NLG: క్రీడలు ద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు: ASP రాములు నాయక్
నల్లగొండ: ఉమ్మడి జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసే ప్రక్రియలో భాగంగా గత 13 వారాల నుండి ప్రతి ఆదివారం నాడు నిర్వహిస్తున్న CSL ఫుట్బాల్ లీగ్ పోటీలలో భాగంగా ఈ ఆదివారం నిర్వహించిన మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరి మ్యాచ్ జరగగా 2-1 స్కోర్ తో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ జట్టు విజయం సాధించింది. ఈ సందర్భంగా MCC-9 మరియు అరోరా స్కూల్ కరస్పాండెన్స్ పాముల అశోక్, గొర్రె వెంకటరెడ్డి క్రీడాకారులకు అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈ ఆదివారం ముఖ్యఅతిథిగా నల్గొండ జిల్లా అడిషనల్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ రాములునాయక్ రావడం, క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ జిల్లా ASP రాములు నాయక్ క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడ ఆడడం ద్వారా శారీరకంగా దారుఢ్యంగా ఉండటమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు అని తెలిపారు.
నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా అమోఘమని, పాఠశాల దశ నుండే విద్యార్థులలో క్రీడల వైపు దృష్టి మళ్లించడానికి నిరంతరం కృషి చేస్తూ ఎంతోమంది జాతీయ స్థాయి ఫుట్బాల్ మరియు కబడ్డీ క్రీడాకారులను గత 13 సంవత్సరాల నుండి నల్గొండ జిల్లా నుండి తయారు చేస్తున్నారని కొనియాడారు. అనంతరం CSL లీగ్ ఫుట్బాల్ పోటీలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఫుట్బాల్ క్రీడాకారులు MD ఫైజాన్ , అప్పల మనిరామ్ లను మెడల్స్ బహుకరించి అభినందించారు.
సీనియర్ ఫుట్బాల్ క్రీడాకారుడు
మమ్మద్ హభీబుద్దీన్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 3 సంవత్సరాల నుండి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నామని కోచ్ చెప్పే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని ఫుట్బాల్ క్రీడలు మెలుకువలు పెంపొందించుకుంటున్నాని జాతీయ స్థాయిలో రాణించడానికి నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నానని తెలిపారు.
మరొక సీనియర్ క్రీడాకారుడు ఖాజా అన్వర్ మాట్లాడుతూ.. చత్రపతి శివాజీ ఫుట్బాల్ క్లబ్ లో చేరడం వలన ఫిజికల్ డెవలప్ కావడం వల్ల ఫుట్బాల్ క్రీడల్లో కూడా రాణిస్తున్నానని తెలిపాడు.
ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, కత్తుల హరి, అప్పల లింగయ్య, జాకటి బాలరాజు, తాజుద్దీన్ రాచూరి వెంకటసాయి, కొక్కు యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.
May 21 2024, 13:17