Mane Praveen

May 25 2024, 22:16

నక్సల్ బరి పోరాటానికి 57 ఏళ్ళు
భారతదేశ పీడిత ప్రజలకు విప్లవ పోరాట మార్గాన్ని చూపిన నక్సల్ బరి పోరాటానికి 57 ఏళ్ళు నిండిన సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్ పై ఎర్రజెండా ను ఎగరవేశారు.

ఈ సందర్భంగా CPI (M-L) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇందూరు సాగర్ పాల్గొని మాట్లాడుతూ.. 1967లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రం డార్జిలింగ్ జిల్లాలో సిలుగురి ప్రాంతంలో సంతాల్ రైతులు తమకు భూమి కావాలని పోరాటాన్ని కొనసాగిస్తే నాడు ఉన్న సంకీర్ణ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ఆ పోరాటంపై కాల్పులు జరిపి 11 మందిని బలిగొన్నదని అన్నారు. ఆ పోరాటమే ఈ దేశ విముక్తి కి విప్లవ పంథాను చూపిందన్నారు. భూమి, బుక్తి కోసం సాగిన నక్సల్ బరి పోరాటం అందించిన స్ఫూర్తితో దేశంలో హింస, అణిచివేత, పీడనలకు వ్యతిరేకంగా విప్లవ పోరాటాలు కొనసాగుతున్నాయని అన్నారు. ఆ ప్రేరణతో  అనేకమంది యువకులు, విద్యార్థులు, మేధావులు విప్లవ పోరాటలలోకి వచ్చారని, శ్రీకాకుళం గిరిజన సాయుధ రైతాంగ పోరాటం కూడా కొనసాగిందని అన్నారు. నాడు జరిగిన నక్సల్ బరి పోరాటం పార్లమెంటరీ పందాకు, విప్లవ పందాకు మధ్య విభజన రేఖను  గీసిందని, ఆ రైతాంగ ఉద్యమంపై జ్యోతిబసు ప్రభుత్వం చేసిన దుర్మార్గమే సిపిఎం లోని అగ్ర శ్రేణి కార్యకర్తలు, నాయకులు విప్లవ మార్గంలో ప్రయాణించారని అన్నారు. నక్సల్ బరి పోరాట స్ఫూర్తితో బలమైన విప్లవోద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్, PYL జిల్లా కార్యదర్శి బివి చారి, రావుల వీరేశ్, జానపాటి శంకర్, దాసరి నర్సింహా, అయోధ్య,బాలాజీ, పవన్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

May 25 2024, 15:54

TG: వరంగల్ జిల్లాలో రైలు పట్టాలపై ప్రేమ జంట ఆత్మహత్య
వరంగల్ జిల్లా: రైలు కింద పడి యువతి మృతి చెందిన ఘటన వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం సారధి నగర్ కు చెందిన ఐలపోగు సుష్మ (17) అనే యువతి, వరంగల్ కాశిబుగ్గ కు చెందిన చెన్నకేశవ అనే యువకుడు శుక్రవారం సాయంత్రం వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఏడు మోరీ ల వద్ద నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన యువతి స్పాట్ లోనే మృతి చెందగా..మృతదేహాన్ని ఎంజీఎం మార్చురికి తరలిం చారు. తీవ్ర గాయాల పాలై న యువకుడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు మీద ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు అయింది. బంధువులకు సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు. వారు వచ్చిన తర్వాత ఏ కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డారని పూర్తి వివరాలు తెలియజేస్తామని ఐ.ఓ ఎం.మల్లయ్య, ఎస్ఐ, ఆర్పీ, వరంగల్ రైల్వే పోలీసులు  తెలిపారు.

Mane Praveen

May 24 2024, 16:04

అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయం
గుర్రంపోడు మండలం, కొప్పోల్ గ్రామంలోని బస్టాండ్ లో గత 3 నెలలుగా మతిస్థిమితం లేని వ్యక్తికి మూడు నెలల పాటు స్థానికులు భోజనం అందించారు.గుర్రంపోడు పోలిస్ సిబ్బంది, కొప్పోల్ గ్రామ యువత సహకారంతో అన్నపూర్ణ సేవాసమితి వారికి సమాచారం అందించగా, తక్షణమే స్పందించిన అన్నపూర్ణ సేవా సమితి అధ్యక్షులు రాజు, సభ్యుడు రాము  మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తిని స్థానిక పోలీస్, గ్రామ యూత్ ఆధ్వర్యంలో సూర్యాపేట లోని ఆశ్రమం కు తరలించారు. నూకల జైపాల్ రెడ్డి  మతి స్థిమితం కోల్పోయిన వ్యక్తిని అంబులెన్స్ లో తీసుకెళ్ళుటకు పెట్రోల్ కి సహకారం అందించారు. ఈ సందర్భంగా పోలీసులు సమాజ సేవ చేస్తున్న గ్రామ యూత్ ని, అన్నపూర్ణ స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందించారు.

Mane Praveen

May 23 2024, 18:06

TG: ఏసీబీకి చిక్కిన అవినీతి అధికారి
కొత్తగూడెం భద్రాద్రి జిల్లా, చర్ల మండలం డిప్యూటీ తహశీల్దారు భరణిబాబు ఈరోజు ఎసిబికి చిక్కారు. భరణిబాబు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కారు. పాసుపుస్తకం ఇచ్చేందుకు రైతును డిటి భరణిబాబు లంచం అడగడంతో సదరు వ్యక్తి ఎసిబి ని ఆశ్రయించాడు. దీంతో వలపన్ని డిప్యూటీ తహశీల్దారును ఎసిబి అధికారులు పట్టుకున్నారు.

Mane Praveen

May 22 2024, 18:43

NLG: దేవాలయం నిర్మాణానికి విరాళం
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీకంఠమహేశ్వరసురమాంబ దేవాలయం నిర్మాణానికి బుధవారం, తన వంతుగా రూ. 55,000/- విరాళాన్ని వల్లంల సంతోష్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ముద్దం శ్రీను గౌడ్ , జమ్ముల వెంకటేష్ గౌడ్ , ఐతగోని రాములు గౌడ్ పాల్గొన్నారు.

Mane Praveen

May 22 2024, 18:38

NLG: విద్యార్థినీ విద్యార్థులు బాల్యదశ నుండే ఈత ను సాధన చేయాలి
నల్గొండ: పట్టణంలోని ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న స్విమ్మింగ్ శిక్షణను ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో వివిధ రకాల స్కిల్స్ ని నేర్చుకోవడంలో భాగంగా ప్రతిరోజు ఈతను కూడా ఒక గంట పాటు సాధన చేయాలని తద్వారా స్వీయ రక్షణతో పాటు, శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చునని సూచించారు. స్విమ్మింగ్ చేయడం ద్వారా శరీరంలోని ప్రతి అవయవం లో చురుకైన కదలికలు ఏర్పడుతాయని తద్వారా ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు పొందవచ్చునని తెలిపారు.

Mane Praveen

May 22 2024, 18:07

NLG: శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలి: మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్
నల్లగొండ: వర్షాకాలం సమీపిస్తున్నందున పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటికి మరమ్మత్తులు చేయించుకోవాలని యాజమాన్యాలకు సూచించాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, వార్డ్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వార్డు ఆఫీసర్లు తమ తమ వార్డులలో భవనాలను గుర్తించి చిన్న చిన్న రిపేర్లు ఉన్నట్లయితే యాజమాన్యాలు రిపేర్లను చేయించుకునే విధంగా సూచనలు చేయాలని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను తొలగించియాలని సూచించారు. పట్టణ ప్రజలు కూడా శిథిలావస్థ భవనాలను గుర్తించి మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాన్ని  నివారించవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో  ఏసీబీ నాగిరెడ్డి, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 21 2024, 16:06

తొలిసారి ఒకే నంబరుకు అత్యధిక రాబడి
TG: తొలిసారి ఒకే నంబరుకు అత్యధిక రాబడి రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు వచ్చింది. ఏకంగా రూ. 25. 50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో మంగళవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. TG 09 9999 నంబర్ ను సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం రూ. 25, 50, 002 చెల్లించినట్లు హైదరాబాద్‌ జేడీసీ సి. రమేశ్‌ తెలిపారు. SB NEWS TELANGANA

Mane Praveen

May 21 2024, 15:53

NLG: బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమెందర్ రెడ్డిని గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ  ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి  ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.