Mane Praveen

Jun 07 2024, 13:53

బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించిన ఉపాధ్యాయులు

నల్గొండ పట్టణంలోని గవర్నమెంట్ జేబీఎస్ హైస్కూల్ సీనియర్ ఉపాధ్యాయులు ఎస్.నాగిరెడ్డి ఆధ్వర్యంలో బడిబాట కరపత్రాన్ని ఆవిష్కరించి, బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో మరియు గుండ్లపల్లి రోడ్ లోని ఇందిరమ్మ అపార్ట్మెంట్ లలో బడిబాట లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. కార్యక్రమంలో పలువురు టీచర్లు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 07 2024, 08:58

కొనసాగుతున్న రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు
వరంగల్- ఖమ్మం-నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయి రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టిన విషయం తెలిసిందే. రెండవ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు లో భాగంగా ఈ రోజు ఇప్పటి వరకు 26 మంది అభ్యర్థులు ఎలిమినేట్ కాగా, 27 వ అభ్యర్థి ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది.

Mane Praveen

Jun 05 2024, 22:43

12,000 ఓట్ల ఆధిక్యంలో తీన్మార్ మల్లన్న..
ఎమ్మెల్సీ బై పోల్ బ్రేకింగ్..
నల్లగొండ టౌన్: నల్లగొండ ఖమ్మం వరంగల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్ మార్ మల్లన్న మొదటి ప్రాధాన్యత ఓట్లలో 12000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
రెండవ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డి అన్నారు
మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Mane Praveen

Jun 05 2024, 22:15

NCC ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
NLG: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఇవాళ నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఎన్సిసి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తో పాటుగా నల్లగొండ పట్టణంలోని పౌరులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్సిసి 31 బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ అనుజ్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక్క పౌరుడిపై ఉన్నదని,పర్యావరణ పరిరక్షణ అనేది శతాబ్దాలుగా ప్రపంచంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా ఉద్భవించిందని మరియు మానవులకు ఎల్లప్పుడూ ముఖ్యమైనదనీ,అడవుల పెంపకం మరియు చెట్ల పెంపకం గ్లోబల్ వార్మింగ్, నేల కోత మొదలైనవాటిని తగ్గించడం ద్వారా మన పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడతాయని వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎన్సిసి క్యాడేట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని,ప్రకృతి, పర్యావరణం మరియు జీవావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గౌరవించడానికి మరియు గుర్తించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మానవాళిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నదని, దీనికి తక్షణ కర్తవ్యం గా ప్రతి పౌరుడు చెట్లు నాటి ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి సుబేదార్ మేజర్ ఎల్ మాధవరావు, ఎన్జీ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్, అధికారులు చంకూర్ సింగ్, నాగఫణి, సంతోష్ మరియు ఎన్సీసీ క్యాడేట్ లు పాల్గొన్నారు.

Mane Praveen

Jun 05 2024, 14:36

చామల కిరణ్ కుమార్ రెడ్డిని అభినందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులు
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జ్ మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భువనగిరి లోక్ సభ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. పార్లమెంట్ ఎన్నికలలో ఘన విజయం సాధించి ఎంపిగా గెలుపొందిన చామల కిరణ్ కుమార్ రెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పుష్పగుచ్చం అందించి అభినందించారు.

Mane Praveen

Jun 05 2024, 14:01

మునుగోడు,నకిరేకల్ లలో ప్రధాన పార్టీలు సాధించిన ఓట్ల సంఖ్య
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల ప్రకారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 1,08,667 బిజెపి పార్టీకి 54,961, బిఆర్ఎస్ పార్టీకి 35,660 ఓట్లు వచ్చాయి. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 96,914, బిజెపి పార్టీకి 59,231 బిఆర్ఎస్ పార్టీకి 21,377 ఓట్లు వచ్చాయి.

Mane Praveen

Jun 05 2024, 12:46

కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ధన్యవాదాలు: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్
 మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధ్యక్షతన,భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం, ఎండలను సైతం లెక్కచేయకుండా అహర్నిశలు కష్టపడి పన చేసిన మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. 7982 మెజార్టీ ఓట్లు  ఇచ్చిన మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

Mane Praveen

Jun 04 2024, 15:40

నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు 24 వ రౌండ్ ముగిసే సమయానికి...

నల్గొండ పార్లమెంట్ -ఎన్నికల ఫలితాలు 24 వ రౌండ్ ముగిసే సమయానికి కాంగ్రెస్ పార్టీ 552659 ఓట్లు ఆధిక్యత లో ఉంది.

కాంగ్రెస్ :7,72,264

బీ ఆర్ ఎస్: 2,16,681

బి జే పి: 2,19,605 ఓట్లు సాధించారు.

Mane Praveen

Jun 04 2024, 14:05

మద్రాస్ ఫుట్బాల్ అకాడమీ సెలక్షన్స్ కు చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ క్రీడాకారులు
ఈ నెల 5,6 తేదీల్లో తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మద్రాస్ ఫుట్బాల్ అకాడమీ సెలక్షన్స్ లలో నల్గొండ పట్టణం చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ కు చెందిన *రాచూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్ లు అండర్-17 గ్రూపు* లో పాల్గొంటున్నారని, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. వీరు ఇద్దరూ గత 4 సంవత్సరాలుగా చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ కోచ్ మద్ది కరుణాకర్(NIS- "D"License) సారథ్యంలో నిరంతరం శిక్షణ పొందుతూ రాష్ట్ర, జాతీయ స్థాయి ఫుట్బాల్ పోటీలలో పాల్గొని ప్రతిభ కలిగిన క్రీడాకారులుగా తయారవుతున్నారని తెలిపారు.

Mane Praveen

Jun 04 2024, 13:58

తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుంభం రామ్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బొమ్మపాల
నల్గొండ జిల్లా, మునుగోడు మండలం పలివెల గ్రామం నుండి జీవన ప్రయాణం సాగించి, క్రీడలనే ఊపిరిగా చేసుకొని, ఇంతింతై వటుడింతై అనే చందాన రాష్ట్ర క్రీడా చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని, ప్రస్తుతం దోమలగూడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ ప్రిన్సిపాల్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ ఎంతోమంది క్రీడాకారులను మరియు ప్రభుత్వ, ప్రైవేటు వ్యాయామ ఉపాధ్యాయులను తయారుచేసిన ఘనత కుంభం రామ్ రెడ్డి దని తెలియజేస్తూ, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ పక్షాన పుట్టినరోజు శుభాకాంక్షలు అని స్పోర్ట్స్ క్లబ్ సభ్యుడు బొమ్మ పాల గిరిబాబు తెలిపారు.