Mane Praveen

May 22 2024, 18:43

NLG: దేవాలయం నిర్మాణానికి విరాళం
మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీకంఠమహేశ్వరసురమాంబ దేవాలయం నిర్మాణానికి బుధవారం, తన వంతుగా రూ. 55,000/- విరాళాన్ని వల్లంల సంతోష్ యాదవ్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ముద్దం శ్రీను గౌడ్ , జమ్ముల వెంకటేష్ గౌడ్ , ఐతగోని రాములు గౌడ్ పాల్గొన్నారు.

Mane Praveen

May 22 2024, 18:38

NLG: విద్యార్థినీ విద్యార్థులు బాల్యదశ నుండే ఈత ను సాధన చేయాలి
నల్గొండ: పట్టణంలోని ఇండోర్ స్టేడియం లో జరుగుతున్న స్విమ్మింగ్ శిక్షణను ఉమ్మడి నల్గొండ జిల్లా ఒలంపిక్ అసోసియేషన్ కోశాధికారి బొమ్మపాల గిరిబాబు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థిని విద్యార్థులు వేసవి సెలవుల్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో వివిధ రకాల స్కిల్స్ ని నేర్చుకోవడంలో భాగంగా ప్రతిరోజు ఈతను కూడా ఒక గంట పాటు సాధన చేయాలని తద్వారా స్వీయ రక్షణతో పాటు, శారీరక ఆరోగ్యం పెంపొందించుకోవచ్చునని సూచించారు. స్విమ్మింగ్ చేయడం ద్వారా శరీరంలోని ప్రతి అవయవం లో చురుకైన కదలికలు ఏర్పడుతాయని తద్వారా ఎన్నో రకాల అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు పొందవచ్చునని తెలిపారు.

Mane Praveen

May 22 2024, 18:07

NLG: శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలి: మున్సిపల్ కమిషనర్ ముసబ్ అహ్మద్
నల్లగొండ: వర్షాకాలం సమీపిస్తున్నందున పట్టణంలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటికి మరమ్మత్తులు చేయించుకోవాలని యాజమాన్యాలకు సూచించాలని మున్సిపల్ కమిషనర్ ముసాబ్ అహ్మద్ అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్, వార్డ్ ఆఫీసర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. వార్డు ఆఫీసర్లు తమ తమ వార్డులలో భవనాలను గుర్తించి చిన్న చిన్న రిపేర్లు ఉన్నట్లయితే యాజమాన్యాలు రిపేర్లను చేయించుకునే విధంగా సూచనలు చేయాలని, కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలను తొలగించియాలని సూచించారు. పట్టణ ప్రజలు కూడా శిథిలావస్థ భవనాలను గుర్తించి మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చేయడం వల్ల ప్రాణ ఆస్తి నష్టాన్ని  నివారించవచ్చని తెలిపారు.
ఈ సమావేశంలో  ఏసీబీ నాగిరెడ్డి, వార్డ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 21 2024, 16:06

తొలిసారి ఒకే నంబరుకు అత్యధిక రాబడి
TG: తొలిసారి ఒకే నంబరుకు అత్యధిక రాబడి రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు వచ్చింది. ఏకంగా రూ. 25. 50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్‌లోని రవాణా కార్యాలయంలో మంగళవారం కొత్త సిరీస్‌ ప్రారంభమైన సందర్భంగా ఆన్‌లైన్‌ వేలం నిర్వహించారు. TG 09 9999 నంబర్ ను సోని ట్రాన్స్‌పోర్టు సొల్యూషన్స్‌ తమ టయోటా ల్యాండ్‌ క్రూజర్‌ ఎల్‌ఎక్స్‌ కోసం రూ. 25, 50, 002 చెల్లించినట్లు హైదరాబాద్‌ జేడీసీ సి. రమేశ్‌ తెలిపారు. SB NEWS TELANGANA

Mane Praveen

May 21 2024, 15:53

NLG: బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జల ప్రేమెందర్ రెడ్డిని గెలిపించాలని విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిజెపి నాయకులు
నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ  ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నాంపల్లి మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఈరోజు గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి కి  ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Mane Praveen

May 21 2024, 13:17

భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ  33వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్
చౌటుప్పల్: పట్టణ కేంద్రంలో ఈ రోజు భారత 6వ ప్రధాన మంత్రి భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమం లో ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు పాల్గొని రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం రాజీవ్ గాంధీ  చేసిన సేవలు గుర్తు చేసుకొని ఆయన ఆశయాలను సాధిస్తామని అన్నారు. ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమం చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకుల ఇంద్రసేన రెడ్డి, టౌన్ అధ్యక్షుడు సుర్వి నర్సింహా గౌడ్, ఉబ్బు వెంకటయ్య, మొగుదాల రమేష్ కౌన్సిలర్ బాబా షరీఫ్, బొడిగె బాలకృష్ణ, సందగళ్ళ సతీష్, చెరుకు లింగస్వామి, రామాలయ గుడి చైర్మన్ బొబ్బిళ్ళ మురళీ, బొంగు జంగయ్య, ఆవుల యేసు, ఉడుగు రమేష్,వర్కాల రవి, గోషిక వినయ్, తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Mane Praveen

May 20 2024, 00:07

NLG: క్రీడలు ద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు: ASP రాములు నాయక్
నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 13 వారాల నుండి ప్రతి  ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL  ఫుట్బాల్ లీగ్ పోటీలలో భాగంగా ఈ ఆదివారం నిర్వహించిన మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరి మ్యాచ్ జరగగా 2-1 స్కోర్ తో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా MCC-9 మరియు అరోరా స్కూల్ కరస్పాండెన్స్  పాముల అశోక్, గొర్రె వెంకటరెడ్డి క్రీడాకారులకు అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈ ఆదివారం ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాములునాయక్  రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ASP రాములు నాయక్  క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడ ఆడడం ద్వారా శారీరకంగా దారుఢ్యంగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని తెలిపారు.

నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా అమోఘమని, పాఠశాల దశ నుండే విద్యార్థులలో క్రీడల వైపు దృష్టి మళ్లించడానికి నిరంతరం కృషి చేస్తూ ఎంతోమంది జాతీయ స్థాయి ఫుట్బాల్ మరియు కబడ్డీ క్రీడాకారులను గత 13 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లా నుండి తయారు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం CSL లీగ్ ఫుట్బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఫుట్బాల్ క్రీడాకారులు MD ఫైజాన్ , అప్పల మనిరామ్ లను మెడల్స్ బహుకరించి అభినందించారు.

సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు
మమ్మద్ హభీబుద్దీన్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుండి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నామని కోచ్ చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఫుట్బాల్ క్రీడలు మెలుకువలు పెంపొందించుకుంటున్నాని జాతీయ స్థాయిలో రాణించడానికి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు.

మరొక సీనియర్ క్రీడాకారుడు ఖాజా అన్వర్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో చేరడం వలన ఫిజికల్ డెవలప్ కావడం వల్ల ఫుట్బాల్ క్రీడల్లో కూడా రాణిస్తున్నానని తెలిపాడు.

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, కత్తుల హరి, అప్పల లింగయ్య, జాకటి బాలరాజు, తాజుద్దీన్ రాచూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్,  తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 19 2024, 14:32

NLG: సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి
మర్రిగూడ: కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39 వ వర్ధంతి సందర్భంగా, మండల కేంద్రంలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో,  సుందరయ్య  చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, సహాయ కార్యదర్శి నీలకంఠం రాములు, కమిటీ సభ్యులు కొట్టం యాదయ్య, మైల సత్తయ్య, చెల్లం ముత్యాలు, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. SB NEWS NLG

Mane Praveen

May 19 2024, 10:54

NLG: జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగధనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య: సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్
జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగదనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు. ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచి పెట్టిన చరిత్ర సుందరయ్య దని, తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర సుందరయ్యది అని ఆయన కొనియాడారు. భూస్వాములకు, పెత్తందారులకు, దోపిడి అన్యాయాలకు  వ్యతిరేకంగా పోరాడి, ఆనాడు చట్టసభల్లో ప్రజల తరఫున తన వాణిని వినిపించారని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి మళ్లీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు, విస్తృత పరిచేందుకు అంకితమైనారని ఆయన అన్నారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య చిన్న వయసులోనే సంఘసంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారని ఆయన అన్నారు. సిపిఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగాబాధ్యతలు చేపట్టారు. ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు. తెలంగాణ సాయుధ పోరాటంకొనసాగిస్తూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి గణనీయమైది. వారి ఆశయ సాధన కోసంప్రతి ఒక్కరు కృషి చేయాలని.. భారతదేశంలోదోపిడి, అసమానతలు లేని సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.

ఈకార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులుఅంతిరెడ్డి,సిపిఎం నాయకులుఈరగట్లస్వామి, ఈరటి వెంకన్న, సోనగోనిగణేష్, కొత్తపల్లి వెంకన్న, బొమ్మరగోని యాదయ్య,ఓర్సు రాములు, తదితరులు పాల్గొన్నారు.

Mane Praveen

May 18 2024, 22:05

అంబేద్కర్ కి పూజలు చేసిన మోదీ
ప్రధాని మోదీ..  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూజలు నిర్వహించారు. ముంబైలోని చైతన్య భూమికి వెళ్లి పుష్పాలు సమర్పించి నమస్కరించారు. తాను ఆ ప్రదేశానికి రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలు ఎప్పటికీ అలాగే ఉంటాయని పేర్కొన్నారు. SB NEWS