నిజంనిప్పులాంటిది

May 14 2024, 15:23

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో గెలిచేదెవరో ?

- పోల్‌ మేనేజ్‌మెంట్లో ముందున్నామని విశ్లేషణ

- మోదీ క్రేజ్‌ గ్రామాల్లోనూ ఉందని విశ్వాసం

- ఆరు గెలుచుకుంటామని బీఆర్‌ఎస్‌ అంచనా

- 10-12 సీట్లు గెలుస్తామని కాంగ్రెస్‌ అంచనా..ముస్లిముల ఏకపక్ష పోలింగ్‌పై భరోసా

- 9-10 గెలుస్తామంటున్న బీజేపీ వర్గాలు

రాష్ట్రంలో లోక్‌సభ పోలింగ్‌ ముగిసింది. నువ్వా నేనా అన్నట్లు సాగిన త్రిముఖ పోరులో విజయం ఎవరిదనే చర్చ అన్ని పార్టీల్లో మొదలైంది. మూడు పార్టీలూ ఫలితాల పట్ల ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని, గత నవంబరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అదృష్టం కాదని నిరూపిస్తామని కాంగ్రెస్‌ ధీమాగా చెబుతోంది.

సోమవారం సొంత గ్రామంలో ఓటేసిన సందర్భంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఎన్నికల ఫలితాలు తమ ప్రభుత్వ పనితీరుకు రెఫరెండమేనని పునరుద్ఘాటించారు. పది నుంచి 12 సీట్లు దక్కే అవకాశం ఉందని పార్టీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూలు, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌, చేవెళ్ల సీట్లలో కాంగ్రెస్‌ కచ్చితంగా గెలుస్తుందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

హైదరాబాద్‌ను వదిలేస్తే... సికింద్రాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ప్రత్యర్థి పార్టీలతో గట్టి పోటీని ఎదుర్కొంటున్నట్లు వివరిస్తున్నాయి. సికింద్రాబాద్‌, మల్కాజ్‌గిరీ సీట్లలో ఓటర్లు సహజంగా అధికార పార్టీకి మెగ్గు చూపుతారని, ముస్లిం మైనార్టీలూ కాంగ్రెస్‌ అభ్యర్థులకే మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రెండూ తమకే దక్కుతాయని అంచనా వేస్తున్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనితీరు పట్ల ఉన్నసానుకూలత, బీజేపీ వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందన్న ప్రచారాలకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం మైనార్టీల్లో మెజారిటీ ఓటర్లు కాంగ్రె్‌సకు మద్దతుగా నిలవడడంతో కాంగ్రె్‌సకు సానుకూల పరిస్థితి స్పష్టంగా కనిపించిందని పార్టీ నేతలు చెబుతున్నారు .

కేసిఆర్ బస్ పోరాట యాత్రతో పెరిగిన ఓట్లు !

కనీసం ఆరు స్థానాల్లో గెలుపు తథ్యమని బీఆర్‌ఎస్‌ భావిస్తోంది. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్‌ వైఫల్యాలు, కేంద్రంలో బీజేపీ తెలంగాణకు ఏమీ చేయడం లేదన్న అంశాలే ప్రధాన ఎజెండాగా బీఆర్‌ఎస్‌ ఈ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించింది. మెదక్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, కరీంనగర్‌, నాగర్‌కర్నూల్‌, పెద్దపల్లి లోకసభ స్థానాల్లో గెలుస్తామని భావిస్తున్నట్లు తెలిసింది. ఓటింగ్‌ శాతం ఏ మాత్రం తగ్గదని అంచనా వేస్తున్నారు. మెదక్‌ ఏళ్ల తరబడి కేసీఆర్‌కు అనుకూలంగా ఉన్న స్థానమని, అక్కడ గెలుపు తేలికేనని, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ పరిధిలో పార్టీ ఎమ్మెల్యేలు ఉండటం, సికింద్రాబాద్‌లో పార్టీ అభ్యర్థికి ప్రజల్లో ఎక్కువ ఆదరణ లభించడం కలిసివస్తాయని అంచనా వేస్తున్నారు.

క్రాస్ ఓటింగ్ తో కేసిఆర్ కు భారీ దెబ్బ !

పోలింగ్‌ తేదీ నాటికి రాష్ట్రంలోని మెజారిటీ లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థుల మధ్యనే ముఖాముఖీ పోటీ నెలకొన్నట్లుగా వాతావరణం ఏర్పడిన నేపథ్యంలో ఆయా స్థానాల్లో బీఆర్‌ఎస్‌ ఓట్లు భారీగా క్రాస్‌ అయినట్లు చెబుతున్నారు. ఒకటి, రెండు శాతం ఓట్లే గెలుపోటములను నిర్ణయిస్తున్న క్రమంలో క్రాస్‌ అయిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఓట్లు.. ఎవరి కొంప ముంచుతాయోనన్న ఆందోళన ఇటు కాంగ్రెస్‌, అటు బీజేపీ వర్గాల్లోనూ నెలకొంది. ముఖ్యంగా మల్కాజ్‌గిరీ, చేవెళ్ల, మహబూబ్‌నగర్‌ ,నాగర్‌ కర్నూలు, జహీరాబాద్‌, నిజామాబాద్‌ వంటి చోట్ల క్రాస్‌ ఓటింగ్‌ భారీగా జరిగిందని చెబుతున్నారు. బీఆర్‌ఎ్‌సలోని కాంగ్రెస్‌ వ్యతిరేకులు బీజేపీ వైపు, బీజేపీ వ్యతిరేకులు కాంగ్రెస్‌ పార్టీకి క్రాస్‌ చేసినట్లూ వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అధికార పార్టీతో మంచి కోసమూ కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు.. కాంగ్రెస్‌ అభ్యర్థులకు క్రాస్‌ చేయడానికే మెగ్గు చూపినట్లూ చెబుతున్నారు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులకు ఉన్న వ్యక్తిగత పరిచయాలతోనూ క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందంటున్నారు.

చేవెళ్ల నియోజకవర్గం తీసుకుంటే ఇటు కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, అటు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు ఇద్దరూ గతంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎంపీలుగా పనిచేసిన వారే. ఆ పార్టీ నాయకులతో ఇద్దరికీ వ్యక్తిగత పరిచయాలు, ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో ఎవరికి వీలైనంతగా వారు బీఆర్‌ఎస్‌ ఓటింగ్‌ను తమవైపునకు తిప్పుకున్నట్లు చెబుతున్నారు.

ముక్కోణపు పోటీలు జరిగితే మెజారిటీ సీట్లలో రెండో ప్లేసు దక్కించుకునైనా ఉనికి నిలబెట్టుకోవాలని భావించిన బీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆశలకు.. ఈ క్రాస్‌ ఓటింగ్‌ భారీగా గండి కొట్టినట్లు చెబుతున్నారు. మెజారిటీ సీట్లలో బీఆర్‌ఎస్‌ మూడో స్థానానికి పడిపోనున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఉనికే ప్రమాదంలో పడేందుకూ ఆస్కారం ఉన్నట్లు చెబుతున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో మోడి క్రేజ్ ! 

రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాలు తామే సాధించబోతున్నామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్‌ శాతం పెరుగుతోందని, ఇది తమకు అనుకూలిస్తుందని అంటున్నారు. ఓటుబ్యాంకు భారీగా పెరుగుతోందని, 9-10 సీట్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ‘‘పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా బీజేపీకిఆదరణ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ మోదీ క్రేజ్‌ విస్పష్టంగా కనిపించింది’’ అని బీజేపీ సీనియర్‌ నేత ఒకరు విశ్లేషించారు. 

ఒక ప్రధాన కులం ఈసారి పూర్తిగా తమ ప్రత్యర్థి వైపు మొగ్గు చూపినట్లు సమాచారం అందిందని, అయితే, దీని ప్రభావం పెద్దగా ఉండబోదని చెప్పారు. యువత పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రాలకు తరలివచ్చారని, మోదీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడం కలిసి వచ్చిందని చెబుతున్నాయి. ప్రధానిగా మోదీ మరోసారి కొనసాగాల్సిన అవసరాన్ని ప్రచారం చేశామని, యువత కూడా అనుకూలంగా స్పందించిందని తెలిపాయి.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 13:49

ఎన్నికల్లో తెలంగాణ కషాయమయం !

- బంపర్ మెజార్టీతో బీజేపి దిగ్విజయం - బండి సంజయ్ 

- కరీంనగర్ నా హిందువుల అడ్డా - బండి సంజయ్ 

రాష్ట్రంలో బీజేపీ మెజారిటీ సీట్లలో గెలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ అన్నారు. కాంగ్రె్‌సకు ఓటమి తప్పదన్న టెన్షన్‌ ఆయన ముఖంలో కనిపించిందని, అందువల్లే కోడ్‌ ఉల్లంఘించి మాట్లాడారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని బాలుర ఉన్నత పాఠశాల, కళాశాలలోని బండి సంజయ్‌ విలేకరులతో మాట్లాడారు ..

ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించిన సీఎం రేవంత్‌ రెడ్డిపై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నిబంధనలను బేఖాతరు చేస్తూ.. ప్రధాని మోదీ, బీజేపీకి వ్యతిరేకంగా.. కాంగ్రె్‌సకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తే.. ఆయనకు ఎన్నికల కోడ్‌ వర్తించదా..? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ఓటర్లకు మద్యం, డబ్బు పంచుతూ ప్రలోభాలకు గురిచేసినా చర్యలు తీసుకోవడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి మెజారిటీ సీట్లు తథ్యమని, కరీంనగర్‌లో బంపర్‌ మెజారిటీ ఖాయమని సంజయ్‌ తేల్చి చెప్పారు.

కొడంగల్‌లో ఓటు వేసేందుకు వెళ్లి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి ఉద్దేశపూర్వంగా ప్రధాని మోదీని కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీజేపీ మెదక్‌ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు డిమాండ్‌ చేశారు. సోమవారం సంగారెడ్డిలోని పోలింగ్‌ కేంద్రాలను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డిపై తమ పార్టీ ప్రత్యక్షంగా, మెయిల్‌ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేసిందని తెలిపారు. తెలంగాణలో బీజేపీ డబుల్‌ డిజిట్‌తో గెలవబోతుందని, రేవంత్‌రెడ్డి ఓటమిని అంగీకరించారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ స్థానాలకు ఇబ్బందవుతుందనే అనుమానంతో రైతుబంధు వేశామని, రేపు రుణమాఫీ చేస్తామంటూ వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని రఘునందన్‌ అన్నారు.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 13:46

రాష్ట్రంలో డబుల్ డిజిట్ బీజేపీకే !

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

- మోదీపై దుష్ప్రచారం చేస్తే పెద్ద నేతలు కాలేరు

- హైదరాబాద్‌లో ఓటర్‌ లిస్ట్‌ అస్తవ్యస్తం: కిషన్‌రెడ్డి

- ఓటమి భయంతో రేవంత్‌ కోడ్‌ ఉల్లంఘించారు - బండి సంజయ్

తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా అవతరించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. తమ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలో డబుల్‌ డిజిట్‌ ఖాయమని స్పష్టం చేశారు. ఏపీలో ఎన్నికలు ఉండటం వల్ల కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓటింగ్‌ శాతం తగ్గిందని చెప్పారు.

పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం కొంత తగ్గినా, మెజారిటీ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గుచూపారని తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూల స్పందన లభించిందని తెలిపారు. ఓటింగ్‌ శాతంతో సంబంధం లేకుండా సికిందరాబాద్‌లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీలో ఈ విద్యా సంవత్సరంలోనే కొన్ని కోర్సులకు అడ్మిషన్లు ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించగానే వర్సిటీ భవనాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు.

సీఎం సార్ ది మిడిమిడి జ్ఞానం !

సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో ప్రధానిపై సవాళ్లు చేస్తున్నారని విమర్శించారు. స్థాయి మరచి ప్రధానిపై విమర్శలు చేయొద్దని హితవు పలికారు. బీజేపీపై, కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన పెద్ద నాయకులు కాబోరని అన్నారు. ‘‘పీఎం అయ్యాక పెళ్లి చేసుకోవాలని రాహుల్‌ అనుకున్నారు. కానీ ప్రధాని అయ్యే అవకాశం లేదని ఆయనకు తెలిసిపోయింది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.. మంచిదే కదా’’ అని అన్నారు. కాగా, మునిసిపల్‌ అధికారుల వైఖరి వల్ల హైదరాబాద్‌లో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా మారిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 

సీఎం రేవంత్‌రెడ్డి మిడిమిడి జ్ఞానంతో ప్రధానిపై సవాళ్లు చేస్తున్నారని విమర్శించారు. స్థాయి మరచి ప్రధానిపై విమర్శలు చేయొద్దని హితవు పలికారు. బీజేపీపై, కేంద్రంపై తప్పుడు ప్రచారం చేసినంత మాత్రాన పెద్ద నాయకులు కాబోరని అన్నారు. ‘‘పీఎం అయ్యాక పెళ్లి చేసుకోవాలని రాహుల్‌ అనుకున్నారు. కానీ ప్రధాని అయ్యే అవకాశం లేదని ఆయనకు తెలిసిపోయింది. అందుకే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.. మంచిదే కదా’’ అని అన్నారు. కాగా, మునిసిపల్‌ అధికారుల వైఖరి వల్ల హైదరాబాద్‌లో ఓటరు జాబితా అస్తవ్యస్తంగా మారిందని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. తమకు ఓ చోట, తమ కుమారుడికి మరో చోట ఓటు కేటాయించారని.. దీనిపై కేంద్ర మంత్రిగా లేఖ రాసినా పట్టించుకోలేదన్నారు. ఒక వర్గం వారి కోసం షేక్‌పేటలో ఏకంగా 3 వేల ఓట్లను తొలగించారని ధ్వజమెత్తారు. షేక్‌పేటలో ఓట్లు గల్లంతయిన పోలింగ్‌ కేంద్రాన్ని కిషన్‌రెడ్డి సందర్శించారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని.. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు ఫిర్యాదు చేస్తామన్నారు.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 13:43

తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భద్రత కట్టుదిట్టం...!

తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కేంద్ర బలగాలు మోహరించారు. ఆయా స్ట్రాంగ్‌ రూముల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్‌ రూమ్స్‌ వద్ద రౌండ్ ది క్లాక్ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అలాగే స్ట్రాంగ్‌ రూముల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంది.

కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా లోక్‌సభ పోలింగ్ (Loksabha Polls 2024) ప్రక్రియ ముగిసింది. నిన్న ఉదయం 7 గంటల పోలింగ్ మొదలవగా సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది.

కొన్ని చోట్ల సరైన సమయానికే పోలింగ్ ముగియగా.. మరికొన్ని పోలింగ్ బూత్‌ల వద్ద మాత్రం రాత్రి 11 గంటల వరకు పోలింగ్ కొనసాగింది.

6 గంటల లోపు క్యూలో నిల్చున్న ఓటర్లకు నిర్ణీత సమయం ముగిసిన తర్వాత కూడా కూడా ఓటు వేసే అవకాశం కల్పించారు. దీంతో పలు ప్రాంతాల్లో రాత్రి 11 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 64.74శాతం పోలింగ్ నమోదు అయ్యింది.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 10:21

PM Modi: నేడు వారణాసిలో నామినేషన్ దాఖలు చేయనున్న ప్రధాని మోడీ

PM Modi: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్ సభ స్థానం నుంచి నేడు ( మంగళవారం ) భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.

అట్టహాసంగా జరిగే ఈ కార్యక్రమంలో బీజేపీ పాలిత, మిత్రపక్షాల రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా, వారణాసిలో ప్రధాని నరేంద్రమోడీ నామినేషన్‌ వేసే కార్యక్రమానికి ఆహ్వానాలు అందుకున్న ముఖ్యమంత్రులు వీరే.. 

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, పుష్కర్ ధామి (ఉత్తరాఖండ్ ), మోహన్ యాదవ్ (మధ్యప్రదేశ్‌), విష్ణు దేవ్ సాయ్ (ఛత్తీస్ గఢ్ ), ఏక్ నాథ్ షిండే (మహారాష్ట్ర), భజన్ లాల్ శర్మ (రాజస్థాన్), హిమంత బిశ్వ శర్మ (అస్సాం), నయాబ్ సైనీ (హర్యానా), ప్రమోద్ సావంత్ (గోవా), ప్రేమ్ సింగ్ తమంగ్‌ (సిక్కిం), మాణిక్ సాహా (త్రిపుర)తో పాటు ఎన్డీఏ పక్షాల నేతలు, కేంద్ర మంత్రులు ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 10:20

EVMS: ఇబ్రహీంపట్నం నిద్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద భారీ భద్రత

ఎన్టీఆర్ జిల్లా: ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీ వద్ద పోలీసులు భారీగా భద్రత ఏర్పాట్లు చేశారు. ఏపీ (AP)లో పోలింగ్ (Polling) పూర్తి అయిన నేపథ్యంలో ఈవీఎంలు ( EVMs) మైలవరం (Mailavaram) నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, నిమ్రా కాలేజ్ స్ట్రాంగ్ రూంలకు అధికారులు తరలిస్తున్నారు..

ఈ ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ (Sampath Kumar) పరిశీలిస్తున్నారు. తిరువూరు, నందిగామ, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను నోవా ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్నారు.

మైలవరం నియోజకవర్గం ఈవీఎంలను నిమ్రా మెడికల్ కాలేజీకి తరలిస్తున్నట్లు రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ చెప్పారు. విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట నియోజకవర్గం ఈవీఎంలను ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్నట్లు తెలిపారు. ఏడు నియోజకవర్గ ఈవీఎంలను ఇబ్రహీంపట్నంలోని నిమ్రా, నోవా ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలకు తరలిస్తున్నామని రిటర్నింగ్ అధికారి సంపత్ కుమార్ చెప్పారు.

నిజంనిప్పులాంటిది

May 14 2024, 10:19

తెలంగాణలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు..

తెలంగాణలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు..

తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి మోస్తరు వర్షాలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలలకు అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ… హైదరాబాద్‌లో నేడు, రేపు జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది.

నిజంనిప్పులాంటిది

May 13 2024, 20:34

హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు, మొత్తం విషయం ఏంటో తెలుసా?

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవి లతపై మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మాధవి లత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిందని మరియు డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారికి భంగం కలిగించారని ఆరోపించిన బిజెపి అభ్యర్థి మాధవి లత యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ముస్లీం ఓటర్ల బురఖా తొలగించి ముఖాలు చూపించాలని పలువురు తమ ముఖాలను కార్డులతో సరిపెడుతున్నారు.

ఓటింగ్ సమయంలో, బీజేపీ అభ్యర్థి అజంపూర్‌లోని పోలింగ్ స్టేషన్ నంబర్ 122కి చేరుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ముస్లిం మహిళా ఓటర్ల గుర్తింపు కార్డులను ఆయన తనిఖీ చేశారు. ముస్లిం మహిళ ముఖంపై నుంచి బురఖా తీసేయమని బలవంతం చేశాడనేది ఆరోపణ. ఆయన తరలింపుపై తీవ్ర దుమారం రేగింది. ఈ విషయాన్ని ధృవీకరించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దురిశెట్టి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా కూడా ఉన్నారు.

విషయం తీవ్రరూపం దాల్చడంతో బీజేపీ అభ్యర్థి ఓ క్లారిటీ ఇచ్చారు. మహిళలు తమ గుర్తింపును ధృవీకరించుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానన్నారు. అందులో తప్పేమీ లేదు.. 'నేను అభ్యర్థిని. చట్టం ప్రకారం ID కార్డును తనిఖీ చేసే హక్కు అభ్యర్థికి ఉంది. నేను పురుషుడిని కాదు స్త్రీని. చాలా మర్యాదపూర్వకంగా నేను వారిని అభ్యర్థించాను, నేను ID కార్డ్‌ని చూసి వెరిఫై చేయవచ్చా? ఎవరైనా దీన్ని పెద్ద ఇష్యూగా చేయాలనుకుంటే, వారు భయపడుతున్నారని అర్థం.

నిజంనిప్పులాంటిది

May 13 2024, 16:49

ఓటు హక్కును వినియోగించుకున్న కట్టెకోలు దీపెందర్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ నల్లగొండ పట్టణంలోని రామగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలోని 139 వ పోలింగ్ బూత్ లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక వజ్రాయుధమని ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ కోరారు.

నిజంనిప్పులాంటిది

May 11 2024, 12:39

మాజి మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు కిలక వాఖ్యలు !

మాజి మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు కిలక వాఖ్యలు !

- సీఎం రేవంత్‍రెడ్డి నా శిష్యుడే.. 

- బజార్లో ఉన్న వ్యక్తిని ఎంపీ చేశారు: ఎర్రబెల్లి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శిశ్యుడే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మూడుసార్లు మాత్రమే గెలిచిన రేవంత్ సీఎం అయ్యాడని.. ఏడు సార్లు గెలిచిన తాను ఇలా మిగిలానని చెప్పుకొచ్చారు. పార్టీ మారిన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనా ఎర్రబెల్లి ఘాటు విమర్శలు చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఎవరిచ్చారనేదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఆయన టీడీపీ పార్టీలో పని చేయగా.. చంద్రబాబే ఆయనకు రాజకీయ గురువు అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇదే ప్రశ్నను ఇటీవల ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జర్నలిస్టులు సంధించారు. దానికి సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి తనకు రాజకీయ గురువు అంటూ ఎవరూ లేరని చెప్పారు. తాను చంద్రబాబు శిశ్యుడిని అంటే ము* తంతా అంటూ కాస్త పరుషంగానే రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు తనకు గురవు కాదని.. ఇద్దరం ఒకే పార్టీలో పని చేశామని రాజకీయ సహచరుడు మాత్రమే అని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో కలిసి గతంలో టీడీపీలో పని చేసి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్స్ చేశారు. శిశ్యరికంపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేసి వారం గడవకముందే.. ఎర్రబెల్లి అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎవరో కాదని.. తన శిశ్యుడే అని చెప్పుకొచ్చారు. వర్ధన్నపేటలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ తన శిశ్యుడే అని కామెంట్లు చేశారు. అంతే కాదు రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి మోసాలు చేస్తడని.. అబద్ధాలు, జిమ్మిక్కులు చేస్తడని విమర్శించారు. మూడుసార్లు గెలిచినోడు సీఎం అయ్యారని.. ఏడుసార్లు గెలిచినోన్ని ఇక్కడ మీ ముందున్నానని చెప్పారు. అబద్ధాలాడేటోడే ముందుకుపోతున్నడని.. న్యాయమనేది లేదని నిట్టూర్చారు. అయినా రేవంత్ ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగరని... తక్కువ టైంలోనే కాంగ్రెస్‍ పార్టీపై జనాల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిలోనే కూలిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు.

ఇక వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బజార్‌లో ఉన్న దయాకర్‍ను తీసుకొచ్చి.. రూపాయి లేకున్నా ఎంపీ చేసిన మహనుభావుడు కేసీఆర్‍ అని కొనియాడారు. అట్లాంటి పసునూరి కూడా పార్టీ మారాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరిని తన తండ్రే చదివించాడని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అవకాశాలను తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేసిన చరిత్ర కడియం శ్రీహరిది అని ఎర్రబెల్లి మండిపడ్డారు.