నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 12:13

బెంగుళూరు రేవు పార్టీ కేసులో విచారణకు డుమ్మా కొట్టిన నటి హేమ

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో హాజరుకాలేనని హేమ లేఖ..

బెంగళూరు సీసీబీ పోలీసులకు లేఖ రాసిన నటి హేమ.. వైరల్ ఫీవర్తో బాధపడుతున్నట్లు లేఖ రాసిన హేమ..

సీసీబీ ఎదుట హాజరయ్యేందుకు కొంత సమయం కావాలని కోరిన హేమ..

మరోసారి హేమకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైన సీసీబీ.. ఇవాళ హాజరుకావాలంటూ గతంలో ఇచ్చిన నోటీసులకు హేమ రిప్లై..

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 11:59

తెలంగాణ ప్రభుత్వ మరియు ప్రైవేటు హాస్పిటల్లో మళ్లీ పెరుగుతున్న కడుపు కోతలు..

మళ్లీ తిరుగుతున్న ప్రైవేట్ హాస్పిటల్లో కడుపు కోతలు..

రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్లు 

ప్రైవేటు ఆస్పత్రుల్లో 75 శాతం ప్రసవాలు అవే 

సర్కారు దవాఖానల్లో 46.4 శాతం 

అగ్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా

నిరుటితో పోలిస్తే పెరిగిన ఆపరేషన్లు 

వైద్యశాఖ తాజా నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌: రాష్ట్రంలో కడుపు కోతలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే ప్రతీ వంద డెలివరీల్లో 75 సిజేరియన్లే ఉంటున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ మొత్తం ప్రసవాల్లో 46.4 శాతం కడుపుకోతలే ఉండటం గమనార్హం. మార్చి నెలలో తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో జరిగిన డెలివరీలపై సర్కారుకు వైద్యశాఖ ఇటీవలే ఓ నివేదిక ఇచ్చింది. దీని ప్రకారం ఆ నెలలో జరిగిన మొత్తం ప్రసవాల్లో 57ు సీ సెక్షన్స్‌ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ వంద కాన్పుల్లో సిజేరియన్లు 21 ఉండగా, భారత్‌లో అది 23.29గా ఉంది. 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా సిజేరియన్‌ డెలివరీలు సగటున 28.5 శాతానికి పెరుగుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. 

కానీ మనదగ్గర ఇప్పుడే దానికి రెట్టింపు స్థాయిలో కడుపుకోతలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. సిజేరియన్‌ ప్రసవాల్లో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. కాగా, గతేడాది వరకు సర్కారీ దవాఖానల్లో సాధారణ ప్రసవాలు 66.8 శాతం ఉండగా... ఇప్పుడవి 54 శాతానికి తగ్గాయి. దాదాపు 12 శాతం మేరకు నార్మల్‌ డెలివరీలు తగ్గి సిజేరియన్లు పెరిగాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇక ప్రైవేటులో సాధారణ ప్రసవాలు గతేడాది వరకు 33-34 శాతం మధ్య ఉండగా... ప్రస్తుతం అవి 25 శాతానికి పడిపోయి, ఏకంగా 75 శాతం డెలివరీలు సిజేరియన్లే అవుతున్నాయి. 

ప్రతీ గంటకు 29 సిజేరియన్‌ ఆపరేషన్లు 

రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కలపి మొత్తం 39,188 ప్రసవాలు జరిగాయి. ఇందులో 22,046 డెలివరీలు సిజేరియన్లు. ఈ లెక్కన ప్రతీ గంటకు 29, రోజుకు సగటున 711 కడుపుకోతలు జరిగినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబుతున్నాయి. సాధారణ ప్రసవాలు కేవలం 43.75 శాతంగా నమోదయ్యాయి. అత్యధిక సిజేరియన్లు జరిగిన జిల్లాగా రాజన్న సిరిసిల్ల నిలిచింది. అక్కడ ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రతీ వంద డెలివరీల్లో 93.5 శాతం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 73.2 శాతం సీ-సెక్షన్స్‌ జరిగాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో అత్యల్పంగా సీ సెక్షన్స్‌ మేడ్చల్‌ జిల్లాల్లో జరుగుతున్నాయి. అక్కడ 51 శాతమే నమోదయ్యాయి. 

మహబూబాబాద్‌ జిల్లాలో ప్రైవేటులో 91.6 శాతం, సర్కారీలో 62 శాతం సిజేరియన్స్‌ జరుగుతున్నాయి. 90 శాతం సీ సెక్షన్స్‌తో నిర్మల్‌ జిల్లా మూడోస్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానాల్లో సగటున అన్ని జిల్లాల్లో సీ సెక్షన్స్‌ 75 శాతం జరుగుతున్నాయి. 80 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాలా జాబితాలో పెద్దపల్లి (89), వరంగల్‌, జనగాం (87), వికారాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల (86), ఆదిలాబాద్‌, కామారెడ్డి (85), సిద్దిపేట (84), మెదక్‌, కరీంనగర్‌, యాదాద్రి భువనగిరి, నిజామాబాద్‌, హన్మకొండ (83), ఖమ్మం (80)ఉన్నాయి. సుమారుగా సగం జిల్లాల్లో 80 శాతానికిపైగా కడుపుకోతలు జరుగుతుండం ఆందోళనకర అంశమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఆస్పత్రుల్లో 50 శాతానికిపైగా సిజేరియన్లు జరుగుతున్న జిల్లాల జాబితాలో నాగర్‌కర్నూల్‌ (50), కరీంనగర్‌ (69), సిద్దిపేట, వరంగల్‌ (57), మంచిర్యాల (60), జగిత్యాల, హన్మకొండ (67), జయశంకర్‌ భూపాలపల్లి (59), కామారెడ్డి, నల్గొండ (51), పెద్దపల్లి (67), ఖమ్మం (53) యాదాద్రి భువనగిరి (55), నిర్మల్‌ (65), నిజామాబాద్‌ (54), మహబూబాబాద్‌, జనగాం (62) జిల్లాలున్నాయి. 

డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం 15 శాతమే.. 

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన ప్రమాణాల మేరకు సీసెక్షన్‌ ప్రసవాలు ప్రతీ వందకు 10-15 మాత్రమే ఉండాలి. 1990లో ప్రపంచవ్యాప్తంగా సగటు సీ సెక్షన్‌ రేటు 7 శాతం ఉండగా, 2030 నాటికి అది 28.5 శాతానికి పెరుగుతుందని అంచనా. ప్రస్తుతం ఆఫ్రికాలో 9.2 శాతం, ఆసియాలో 23.1 శాతం, యూర్‌పలో 25.7 శాతం, అమెరికాలో 39.3 శాతం కడుపుకోతలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 11:35

తెలంగాణలో ఉసురు తీసిన గాలివాన

ఉసురు తీసిన గాలివాన

విరిగిపడిన చెట్లు.. కూలిన షెడ్లు, కరెంటు స్తంభాలు

రాష్ట్రవ్యాప్తంగా 13 మంది మృత్యువాత

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే ఏడుగురి దుర్మరణం

హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరి మృతి

ఈనాడు, హైదరాబాద్, మహబూబ్‌నగర్‌

ఉసురు తీసిన గాలివాన

హైదరాబాద్‌ వనస్థలిపురం గణేశ్‌ ఆలయం ప్రాంతంలోని కెనరా బ్యాంకు రోడ్డులో కారు, ఆటోపై కూలిన వృక్షం

అకాలవర్షాలు, ఈదురుగాలులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రెమాల్‌ తుపాను ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ... మధ్యాహ్నం ఉన్నట్లుండి భారీ ఈదురుగాలులు విరుచుకుపడటంతో వేర్వేరు ప్రమాదాల్లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క నాగర్‌కర్నూల్‌ జిల్లాలోనే వేర్వేరు ఘటనల్లో ఏడుగురు మృత్యువాతపడ్డారు. షెడ్డు కూలడంతో తండ్రీకూతుళ్లు సహా నలుగురు, పిడుగుపాటుతో ఇద్దరు, ఓ డ్రైవరు చనిపోయారు. రాజధాని హైదరాబాద్‌లో నలుగురు, మెదక్‌లో ఇద్దరు వేర్వేరు ప్రమాదాల్లో దుర్మరణం చెందారు. పలు జిల్లాల్లో భారీ వృక్షాలు, విద్యుత్‌ స్తంభాలు విరిగిపడటంతో అనేక చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గంటల తరబడి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. గాలుల ధాటికి రోడ్లపై, ఇళ్ల ఆవరణల్లోని వస్తువులు చెల్లాచెదురయ్యాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాను భారీ వర్షం అతలాకుతలం చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గాలిదుమారం రేగింది. నల్గొండ జిల్లా పెద్ద అడిశెర్లపాడు మండలం ఘన్‌పూర్, హాలియా మండలం ఇబ్రహీంపేట, గుర్రంపోడు మండల కేంద్రాల్లో వాన కురిసింది.

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరులో కూలిపోయిన రేకులషెడ్డు శిథిలాల్లో నలుగురి మృతదేహాలు

హైదరాబాద్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో రహదారులు, ఇళ్లు, వాహనాలపై భారీ చెట్లు, కొమ్మలు విరిగిపడ్డాయి. బహుళ అంతస్తులపై ఏర్పాటు చేసిన పలు హోర్డింగ్‌లు, సెల్‌టవర్లు పడిపోయాయి. ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. కొద్దిసేపటికి గాలులకు భారీ వర్షం తోడవ్వడంతో ప్రజలు వణికిపోయారు. హయత్‌నగర్‌ నుంచి వనస్థలిపురం మీదుగా ఎల్బీనగర్‌ వరకూ, మల్కాజిగిరి, మేడ్చల్‌ నుంచి శామీర్‌పేట్‌ మీదుగా కీసర, ఘట్‌కేసర్‌ వరకూ వాహనాల రాకపోకలు స్తంభించాయి. సాయంత్రం 6 గంటలకు కూకట్‌పల్లి, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాలు, ఐటీ కారిడార్‌లో భారీ వర్షం కురవడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో ఓ ఇంటిపై పడిపోయిన హోర్డింగ్‌

పలు జిల్లాల్లో ఎండల తీవ్రత 

మరోవైపు రాష్ట్రంలో ఎండలు ఆదివారం 46.5 డిగ్రీల మార్కును తాకాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో 46.5 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. ఇదే మండలం బుద్దేష్పల్లిలో 46.1 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో 45.8, పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ 45.8, జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌ 45.6, ధర్మపురి మండలం నేరెళ్ల 45.6, ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి 45.2, మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్‌ 45.2, పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండల కేంద్రం 45.1, మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రం 45, నిర్మల్‌ జిల్లా కేంద్రం 45, మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తపాల్పూర్‌లో 45 డిగ్రీల ఎండ కాసింది. మరికొన్ని జిల్లాల్లో 44.8 నుంచి 44.9 డిగ్రీల మధ్య నమోదైంది. సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది.పలు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపింది. 

హయత్‌నగర్‌ ఇన్ఫర్మేషన్‌ కాలనీలో ద్విచక్రవాహనంపై కూలిన భారీ వృక్షం

వనస్థలిపురం సాగర్‌ కాంప్లెక్స్‌పై విరిగి పడిన సెల్‌ఫోన్‌ టవర్‌

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో ఏడుగురి మృత్యువాత

నాగర్‌కర్నూల్‌ జిల్లా తాడూరు శివారులోని ఇంద్రకల్‌ రోడ్డు సమీపంలో రైతు మల్లేశ్‌(38) తన పొలంలో రేకుల షెడ్డు నిర్మించుకుంటున్నారు. ఆయనతోపాటు భార్య పార్వతమ్మ, కుమారుడు రాజు, కుమార్తె అనూష(12), పని చేయడానికి వచ్చిన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన ఇద్దరు మేస్త్రీలు, ఇద్దరు అడ్డాకూలీలు చెన్నమ్మ(38), రాముడు(36) అక్కడే ఉన్నారు. ఉన్నట్లుండి ఈదురుగాలులతో వర్షం కురవడంతో మల్లేశ్‌తోపాటు ఆయన కుటుంబసభ్యులు, మేస్త్రీలు చిన్ననాగులు, కుర్మయ్య, చెన్నమ్మ, రాముడు, పక్క పొలం రైతు నాగరాజు షెడ్డులో తలదాచుకున్నారు. నిర్మాణంలో ఉన్న షెడ్డు ఒక్కసారిగా కూలిపోవడంతో మల్లేశ్, అనూష, చెన్నమ్మ, రాముడు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రగాయాలైన పార్వతమ్మ, రాజు, చిన్ననాగులు, నాగరాజులును ఆసుపత్రికి తరలించారు. నాగర్‌కర్నూల్‌ మంతటి గేట్‌ సమీపంలో రేకుల షెడ్డుపై ఉన్న రాయి పడి వేణుగోపాల్‌(38) మృతిచెందారు. వికారాబాద్‌ జిల్లా బాషీర్‌బాద్‌ మండలం నీళ్లపల్లి చెందిన వేణుగోపాల్‌ కారు కిరాయికి తిప్పుతూ జీవనం సాగించేవారు. శ్రీశైలం కిరాయికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈదురుగాలులకు మంతటి గేటు సమీపంలో రోడ్డు పక్కనే రేకుల షెడ్డుపై ఉన్న రాయి వేగంగా దూసుకొచ్చి కారు అద్దాన్ని పగులగొట్టుకొని లోపలున్న వేణుగోపాల్‌పై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మృతిచెందారు. అలాగే తెలకపల్లికి చెందిన లక్ష్మణ్‌(12), తిమ్మాజీపేట మండలం మారేపల్లికి చెందిన కుమ్మరి వెంకటయ్య(54) వేర్వేరు ఘటనల్లో పిడుగుపాటుకు బలయ్యారు.

హైదరాబాద్‌లో నలుగురి మృతి

కీసర, మియాపూర్: యాదాద్రి జిల్లా బొమ్మలరామారం గ్రామానికి చెందిన నాగిరెడ్డి, ధనుంజయ్‌లు మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. తిమ్మాయిపల్లి సమీపంలోని వేణుగోపాలస్వామి ఆలయం వద్ద బలమైన ఈదురుగాలులకు భారీ చెట్టు విరిగి వారిపై పడింది. దీంతో వెనుక కూర్చున్న నాగిరెడ్డి రామిరెడ్డి(56) అక్కడికక్కడే చనిపోయారు. తీవ్ర గాయాలైన ధనుంజయ్‌(44)ను సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. హఫీజ్‌పేట్‌లోని సాయినగర్‌లో ఓ ఇంటి మూడో అంతస్తులో రేకులషెడ్డు వేసి, పైన ఇటుకలు పెట్టారు. గాలివానకు రేకులు ఎగిరిపోగా.. ఇటుకలు పక్క ఇంట్లో ఉంటున్న చిన్నారి సమద్‌(3)తోపాటు రోడ్డుపై వెళ్తున్న రషీద్‌(45)పై పడ్డాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే చనిపోగా.. రషీద్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

కోళ్ల ఫారం గోడ కూలి ఇద్దరి దుర్మరణం

ములుగు: మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం ఘనపూర్‌ గ్రామానికి చెందిన గంగ గౌరీశంకర్‌(30).. హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్టకు చెందిన భాగ్యమ్మ(50)(గౌరీ శంకర్‌కు వదిన) తమ కుటుంబసభ్యులతో కలిసి శనివారం సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్‌లో బంధువులు విభూతి శ్రీనివాస్‌ ఇంటికి వచ్చారు. ఆదివారం శ్రీనివాస్‌ పొలానికి అందరూ కలిసి వెళ్లారు. ఉరుములు, మెరుపులతో గాలివాన రావడంతో సమీపంలోని ఇరుకుల రాములు కోళ్లఫారం గోడ వద్దకు వెళ్లారు. గాలి ధాటికి అది ఒక్కసారిగా కూలిపోవడంతో గౌరీశంకర్, భాగ్యమ్మ అక్కడికక్కడే మృతిచెందారు. గంగామాధవి, విభూతి శ్వేత, ఇంద్రజ, గంగ సునీతలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం ములుగు మండలం లక్ష్మక్కపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గౌరీశంకర్‌ బ్యాంకు ఉద్యోగి కాగా అతని తండ్రి నాలుగేళ్ల క్రితం, సోదరుడు మూడేళ్ల క్రితం మృతిచెందారు.

నైరుతి రుతుపవనాలు ఆదివారం నాటికి మరింత విస్తరించాయి. మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు చేరుకున్నాయి. దీన్ని బట్టి ఈ నెల 31 నాటికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

తగ్గిన విద్యుత్‌ డిమాండ్‌

రాష్ట్రంలో వర్షాలతో వాతావరణం చల్లబడటం, యాసంగి సాగు దాదాపు పూర్తవడంతో విద్యుత్‌ డిమాండు గణనీయంగా తగ్గిపోయింది. ఆదివారం రాష్ట్ర విద్యుత్‌ గరిష్ఠ డిమాండు 8797 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది ఇదేరోజు 9262 మెగావాట్లు ఉంది. రాత్రి సమయంలో డిమాండు 7 వేల మెగావాట్లకు చేరుతోంది. నెల క్రితం వరకూ రోజూవారీ గరిష్ఠ డిమాండు 15 వేల మెగావాట్లకు పైగా ఉన్న సంగతి తెలిసిందే.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 10:24

హైదరాబాద్ రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగు...

11 టోల్‌ ప్లాజాలు.. ఇంటర్‌చేంజ్‌లు

107 మేజర్‌, మైనర్‌ బ్రిడ్జిలు.. 4 ఆర్వోబీలు

187 అండర్‌ పాస్‌లు.. 6 రెస్ట్‌ ఏరియాలు

ఇది ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగం స్వరూపం

బ్రిడ్జిలు, కెనాల్‌ క్రాసింగ్స్‌, రైల్వే అంశాలపై జీఏడీకి వివరాలు సమర్పించిన ఎన్‌హెచ్‌ఏఐ

హైదరాబాద్‌, మే 26: రీజినల్‌ రింగ్‌ రోడ్డు ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక అడుగు పడింది. రోడ్డు నిర్మాణానికి ఆగస్టు రెండో వారంలో టెండర్లకు వెళ్లనున్న నేపథ్యంలో రహదారి స్వరూపం దాదాపు ఖరారైంది. 6 ప్యాకేజీలతో 161 కి.మీ. మేర నిర్మాణం కానున్న ఉత్తరభాగం రహదారిలో టోల్‌ ప్లాజాలు మొదలుకుని, ఆర్వోబీల వరకు ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందనే అన్ని అంశాలను ఇప్పటికే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ విభాగం ప్రాథమికంగా ఖరారు చేసింది. 

ప్రస్తుతం ప్రాథమిక అంచనాలలో ఉన్న రోడ్డు మ్యాప్‌ అతి త్వరలోనే ఖరారు కానున్నట్టు అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. గత సర్కారు ఆశించిన స్థాయిలో సహకరించకపోవడం వల్ల ఏళ్ల తరబడి ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రీజినల్‌ రింగ్‌ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడే ఔటర్‌ రింగ్‌ రోడ్డును నిర్మించామని, ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ను కూడా తామే పూర్తిచేస్తామంటూ సీఎం రేవంత్‌, ఆర్‌ అండ్‌ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెబుతూ వస్తున్నారు. అత్యంత వేగంగా దీని పనులను మొదలుపెట్టేందుకు అవసరమైన మేర సహకరిస్తున్నారు. ఉత్తర భాగం రోడ్డు మ్యాప్‌కు సంబంధించిన ఇతర నిర్మాణాలపైనా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులతో సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రోడ్డుతో పాటు ఏయే ప్రాంతాల్లో ఇతర నిర్మాణాలు రానున్నాయనే అంశాలను తెలుసుకున్నారు.

ఇదీ సమగ్ర స్వరూపం..

ఉత్తర భాగం రోడ్డు విస్తీర్ణం 161కి.మీ. ఈ మార్గంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్‌ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన మైనర్‌, మేజర్‌, బాక్స్‌ కల్వర్టులను కూడా నిర్మించాల్సి ఉంది. దీంతో అసలు ఈ ఉత్తర భాగం రోడ్డు మొత్తంలో ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు వస్తున్నాయనే వివరాలకు సంబంధించి ఎన్‌హెచ్‌ఏఐ ప్రాథమికంగా ఒక రిపోర్టును సిద్ధం చేసింది. ఈ మేరకు మొత్తం రోడ్డు విస్తీర్ణంలో 11 టోల్‌ప్లాజాలు, 11 ఇంటర్‌ ఛేంజ్‌లు రానుండగా, 6 చోట్ల రెస్ట్‌ ఏరియాలు ఏర్పాటుకానున్నాయి. చిన్న, మధ్య, భారీ తరహా వెహికల్‌ అండర్‌ పాస్‌లు అన్నీ కలిపి దాదాపు 187 వరకు నిర్మాణం చేయాల్సి వస్తోందని అధికారులు గుర్తించారు. నాలుగు రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి(ఆర్వోబీ)లను నిర్మించాల్సి వస్తోంది. 

ఇవికాక మేజర్‌ బ్రిడ్జిలు 27, మైనర్‌ బ్రిడ్జిలు 80, బాక్స్‌ కల్వర్టులు 404 మేర నిర్మించాల్సి ఉంది. కాగా, ఈ నిర్మాణాలకు రోడ్డుతో సంబంధం లేకుండా టెండర్లకు వెళ్లాలా..? లేదంటే రోడ్డుతో పాటే కలిపి టెండర్లను ఆహ్వానించాలా..? అనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఈ మార్గంలో ఉన్న రైల్వే లైన్లు, కాల్వలు, చెట్లు, సహా పలు అంశాలకు సంబంధించిన వివరాలను రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖకు అందించగా, వీటిలో కొన్నింటి నిర్వహణకు ఇరిగేషన్‌, రైల్వే శాఖల నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆయా అనుమతులను త్వరలోనే పొంది, రోడ్డు పనులను త్వరితగతిన పూర్తిచేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 08:55

Ts: ఐటిఐ నూతన కోర్సులు చేసే వారికి గ్యారెంటీ ఉపాధి..

 ప్రభుత్వ ఐటీఐల్లో ఉపాధి కోర్సులు 

పారిశ్రామికీకరణే లక్ష్యంగా ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు

టాటా టెక్నాలజీస్‌ భాగస్వామిగా..

ఉమ్మడి జిల్లాలో ఆరింటిలో..

ఈ విద్యాసంవత్సరంనుంచే 6నూతన కోర్సులు

1440 సీట్లు అందుబాటులోకి

భువనగిరి టౌన్‌, 24 మే: పారిశ్రామిక రాష్ట్రమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ పారిశ్రామి క శిక్షణ సంస్థ (ఐటీఐ)లో ఉపాది ఆధారిత పారిశ్రామిక శిక్షణ కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టు పేరిట టాటా టెక్నాలజీ్‌సతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. 

రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో నూతన కోర్సుల ప్రారంభానికి అవసరమైన భవనాల నిర్మాణం, ఆధునిక శిక్షణ సామగ్రికి, శిక్షణకు రూ.2వేల కోట్లను టాటా టెక్నాలజీస్‌ వెచ్చించనుంది. ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాల కల్పనే ఒప్పంద లక్ష్యంగా ఉంది. ఈ మేర కు ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రభుత్వ ఐటీఐల్లో నూతన కోర్సుల మౌలిక వసతుల కల్పనకు ఈ పాటికే మూడు దఫాల సర్వేలు పూర్తికాగా ఎన్నికల కోడ్‌ ముగిసిసిన వెంటనే పనులు ప్రారంభం కానున్నాయి. దీంతో నూతన కోర్సుల్లో చేరే విద్యార్థులకు గ్యారంటీగా ఉపాధి ఉద్యోగాలు లభించనున్నాయి.

మారనున్న ప్రభుత్వ ఐటీఐల దశ

ఇండస్ట్రీ 4.0 ప్రాజెక్టుతో ప్రభుత్వ ఐటీఐల దశ మారడంతోపాటు నూతన కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశా లు మెరుగు కానున్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో ప్రస్తుతం కొనసాగుతున్న కోర్సులు యథావిధిగా ఉండనుండగా నూతనంగా ఆరు కోర్సులు అం దుబాటులోకి రానున్నాయి. ప్రస్తుత ఫిట్టర్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితర సంప్రదాయ కోర్సులతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గాయి. అప్పటి పారిశ్రామిక రంగ పరిస్థితులకు దశాబ్దాల క్రితం రూ పొందించిన అప్పటి కోర్సులు నేటి ఆధునిక పారిశ్రామిక రంగానికి అ నుగుణంగా స్కిల్‌ వర్కర్స్‌ లభించకపోతుండటంతో పారిశ్రామిక అభివృద్ధికి ఆటంకంగా మారుతుండటంతోపాటు యువతకు ఉద్యోగ ఉపా ధి అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సులను ఆధునికీకరించే లక్ష్యంలో భాగంగా ప్రస్తుత పారిశ్రామికీకరణకు అనుగుణంగా రూపొందించిన ఆరు నూతన కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్ర భుత్వ ఐటీఐల్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే ప్రస్తుత కోర్సులకు ఈ పాటికే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా నూతన కోర్సులకు త్వరలో అడ్మీషన్‌ నోటిఫికేషన్‌ జారీ కానుంది. విద్యా అర్హతలు, ఉపకారవేతనాలు తదితర నిబంధనలు యథావిధిగా ఉండనున్నాయి.

ఆరు నూతన కోర్సులు.. ప్రతి కోర్సులో 40 సీట్లు

ఒకటి, రెండు సంవత్సరాల నిడివితో ఆరు నూతన కోర్సులు అందుబాటులోకి రానున్నాయి. ప్రతీ కోర్సులో 40 సీట్లు ఉంటాయి. నూతన కోర్సులకు అనుగుణంగా ప్రతీ ఐటీఐకి నూతన ఇన్‌స్ట్రక్టర్స్‌ను నియమించనుండగా ప్రస్తుత ఇన్‌స్ట్రక్టర్స్‌ అందరికీ టాటా టెక్నాలజీస్‌ శిక్షణ ఇవ్వనుంది. నూతన కోర్సులు ఇలా......

రెండు సంవత్సరాల కోర్సులు

1) బేసిక్‌ డిజైనర్‌ అండ్‌ వర్చువల్‌ వెరిఫైర్‌(మెకానికల్‌)

2) అడ్వాన్స్‌డ్‌ ిసీఎన్‌సీ మిషినింగ్‌ టెక్నీషియన్‌

3) మెకానిక్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌

ఏడాది కోర్సులు

4) మ్యానుఫ్యాక్చరింగ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌ ఆటోమేషన్‌

5) ఇండస్ట్రియల్‌ రోబోటిక్స్‌ అండ్‌ డిజిటల్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌

6) ఆర్టీసన్‌ యూజింగ్‌ అడ్వాన్స్‌డ్‌ టూల్స్‌

ఉమ్మడి జిల్లాలో ఇలా....

ఉమ్మడి జిల్లాలో ఆరు ప్రభుత్వ, 23ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిలో సుమారు 11, 361 మంది విద్యార్థులు పలు కోర్సులు చేస్తున్నారు. అయితే యాదాద్రి, నల్లగొండ జిల్లాల్లో మాత్రమే ప్రభుత్వ ఐటీఐలు ఉండగా సూర్యాపేట జిల్లా విద్యార్థులకు మాత్రం ప్రైవేటు ఐటీఐలే అందుబాటులో ఉన్నాయి. దీంతో యాదాద్రిభువనగిరి, నల్లగొండ జిల్లాల్లోని ప్రభుత్వ ఐటీఐల్లో మాత్రమే నూతన ఆరు కోర్సులు, 1440సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి.

జిల్లా ప్రభుత్వ ప్రైవేటు విద్యార్థులు

నల్లగొండ 4 10 5,748

యాదాద్రి 2 8 4,563

సూర్యాపేట - 5 1,050

మొత్తం 6 23 11,361

నూతన కోర్సులతో ఉజ్వల భవిష్యత్తు : హరికృష్ణ, కన్వీనర్‌ యాదాద్రిభువనగిరి జిల్లా ఐటీఐలు

నూతన కోర్సులు విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ను కల్పిస్తాయి. ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా టాటా ఇండస్ట్రీస్‌ భాగస్వామిగా రూపొందించిన ఆరు కోర్సులు ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రభుత్వ ఐటీఐల్లో అందుబాటులోకి రానున్నాయి. ఉపాధి లక్ష్యంగా తీర్చిదిద్దిన నూత న కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. నూతన కోర్సులకోసం ఐటీఐల్లో ప్రతిపాదించిన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.

నిజందాగదుక్షణంఆగదు

May 27 2024, 08:41

తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంపై నిషేధం

తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకంపై నిషేధం

Gutka Ban | హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆరోగ్యానికి హానిక‌ర‌మైన గుట్కాను నిషేధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ మేర‌కు గుట్కా తయారీ, అమ్మ‌కాల‌పై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ ఏడాది మే 24 నుంచి ఏడాది కాలం పాటు ఈ నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉంటాయ‌ని స్ప‌ష్టం చేశారు.

గుట్కా, పాన్ మాసాల‌లో ఆరోగ్యానికి హాని క‌లిగించే పొగాకు, నికోటిన్ ఉండ‌డం మూలంగానే వాటిని నిషేధించిన‌ట్లు పేర్కొన్నారు. గుట్కాను త‌యారు చేసినా, నిల్వ ఉంచినా, విక్ర‌యాలు జ‌రిపినా చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 26 2024, 07:56

భద్రాచలం పారామెడికల్ విద్యార్థి మరణం పై న్యాయవిచారణ జరిపించాలి: PYL డిమాండ్

పత్రిక

భద్రాచలం పారామెడికల్ మారుతీ కాలేజీలో అనుమాన స్థితిలో మరణించిన పగిడిపల్లి కారుణ్య విద్యార్థి మరణం పై న్యాయ విచారణ జరిపించాలి.ఇండియన్ నర్శింగ్ కౌన్సిల్ జోక్యం చేసుకోవాలి.పి వై ఎల్ డిమాండ్

కోడిజర్ల మండలం ఓ గ్రామం నుండి భద్రాచలం వచ్చి డాక్టర్ కాంతారావు నడుపుతున్న మారుతీ పారామెడికల్ కాలేజీలో BSC నర్సింగ్ చదువుతున్న పగిడిపల్లి కారుణ్య ఎలా చనిపోయిందో,కలెక్టర్, SP, పోలీస్ వారు విచారణ జరపాలని ప్రగతిశీల యువజన సంఘం(PYL )జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాలేజీ యాజమాన్యం cc, పుటజ్ నీ డిలీట్ చేయడం అనుమానస్పదంగా మారిందని అయన ప్రకటనలో తెలిపారు. గురువారం రాత్రి 8,గంటలకు భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ లో చనిపోయినట్టు నిర్దారించారు.శుక్రవారం మధ్యాహ్నం 3,గంటలకు 25, లక్షలకు కాలేజీ యాజమాన్యం సెటిల్ మెంట్ చేశారు దీనిపైన హైకోర్టు విచారణ జరిపించాలని హైకోర్టు అడ్వకేట్ శరత్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది.

పారామెడికల్ మారుతి కాలేజ్ కి దాని యాజమాన్యానికి ఎటువంటి సంబంధాలు లేదని వాళ్ల తల్లిదండ్రులు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు దీనిపై జిల్లా కలెక్టర్ గారు,SP గారు విచారణ జరిపి తగు న్యాయం జరిపించాలని ఒక డిమాండ్ అయితే మా డిమాండ్ విద్యార్థిని మరణించిన స్థలంలోకి ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ మిత్రబృందాన్ని కానీ తన ఉన్న రూముని కానీ తను క్రింద పడిన స్థలాన్ని కానీ జరుగుతున్న అన్నింటిని గమనించి సరైన మార్గంలో ఎంక్వారి చెయ్యాలని నిజనిర్ధారణ ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలని వారు అన్నారు.ఇటువంటి సంఘటనలు ఇకముందు పునరుద్దరణ జరకుండ ఆ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తప్పు ఎవరిదైనా ఎంత వారిదైనా చట్టం న్యాయం ముందు అందరు సమానమే అని గుర్తించి కఠినంగా శిక్షంచాలని నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మారుతీ నర్సింగ్ కాలేజీపై ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కు కంప్లెన్ట్ లెటర్ సిపారస్ చెయ్యాలని ముసలి సతీష్ డిమాండ్ చేశారు.

అమ్మాయి తల్లిదండ్రులు కొట్టుకొని విడిపోయారు మేనమామ ఆ అనాధను కస్టపడి చదివించారు అమ్మ నాన్న లేకపోవడంతో భయంతో పెరిగింది ఆ అమ్మాయి చనిపోయిన ప్లేస్ కు వెళ్లకుండా ఆత్మ అత్య అని 25లక్షలు సెటిల్ మెంట్ చేశారు అధికారులు .దీన్ని విద్యార్థి సంఘలు యువజన సంఘలు తీవ్రంగా ఖండిస్తున్నాయి కరణ్యకు న్యాయం జరిగేదాకా ఉద్యమాలు జరుగుతాయి అని హెచ్చరించారు.

నిజందాగదుక్షణంఆగదు

May 26 2024, 07:48

PCC చీఫ్ గా సీతక్కను ఎంపిక చేసే అవకాశం.....

PCC చీఫ్ గా సీతక్క?

TG: పీసీసీ చీఫ్ పోస్టు కోసం పలువురు కాంగ్రెస్

నేతలు పోటీ పడుతున్నారు. అయితే పీసీసీ చీఫ్గా

మంత్రి సీతక్క ఎంపిక కానున్నట్లు తెలుస్తోంది.

సీతక్క

ఆదివాసీ కావడంతో ఆమెను పీసీసీ చీఫ్ గా చేస్తే పార్టీ

నేతలు వ్యతిరేకించలేరని హైకమాండ్ భావిస్తోందట.

ఒక వేళ సీతక్కకు పీసీసీ చీఫ్ బాధ్యతలు

అప్పగిస్తే.. మంత్రి పదవి నుంచి ఆమె తప్పుకోవాల్సి

ఉంటుందని సమాచారం.

నిజందాగదుక్షణంఆగదు

May 24 2024, 21:20

కొమురం భీం జిల్లాలో అటవీశాఖ వర్సెస్‌ అన్నదాతలు..

కొమురం భీం జిల్లాలో అటవీశాఖ వర్సెస్‌ అన్నదాతలు

అంకుసాపూర్‌లో అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతులు

రైతులను అడ్డుకున్న అటవీశాఖ అధికారులు

రెవెన్యూ భూములను అటవీ భూములుగా చెబుతున్నారని..

అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు

నిజందాగదుక్షణంఆగదు

May 24 2024, 21:11

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

జూన్‌ 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ 

జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు

జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు

మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ

జూన్‌ 19 నుంచి ఇంజినీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌

జులై 24న ఇంజినీరింగ్‌ రెండోవిడత సీట్ల కేటాయింపు

జులై 30 నుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌

ఆగస్ట్‌ 5న తుది విడత సీట్ల కేటాయింపు