రాజ్భవన్లో గవర్నర్తో కూటమి నేతల భేటీ..

గవర్నర్తో సమావేశమైన అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, పురంధేశ్వరి.. 

ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్ను కోరిన నేతలు.. 

చంద్రబాబుకు మద్దతిచ్చిన 164 మంది సభ్యుల జాబితాను గవర్నర్కు అందజేసిన నేతలు.. 

సాయంత్రంలోపు చంద్రబాబును ప్రభుత్వ ఏర్పాటుకు పిలుస్తామన్నారు: ఎన్డీయే కూటమి నేతలు

ఏపీ రాజధానిగా అమరావతి..

మన రాజధాని అమరావతి అని చంద్రబాబు ప్రకటన.. 

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం.. 

కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం: చంద్రబాబు

Streetbuzz News

SB NEWS

Streetbuzz News

మేడారం అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ ఫోకస్ !

- జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి లేఖ

- సమ్మక్క-సారలమ్మ ప్రాశస్త్యం, శాసనాలతో మ్యూజియం

- భవిష్యత్తు తరాలకు చరిత్రను తెలియజేయడమే లక్ష్యం

- చిలకల గుట్ట సుందరీకరణ, భక్తులకు మరిన్ని సౌకర్యాలు

- పర్యాటక ప్రాంతంగా మేడారం.. గిరిజనులకు ఉపాధి

వనదేవతలైన సమ్మక్క-సారలమ్మ చరిత్రను భవిష్యత్తు తరాలకూ తెలపాలని, ఇందుకోసం మేడారంలో వనదేవతల స్మృతి వనం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. గద్దెల వెనుకవైపు ఉన్న 25 ఎకరాల స్థలంలో ఈ స్మృతి వనాన్ని నిర్మించాలని భావిస్తోంది.

తల్లుల జాతర విశేషాలతోపాటు అప్పటి వస్తువులు, శాసనాలు, వనదేవతల ప్రాశస్త్య వివరాలతో మ్యూజియంను ఏర్పాటు చేయనుంది. చిలకల గుట్టను సుందరీకరించడంతోపాటు భక్తులకు మరిన్ని సౌకర్యాలను కల్పించేందుకు కసరత్తు చేస్తోంది. 

ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. జాతర సమయంలో వనమంతా జనంతో నిండిపోతుంది.రెండేళ్లకోసారి నాలుగురోజులపాటు జరిగే ఈ జాతరకు దాదాపు 10 రాష్ట్రాల నుంచి కోటి మందికి పైగా గిరిజన, గిరిజనేతర భక్తులు వస్తారు. ‘కుంభమేళా’ తర్వాత దేశంలో మళ్లీ అంతటి స్థాయిలో ప్రజలు పాల్గొనేది ఈ జాతరలోనే.

ఇంత ప్రాశస్త్యం ఉన్న జాతరకు జాతీయ హోదా కల్పించాలన్న డిమాండ్‌ కొన్నేళ్లుగా ఉంది. ఇప్పటికే రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది. కానీ, కేంద్రం మాత్రం ఏళ్ల నుంచి తాత్సారం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో జాతరకు జాతీయ హోదా కల్పించే అంశాన్ని మరో సారి ప్రస్తావించడంతోపాటు స్మృతి వనం వివరాలను తెలుపుతూ కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

700 కోట్లతో కోకా కోలా ప్లాంట్ ..!

- పెద్దపల్లి జిల్లాలో కోకా కోలా ప్లాంట్ ఏర్పాటు

- విదేశీ పర్యటనలో మంత్రి శ్రీధర్ బాబు

ప్రముఖ అంతర్జాతీయ కూల్ డ్రింక్ కంపెనీ కోకా కోలా.. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోంది. అమెరికా పర్యటలో ఉన్న మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో సమావేశమై.. రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.

కాగా.. ఇప్పటికే రాష్ట్రంలో కోకా కోలా ప్లాంట్ ఉండగా.. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు కంపెనీ ప్రతినిధులు చెప్పినట్టు మంత్రులు తెలిపారు.అమెరికా పర్యటనలో ఉన్న మంత్రులు శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోకా కోలా గ్రూప్‌ డైరెక్టర్‌ జోనథన్‌ రీఫ్‌తో అట్లాంటాలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.

పెట్టుబడులకు అత్యంత అనుకూలంగా ఉన్న తెలంగాణలో తమ పరిశ్రమను విస్తరించాలని కంపెనీని మంత్రులు ఆహ్వానించారు. మంత్రుల ఆహ్వానానికి సానుకూలంగా స్పందించిన జోనథన్‌.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా కంపెనీ విస్తరణలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తామని కంపెనీ తెలిపిందని సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌ బాబు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

పెద్దపల్లి జిల్లాలో రూ.700 కోట్ల పెట్టుబడితో కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్‌తో తయారీ సామర్థ్యాన్ని విస్తరించనుంది. ఈ ప్లాంట్‌ని సంస్థ పూర్తి యాజమాన్యంలోని బాట్లింగ్ ఆర్మ్ అయిన హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ (HCCB) స్థాపించనుంది. ఇది ఇప్పటికే ప్లాంట్ ఏర్పాటు కోసం అనువైన ప్రదేశాన్ని కూడా గుర్తించినట్టు సమాచారం. పెద్దపల్లిలో ఈ కంపెనీ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తే.. ఆ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉందని మంత్రి శ్రీధర్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉదయం 10.30 గంటలకు టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యేల సమావేశం..

హాజరుకానున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. 

శాసన సభాపక్ష నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్న నేతలు..

సమావేశం తర్వాత గవర్నర్ను కలవనున్న 3 పార్టీల నేతలు..

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా..

చంద్రబాబును ఆహ్వానించనున్న గవర్నర్

కేంద్ర మంత్రివర్గ సభ్యుల మంత్రిత్వ శాఖలు

•పోర్ట్‌ఫోలియో పంపిణీపై అందరి దృష్టి

ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 71 మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత, ఇప్పుడు వారి శాఖలను పంపిణీ చేస్తున్నారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తన మూడవ దఫాలో, మంత్రి మండలిలోని సహచరులకు శాఖలను పంపిణీ చేశారు.

నివేదికల ప్రకారం, నితిన్ గడ్కరీకి వరుసగా మూడవసారి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ లభించే అవకాశం ఉంది, అయితే, హర్ష్ మల్హోత్రా మరియు అజయ్ తమ్టాలకు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖలో సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించబడ్డాయి. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎస్ జైశంకర్ వద్దే ఉంటుంది. మోడీ ప్రభుత్వం రెండో దఫాలో జైశంకర్ విదేశాంగ మంత్రిగా కూడా ఉన్నారు.

ఏ మంత్రివర్గం ఎవరికి వచ్చిందో తెలుసుకోండి:-

• జ్యోతిరాదిత్య సిధియా టెలికాం మంత్రిత్వ శాఖను నిర్వహిస్తారు.

• భూపేంద్ర యాదవ్‌కు పర్యావరణ మంత్రి పదవి ఇవ్వబడింది.

• ప్రహ్లాద్ జోషిని వినియోగదారుల మంత్రిగా చేశారు.

• మోడీ ప్రభుత్వంలో రవ్‌నీత్ బిట్టు మైనారిటీ శాఖ సహాయ మంత్రిగా చేశారు.

• సర్బానంద సోనోవాల్‌కు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది.

• టీడీపీ నేత రామ్మోహన్ నాయుడుకు పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు.

• బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆరోగ్య మంత్రిగా చేశారు.

• మోడీ 3.0లో కూడా ధర్మేంద్ర ప్రధాన్ విద్యా మంత్రిగా కొనసాగుతారు.

• కిరెన్ రిజిజు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా చేశారు.

• చిరాగ్ పాశ్వాన్‌కు క్రీడలు మరియు యువజన మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది.

• గజేంద్ర షెకావత్ ఆర్ట్ టూరిజం మరియు కల్చర్ మంత్రిగా చేశారు. దీంతో పాటు సురేశ్ గోపీకి రాష్ట్ర పర్యాటక, కళ, సాంస్కృతిక శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

• పీయూష్ గోయల్‌ను వాణిజ్య మంత్రిగా, శ్రీపాద్ నాయక్‌కు ఇంధన శాఖ సహాయ మంత్రిగా చేశారు.

• మోడీ 3.0లో, CR పాటిల్‌కు జలశక్తి మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది.

• శివరాజ్ సింగ్ చౌహాన్‌కు రెండు మంత్రిత్వ శాఖలు లభించాయి, అతనికి పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆదేశం ఇవ్వబడింది. దీంతోపాటు ఆయనకు వ్యవసాయ శాఖను కూడా కేటాయించారు.

• అశ్విని వైష్ణవ్‌కు సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కమాండ్ ఇవ్వబడింది. మోదీ ప్రభుత్వం రెండో దఫాలో వైష్ణవ్ రైల్వే మంత్రిగా ఉన్నారు.

• హర్యానాకు చెందిన బీజేపీ నేత, మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్‌కు విద్యుత్ శాఖ మంత్రి పదవి దక్కింది. శ్రీపాద్ నాయక్ MOS పవర్‌గా ఉంటారు.

• మనోహర్ లాల్ ఖట్టర్ హౌసింగ్ మరియు పట్టణ వ్యవహారాల బాధ్యతను కూడా పొందవచ్చు, తోఖాన్ సాహు రాష్ట్ర మంత్రిగా ఉంటారు.

• విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కమాండ్ మరోసారి S. జైశంకర్‌కు ఇవ్వబడింది.

జూన్ 9 రాత్రి 7.15 గంటలకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోదీతో పాటు మంత్రి మండలిలో ఆయన 71 మంది సహచరులతో పదవీ ప్రమాణం మరియు గోప్యత ప్రమాణం చేయించిన సంగతిని మీకు తెలియజేద్దాం. వరుసగా మూడోసారి ఏర్పాటైన ఎన్డీయే ప్రభుత్వంలోని కేబినెట్‌లో ఏడుగురు మహిళా మంత్రులు చోటు దక్కించుకున్నారు. మాజీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ప్రధాని మరోసారి విశ్వాసం ప్రదర్శించారు. సీతారామన్‌తోపాటు రాష్ట్ర మాజీ మంత్రి అన్నపూర్ణాదేవి, ఉత్తరప్రదేశ్‌ నుంచి ఎన్నికైన అనుప్రియా పటేల్, కర్ణాటక నుంచి ఎన్నికైన శోభా కరంద్లాజే మరోసారి మంత్రివర్గంలోకి వచ్చారు. తొలిసారిగా మంత్రి పదవి చేపట్టిన మహిళా నేతల్లో 37 ఏళ్ల రక్షా నిఖిల్ ఖడ్సే పేరు కూడా ఉంది.

చంద్రబాబు కేబినెట్‌లోకి పవన్ కళ్యాణ్?.. పదవి ఫిక్స్, ఏ శాఖ అంటే!

భారీ అంచనాల మధ్య ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది. చంద్రబాబు మంత్రివర్గంలో జనసేన, బీజేపీ భాగస్వాములు కానున్నాయి. కొద్ది రోజులుగా పవన్ ప్రభుత్వంలో చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత కొనసాగింది. దీని పైన పవన్ క్లారిటీ ఇచ్చారు. అటు లోకేశ్ సైతం మంత్రివర్గంలో చేరనున్నారు. కొత్త ప్రభుత్వంలో ఇద్దరి పాత్ర పైన స్పష్టత వచ్చింది. ఎన్నికల హామీల అమలు..మూడు పార్టీల సమన్వయం ఈ ఇద్దరికి కీలకంగా మారనుంది. ఇద్దరి శాఖలు ఖరారయ్యాయి.

చంద్రబాబు కసరత్తు

ఏపీలో ఈ సారి పాలన - మిత్రపక్షాలతో సమన్వయం చంద్రబాబు సమర్ధతకు పరీక్షగా మారుతోంది. జనసేన, బీజేపీ నుంచి మంత్రుల సంఖ్య..శాఖల పైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పవన్, బీజేపీ ముఖ్య నేతలతో చర్చించారు, 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు, పవన్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుంచి 135 గెలవటం..అందునా గెలిచిన వారిలో సీనియర్ల సంఖ్య ఎక్కువగా ఉండటం తో మంత్రుల ఎంపిక పైన చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. సామాజిక -ప్రాంతీయ సమీకరణాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

మూడు పార్టీలకు పదవులు

ఇక..జనసేనాని పవన్ కల్యాణ్ ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన పవన్ కొద్ది రోజులుగా డైలమాలో ఉన్నారు. అయితే, ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా, ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన చంద్రబాబు - పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏ శాఖలు ఇవ్వాలనే దాని పైన ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు.

పవన్ -లోకేశ్ శాఖలు

దీంతో..పవన్ కల్యాణ్ మంత్రివర్గంలో చేరటం ఖాయమైంది. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం - గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవటంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. ఇక..నారా లోకేశ్ కు ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖలు ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే, ఈ సారి రాజధాని - యువతకు ఉపాధి కల్పన కీలకం కావటంతో ఈ శాఖలు కేటాయిస్తున్నట్లు కనిపిస్తోంది. అమరావతి నిర్మాణం సైతం పట్టణాభివృద్ధి పరిధిలోకి రానుంది. రాజధాని కోసం ప్రత్యేక సమయం కేటాయించాల్సి ఉండటంతో..లోకేష్ వద్దే ఉంచుతారా లేక, గతంలో పర్యవేక్షించిన నారాయణకు తిరిగి అప్పగిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ ..?

కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో అనేక రాష్ట్రాల్లో ఎంపీలకు మంత్రి పదవులు వరించాయి. తెలంగాణలో కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయని ప్రచారం సాగుతోంది.

ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌(Etela Rajender)కు ఆశాభంగం తప్పలేదు.

ఆయన్ని బుజ్జగించేందుకుగానూ కాషాయపార్టీ బీజేపీ(BJP) రాష్ట్రాధ్యక్ష పదవిని ఈటలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి, ఆ స్థానంలో కిషన్ రెడ్డిని కూర్చోబెట్టారు. ఇప్పుడు వారిద్దరిని కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయాలని చూస్తున్న మోదీ - షా ద్వయం రాష్ట్రంలో పార్టీ పగ్గాలను ఈటలకు అప్పగించాలని భావిస్తోందట.

మంత్రి పదవి ఆశించి నిరాశలో మునిగిపోయిన ఈటలకు ఇలా అయినా కూల్ చేద్దామని బీజేపీ పెద్దల ప్లాన్‌గా తెలుస్తోంది.

Telangana Politics: గులాబీ బాస్ కీలక నిర్ణయం.. కేటీఆర్ ఔట్.. ఆ పదవి ఎవరికంటే..?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా రావడంతో గులాబీ బాస్‌ తీవ్ర నిరాశకు గురయ్యారు. కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ నేతలకు ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. బీఆర్‌ఎస్‌ అధినేత వైఖరితో పాటు పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనంతోనే పార్టీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ లోపల, బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

లోపల, బయట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అహంకారపూరిత వైఖరి పార్టీకి నష్టం చేస్తుందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో కేటీఆర్‌ను పార్టీలో కీలక బాధ్యతల నుంచి మార్చాలని గులాబీ బాస్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ స్థానంలో కుటుంబంలోనే మరొకరికి కేటాయించాలా లేదా బయట వ్యక్తులకు అప్పగించాలా అనేదానిపై కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారట. 

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు హరీష్‌రావుకు అప్పగించాలని లేదంటే ఎస్సీ, బీసీ సామాజికవర్గాల నుంచి ఎవరినైనా ఒకరిని ఎంపిక చేసే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల కాలం కావడంతో పార్టీ శ్రేణులను ఏకతాటిపైకి తీసుకురాగలిగే నాయకులు ఎవరనేదానిపై గులాబి బాస్ ఫోకస్ చేశారట. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది.

ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ పార్టీ స్థానిక సంస్థల్లో బలపడే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈసారి ఎన్నికలు ఏకపక్షంగా ఉండబోవని.. కాంగ్రెస్‌తో పాటు బీజేపీ నుంచి పోటీ ఉంటుందని.. ఇద్దరి మధ్య పోటీని తట్టుకుని పార్టీని గెలుపువైపు తీసుకెళ్లగలిగే నాయకుడికి కీలక బాధ్యతలు అప్పగించాలని కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరికొద్దిరోజుల్లోనే బీఆర్‌ఎస్ సంస్థాగత మార్పులు తప్పవనే సంకేతాలు వెలువడుతున్నాయి.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌ను తప్పించి.. ఆ స్థానంలో హరీష్‌రావుకు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీలో సీనియర్లకు ఎవరికైనా ఈ బాధ్యతలు అప్పగించవచ్చనే చర్చ లేకపోలేదు. ఓవైపు కుమార్తె కవిత ఢిల్లీ మద్యం పాలసీ కేసులో జైలులో ఉండటంతో.. ఈ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తే పార్టీకి ప్రయోజనం ఉంటుందనే కోణంలో కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. మరోవైపు హరీష్‌రావు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు స్వీకరించేందుకు సానుకూలంగా లేనట్లు తెలుస్తోంది. కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి హరీష్‌కు బాధ్యతలు అప్పగిస్తే ఆయన ఎలా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

ఫ్యామిలీ పాలిటిక్స్ కు బ్రేక్ !

బీఆర్‌ఎస్‌పై ఫ్యామిలీ పార్టీ అనే ముద్ర పడింది. గత పదేళ్లలో కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యమకారులకు, సామాన్య కార్యకర్తలకు ఇవ్వలేదనే వాదన ఉంది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు కొంత ఇబ్బంది కలిగించిందనే చర్చ ఉంది. దీంతో ఆ ముద్రలు తొలగించుకోవడానికి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని పార్టీ సీనియర్లలో ఒకరికి అప్పగించవచ్చనే ప్రచారం జరుగుతోంది. సంస్థాగత మార్పుల్లో భాగంగా గులాబీ బాస్ పార్టీ కీలక బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారనే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో కొనసాగుతోంది.

జమ్మూ కాశ్మీర్ లోని రియాసీలో ఉగ్రదాడి యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సు పై కాల్పులు

•రియాసీ ఉగ్రవాద దాడి: కళ్లారా చూశామని, ప్రమాణ స్వీకారం సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఈ దాడిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు

జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలో యాత్రికులు నిండిన బస్సుపై ఆరు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల కారణంగా ఊగిసలాడుతున్న బస్సు కాలువలో పడిపోయింది. ఈ ఘటనలో 10 మంది యాత్రికులు మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. రియాసిలో భక్తుల బస్సుపై జరిగిన దాడిలో మరణించిన వారిలో ఒక చిన్నారి, ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

శివ ఖోడి నుంచి కత్రాకు బయలుదేరిన బస్సుపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేసి కాల్పులు జరిపారు. మార్గమధ్యంలో ఉగ్రవాదులు నిల్చుని కదులుతున్న బస్సు డ్రైవర్ ను నుదురు మధ్యలో కాల్చిచంపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తర్వాత వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఆ సమయంలో బస్సు అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో గంటల తరబడి కాల్పులు జరిగాయి.

ఈ ఉగ్రవాద దాడి తర్వాత, పోలీసులకు సహాయం చేయడానికి మరియు గ్రౌండ్ పరిస్థితిని అంచనా వేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బృందం రియాసికి చేరుకుంది. ఆదివారం దాడి తర్వాత ఆ ప్రాంతంలో భద్రతను పెంచారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు భద్రతా బలగాలు డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి. భారత సైన్యం సమీపంలోని COB వద్ద అదనపు బలగాలను మోహరించింది మరియు ప్రస్తుతం శోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

పిర్ పంజాల్ అడవుల్లో పాక్ SSG లేదా SSG శిక్షణ పొందిన జిహాదీల ఉనికిని భద్రతా సంస్థలు చాలా కాలంగా అనుమానిస్తున్నాయని మీకు తెలియజేద్దాం. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు బహిరంగంగా యాక్టివ్‌గా ఉన్నారని స్పష్టమైంది. అయితే, ముందస్తు ఇన్‌పుట్ ఉన్నప్పటికీ, ఇంత పెద్ద సంఘటన జరిగింది.