నిజంనిప్పులాంటిది

May 17 2024, 13:08

టీపీసీసీ అధ్యక్ష పదవికి సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా ?

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి నియామకం ఉండనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటించింది.

జూన్ నెలాఖరులో లోకల్ బాడీ ఎన్నికలు ఉండటంతో ఆలోగానే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. దీంతో ఆశావహులు చాలామంది దీనికోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

రెడ్డి సామాజికవర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండటంతో ఇతర సామాజిక వర్గాలకు పీసీసీ పదవి దక్కే అవకాశం కనపడుతోంది.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. ఆయన సోదరుడు వెంకటరెడ్డి మంత్రిగా ఉండటంతో మంత్రి పదవి దక్కడం కష్టమే అవుతుంది. అయితే పీసీసీ అయినా ఇవ్వాలని పట్టుబట్టే అవకాశం ఉంది.

నిజంనిప్పులాంటిది

May 17 2024, 12:11

ఏపీలో ఎన్నికల హింసపై ఈసీ కొరడా - ముగ్గురు ఎస్పీలు, ఒక కలెక్టర్​పై చర్యలకు ఆదేశం

రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తరువాత జరిగిన అల్లర్ల నేపథ్యంలో పలువురు కీలక అధికారులపై కేంద్రం ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ తర్వాత అసహనం వ్యక్తం చేస్తూ పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసింది. పల్నాడు కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేసింది. మూడు జిల్లాలోని 12 మంది డీఎస్పీలపైనూ విచారణకు ఆదేశించింది. ప్రతి కేసుపై సిట్‌ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదించాలని స్పష్టం చేసింది.

ఏపీలో పోలింగ్‌ రోజు, ఆ తర్వాత చెలరేగిన హింసపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎస్‌ జవహర్‌ రెడ్డి, డీజీపీతో భేటీ అనంతరం రాష్ట్రంలో చోటు చేేసుకున్న పరిణాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. హింసాఘటనలకు బాధ్యులను చేస్తూ, మూడు జిల్లాలకు చెందిన కీలక ఉన్నతాధికారులపై కొరడా ఝుళిపించింది. పల్నాడు, అనంతపురం జిల్లాల ఎస్పీలపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ ఇద్దరినీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది. అలాగే, పల్నాడు జిల్లా కలెక్టర్‌, తిరుపతి ఎస్పీలను బదిలీ చేయడంతో పాటు శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ మూడు జిల్లాల్లో మొత్తం 12మంది సబార్డినేట్‌ పోలీస్‌ అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ వారిపై శాఖాపరమైన చర్యలకూ ఆదేశించింది.

హింసాత్మక ఘటనలను నియంత్రించడంలో పూర్తిగా విఫలమయ్యారు

పోలింగ్‌ జరిగిన మే 13న పల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో ఎక్కువగా హింస చెలరేగిందని దీన్ని నియంత్రించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఈసీ తెలిపింది. సీఎస్‌, డీజీపీతో గురువారం భేటీ అనంతరం కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లు సమావేశమై ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలపై తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఎలాంటి హింస చెలరేగకుండా చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మరింత కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించింది.

ఆ అధికారులపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోండి

పల్నాడు జిల్లాలో చెలరేగిన అల్లర్లను అడ్డుకట్టవేయడంలో విఫలమవ్వడంతో జిల్లా కలెక్టరు లోతేటి శివశంకర్‌పై బదిలీ వేటు వేయగా ఎస్పీ బిందు మాదవ్‌పై సస్పెన్షన్‌ వేటు వేసింది. మారణాయుధాలు, నాటు బాంబులతో భారీ విధ్వంసానికి వైఎస్సార్సీపీ కుట్ర పన్నినట్లు పోలీసుల తనిఖీల్లో స్పష్టమైంది. ఈ స్థాయిలో విధ్వంసానికి తెర తీసినా పోలీసులు నిలువురించడంలో విఫలమవ్వడంతో ఈసీ చర్యలు తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్‌ వేటు వేసిన ఈసీ వెంటనే విధుల్లోంచి తప్పించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎస్‌, డీజీపీలను ఆదేశించింది.

వరుస ఘటనలు జరుగుతున్నా ఎందుకు అదుపు చేయలేక పోయారు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలకు జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌ను బాధ్యుడిగా చేస్తూ ఈసీ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ నెల 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా తాడిపత్రిలోని 9వ వార్డులోని పోలింగ్ బూత్ సమీపంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనచరులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లదాడులకు పాల్పడ్డారు. పోలింగ్ మరుసటి రోజున 14వ తేదీన వైఎస్సార్సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి తన అనుచరులతో టీడీపీ నేత సూర్యముని ఇంటిపై దాడిచేశారు. వరుస సంఘటనలు జరుగుతున్నా తాడిపత్రి డీఎస్పీ గంగయ్య అదుపుచేయలేక విఫలమయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారి డా.వినోద్ కుమార్ ను నివేదిక కోరింది. సీఈసీ ఇచ్చిన ఆదేశాల్లో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్‌తో పాటు తాడిపత్రి డీఎస్పీ గంగయ్య, తాడిపత్రి పట్టణ సీఐ మురళీకృష్ణలపై బదిలీ వేటు వేసింది.

ఓట్ల లెక్కింపు పూర్తయిన బలగాలను కొనసాగించాలని ఆదేశం

తిరుపతి జిల్లా ఎస్పీ కృష్ణకాంత్‌పటేల్‌పైనూ సీఈసీ బదిలీ వేటు వేసింది. శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి ఘటనలో విఫలం చెందారని ఈసీ భావించింది. రాష్ట్రంలో హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలన్న ఈసీ ప్రతి కేసుపై సిట్‌ ఏర్పాటు చేసి రెండు రోజుల్లో నివేదించాలని ఆదేశించింది. ఎఫ్‌ఐఆర్‌లు పెట్టి ఐపీసీ, అన్ని సెక్షన్ల కింద కేసులుపెట్టాలని ఆదేశించింది. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు పూర్తయిన 15 రోజుల తర్వాత కూడా 25 కంపెనీల సీఏపీఎఫ్‌ బలగాలను కొనసాగించాలని కేంద్ర హోంశాఖను ఆదేశించింది. పోలింగ్ అనంతర హింసపై కఠినంగా ఉండాలని సీఎస్‌, డీజీపీలకు ఆదేశాలు జారీచేసింది.

నిజంనిప్పులాంటిది

May 17 2024, 12:08

AP Violence: ఏపీలో హింసాత్మక ఘటనలు.. రంగంలోకి సిట్

AP Violence: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల అనంతర చెలరేగిన హింసపై ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలకు పూనుకుంది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు అందజేసిన నివేదిక ఆధారంగా అధికారులపై వేటు వేసింది..

మరోవైపు.. ఈ హింసాత్మక ఘటనలపై రంగంలోకి దిగనుంది స్పెషల్‌ ఇన్వెస్టిగేట్‌ టీవ్‌ (సిట్‌).. ఎందుకంటే.. ఆ ఘటనలపై సిట్ వేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం సిట్ ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి హింసాత్మక ఘటన పైనా నివేదిక ఇవ్వనుంది సిట్.. పల్నాడు, మాచర్ల, నరసరావు పేట, తిరుపతి, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై దర్యాప్తు చేయనున్న సిట్.. అసలు అల్లర్లు చెలరేగింది ఎక్కడ? వాటికి బీజం వేసింది ఎవరు? హింసాత్మకంగా మారడానికి కారణాలు ఏంటి..? తదితర అంశాలపై అధ్యయనం చేయనుంది..

ఇక, తాజాగా విశాఖపట్నంలో జరిగిన ఘటననూ సిట్ పరిధిలోకి తేవాలా..? వద్దా..? అనే అంశంపై మల్లగుల్లాలు పడుడుతున్నారట అధికారులు.. మరోవైపు.. తాడిపత్రి ఘటనలో డీఎస్పీ చైతన్య తన పరిధి దాటి వ్యవహరించారని భావిస్తున్న పోలీస్ ఉన్నతాధికారులు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించే అవకాశం ఉందంటున్నారు.

ప్రతి ఘటన పైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.. రెండు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఇప్పటికే ఎన్నిలక కమిషన్‌ ఆదేశాలు జారీ చేసింది.. వివిధ ఘటనల్లో పోలీస్ అధికారుల వైఫల్యం కన్పించడంతో ఇప్పటికే.. బాధ్యులపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) వేటు వేసిన విషయం విదితమే.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 19:44

టికెట్ లేకపోయినా ఓకే: ఒంటరిగా రైళ్లల్లో ప్రయాణించే మహిళల కోసం..భారతీయ రైల్వే స్పెషల్ రూల్స్

Indian Railways: భారత రైల్వేశాఖ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తుంది. సురక్షితంగా ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు, బెస్ట్‌ ట్రావెలింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించేందుకు ప్రాధాన్యం ఇస్తుంది.

ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణించే మహిళల కోసం రైల్వేశాఖ ప్రత్యేక రక్షణ చట్టాలు అమలు చేస్తోంది. ప్రస్తుతం ఈ చట్టాలపై చాలా మందికి అవగాహన లేదు. ఈ పరిస్థితిని మార్చాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రజలకు పెద్దగా తెలియని, ముఖ్యమైన రైల్వే రూల్స్ తెలుసుకుందాం.

1989లో రూపొందించిన, భారతీయ రైల్వే చట్టంలోని సెక్షన్ 139.. ఒంటరి మహిళా ప్రయాణీకులకు, ముఖ్యంగా పిల్లలతో ప్రయాణించే వారికి రక్షణ కల్పిస్తుంది.

ఈ చట్టం ప్రకారం, ఒక మహిళ తన బిడ్డతో ఒంటరిగా ప్రయాణిస్తుంటే, టిక్కెట్ లేదా పాస్ లేకపోతే, ఆమెను రాత్రిపూట రైలు నుంచి దిగేయమని బలవంతం చేయకూడదు. రైలు ప్రయాణాల సమయంలో మహిళా ప్రయాణికులు, వారి పిల్లల భద్రత, శ్రేయస్సు కోసం ఈ నిబంధన తీసుకొచ్చారు.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:35

Rain Alert: వర్షాలపై సీఎం రేవంత్ రివ్యూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచన

హైదరాబాద్(Hyderabad Rains)లో కురుస్తున్న వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు.

గురువారం సాయంత్రం సెక్రటేరియట్‌లోని అన్ని విభాగాల అధికారులతో సీఎం మాట్లాడారు..

వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. 

వర్షాలపై సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య అధికారులతో రేవంత్ రివ్యూ నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Streetbuzz News

SB NEWS

నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:29

chandrababu: షిరిడీ సాయి సేవలో చంద్రబాబు దంపతులు..

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ముఖ్య పార్టీల నేతలు రిలాక్స్ అవుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (chandrababu) నాయుడు మహారాష్ట్ర పర్యటనలో ఉన్నారు..

మహారాష్ట్రలో గల కొల్హాపూర్‌ మహాలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సతీ సమేతంగా సందర్శించారు. ఆలయంలో చంద్రబాబు, భువనేశ్వరి ప్రత్యేక పూజలు చేశారు.

అక్కడి నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం షిరిడీ వెళ్లారు. షిరిడీలో ప్రత్యేక పూజలు చేశారు. చంద్రబాబు దంపతులకు ఆలయ అధికారులు జ్ఞాపిక బహుకరించారు.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:27

AP Election 2024: ఈసీ ముందు హాజరైన ఏపీ సీఎస్ డీజీపీలు

రాష్ట్రంలో ఈ రెండ్రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు..? ఇంతకూ ఏపీలో ఏం జరుగుతోంది..? మీరిద్దరూ ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వండి'' అంటూ కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే..

దీంతో జవహర్ రెడ్డి, హరీష్ కుమార్ గుప్తా ఇద్దరూ నేడు (గురువారం) ఢిల్లీ వెళ్లి ఎన్నికల కమిషన్ ముందు హాజరయ్యారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీకి అధికారులు వివరణ ఇస్తున్నారు.

అసలు విషయం ఇదీ..

కాగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ రోజు, ఆ తర్వాత కూడా రాష్ట్రంలో చెలరేగిన హింసాకాండపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) మండిపడిన విషయం తెలిసిందే. 'పోలింగ్‌ ముగిసిన తర్వాత కూడా హింసాత్మక ఘటనలు జరగడమేంటి? రాష్ట్రంలో ఈ రెండ్రోజుల్లో జరిగిన పరిణామాలకు బాధ్యులెవరు..? పోలింగ్‌ రోజు నిర్లక్ష్యం వహించారు.. ఆ తర్వాత కూడా నిర్లిప్తత కనిపిస్తోంది.. ఇంతకూ ఏపీలో ఏం జరుగుతోంది..? మీరిద్దరూ ఢిల్లీకి వచ్చి సమాధానం ఇవ్వండి' అంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డిని, డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తాలకు బుధవారం సమన్లు జారీ చేసింది. పోలింగ్‌ ముందు రోజు అర్ధరాత్రి నుంచి మాచర్ల, నరసరావుపేట, చంద్రగిరి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో వరుసగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో విఫలమైందా.. నిఘా వర్గాల సమాచారం లేదా.. పోలీసు బందోబస్తు చర్యల్లో లోపముందా తదితర అంశాలపై తమకు వివరణ ఇవ్వాలని స్పష్టంచేసింది. హింసాకాండ జరుగుతుందని గతానుభవాలు ఉన్నా.. ఎందుకు నిర్లక్ష్యం వహించారని నిలదీసింది. పోలింగ్‌ రోజు పల్నాడు ప్రాంతంలో అధికార పార్టీ దౌర్జన్యాలు, మాచర్లలో ప్రతిపక్షాల ఏజెంట్లపై దాడులు, ఇళ్లలోకి చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించడం.. నరసరావుపేటలో టీడీపీ అభ్యర్థిపై దాడులకు దిగడం.. కత్తులు, కర్రలతో రోడ్లపై స్వైరవిహారం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌ రూముల వద్దే మారణాయుధాలతో దాడి చేయడాన్ని గట్టిగా నిలదీసిన విషయం తెలిసిందే.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 18:26

సీఏఏ అసత్య ప్రచారం.. ప్రతిపక్షాలపై మోదీ ఫైర్

లఖ్‌నవూ: సీఏఏ అమలు ప్రక్రియను వేగవంతం చేసిన కేంద్ర ప్రభుత్వం తొలి విడతలో 14 మందికి భారత పౌరసత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) స్పందించారు..

కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలపై ధ్వజమెత్తారు

''భారత్‌కు వచ్చిన శరణార్థులకు సీఏఏ ద్వారా పౌరసత్వం కల్పించే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దేశ విభజన, ఇతర కారణాలతో దేశంలో చాలా ఏళ్లుగా శరణార్థులు ఇక్కడ జీవిస్తున్నారు. ఆ బాధితులకు కేంద్రం సీఏఏ ద్వారా పౌరస్వతం కల్పిస్తోంది. కానీ, ఎస్పీ, హస్తం పార్టీ ఈ చట్టంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి'' అని ప్రధాని దుయ్యబట్టారు. యూపీలోని అజంగఢ్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు.

అలా ఎన్నటికీ జరగదు..

''అధికారం సాధిస్తే సీఏఏను రద్దు చేసేందుకు ఇండియా కూటమి యోచిస్తోంది. కానీ, అది ఎన్నటికీ జరగదు. ఈ చట్టాన్ని తొలగించడం అసాధ్యం. వారంతా మోసగాళ్లు (ప్రతిపక్ష నేతలను ఉద్దేశిస్తూ). మతోన్మాద మంటల్లో దేశం కాలిపోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు''అని మోదీ ప్రతిపక్షాలపై పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు.

కాగా.. సీఏఏ చట్టం ప్రకారం.. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌ల నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థుల వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి సత్వరమే భారత పౌరసత్వాన్ని ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం నిబంధనల్ని రూపొందించిన సంగతి తెలిసిందే. 2014 డిసెంబరు 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి భారత్‌కు వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.

నిజంనిప్పులాంటిది

May 16 2024, 12:03

AP News: అలిపిరి వద్ద కారు దగ్ధం

తిరుపతి : తిరుపతిలోని (Tirupati) అలిపిరి వద్ద ఓ కారు మంటలకు ఆహుతైంది. అలిపిరి గరుడా సర్కిల్ వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన కారు డ్రైవర్ వాహనాన్ని పక్కక నిలిపివేశారు..

వెంటనే డ్రైవర్‌తో పాటు కారులో నుంచి భక్తులు బయటకు పరుగులు తీశారు. ఆ తరువాత పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. తిరుమల నుంచి తిరుపతికి తిరుగు ప్రయాణంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే కారులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..

నిజంనిప్పులాంటిది

May 16 2024, 11:11

హోం గార్డులకు జీతాల కోతలు !

- గతంలో మధ్యప్రదేశ్‌లో హోంగార్డు మృతి

- ఆ కుటుంబానికి ఇంకా అందని సాయం

- హోంగార్డులకు జీవిత బీమా దక్కని వైనం

- ఇక్కడ గైర్హాజరంటూ డీడీఏలోనూ కోత

- ఇతర రాష్ట్రాల్లో అదనపు భత్యాలు

- ఇక్కడ మాత్రం జీతాల్లో కోతలు

వారంతా ఖాకీ యూనిఫాం వేసుకుంటారు..! కానీ, పోలీసు శాఖలో శాశ్వత ఉద్యోగులు కాదు..! కానిస్టేబుళ్లకు దీటుగా బందోబస్తుల్లో.. ట్రాఫిక్‌ నియంత్రణలో నిలువుకాళ్ల జీతం చేస్తారు..! కానీ, జీతం విషయంలో భారీ వ్యత్యాసం ఉంటుంది.ఇదీ హోంగార్డుల పరిస్థితి..! ఇప్పుడు ఎన్నికల విధుల్లో భాగంగా ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న హోంగార్డులకు కొత్త చిక్కొచ్చిపడింది. నిజానికి భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) చెప్పిన సంఖ్యలో రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు ఆయా రాష్ట్రాల ఎన్నికల విధులకు పోలీసులను పంపాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అధికారులు రెండో ఆలోచన లేకుండా పంపించేది హోంగార్డులనే..! లోక్‌సభతో పాటు.. పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరుగుతున్న ఎన్నికల సందర్భంగా ఇప్పుడు కూడా హోంగార్డులను ఆయా రాష్ట్రాలకు తరలించారు. ముఖ్యంగా తెలంగాణ హోంగార్డులు ఛత్తీ్‌సగఢ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో సేవలందిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డులకు తమ సొంత యూనిట్లలో గైర్హాజరు వేస్తున్నారు. దాంతో వేతనంలో కోతతోపాటు.. రోజువారీ విధులకు సంబంధించిన భత్యం(డీడీఏ) కూడా దక్కడం లేదు. ఎన్నిరోజులు పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వహిస్తే.. అన్ని రోజులు ఇక్కడ వేతనంలో కోత విధిస్తున్నారు. నిజానికి హోంగార్డుకు రోజంతా పనిచేస్తే.. ఓ తాపీ మేస్త్రీకి దక్కే కూలీ కంటే తక్కువగా గౌరవ వేతనం(రూ.921) వస్తోంది.

ఇక్కడ విధులు నిర్వర్తించినప్పుడు షిఫ్టుల వారీగా పనిచేస్తారు. పొరుగు రాష్ట్రాల్లో మాత్రం 24 గంటలూ నిలువుకాళ్ల జీతం చేస్తున్నారు. 24 గంటలూ కష్టపడ్డా వారికి ఈసీఐ ద్వారా అదే రూ.921 దక్కుతోంది. ఆయా రాష్ట్రాల్లో డైట్‌ చార్జీల కింద రూ.250 అదనంగా ఇస్తారు. డైట్‌ చార్జీల వంకతో ఉన్నతాధికారులు వీరికి భోజన వసతులను సైతం కల్పించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లోనూ చేతిలో లాఠీ తప్ప ఎలాంటి ఆయుధం లేకుండా పనిచేసే తమ పట్ల ఇంతటి వివక్ష తగదని హోంగార్డులు వాపోతున్నారు. 

పక్కా రాష్ట్రాల్లోనే నయ్యం!

ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో హోంగార్డులకు గౌరవ వేతనంతోపాటు.. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల విధుల్లో పాల్గొన్నందుకు అదనపు భత్యం, ఈసీఐ ఇచ్చే వేతనం లభిస్తోంది. ఈ రాష్ట్రాల నుంచి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు పలువురు హోంగార్డులు వచ్చారు. వారి డైట్‌ చార్జీలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయని రాష్ట్ర హోంగార్డులు వివరిస్తున్నారు. ఆయా రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాన్నే ఇక్కడా అమలు చేయాలని కోరుతున్నారు.

హోం గార్డులు చనిపోతే అంతే..?

పొరుగు రాష్ట్రాల్లో విధులు నిర్వర్తించే హోంగార్డులను మరో భయం వెంటాడుతోంది. అక్కడ విధి నిర్వహణలో మరణిస్తే.. తమ కుటుంబాలు రోడ్డున పడడం తప్ప.. ప్రభుత్వం ఆదుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. గతంలో మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల బందోబస్తుకు వెళ్లిన శ్యామ్‌కుమార్‌అనే హోంగార్డు.. గుండెపోటుతో మృతిచెందారు. అప్పట్లో ఉన్నతాధికారులు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఇచ్చిన రూ.10 వేలు తప్ప.. శ్యామ్‌కుమార్‌ కుటుంబానికి దక్కిందేమీ లేదు.

హోంగార్డులకు ప్రభుత్వం జీవిత బీమాను కల్పిస్తున్నా.. శామ్‌కుమార్‌ది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, అది సహజ మరణమని పేర్కొంటూ బీమా కంపెనీ చేతులెత్తేసినట్లు తెలిసింది. ఇప్పుడు ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కానిస్టేబుళ్ల విషయంలో భద్రత ఉంటుందని, వారిని కాదని.. తమను ఇతర రాష్ట్రాలకు పంపడమేంటని హోంగార్డులు ప్రశ్నిస్తున్నారు.