నిరాశ్రయ కుటుంబానికి ముత్తు చేయూత
![]()
RR: మాడ్గుల మండలం, అన్నెబోయినపల్లి గ్రామానికి చెందిన జిల్లా శారద అనే మహిళ భర్త ఇటీవల ఆక్సిడెంట్ కారణంగా మరణించాడు. భర్త మరణంతో శారద ఆర్థికంగా ఇబ్బంది పడుతుంది. బాధితురాలికి ఇద్దరు చిన్న పిల్లలు ఉండటంతో ఇల్లు గడవటం కూడా కష్టంగా మారింది.
సహచరుల ద్వారా విషయం తెలుసుకున్న శ్రీ పగడాల కనకయ్య మెమోరియల్ ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు వారి కుటుంబానికి భరోసాను అందించారు. ఆర్థిక సహాయంగా శారదకు పదివేల రూపాయలను అందించారు. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఫౌండేషన్ ని సంప్రదించాలని ముత్తు కోరారు.
ఈ సందర్బంగా ముత్తు మాట్లాడుతూ.. తన తండ్రి పేరున ఉన్న ఈ ఫౌండేషన్ ఎంతో మంది పేద ప్రజలకు నీడనిస్తుందని, అన్నార్తులకు ఆకలి ముద్దగా కడుపు నింపుతుందని పేర్కొన్నారు. పేదల కోసం తమ ఫౌండేషన్ ఎప్పటికి అండగా నిలబడుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ వైస్ చైర్మన్ మాడ్గుల శిరీష, ట్రెజరరీ పగడాల కళ్యాణ్, జనరల్ సెక్రెటరీ మొగిలి కిషన్, ఎం. మల్లేపల్లి మాజీ సర్పంచ్ మార్ల వెంకటయ్య, నర్ర పరమేష్ తదితరులు ఉన్నారు.


ఈనెల 27 న జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.
ఈనెల 27 న జరగనున్న నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ పట్టబద్రుల ఉప ఎన్నికకు మిర్యాలగూడ డివిజన్ వ్యాప్తంగా 29 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్డీవో శ్రీనివాసరావు తెలిపారు.
నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్బిఐ బ్యాంకు పక్కన శ్రీ ఆంజనేయం సీడ్స్ అండ్ ఫెర్టిలైజర్ షాపు ఓపెన్నింగ్ కార్యక్రమానికి నాంపల్లి జెడ్పిటిసి ఏవి రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ ప్లేట్లలో రాష్ట్ర కోడ్‌గా TS స్థానంలో TG అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్.. కేంద్ర ప్రభుత్వ ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఇక నుండి తెలంగాణలో వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్‌లు TS స్థానంలో TG ఉండే విధంగా రిజిస్టేషన్లు చేయాలని గెజిట్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టబద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఈనెల 25వ తేదీ నుండి 30వ తేదీ వరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని న్యూ డైమెన్షన్ ఇంటర్నేషనల్ హైస్కూల్ నందు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రప్రధమంగా *ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ D లైసెన్స్ ప్రొఫెషనల్ కోచ్ సర్టిఫికెట్ కోర్సు* ను నిర్వహించనున్నారు.
సూర్యాపేట: కంట్రోల్ సెంటర్ నుండి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
May 18 2024, 17:19
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.7k