NLG: జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగధనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య: సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్
జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేసిన త్యాగదనుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అని సిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శి జెర్రిపోతుల ధనుంజయ గౌడ్ అన్నారు.
ఆదివారం చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని పంచి పెట్టిన చరిత్ర సుందరయ్య దని, తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టిన చరిత్ర సుందరయ్యది అని ఆయన కొనియాడారు.
భూస్వాములకు, పెత్తందారులకు, దోపిడి అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడి, ఆనాడు చట్టసభల్లో ప్రజల తరఫున తన వాణిని వినిపించారని ఆయన అన్నారు. ఎమర్జెన్సీ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ కు తిరిగి వచ్చి మళ్లీ ఉద్యమ నిర్మాణాన్ని పటిష్టం చేసేందుకు, విస్తృత పరిచేందుకు అంకితమైనారని ఆయన అన్నారు.
భూస్వామ్య కుటుంబంలో జన్మించిన పుచ్చలపల్లి సుందరయ్య చిన్న వయసులోనే సంఘసంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్నారని ఆయన అన్నారు. సిపిఎం ఏర్పడినప్పుడు తొలి ప్రధాన కార్యదర్శిగాబాధ్యతలు చేపట్టారు. ప్రధాన కమ్యూనిస్టు పార్టీగా తీర్చిదిద్దడానికి పునాదులు వేశారు.
తెలంగాణ సాయుధ పోరాటంకొనసాగిస్తూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన కృషి గణనీయమైది. వారి ఆశయ సాధన కోసంప్రతి ఒక్కరు కృషి చేయాలని.. భారతదేశంలోదోపిడి, అసమానతలు లేని సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.
ఈకార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులుఅంతిరెడ్డి,సిపిఎం నాయకులుఈరగట్లస్వామి, ఈరటి వెంకన్న, సోనగోనిగణేష్, కొత్తపల్లి వెంకన్న, బొమ్మరగోని యాదయ్య,ఓర్సు రాములు, తదితరులు పాల్గొన్నారు.
May 19 2024, 14:32