గోషామహల్ లో అధికంలో మాధవిలత
గోషామహల్ నియోజకవర్గంలో భారీ అధికంలో భాజపా అభ్యర్థి మాదవిలత... మొదటి రౌండ్..... భాజపా: 7936 మజ్లీస్: 601 కాంగ్రెస్: 307 భారస: 317
మెదక్ పార్లమెంట్ మొదటి రౌండ్లో బీజేపీ ఆధిక్యం
*మెదక్ పార్లమెంట్ మొదటి రౌండ్లో బీజేపీ మాధవనేని రఘునందన్ రావు 800 ఓట్ల తో ఆధిక్యం...*
*బీజేపీ :-3515*
కాంగ్రెస్ :2740
బిఆర్ఎస్ :2425
ముందంజలో కడియం కావ్య
TS: వరంగల్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య ముందంజలో ఉన్నారు. ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు నాలుగు స్థానాలలో ఆధిక్యత తో కొనసాగుతున్నారు.
నల్లగొండ టౌన్: వాటర్ ట్యాంక్‌లో శవం
28వార్డు, హనుమాన్ నగర్ కు చెందిన ఆవుల వంశీకృష్ణ యాదవ్ (26) గత నెల 24వ తేదీ నుండి కనిపించకుండా పోయాడు. అతని కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెతకడం ప్రారంభించగా సోమవారం ఉదయం 12 వ వార్డులో గల హిందూపూర్ వాటర్ ట్యాంకు లో వంశీకృష్ణ శివమై కనిపించాడు. అనుమానాప్పద స్థితిలో మృతదేహం లభించడం తో స్థానికంగా కలకలం రేపింది. వాటర్ ట్యాంకులో వాటర్ చెక్ చేయగా అందులో డెడ్ బాడీ ప్రత్యక్షమైంది. వెంటనే మున్సిపాలిటీ సిబ్బంది మృతదేహాన్ని వెలికి తీశారు. మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పది రోజులుగా ఆ వార్డు ప్రజలు ఆ నీటినే తాగే పరిస్థితి ఏర్పడింది.
మర్రిగూడ మండలంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ ఆదివారం మర్రిగూడ చౌరస్తా లో తెలంగాణ అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి, జ్యోతిని వెలిగించి ఘన నివాళి అర్పించారు. అమరులకు జోహార్లు తెలిపారు. తెలంగాణ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ చౌరస్తాలోని అమరవీరుల స్థూపం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వరకు సాగిన ర్యాలీని విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించిన విధంగా జూన్ 2, దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మర్రిగూడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి, తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ మేతరి యాదయ్య, ఎంపీపీ గండికోట రాజమణి హరికృష్ణ, మాజీ సర్పంచ్ లు, దండేటికర్ అనసూయ అంజయ్య, జంగిలి రవి లష్మిప్రసన్న, గంట కవిత యాదయ్య, కొట్టం రమేష్, సబితా యాదగిరి రెడ్డి, మాడెం శాంతమ్మ వెంకటయ్య,ఎంపీటీసీ ఏర్పుల శ్రీశైలం పార్టీ నాయకులు నందికొండ లింగారెడ్డి, మాతంగి నవీన్, రావుల రాములు, చాపల రవి, మేతరి శంకర్, పెంబళ్ల గిరి, వంపు రాంచరణ్ దాస్,తదితరులు పాల్గొన్నారు.
NLG: యోగ ఆసన జడ్జెస్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొన్న జిల్లావాసులు
4వ రాష్ట్ర స్థాయి యోగ ఆసన జడ్జెస్ ట్రైనింగ్ ప్రోగ్రాం హైదరాబాద్ లోని దిండిగల్ విశాల్ ప్రకృతి రిసార్ట్స్ లో మే 28 నుండి 31 వరకు తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ట్రైనింగ్ లో తెలంగాణ లోని 18 జిల్లాల నుండి 75 మంది యోగాసనా ట్రైనీ జడ్జెస్ మరియు రిసోర్సెస్ పర్సన్స్ పాల్గొన్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో చీఫ్ గెస్ట్ గా గవర్నమెంట్ కాలేజీ అఫ్ ఫిసికల్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ కుంభం రామి రెడ్డి, తెలంగాణ యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జి. శ్రీధర్ రావు, జనరల్ సెక్రటరీ నందనం కృపాకర్ , రామ్ రెడ్డి, తోట సతీష్ ,రాయనబోయిన శ్రీను పాల్గొన్నారు. నల్గొండ నుండి యోగ ఆసన జడ్జెస్ ట్రైనింగ్ పొందిన వారిలో కడారి మల్లేష్, శ్రీనివాస్ రెడ్డి, వాణీ, జోజి, సైదులు ఉన్నారు.
NLG: ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలి: కత్తుల లింగస్వామి
ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కత్తుల లింగ.స్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మండల కమిటీ ఆధ్వర్యంలో మర్రిగూడ ఎండిఓ కు ఉపాధి హామీ చట్టాన్ని రక్షించాలని, ఉపాధి సిబ్బందిని పర్మినెంట్ చేయాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మెమోరాండం ను సమర్పించారు. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జోగు లక్ష్మయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నీలకంఠం రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉపాధి హామీ లో పనిచేస్తున్న కూలీలకు గతంలో వారం వారం డబ్బులు వచ్చేవని ఇప్పుడు నెలల తరబడి రాకపోవడం మూలంగా కూలీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో క్రమేపి నిధులు తగ్గించడం మూలంగా పెద్ద ఎత్తున పెండింగ్ వేతనాలు పేరుకపోయాయని వెంటనే డబ్బులు విడుదల చేసి కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఉపాధి హామీ సిబ్బందిని పర్మనెంట్ చేస్తామని ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారని అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడుస్తున్న పట్టించుకోకపోవడం దారుణమని, వెంటనే ఉపాధి సిబ్బందిని పర్మిట్ చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు కేటాయించి కూలీలను ఆర్థిక ఇబ్బందుల నుండి ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని తెలిపారు. పెరుగుతున్న ధరల కనుగుణంగా దినసరి కూలి 600 రూపాయలు ఇచ్చి, ప్రతి కుటుంబానికి 200 రోజులు పనులు కల్పించాలని, ఉపాధి హామీ ఫీల్ అసిస్టెంట్లను పర్మినెంట్ చేసి వారి వేతనాలు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జోగు లక్ష్మయ్య, సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, నీలకంఠం రాములు తదితరులు పాల్గొన్నారు.
NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి
మునుగోడు శాసన సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం తన జన్మదినం సందర్భంగా ఆయన తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్నారు. తదుపరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు నాంపల్లి మండల కేంద్రంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి పేదింటి మహిళలకు చీరలు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసినారు. అనంతరం అన్నదానం వెయ్యి మందికి పైగా చేశారు. బాణసంచా కాల్చి స్వీట్లు,పండ్లు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజు, ఎవి రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, గజ్జల శివారెడ్డి, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మట్టిపల్లి యాదయ్య, గఫార్, మేకల రమేష్ యాదవ్, మెగావత్ కృష్ణ నాయక్, పానుగంటి వెంకన్న, ఎస్.కె చాంద్ పాషా, సురేందర్ నాయక్, పానుగంటి వెంకటయ్య, కోరే శివ, ఈద శేఖర్, కంశెట్టి చత్రపతి, ఎరెడ్ల వెంకట్ రెడ్డి, కలకొండ దుర్గయ్య, దామెర యాదగిరి, కాటన్ వెంకటయ్య గౌడ్, బూదునూరు వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, బుషిపాక సంజీవ, పోగుల దివ్య, తదితరులు పాల్గొన్నారు.
Jun 04 2024, 09:35