NLG: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి
మునుగోడు శాసన సభ్యులు  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శనివారం తన జన్మదినం సందర్భంగా  ఆయన తిరుమల తిరుపతి దర్శనం చేసుకున్నారు. తదుపరి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు గజ్జల శివారెడ్డి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఘనంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలు
మునుగోడు ఎమ్మెల్యే  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 57వ జన్మదిన వేడుకలు నాంపల్లి మండల కేంద్రంలో శనివారం ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సెంటర్లో కేక్ కట్ చేసి పేదింటి మహిళలకు చీరలు పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసినారు. అనంతరం అన్నదానం వెయ్యి మందికి పైగా చేశారు. బాణసంచా కాల్చి స్వీట్లు,పండ్లు, పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి రాజు, ఎవి రెడ్డి, కుంభం కృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, గజ్జల శివారెడ్డి, ఎరెడ్ల రఘుపతి రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, మట్టిపల్లి యాదయ్య, గఫార్, మేకల రమేష్ యాదవ్, మెగావత్ కృష్ణ నాయక్, పానుగంటి వెంకన్న, ఎస్.కె చాంద్ పాషా, సురేందర్ నాయక్, పానుగంటి వెంకటయ్య, కోరే శివ, ఈద శేఖర్, కంశెట్టి చత్రపతి, ఎరెడ్ల వెంకట్ రెడ్డి, కలకొండ దుర్గయ్య, దామెర యాదగిరి, కాటన్ వెంకటయ్య గౌడ్, బూదునూరు వెంకటరెడ్డి, సుధాకర్ రెడ్డి, పానుగంటి వెంకటయ్య, బుషిపాక సంజీవ, పోగుల దివ్య, తదితరులు పాల్గొన్నారు.
TG: ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సీఐ, ఎస్ఐ
HYD: ఒక కేసును మూసివేయడం కోసం 3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు పట్టుబడ్డ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సిఐ జి. వీరస్వామి మరియు ఎస్ఐ షేక్ షఫీ... ఎల్.ఉపేందర్ అనే ప్రైవేట్ వ్యక్తి ద్వారా ఈ లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి మృతి పట్ల సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి
సిక్కిం, కేరళ రాష్ట్రాల మాజీ గవర్నర్ పుంజాల శివశంకర్ సతీమణి లక్ష్మీబాయి మృతి పట్ల తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్చార్జి దీపా దాస్ మున్షితో కలిసి శంషాబాద్ శివారులోని మామిడిపల్లి గ్రామంలో లక్ష్మీబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం వారి కుమారుడు డాక్టర్ వినయ్ కుమార్, కోడలు అలేఖ్యలను ఓదార్చి సానుభూతి తెలిపారు.
NLG: ఫుట్బాల్ D లైసెన్స్ కోచ్ లైసెన్స్ కోర్సు ను పూర్తి చేసిన క్రీడాకారులను ప్రత్యేకంగా అభినందించిన బొమ్మపాల గిరిబాబు
తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ (TFA) ఆధ్వర్యంలో ఈనెల 24 నుండి 30 వ తేదీ వరకు , యాదాద్రిభువనగిరి జిల్లాలో గల న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హైస్కూల్లో, D లైసెన్స్ కోచ్ సర్టిఫికెట్ కోర్సు ను ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మద్ది కర్ణాకర్, బాణావత్ మౌనిక, చిట్టిమల్ల సంధ్య ముగ్గురు క్రీడాకారులు దిగ్విజయంగా పూర్తి చేసి, ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ నుండి కోచ్ సర్టిఫికెట్ పొందారు. ఈ  సందర్భంగా, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ పక్షాన ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ముగ్గురిని ప్రత్యేకంగా అభినందించారు. ముగ్గురు కూడా క్షేత్రస్థాయిలో పాఠశాల దశ నుండి ఫుట్బాల్ క్రీడాకారులను తయారుచేసి జిల్లాకు, రాష్ట్రానికి, దేశానికి అందించాలని సూచించారు.
NLG: గాయాల పాలైన 108 అంబులెన్స్ డ్రైవర్ ని ఆదుకోవాలి: ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి
నల్గొండ జిల్లా, పీఏ పల్లి మండలం, నీలింనగర్ కోదాడ జడ్చర్ల రహదారి వెంట నీలింనగర్ సమీపంలో ఇటీవల, కోమండ్ల శేఖర్ వీధి నిర్వహణలో భాగంగా 108 అంబులెన్స్ లో ప్రయాణిస్తూ అంబులెన్స్, లారీ ఢీకొన్న ఘటనలో రెండు వాహనాలు దగ్ధమై శేఖర్ తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ ఘటనపై ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి,  దళిత రత్న బుర్రి వెంకన్న స్పందిస్తూ..  ప్రభుత్వం ద్వారా శేఖర్ కు మెరుగైన వైద్యాన్ని అందించాలని, వారి కుటుంబాన్ని ఆర్థికపరంగా అన్ని విధాలుగా ఆదుకోవాలని అన్నారు. ఆపదలో 24 గంటలు ప్రజల ప్రాణాలను కాపాడే 108 వాహనాలు, వారి సేవలు మరువ లేనివని అలాంటివారికి ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం అండగా ఉండాలని వారిని అన్ని విధాల ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
NLG: సిఐటియు 54వ ఆవిర్భావ దినోత్సవం
కార్మిక వర్గాన్ని ఒక వర్గంగా ఐక్యం చేసి దోపిడీ రహిత కార్మిక వర్గ రాజ్య స్థాపన లక్ష్యంగా 1970లో సిఐటియు ఆవిర్భవించిందని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి తెలిపారు. గురువారం నల్గొండ పట్టణంలోని హమాలీ యూనియన్ కార్యాలయం దగ్గర సిఐటియు పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో 54వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జండా ఆవిష్కరణ, కేక్ కట్ చేసి మాట్లాడారు.
NLG: నాగార్జునసాగర్ జలాశయంలో తగ్గిన నీటి నిల్వలు
నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తి స్థాయి నీటి మట్టం 590. 00 అడుగులకు గాను 504. 70 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.5050 టీఎంసీలకు గాను ప్రస్తుతం 122.8483 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక జలాశయానికి అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉండగా ఇన్ ఫ్లో లేదు.
కర్రోడా అన్నందుకు విడాకులు..!
భర్తను భార్య పదే పదే కర్రోడా అని అనడంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. ఆమె ప్రతి సారి కర్రోడా అంటే ఇబ్బందిగా ఉందని కోర్టుకు విన్నవించాడు. దీంతో భార్య నుంచి తనకు విడాకులు కావాలని కోర్టులో విజ్ఞప్తి చేశారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం భర్తను కర్రోడా అని పిలవడం క్రూరత్వం కిందకు వస్తుందని కోర్టు తెలిపింది. ఈ పద్దతిన మెంటల్, ఫిజికల్, ఎమోషనల్‌గా కూడా ఎఫెక్ట్ పడుతుందని తెలిపింది. భర్తకు మానసిక వేదన కలిగించిన భార్యకు కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సంఘటన కేరళ రాష్ట్రంలో జరిగింది.
చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం
చివరి విడత పోలింగ్‌కు పశ్చిమ బెంగాల్ సిద్ధం. లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తించిన రాష్ట్రం పశ్చిమబెంగాల్. అక్కడి ఎన్నికలు బీజేపీ, తృణమూల్ మధ్య తీవ్ర వివాదాల నేపథ్యంలో హోరాహోరీగా సాగుతున్నాయి. మొత్తం 42 నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా 33 చోట్ల పోలింగ్ పూర్తయింది. మిగిలిన 9 స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. మొత్తం 124 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.