కొమురం భీం జిల్లాలో అటవీశాఖ వర్సెస్‌ అన్నదాతలు..

కొమురం భీం జిల్లాలో అటవీశాఖ వర్సెస్‌ అన్నదాతలు

అంకుసాపూర్‌లో అటవీ భూముల్లో సాగు చేస్తున్న రైతులు

రైతులను అడ్డుకున్న అటవీశాఖ అధికారులు

రెవెన్యూ భూములను అటవీ భూములుగా చెబుతున్నారని..

అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగిన రైతులు

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

జూన్‌ 27 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ 

జూన్‌ 30 నుంచి మొదటి విడత వెబ్‌ ఆప్షన్లు

జులై 12న తొలి విడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు

మూడు విడతల్లో ఇంజినీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియ

జూన్‌ 19 నుంచి ఇంజినీరింగ్‌ రెండోవిడత కౌన్సెలింగ్‌

జులై 24న ఇంజినీరింగ్‌ రెండోవిడత సీట్ల కేటాయింపు

జులై 30 నుంచి ఇంజినీరింగ్‌ తుదివిడత కౌన్సెలింగ్‌

ఆగస్ట్‌ 5న తుది విడత సీట్ల కేటాయింపు

TS:కేబినెట్ కు మరో ఆరుగురు మంత్రులు ! ఛాన్స్ దక్కే అవకాశం ఎవరికి ఉందంటే...!

బ్రేకింగ్ న్యూస్

కేబినెట్ కు మరో ఆరుగురు మంత్రులు !

హైదరాబాద్ న్యూస్ డెస్క్ ; తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చాలా రోజులుగా ఆశావాహులు నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పైన అడుగులు పడుతున్నాయి. జూలై, ఆగస్టులోనే పంచాయితీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తన మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి తరువాత తన మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ హైకమాండ్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పంచాయితీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ..నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ ద్వితీయార్ధంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎంతో సహఆ 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది.ప్రస్తత కేబినెట్ లోహైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరు లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు.

అనూహ్యంగా ఎంపిక ఛాన్స్ దక్కేదేవరికి ? 

ఛాన్స్ దక్కేదెవరికి కొత్తగా ఛాన్స్ ఆశిస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు ఈ సారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌ నుంచి గడ్డం వినోద్, వివేక్‌ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ నెలకొంది. ఇద్దరూ దిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్‌ ధీమాతో ఉన్నారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా ప్రయత్నిస్తున్నారు. కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది.

రోహిత్ కు ఛాన్స్ క్యాబినెట్ లోకి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుండి హామీ దక్కినట్లు సమాచారం. యువకులకు మంత్రివర్గంలో పీట వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేసి వేణుగోపాల్ నుండి మైనంపల్లి రోహిత్ కు ఫోన్ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గంలో చోటు లభిస్తే అతిపిన్న వయస్కుడిగా రోహిత్ రికార్డ్ సృష్టించనున్నారు. ఈ క్రమంలోనే వందకుపైగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

యాదద్రి భక్తులకు శుభవార్త ..!

యాదద్రి భక్తులకు శుభవార్త ..!*

యదద్రి (న్యూస్ ప్రతినిధి - నరసింహ ) ; యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు.

యాదాద్రి భక్తులకు శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం ఉన్నతాధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. స్వామి వారి దర్శనంతోపాటు ఆర్జిత సేవలు ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా బుక్ చేసుకోవచ్చని భక్తులకు తెలిపారు. స్వామి వారిని దర్శించుకొనేందుకు నిత్యం లక్షలాది మంది భక్తులు యాదాద్రికి తరలి వస్తున్నారని... ఈ నేపథ్యంలో వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు దేవస్థానం ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల కోసం తీసుకు వచ్చిన సౌకర్యాలన్నీ యాదాద్రిలో తీసుకు వస్తామని స్పష్టం చేశారు. అందులోభాగంగానే ఆన్‌లైన్ సేవలు తీసుకు వచ్చామని వివరించారు. ఆన్‌లైన్‌లో yadadritemple.telangana.gov.in. వెబ్‌సైట్‌లోకి వెళ్లి.. టికెట్లు బుక్ చేసుకోవచ్చని భక్తులకు సూచించారు. ఇక ఇదే వెబ్‌సైట్ నుంచి ఈ హుండీకి విరాళాలు ఇవ్వ వచ్చునని భక్తులకు తెలిపారు. ఆన్‌లైన్ ద్వారా గంట ముందు స్వామి వారి దర్శనం, పూజ కైంకర్యాలకు బుక్ చేసుకో వచ్చని యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు వివరించారు.

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత మహిమాన్విత పుణ్య క్షేత్రాలు చాలానే ఉన్నాయి. వాటిలో యాదాద్రి ఒకటి. యాదగిరిగుట్టలో కొలువు తీరిన శ్రీలక్ష్మీనరసింహస్వామి.. భక్తుల కోరిన కోరికలు తీరుస్తాడని ప్రజలు బలంగా నమ్ముతారు. మరోవైపు ఆ ఆలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఆ క్రమంలో యాదగిరిగట్టు కాస్తా యాదాద్రిగా మారింది. తిరుమల తరహాలోనే యాదాద్రిలో ఆలయ నిర్మాణం చేపట్టారు.

దీంతో మాఢ వీధులు, స్వామి వారి పూజా కైంకర్యాలు, ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు, ప్రసాదాలతో యాదాద్రి.. తెలంగాణ తిరుమలగా రూపుదిద్దుకొంది. ఇంకోవైపు వీఐపీ, వీవీఐపీలు, సిఫార్సులపై వచ్చే భక్తులకు రూ.300 టికెట్‌ ద్వారా బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. రూ. 150 చెల్లించి శీఘ్ర దర్శనం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం ఉంది. కానీ అన్ని సేవలను ఇకపై ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు యాదాద్రి దేవస్థానం ఉన్నతాధికారులు తెలిపారు.

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత !

50 మందికి పైగా నకిలీ డాక్టర్లు పట్టివేత !

హైదరాబాద్‌ న్యూస్ డెస్క్ : తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్‌, చింతల్‌, షాపూర్‌నగర్‌(IDPL, Chintal, Shapurnagar) ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ వైద్యులను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు జరిపారు. నకిలీ వైద్యులు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్‌(Antibiotics) ఇస్తున్నట్లు గుర్తించారు.

తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాక, వారికి అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు యాభై మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇద్దరిని జైలుకు పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ సన్నీ డేవిస్‌, డాక్టర్‌ ఇమ్రాన్‌ అలీ, డాక్టర్‌ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు.

కవిత బెయిల్ పిటిషన్ వాయిదా...

FLASH: కవిత బెయిల్ పిటిషన్ వాయిదా

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో MLC కవిత బెయిల్

పిటిషన్ ఈ నెల 27వ తేదీకి వాయిదా పడింది.

ఈ కేసులో కవిత పాత్ర గురించి దర్యాప్తు సంస్థ

చెప్పిన విషయాలపై కవిత తరఫున

న్యాయవాది కోర్టుకు వివరించారు. దీనికి

సంబంధించి ఆదివారం సాయంత్రం లోపు

కౌంటర్ కాపీని కవిత న్యాయవాదికి మెయిల్

ద్వారా ఇవ్వాలని ED, CBIని హైకోర్టు

ఆదేశించింది.

హైదరాబాద్‌లో దారుణం! 16 ఏళ్ల బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం!

హైదరాబాద్‌లో దారుణం! 16 ఏళ్ల బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం!

 చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఉండే ఆయుధంగా మారింది సెల్ ఫోన్. ఇది లేకుంటే పూట గడవడం కష్టంగా మారింది. ముఖ్యంగా టీనేజ్ పిల్లలు దీనికి బాగా ఎడిక్ట్ అవుతున్నారు. దీంతో పెరేంట్స్ కు పెద్ద తలనొప్పిగా మారింది.

హైదరాబాద్‌లో దారుణం! 16 ఏళ్ల బాలికపై ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం!

పొద్దున లేస్తూనే ఫోన్. అర్థరాత్రి వరకు ఆ మాయ పేటికలోనే సమయం గడిపేస్తున్నారు పిల్లలు, పెద్దలు. ముఖ్యంగా టీనేజ్, యూత్ యువతీ యువకులు అందులో తలమునకలు అయిపోతున్నారు. ఇంట్లో తల్లిదండ్రులకు హెల్ప్ చేయకుండా అస్తమాను ఫోన్ పట్టుకుని కూర్చుంటారు. అంతే కాకుండా వయస్సుకు మించి వ్యవహారాలను ఫోనులో చక్కబెడుతున్నారు. నిండా 18 సంవత్సరాలు నిండని అమ్మాయిలు, అబ్బాయిలు.. సెల్ ఫోనులో చాటింగ్, ఫోన్స్ అంటూ గంటలు గంటలు గడిపేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు మందలిస్తుంటారు. తల్లిదండ్రులు కోప్పడడటం ఆలస్యం అన్నం మీద అలిగి కూర్చుంటారు కొంత మంది పిల్లలు. మరికొంత మంది అయితే ఇంట్లో నుండి కోపంతో వెళ్లిపోతుంటారు. వీరిని వెతికి వెతికి పట్టుకొస్తుంటారు పెరేంట్స్. అరవమని, కోప్పడమని సర్ది చెబితే తిరిగి వస్తుంటారు. అలా ఇంట్లో నుండి వెళ్లిపోయిన అనేక మంది పిల్లలు అనాధలుగా బతుకుతుంటారు.

మగ పిల్లలది ఒక దారైతే.. ఆడ పిల్లల పరిస్థితి అధ్వానం. అందులోనూ ఈడొచ్చిన ఆడ పిల్ల బయటకు వెళితే పరిస్థితి ఊహించని పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుంది. తాజాగా సికింద్రాబాద్‌లో ఈ తరహా ఘటనే వెలుగు చూసింది. గంటల తరబడి ఫోనులో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించడంతో సికింద్రాబాద్‌కు చెందిన 16 ఏళ్ల బాలిక ఇంట్లో నుండి పారిపోయింది. బయటకు వెళ్లాక.. ఆమెకు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డితో పరిచయం ఏర్పడింది. ఆమె వివరాలు తెలుసుకున్న సందీప్.. ఇదే అదునుగా భావించి.. ఆమెకు మాయ మాటలు చెప్పాడు. రోడ్డు మీద ఉండటం మంచిది కాదంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు.

అతడి దురుద్దేశం తెలియని బాలిక.. ర్యాపిడో డ్రైవర్ సందీప్‌తో కలిసి లాడ్జికి వెళ్లింది. అక్కడకు వెళ్లాక ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు సందీప్. దీంతో ఆమె ఏడ్చుకుంటూ తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆమె పేరెంట్స్. పోలీసులు ర్యాపిడో డ్రైవర్ సందీప్ రెడ్డిని అదుపులోకి తీసకుని విచారిస్తున్నారు. అతడిపై పోక్సోతో పాటు పలు ఆ8కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో ర్యాపిడో, ఊబర్ డ్రైవర్స్ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చిన సంగతి విదితమే. మహిళా ప్రయాణీకులతో వియర్డ్ బిహేవియర్‌తో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పలు ఘటనలు బయటకు వచ్చాయి. ఆటో, బైక్స్, క్యాబ్స్ ల్లో ఆడ పిల్లలపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు దేశాన్ని కుదిపేసిన సంగతి విదితమే.

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు,సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామ శర్మ మృతి...

సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామ శర్మ మృతి.

 నల్గొండ 

 ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామశర్మ (90) కొద్దిసేపటి క్రితం మృతి చెందారు.

నల్గొండలోని రామగిరిలోని ఆయన స్వగృహంలో వయాభారంతో బుధవారం రాత్రి 9 గంటలకు మృతి చెందిన జరిగింది. కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో జన్మించిన అనంతరామ శర్మ చిన్నప్పటినుంచి ప్రగతిశీలభావాలతో పెరిగారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వైపు తన మళ్లారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు.

నల్గొండలోని ఎన్జీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కమ్యూనిస్టు పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా మారారు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ అనంతరం సిపిఎం పార్టీలో కీలక నేతగా ఏదిగారు. ప్రారంభంలో సిపిఎంలో కీలకంగా ఉంటూ దండంపల్లి. గ్రామ సర్పంచ్గా కూడా రెండు దశాబ్దాలకు పైగా సేవలందించారు. రైతు వ్యవసాయ కార్మిక కార్మిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు. నల్లగొండ జిల్లాలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అహర్నిశల కృషి చేశారు. నల్గొండ జిల్లా ఉద్యమ నిర్మాతలైన విఎన్, స్వరాజ్యం, నర్రా రఘువరెడ్డి లాంటి ఉద్దండ అనేకలతో కలిసి పార్టీలోకి కీలకంగా వ్యవహరించారు.

నల్లగొండ జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని పటిష్టం చేసేందుకు సిఐటియూలో చాలా కాలం పని చేసారు. సిపిఎం పార్టీ నల్లగొండ డివిజన్ కార్యదర్శి గాను చాలా కాలం సేవలు అందించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా చాలాకాలం బాధ్యతలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ల కోసం చివరి వరకు వరకు వెళ్లి కొట్లాడారు. సమరయోధుల పెన్షన్ల సంఘం కన్వీనర్ గాను వ్యవహరించారు. చివరి వరకు నమ్ముకున్న కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి నిలబడ్డారు. ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసంతో  తీవ్ర వయోభారంలోనూ ఈ నెల 13వ తేదీన జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

తన స్వగ్రామం పిట్టంపల్లి వరకు వెళ్లి ఓటు వేసి రావడం ఆయన నిబద్దత కు నిదర్శనము. బుధవారం సాయంత్రం కూడా టివి చూస్తూ గడిపిన అనంతరామ శర్మ హఠాత్తుగా మృతి చెందడం జరిగింది. కాగా అనంతరామ శర్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

సంతాపం తెలిపిన సీపీఎం నేతలు. 

 అనంతరామ శర్మ మృతి విషయం తెలిసిన సిపిఎం నేతలు ఆయన మన పార్థివ దేహాన్ని సందర్శించి  మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరామ శర్మ పార్ధివదేహంపై ఎర్రజెండాను కప్పి సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పార్టీ నేతలు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య , పాలడుగు నాగార్జున,పాలడుగు ప్రభావతి,శ్రీశైలం, లక్ష్మీ నారాయణ, సయ్యద్ హశం, సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు. 

 శర్మ మృతి కి సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నరసింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి తమ సంతాపం తెలిపారు.  

సింగపూర్ లో ఉన్న ఆయన చిన్న కుమారుడు వచ్చాక అంతక్రియలు నిర్వహించినట్లు తెలిసింది.

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు

జూన్ 02 న కెసిఆర్ ను ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి సర్కారు 

తెలంగాణ వచ్చిన పదేండ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ.  

దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో పదివేల మందితో ఘనంగా నిర్వ హించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.  

రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

వేలాదిమంది ఉద్యమించి నా, ప్రధాన ఉద్యమకారుడిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరు ఉంది. 

కాబట్టి తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంపనున్నట్టు సమాచారం...

కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్.. అధ్యక్షుడు కోసం గాలింపు.....

కూలిన ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం హెలికాప్టర్‌. వాతావరణం అనుకూలించక కుప్పకూలిన హెలికాప్టర్‌. ఇబ్రహీం ఆచూకీ కోసం కొనసాగుతున్న గాలింపు. జోల్ఫా సిటీ సమీపంలో ప్రమాదం. అజర్‌బైజాన్ పర్యటనకు వెళ్తుండగా ఘటన.