ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు,సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామ శర్మ మృతి...
సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామ శర్మ మృతి.
నల్గొండ
ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, సిపిఎం సీనియర్ నేత పెన్నా అనంతరామశర్మ (90) కొద్దిసేపటి క్రితం మృతి చెందారు.
నల్గొండలోని రామగిరిలోని ఆయన స్వగృహంలో వయాభారంతో బుధవారం రాత్రి 9 గంటలకు మృతి చెందిన జరిగింది. కట్టంగూరు మండలం పిట్టంపల్లిలో జన్మించిన అనంతరామ శర్మ చిన్నప్పటినుంచి ప్రగతిశీలభావాలతో పెరిగారు. ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొంటూ తర్వాత కమ్యూనిస్టు ఉద్యమం వైపు తన మళ్లారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ కీలక పాత్ర పోషించారు.
నల్గొండలోని ఎన్జీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కమ్యూనిస్టు పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా మారారు ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీలో పనిచేస్తూ అనంతరం సిపిఎం పార్టీలో కీలక నేతగా ఏదిగారు. ప్రారంభంలో సిపిఎంలో కీలకంగా ఉంటూ దండంపల్లి. గ్రామ సర్పంచ్గా కూడా రెండు దశాబ్దాలకు పైగా సేవలందించారు. రైతు వ్యవసాయ కార్మిక కార్మిక ఉద్యమాల్లో కీలక భూమిక పోషించారు. నల్లగొండ జిల్లాలో సిపిఎం పార్టీ విస్తరణ కోసం అహర్నిశల కృషి చేశారు. నల్గొండ జిల్లా ఉద్యమ నిర్మాతలైన విఎన్, స్వరాజ్యం, నర్రా రఘువరెడ్డి లాంటి ఉద్దండ అనేకలతో కలిసి పార్టీలోకి కీలకంగా వ్యవహరించారు.
నల్లగొండ జిల్లాలో కార్మిక ఉద్యమాన్ని పటిష్టం చేసేందుకు సిఐటియూలో చాలా కాలం పని చేసారు. సిపిఎం పార్టీ నల్లగొండ డివిజన్ కార్యదర్శి గాను చాలా కాలం సేవలు అందించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కూడా చాలాకాలం బాధ్యతలు నిర్వహించారు. స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ల కోసం చివరి వరకు వరకు వెళ్లి కొట్లాడారు. సమరయోధుల పెన్షన్ల సంఘం కన్వీనర్ గాను వ్యవహరించారు. చివరి వరకు నమ్ముకున్న కమ్యూనిస్టు సిద్ధాంతానికి కట్టుబడి నిలబడ్డారు. ప్రజాస్వామ్యంపై అచంచల విశ్వాసంతో తీవ్ర వయోభారంలోనూ ఈ నెల 13వ తేదీన జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
తన స్వగ్రామం పిట్టంపల్లి వరకు వెళ్లి ఓటు వేసి రావడం ఆయన నిబద్దత కు నిదర్శనము. బుధవారం సాయంత్రం కూడా టివి చూస్తూ గడిపిన అనంతరామ శర్మ హఠాత్తుగా మృతి చెందడం జరిగింది. కాగా అనంతరామ శర్మకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
సంతాపం తెలిపిన సీపీఎం నేతలు.
అనంతరామ శర్మ మృతి విషయం తెలిసిన సిపిఎం నేతలు ఆయన మన పార్థివ దేహాన్ని సందర్శించి మృతికి సంతాపం ప్రకటించారు. అనంతరామ శర్మ పార్ధివదేహంపై ఎర్రజెండాను కప్పి సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పార్టీ నేతలు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య , పాలడుగు నాగార్జున,పాలడుగు ప్రభావతి,శ్రీశైలం, లక్ష్మీ నారాయణ, సయ్యద్ హశం, సలీం, పుచ్చకాయల నర్సిరెడ్డి తదితరులు ఉన్నారు.
శర్మ మృతి కి సిపిఎం మాజీ ఎమ్మెల్సీ చేరుపల్లి సీతారాములు, మాజీ ఎమ్మెల్యేలు నంద్యాల నరసింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి తమ సంతాపం తెలిపారు.
సింగపూర్ లో ఉన్న ఆయన చిన్న కుమారుడు వచ్చాక అంతక్రియలు నిర్వహించినట్లు తెలిసింది.
May 24 2024, 20:42