NLG: మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికుల ధర్నా
తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ మర్రిగూడ మండల సిఐటియు ఆధ్వర్యంలో, బుధవారం మర్రిగూడ ఎంపీడీవో కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య హాజరై మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్ల నుండి గ్రామపంచాయతీలలో వెట్టి చేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. గ్రామాలకు స్పెషల్ అధికారులు వచ్చిన నాటి నుండి కార్మికులకు వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు.
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనము 26 వేల రూపాయలు ఇవ్వాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పర్మనెంట్ చేయాలని పిఎఫ్,ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికులకు తక్షణమే రెండు జతల బట్టలు, చెప్పులు, సబ్బులు, టవల్స్ టార్చ్ లైట్, చేతి గ్లౌజ్, బూట్ల, ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల నాయకులు పోలేపల్లి రాములు,నక్క నరసింహ,ఒంపు ముత్తమ్మ, పెరుమాండ్ల మంజుల, అయితపాక పద్మ, గ్యార దుర్గమ్మ, యాచారం జంగమ్మ, మర్రి ఇందిరమ్మ, హేమలత, నర్సమ్మ, ఏపూరి ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.
May 30 2024, 12:15