ప్రస్తుత ఎలక్షన్ ఫలితాల ప్రకారం జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించనున్న నారా చంద్రబాబు నాయుడు...
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మరోసారి జాతీయస్థాయిలో కీలక పాత్ర పోషించబోతున్నారు.
గతంలో అటల్ బీహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు ఎన్డీయే కన్వీనర్ గా బాధ్యతలను నిర్వర్తించారు.
ఆ సమయంలో తమకు ఇది కావాలి.. అది కావాలి.. ఏదీ డిమాండ్ చేయలేదు. కేవలం కేంద్రంలో ప్రభుత్వం సజావుగా సాగేలా చూశారు. తాజాగా మరోసారి అదే పాత్రను పోషించబోతున్నారు.
బీజేపీకి ఎదురుగాలులు
తాజాగా విడుదలవుతున్న లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి ఎదురుగాలులు వీస్తున్నాయి.
ఈసారి 400 కు పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించబోతున్నామని, ప్రధానమంత్రిగా నరేంద్రమోడీ హ్యాట్రిక్ సాధించబోతున్నారంటూ బీజేపీ ఊదరగొట్టింది.
తీరా ఫలితాలు వస్తున్న తీరును గమనిస్తుంటే ఎన్డీయే కు వస్తున్న ఫలితాలు అంతంతమాత్రంగానే కనపడుతున్నాయి.
ఇండియా కూటమి అనుకున్నదానికన్నా అద్భుతమైన పనితీరును కనపరుస్తోంది. మంచి ఫలితాలను రాబడుతోంది.
మిత్రపక్షాలపై ఆధారపడాలి
భారతీయ జనతా పార్టీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేైసినా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితులు కనపడటంలేదు.
మిత్రులపై తప్పనిసరిగా ఆధారాపడాల్సిన పరిస్థితి కనపడుతోంది.
దాదాపుగా మిత్రపక్షాలమీద ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమవుతోంది.
ఎన్డీయే కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీది కీలక పాత్ర అవుతోంది.
రాష్ట్రంలో అధికారం చేపట్టబోతుండటంతోపాటు భారీ స్థాయిలో ఎంపీ సీట్లను గెలుచుకోబోతోంది.
దాదాపు పోటీచేసిన అన్ని ఎంపీ స్థానాల్లోను గెలవబోతోంది. దీంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పనుండటం ఖాయమైందని ఆ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, యూపీలో అనుకున్న స్థాయిలో సీట్లను సాధించలేకపోయింది.
ఈ నేపథ్యంలో రాష్ట్రం నుంచి చంద్రబాబు సూచించిన వారికే కేంద్రమంత్రి పదవులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి...
Jun 04 2024, 14:39