భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రదారులను తరిమికొట్టాలి
•కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపిచాలి
•సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడా వెంకట్ రెడ్డి
సిపిఐ పార్టీ బలపరిచిన కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు చేతి గుర్తుపై ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని సైదాపూర్ మండల కేంద్రంలో సీపీఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులు బత్తుల బాబు ఆద్వర్యంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య ఆతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వేంకట్ రెడ్డి హజరై మాట్లాడారు. బిజెపి అధికారంలోకి వస్తే దేశం అల్లకల్లోలంగా మారుతుందని, సామాన్య ప్రజలు ఈ దేశంలో జీవించే హక్కులు కోల్పోతారని, దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందన్నారు. బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ , ఇండియా కూటమి గెలిస్తేనే దేశంలో సామాన్య ప్రజలకు న్యాయం చేకూరుతుందని తెలిపారు. కరీంనగర్ పార్లమెంట్ లో సిపిఐ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును అత్యధిక మెజార్టీతో పార్లమెంట్ కు పంపాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మర్రి వేంకటస్వామి, బోయిని అశోక్, కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్, మిట్టపల్లి కిష్టయ్య, వేముల రమేష్ సిపిఐ సినియర్ నాయకులు కంది రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ సదానందం, హమ్మయ్య, రవి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
May 10 2024, 17:50