హైదరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి మాధవి లతపై కేసు నమోదు, మొత్తం విషయం ఏంటో తెలుసా?

హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మాధవి లతపై మలక్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. మాధవి లత ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసిందని మరియు డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారికి భంగం కలిగించారని ఆరోపించిన బిజెపి అభ్యర్థి మాధవి లత యొక్క వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పోలింగ్ కేంద్రంలో ఓటర్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ముస్లీం ఓటర్ల బురఖా తొలగించి ముఖాలు చూపించాలని పలువురు తమ ముఖాలను కార్డులతో సరిపెడుతున్నారు.

ఓటింగ్ సమయంలో, బీజేపీ అభ్యర్థి అజంపూర్‌లోని పోలింగ్ స్టేషన్ నంబర్ 122కి చేరుకున్నారు. పోలింగ్ బూత్ వద్ద ఉన్న ముస్లిం మహిళా ఓటర్ల గుర్తింపు కార్డులను ఆయన తనిఖీ చేశారు. ముస్లిం మహిళ ముఖంపై నుంచి బురఖా తీసేయమని బలవంతం చేశాడనేది ఆరోపణ. ఆయన తరలింపుపై తీవ్ర దుమారం రేగింది. ఈ విషయాన్ని ధృవీకరించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. దురిశెట్టి హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా కూడా ఉన్నారు.

విషయం తీవ్రరూపం దాల్చడంతో బీజేపీ అభ్యర్థి ఓ క్లారిటీ ఇచ్చారు. మహిళలు తమ గుర్తింపును ధృవీకరించుకోవాలని తాను అభ్యర్థిస్తున్నానన్నారు. అందులో తప్పేమీ లేదు.. 'నేను అభ్యర్థిని. చట్టం ప్రకారం ID కార్డును తనిఖీ చేసే హక్కు అభ్యర్థికి ఉంది. నేను పురుషుడిని కాదు స్త్రీని. చాలా మర్యాదపూర్వకంగా నేను వారిని అభ్యర్థించాను, నేను ID కార్డ్‌ని చూసి వెరిఫై చేయవచ్చా? ఎవరైనా దీన్ని పెద్ద ఇష్యూగా చేయాలనుకుంటే, వారు భయపడుతున్నారని అర్థం.

ఓటు హక్కును వినియోగించుకున్న కట్టెకోలు దీపెందర్

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నేడు జరుగుతున్న ఎన్నికల్లో బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ నల్లగొండ పట్టణంలోని రామగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలోని 139 వ పోలింగ్ బూత్ లో తన ఓటుహక్కును వినియోగించుకున్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు ప్రజల చేతిలో ఒక వజ్రాయుధమని ప్రతి ఒక్కరు బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీసీ యువజన సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెకోలు దీపెందర్ కోరారు.

మాజి మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు కిలక వాఖ్యలు !

మాజి మంత్రి ఎరబెల్లి దయాకర్ రావు కిలక వాఖ్యలు !

- సీఎం రేవంత్‍రెడ్డి నా శిష్యుడే.. 

- బజార్లో ఉన్న వ్యక్తిని ఎంపీ చేశారు: ఎర్రబెల్లి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శిశ్యుడే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మూడుసార్లు మాత్రమే గెలిచిన రేవంత్ సీఎం అయ్యాడని.. ఏడు సార్లు గెలిచిన తాను ఇలా మిగిలానని చెప్పుకొచ్చారు. పార్టీ మారిన ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యే కడియం శ్రీహరిపైనా ఎర్రబెల్లి ఘాటు విమర్శలు చేశారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తు ఎవరిచ్చారనేదానిపై ప్రస్తుతం జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఆయన టీడీపీ పార్టీలో పని చేయగా.. చంద్రబాబే ఆయనకు రాజకీయ గురువు అనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఇదే ప్రశ్నను ఇటీవల ఓ మీడియా ఛానెల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో జర్నలిస్టులు సంధించారు. దానికి సమాధానం చెప్పిన రేవంత్ రెడ్డి తనకు రాజకీయ గురువు అంటూ ఎవరూ లేరని చెప్పారు. తాను చంద్రబాబు శిశ్యుడిని అంటే ము* తంతా అంటూ కాస్త పరుషంగానే రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు తనకు గురవు కాదని.. ఇద్దరం ఒకే పార్టీలో పని చేశామని రాజకీయ సహచరుడు మాత్రమే అని చెప్పుకొచ్చారు.

ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో కలిసి గతంలో టీడీపీలో పని చేసి ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక కామెంట్స్ చేశారు. శిశ్యరికంపై రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేసి వారం గడవకముందే.. ఎర్రబెల్లి అగ్నికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. రేవంత్ రెడ్డి ఎవరో కాదని.. తన శిశ్యుడే అని చెప్పుకొచ్చారు. వర్ధన్నపేటలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన రేవంత్ తన శిశ్యుడే అని కామెంట్లు చేశారు. అంతే కాదు రేవంత్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

రేవంత్ రెడ్డి మోసాలు చేస్తడని.. అబద్ధాలు, జిమ్మిక్కులు చేస్తడని విమర్శించారు. మూడుసార్లు గెలిచినోడు సీఎం అయ్యారని.. ఏడుసార్లు గెలిచినోన్ని ఇక్కడ మీ ముందున్నానని చెప్పారు. అబద్ధాలాడేటోడే ముందుకుపోతున్నడని.. న్యాయమనేది లేదని నిట్టూర్చారు. అయినా రేవంత్ ఎక్కువ రోజులు సీఎంగా కొనసాగరని... తక్కువ టైంలోనే కాంగ్రెస్‍ పార్టీపై జనాల్లో వ్యతిరేకత వచ్చిందని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వం ఏడాదిలోనే కూలిపోతుందని సంచలన కామెంట్స్ చేశారు.

ఇక వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్‌పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బజార్‌లో ఉన్న దయాకర్‍ను తీసుకొచ్చి.. రూపాయి లేకున్నా ఎంపీ చేసిన మహనుభావుడు కేసీఆర్‍ అని కొనియాడారు. అట్లాంటి పసునూరి కూడా పార్టీ మారాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి నమ్మక ద్రోహం చేసిన కడియం శ్రీహరిని తన తండ్రే చదివించాడని చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే అవకాశాలను తీసుకుని బీఆర్ఎస్ పార్టీకి నమ్మకద్రోహం చేసిన చరిత్ర కడియం శ్రీహరిది అని ఎర్రబెల్లి మండిపడ్డారు.

పార్లమెంట్ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం

- తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు

- ప్రజలకు మావోయిస్టుల కీలక పిలుపు

- పార్లమెంట్ ఎన్నికల్లో ఓటేయవద్దని పిలుపు

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల వేళ మావోయిస్టుల వాల్‌పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లోని ములుగు జిల్లా వాజేడు మండలంలోని పలు గ్రామాల్లో ఈ వాల్‌పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలు తుది అంకాని చేరుకున్నాయి. నేడు సాయంత్రంతో ప్రచార పర్వానికి తెరపడనుంది. గత 50 రోజులకు పైగా ఊదరగొట్టిన మైకులు మూగబోనున్నాయి. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈసీ గుర్తించిన సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ పూర్తవుతుంది. మెుత్తం 17 పార్లమెంట్ స్థానాలు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలకు జరగనుండగా.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రాలు రాష్ట్రంలో కలకలం రేపాయి. ఈ కరపత్రాల్లో ఓటర్లకు మావోయిస్టు పార్టీ కీలక పిలుపునిచ్చింది. ప్రస్తుతం జరగుతున్న పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని ప్రజలకు సూచించింది. ఈ మేరకు శనివారం తెలంగాణ ఛత్తీస్‌గఢ్ సరహద్దుల్లో ఈ కరపత్రాలు కలకలం రేపాయి. ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం వై జంక్షన్ సమీపంలో మావోయిస్టుల పేరిట వాల్ పోస్టర్లు, కరపత్రాలు దర్శనమిచ్చాయి.

పార్లమెంట్ ఎన్నికలను ఓటర్లు బహిష్కరించాలని ఈ కరపత్రాల ద్వారా మావోయిస్టులు పిలుపునిచ్చారు. వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ పేరుతో వాల్ పోస్టర్లను మావోయిస్టు పార్టీ విడుదల చేసింది. పోలింగ్‌కు మరికొన్ని గంటల సమయం మాత్రమే నేపథ్యంలో మావోయిస్టుల కరపత్రాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. దీంతో పోలీసులు, కేంద్రబలగాలు అలర్ట్ అయ్యాయి. ఏజెన్సీ ఏరియాలో భారీగా భద్రత బలగాలను మోహరించారు. సమీప గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది.

సీఎం రేవంత్‌ రెడ్డికి ఈసీ నోటీసులు

- 48 గంటలు డెడ్‌‌లైన్.. దాటితే చర్యలే..!

ఓవైపు లోక్ సభ ఎన్నికలకు రెండు రోజులు మాత్రమే సమయం ఉండగా.. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి (Anumula Revanth Reddy) ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న భాష, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandrashekar Rao) పై వ్యక్తిగత దూషణలపై బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు.. సీఎం రేవంత్ రెడ్డికి శుక్రవారం (మే 10న) షోకాజు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను వ్యక్తిగతంగా దూషించినందుకు, అసభ్యపదజాలం వాడినందుకు రేవంత్ రెడ్డికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది.

బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్ నిరంజన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. అయితే.. ఈ నోటీసులపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని నిరంజన్‌ను ఈసీ ఆదేశించింది. గడువు ముగిసేసరికి వివరణ ఇవ్వకపోతే రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారులు హెచ్చరించారు.

కాగా.. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో.. మందు వేసి మాట్లాడుతుండో తెలియట్లేదు. సోయిలేనోడు, సన్నాసోడు, చవట, దద్దమ్మ, దిక్కుమాలినోడు.." అంటూ కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్రపదజాలాన్ని ఉపయోగించారు. రైతుబంధు సాయం, రైతురుణమఫీ విషయంలో కేసీఆర్, రేవంత్ రెడ్డి మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్న క్రమంలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో.. సీఎ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎంకు ఈసీ నోటీసులు ఇచ్చింది.

ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు..

ఈ రోజు నాల్గో విడత ఎన్నికల ప్రచారానికి చివరి రోజు.. 

ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగియనున్న ప్రచారం.. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు నాల్గో విడతలో 10 రాష్ట్రాల్లో ఎన్నికలను నిర్వహించనున్న ఈసీ.. 

మొత్తం 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంట్ నియోజకవర్గాల్లో మే 13న పోలింగ్..

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మతిభ్రమించింది

•బండి సంజయ్ పై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

•కాంగ్రెస్ అభ్యర్థి జనంలో ఉండని నాయకుడు

•కాంగ్రెస్ లో అంతర్గత కుమ్మలాటలు, రాజకీయలు ఎక్కువయ్యాయి.

బిజెపి కరీంనగర్ మాజీ జిల్లా అధ్యక్షులు బాస సత్యనారాయణ రావు

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ లో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ పై అవాకులు చివాకులు పేలారని, దీన్ని పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని, ముఖ్యమంత్రి ఉద్యోగం కోల్పోయిన కెసిఆర్ కు పతిభ్రమించి, పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు భాస సత్యనారాయణ రావు విమర్శించారు. శుక్రవారం కరీంనగర్లోని పార్లమెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆయన పార్టీ బిఆర్ఎస్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి గద్దె దించిన వాళ్ల తీరు మారలేదన్నారు.

మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అసత్య ప్రచారాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ దాదాపు 12,000 వేల కోట్ల నిధులు ప్రజా సంక్షేమం, ఇతర అభివృద్ధి పనుల కోసం తీసుకొచ్చారన్నారు . కళ్ళు ఉండి చూసేవారికి చేసిన అభివృద్ధి పనులు కరీంనగర్ పార్లమెంటు వ్యాప్తంగా కళ్ళముండే కనబడతాయని, కళ్ళు ఉన్నా కూడా నటించే వారికి ఆ పనులు కనిపించవన్నారు. అలాగే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెలియని పరిస్థితి పార్లమెంటు పరిధిలో ఉందన్నారు.

తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి , చెట్టు పేరు చెప్పుకొని కాయలమ్ముకుందామనే ప్రయత్నంలో ఉన్నాడని, కాంగ్రెస్ అభ్యర్థి ఏనాడు ప్రజల్లో లేడన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల పక్షాన ఏనాడూ నిలబడలేదని, కేవలం తన రాజకీయ అవసరాల కోసం గతంలో పిఆర్పి నుండి ఎంపీగా పోటీ చేసి కనబడకుండా పోయారని విమర్శించారు. తిరిగి ఇన్నేళ్ల తర్వాత మళ్లీ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్నికల బరిలో ఎంపీ అభ్యర్థిగా నిలిచారన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ప్రజల కోసం ఇన్నేళ్లలో ఏమైనా సేవ చేశారా..? కష్టాల్లో ఉన్న ఎప్పుడైనా ఆదుకున్నారా..? ప్రజలంతా ఆలోచన చేయాలన్నారు.

కేవలం తన రాజకీయ ఆకాంక్షను నెరవేర్చుకోవడానికి కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలపై గాని, పార్లమెంటు పరిస్థితులపై గాని ఏమాత్రం అవగాహన లేదన్నారు. అలాంటి వ్యక్తికి ఓటు వేయడం దండుగా అనే అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు, రాజకీయాలు ఎక్కువ అని, అందుకే కరీంనగర్ అసెంబ్లీ అభ్యర్థి పురమళ్ళ శ్రీనివాస్, హుస్నాబాద్ నియోజకవర్గానికి చెందిన అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి లు దూరమయ్యారని తెలిపారు. పార్టీ వ్యవహారాలనే చక్కదిద్దుకోనొళ్ళు ప్రజల సమస్యలను ఏం పరిష్కరిస్తారు ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు.

కాంగ్రెస్ రోజురోజుకి ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. జరగబోయే పార్లమెంటు ఎన్నిక లో వార్ వన్ సైడ్ జరగనుందని, బిజెపి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజారిటీతో గెలవబోతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్, మీడియా కన్వీనర్ కటకం లోకేష్, జిల్లా అధికార ప్రతినిధి సెన్సార్ బోర్డు సభ్యులు బొంతల కళ్యాణ్ చంద్ర, సోషల్ మీడియా కన్వీనర్ ఉప్పర పల్లి శ్రీనివాస్ ,నాయకులు అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.

BJP,RSS, మోడీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడుదాం

•ఇండియా కూటమి అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును గెలిపిద్దాం.

•రాజ్యంగాన్ని,రిజర్వేషన్లను కాపాడుకుందాం

సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు పిలుపు

సిపిఐ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఇండియా కూటమి కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు కు మద్దతుగా పదవ డివిజన్ కట్ట రాంపూర్ లో విస్తృత ప్రచారం నిర్వహించారు. 

ఈసందర్బంగా సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కాంగ్రెస్ నగర ఉపాధ్యక్షులు బత్తిని చంద్రయ్య గౌడ్ లు మాట్లాడుతూ... 

మోడీ 10 ఏళ్ల పాలనలో దేశవ్యాప్తంగా హిందుత్వ ఫాసిస్టు శక్తులు పెట్రేగిపోయా యని, దళితులపైన, ఆదివాసీల పైన, మహిళల పైన, మైనారిటీ లపైన దాడులు, హింసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. ముస్లిం, క్రిస్టియన్ తదితర మైనారిటీ మతాలకు వ్యతిరేకంగా హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ దేశ సమైక్యతకు, లౌకిక, ప్రజాస్వామిక విధానాలకు తూట్లు పొడుస్తు 80% హిందువుల సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతు హిందువుల్ని బిజెపి మభ్యపెడుతుందన్నారు.

దేశంలోని మణిపూర్లో మైనారిటీలపై, తెగలపై ఎడతెగని హత్యాకాండ కొనసాగిస్తున్నారని, రామ మందిర నిర్మాణం, పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్ 370 రద్దు తదితర చట్టాలతో మైనారిటీలను కేంద్రంగా చేసుకొని దాడులు చేస్తూ, వారిని అభద్రతా భావానికి గురిచేస్తున్నారన్నారు.

లౌకిక, ప్రజాస్వామిక వాదులపై, ఆలోచనాపరులపై పాశవిక నిర్బంధాన్ని బీజేపీ అమలు చేస్తుందని, రాజ్యాంగ పరంగా ఏర్పడిన సంస్థలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని మోడీ ప్రభుత్వం చట్టసభలను నామమాత్రం చేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష రాజకీయ పార్టీల నాయకులను, ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారని, పార్లమెంటరీ ఫాసిజాన్ని దేశంలో అమలు చేస్తున్నదని విమర్శించారు.

భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసే బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తుల ప్రమాదాన్ని అడ్డుకోవాలని తెలిపారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో బిజెపిని, దాని మిత్రపక్షాలను ఓడించాలని, ఇండియా కూటమి అభ్యర్థి రాజేందర్ రావు ని గెలిపించాలని పైడిపల్లి రాజు, బత్తిని చంద్రయ్య గౌడ్ లు పిలుపునిచ్చారు.

 

 పదవ డివిజన్ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో సిపిఐ,కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంకటి మమత, మంజుల, పోచయ్య, ప్రశాంత్, పద్మ, హరి, శ్రీనివాసరెడ్డి, కవిత, సంధ్య, సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

గడ్డం వంశీని ఆదరించి ఓటు వేసి పార్లమెంటుకు పంపండి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆధ్వర్యంలో రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ను భారీ మెజార్టీతో గెలిపించాలని స్టానిక ప్రజలను కోరారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కాంగ్రెస్ వేవ్ నడుస్తుందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని పూర్తి విశ్వాసంతో ఉన్నామని, ఐదు న్యాయాలతో కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల గురించి ఆలోచించి, వారి సంక్షేమం కోసం ముందుకు సాగుతుందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపెల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరామనరావు ల నాయకత్వంలో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం, యువత ఉద్యోగ అవకాశాల హామీ ఇస్తున్నా గడ్డం వంశికృష్ణ ను గెలిపించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

 సోమవారం జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకొని గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దలగట్టు యాదవ్, గాజుల శివశంకర్, అమ్ముల బిక్షపతి, అటెపల్లి రాజు, అసరి ఎర్రయ్య, గుండేటి సదయ్య, గుండేటి రాములు, గడ్డం రాజకుమార్, గాజుల శ్రీచరణ్, గుండేటి శ్రీకాంత్, సోమయ్య, శ్రీనివాస్, అసరి కుమార్, రాంచందర్ గుండేటి శంకర్, గుండేటి అనిల్, అమ్ముల శంకర్, గుండేటి సాయిలు, అంబుల మల్లయ్య, గుండేటి రజినీకాంత్, గంట రాజు తదితరులు పాల్గొన్నారు.

భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రదారులను తరిమికొట్టాలి

•కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిచాలి 

•సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి

సిపిఐ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సైదాపూర్ మండల కేంద్రంలో సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు ఆద్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వేంకట్ రెడ్డి హజరై మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వస్తే దేశం అల్లకల్లోలంగా మారుతుందని, సామాన్య ప్రజలు ఈ దేశంలో జీవించే హక్కులు కోల్పోతారని, దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.

ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ , ఇండియా కూటమి గెలిస్తేనే దేశంలో సామాన్య ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ లో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ కు పంపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వేంకటస్వామి, బోయిని అశోక్, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, మిట్టపల్లి కిష్టయ్య, వేముల రమేష్ సిపిఐ సినియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ సదానందం, హమ్మయ్య, రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.