ఇల్లు లేని నిరుపేదలకు, స్థలం ఉండి ఇల్లు లేని పేదలకు.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం గుడ్ న్యూస్..

నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..


తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరుస్తామన్నారు. నిరుపేద కుటుంబాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు సొంత ఇళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. వారి కలలు నెరవేర్చేందుకు భద్రాద్రి రాముడు సాక్షిగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. తెలంగాణలో సొంత ఇళ్లు లేని వారు ఉండకూడదని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని సభాముఖంగా తెలిపారు.


ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల చొప్పున.. ప్రతి ఏడాది 4.50 ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుందని అన్నారు. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం రూ.7,740 కోట్లు ఖర్చు చేసేందుకు రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించిందని అన్నారు. ఈ ఒక్క ఏడాదే 22,500 కోట్ల రూపాయలు వెచ్చించిందని అన్నారు. ఇంటి స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థిక సాయం, ఇంటి స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయబోతున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు తొలిదశలో రూ.3 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వ పూచీకత్తు పై రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలకు రుణం ఇచ్చేందుకు హడ్కో గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

ప్రాణం తీసిన 'ఒక్క రూపాయి' పంచాయతీ...

ఒక్క..రూపాయి పంచాయతీ ప్రాణంతీసింది..!! 

వరంగల్ లో దారుణం జరిగింది. ఒక్క రూపాయి విషయంలో ఇద్దరు వ్యక్తుల మధ్య చెలరేగిన చిల్లర ఘర్షణ, ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలి తీసుకుంది. క్షణికావేశంలో మాటామాట పెరిగి తోపులాటకు దారి తీసింది. దీంతో ఓ వ్యక్తి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు..

ఈ విషాద సంఘటన వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్‌లో జరిగింది.. ప్రేమ్ సాగర్ అనే వ్యక్తి ఆటో నడుపుకుంటున్నాడు. శుక్రవారం రాత్రి గాంధీనగర్‌లోని ఓ బిర్యానీ పాయింట్ వద్దకు బిర్యాని కోసం వచ్చాడు. అదే సమయంలో అరవింద్ అనే యువకుడు కూడా బిర్యాని కోసం అక్కడకు వచ్చాడు. ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ 59 రూపాయల బిర్యానికి, 60 రూపాయలు ఫోన్ పే కొట్టాడు. ఈ క్రమంలో ఒక్క రూపాయి ఎక్కువ కొట్టావ్ అంటూ అరవింద్ ఆటో డ్రైవర్‌ను ఎగతాళి చేశాడు.

ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వాగ్వివాదానికి దారి తీసింది. క్షణికావేశంలో ఇద్దరు పిడుగులు గుద్దుకున్నారు.. తోపులాటలో అరవింద్ ఆటో డ్రైవర్ ప్రేమ్ సాగర్ బలంగా నెట్టేయడంతో కిందపడి పక్కనే ఉన్న రాయికి అతని తల తాకి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని గమనించి ఆసుపత్రికి తరలించినా ఫలితం దక్కలేదు. చిన్న మెదడు చిట్లి ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయినట్లు* వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆటో డ్రైవర్ డెడ్ బాడీని ఎంజీఎం మార్చురీకి తరలించారు.

 ఒక్క రూపాయి ఇంతటి వివాదానికి కారణమైంది.క్షణికావేశం నిండు ప్రాణాలు బలి తీసుకుంది. అహంకారంతో ఆటోడ్రైవర్ ప్రాణాలు మింగేసిన యువకుడు అరవింద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టిఆర్ఎస్ ఘనవిజయం..

మహబూబ్‌నగర్‌ : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నవీన్‌ కుమార్‌ రెడ్డి గెలుపు. కౌంటింగ్‌ సెంటర్‌ నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి.

నేటి నుంచి బాసర IIIT లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ..

నేటి నుంచి బాసర IIIT లో అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ

ప్రతిష్టాత్మకమైన బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త విద్యాసంవత్సరానికి అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ అధికారులు ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే

నేటి నుంచి బాసర ట్రిపుల్ ఐటీ అడ్మిషన్స్ కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. నేటి నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. www.rgukt.ac.in వెబ్ సైట్, ఇమెయిల్ ద్వారా సందర్శించాలని సూచించారు. ఇన్ చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ మాట్లాడుతూ ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్ ద్వారా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది 10వ తరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు వెలువడ్డాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు

తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలి, ఏ కోర్సులు చదవాలి అనే విషయాలపై తల్లిదండ్రులు విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువుపైనే ప్రత్యేక చర్చ నడుస్తోంది. తెలంగాణలో ఏకైక విద్యాలయ ప్రాంగణం కలిగిన బాసర ట్రిపుల్స్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఇక్కడే చదివించాలని కోరుకుంటారు. కాగా.. బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020-21లో 32,000 మంది, 2021- 22లో 20,178 మంది, 2022-23లో 31,432 మంది, 2023-24లో 32,635 మంది విద్యార్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నారు.

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం..

అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఓట్ల లెక్కింపు ప్రారంభం.

నేటితో ముగియనున్న అరునాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల గడువు. అసెంబ్లీల గడువు ముగియనుండటంతో ముందుగానే ఓట్ల లెక్కింపు.

అరుణాచల్‌ప్రదేశ్‌లో 60, సిక్కింలో 32 స్థానాలు. అరుణాచల్‌ప్రదేశ్‌లో 10 సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకున్న బీజేపీ.

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాతో జాగ్రత్త: కేంద్రం

ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాతో జాగ్రత్త: కేంద్రం

దిల్లీ: దేశంలోని పక్షులు, కోళ్లలో అసాధారణ మరణాలు సంభవించడంపై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని పశుసంవర్థక విభాగంతో పంచుకోవాలని సూచించింది. దీనివల్ల ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజాపై జాతీయ కార్యాచరణ ప్రణాళిక ప్రకారం ప్రజారోగ్య కార్యాచరణను చేపట్టవచ్చని పేర్కొంది.

ఈ మేరకు జాతీయ వ్యాధి నియంత్రణ సంస్థ (ఎన్‌సీడీసీ), పశుసంవర్థక, పాడిపరిశ్రమ విభాగం మే 25న ఓ ఉమ్మడి అడ్వైజరీ జారీచేశాయి. ఆంధ్రప్రదేశ్‌ (నెల్లూరు జిల్లా), మహారాష్ట్ర (నాగ్‌పుర్‌ జిల్లా), కేరళ (అలప్పుజ, కొట్టాయం, పథనంథిట్ట జిల్లాలు), ఝార్ఖండ్‌ (రాంచీ జిల్లా)ల్లో ఇప్పటికే కోళ్లలో ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ ఫ్లూ) మరణాలు సంభవించినట్లు పేర్కొంది. ఏవియన్‌ ఇన్‌ఫ్లుయెంజా (హెచ్‌5ఎన్‌1) ఇన్‌ఫెక్షన్‌ అత్యంత ప్రమాదకరమైంది. మానవులకు సోకే అవకాశం ఉంది. దీని సంక్రమణను తగ్గించడానికి, నివారించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడం అత్యవసరం’’ అని స్పష్టంచేసింది.

ఎలక్షన్ కోడ్ ముగిశాక తెలంగాణలో కొలువుల పండగ..

కోడ్‌ ముగిశాక కొలువుల పండగ

టీజీపీఎస్సీ పరిధిలో తుది దశలో 13 వేల పోస్టులు

నెలాఖరులోగా గురుకుల సొసైటీల్లో పోస్టింగులు!

లోక్‌సభ ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర కొనసాగనుంది. కోడ్‌ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్లకు ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామకపత్రాలు తీసుకున్న అభ్యర్థులకు పోస్టింగులు దక్కనున్నాయి. గురుకుల, పోలీసు నియామక బోర్డుల పరిధిలో నియామకాలు పూర్తికాగా, టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడికానున్నాయి. గురుకుల సొసైటీలు జూన్‌ నెలాఖరులోగా పోస్టింగుల ప్రక్రియ పూర్తిచేయాలన్న లక్ష్యంతో ఉన్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13 వేలకు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధ్రువీకరణ పత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది. జనరల్‌ ర్యాంకు జాబితా (జీఆర్‌ఎల్‌) వెల్లడైన నోటిఫికేషన్లకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తిచేసి రెండు, మూడు నెలల్లో నియామకాలు పూర్తిచేయాలన్న లక్ష్యంతో కమిషన్‌ పనిచేస్తోంది. టీజీపీఎస్సీ జారీ చేసిన ఉద్యోగ ప్రకటనల్లో అత్యధికంగా గ్రూప్‌-4 కింద 8,180 పోస్టులు ఉన్నాయి. రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జీఆర్‌ఎల్‌ వెల్లడైంది. క్రీడా కేటగిరీలో 1,569 మందికి ధ్రువీకరణ పత్రాల పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల పత్రాల పరిశీలన ఈనెలలో ప్రారంభించేందుకు కమిషన్‌ ఏర్పాట్లు చేస్తోంది. 

నియామక ప్రక్రియ తుది దశలో...

ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధించి మెరిట్‌ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్‌ ఇంజినీరు పోస్టుల తుది కీతో పాటు జీఆర్‌ఎల్‌ను కమిషన్‌ విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి కూడా పరిశీలన ముగిసింది. దివ్యాంగులైన అభ్యర్థులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల జీఆర్‌ఎల్‌ విడుదలైంది. పురపాలక శాఖలో ఎకౌంటెంట్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. భూగర్భ జలవనరుల శాఖలో గెజిటెడ్‌ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలనను ఇప్పటికే కమిషన్‌ పూర్తి చేసింది. పోస్టుల ప్రాధాన్య క్రమం మేరకు అభ్యర్థుల నుంచి ఆప్షన్లు తీసుకుంది. సాంకేతికవిద్య విభాగంలోని 247 పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టులకు కమిషన్‌ జీఆర్‌ఎల్‌ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్‌ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్‌ విద్య విభాగంలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు తుది కీ వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్‌లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తిచేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్‌ భావిస్తోంది. 

నేటి నుంచి గ్రూప్‌-1 హాల్‌టికెట్లు

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసు ఉద్యోగాల కోసం జూన్‌ 9న నిర్వహించే ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. హాల్‌టికెట్లు శనివారం అందుబాటులోకి రానున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. కమిషన్‌ ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అభ్యర్థులు హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు కమిషన్‌ వెబ్‌సైట్లో ప్రత్యేక లింకు పెట్టనుంది. హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత వ్యక్తిగత వివరాల్లో భాగంగా పేరులో పొరపాట్లు దొర్లితే అభ్యర్థులు ప్రత్యేకంగా డిక్లరేషన్‌ ఇవ్వాలి. ఆ వివరాలన్నీ కమిషన్‌.. వెబ్‌సైట్లో పొందుపరిచింది.

Ts: రాజకీయ విమర్శలకు తావు లేకుండా దశాబ్ది ఉత్సవాలు జరుపుకోవాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ గీతం ఉండాలని ప్రజలు కోరుకున్నారు.. రాజకీయ విమర్శలకు తావులేకుండా దశాబ్ది వేడుకలు జరుపుకోవాలి.. తెలంగాణ అమరులను ప్రధాని మోడీ అవమానించారు.. తల్లి చనిపోయింది.. బిడ్డను తెచ్చుకున్నారన్నారు.. సుష్మా స్వరాజ్‌ సేవలు మేం మర్చిపోం-మంత్రి పొన్నం ప్రభాకర్‌

వరంగల్‌: కేయూలో విద్యార్థుల రాజముద్ర మార్పుపై ఆందోళన..

వరంగల్‌: కేయూలో విద్యార్థుల ఆందోళన

తెలంగాణ రాజముద్రలో..

కాకతీయ కళాతోరణాన్ని తొలగించవద్దని నిరసన

సీఎం రేవంత్‌ దిష్టిబొమ్మ దహనానికి యత్నం

అడ్డుకున్న పోలీసులతో విద్యార్థుల వాగ్వాదం

వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు..

వంగా గీతపై మాజీ ఎమ్మెల్యే వర్మ సంచలన ఆరోపణలు,

కాకినాడ ఈహెచ్‌ఎస్ ఆస్పత్రిలో ఉద్యోగాలకు రూ.10 లక్షల చొప్పున వంగా గీత లంచం తీసుకుంటున్నారు..

ఉద్యోగాల విషయంలో రూ.కోట్ల రూపాయల స్కామ్‌ జరిగింది.. మా ప్రభుత్వం వచ్చాక కేంద్రం నుంచి విచారణ చేయిస్తాం: మాజీ ఎమ్మెల్యే వర్మ.