NCC ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం
NLG: ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఇవాళ నాగార్జున ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఎన్సిసి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం తో పాటుగా నల్లగొండ పట్టణంలోని పౌరులకు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎన్సిసి 31 బెటాలియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లెఫ్ట్నెంట్ కల్నల్ అనుజ్మన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరాణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఒక్క పౌరుడిపై ఉన్నదని,పర్యావరణ పరిరక్షణ అనేది శతాబ్దాలుగా ప్రపంచంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా ఉద్భవించిందని మరియు మానవులకు ఎల్లప్పుడూ ముఖ్యమైనదనీ,అడవుల పెంపకం మరియు చెట్ల పెంపకం గ్లోబల్ వార్మింగ్, నేల కోత మొదలైనవాటిని తగ్గించడం ద్వారా మన పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడతాయని వివరించారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ఎన్సిసి క్యాడేట్లు మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని,ప్రకృతి, పర్యావరణం మరియు జీవావరణ శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గౌరవించడానికి మరియు గుర్తించడానికి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, ఇండస్ట్రియల్ పొల్యూషన్ వల్ల మానవాళిపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉన్నదని, దీనికి తక్షణ కర్తవ్యం గా ప్రతి పౌరుడు చెట్లు నాటి ప్రకృతి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్సిసి సుబేదార్ మేజర్ ఎల్ మాధవరావు, ఎన్జీ కళాశాల ఎన్సిసి ఆఫీసర్ చిలుముల సుధాకర్, అధికారులు చంకూర్ సింగ్, నాగఫణి, సంతోష్ మరియు ఎన్సీసీ క్యాడేట్ లు పాల్గొన్నారు.
Jun 07 2024, 08:58