సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట..
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట..
కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్..
జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు..
ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలన్న విజ్ఞప్తిని సమర్థించిన సుప్రీంకోర్టు.
Vande Bharat Sleeper: వామ్మో.. వందే భారత్ స్లీపర్ ట్రెయిన్‌లో ఇన్ని ఫీచర్సా!
ప్రస్తుతం రైల్వే ప్రయాణికులను అమితంగా ఆకర్షిస్తున్నాయి వందేభారత్ రైళ్లు. ఆధునిక సౌకర్యాలున్న ఈ రైళ్లకు భారీ డిమాండ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ప్రారంభించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు ప్రారంభించింది. ఈ సర్వీసు ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ప్రయాణికులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో రైల్వే శాఖ వీటిని ప్రారంభించేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ దిశగా తాజాగా మరో ముందడుగు పడింది.
వందేభారత్ రైలు భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్‌ను (Safety Assesment) ఆర్ఐటీఈఎస్ (RITES) సంస్థకు రైల్వే శాఖ తాజాగా ఇచ్చింది. ఐటల్‌సర్టిఫయర్ ఎస్‌పీఏతో సంయుక్తంగా ఆర్ఐటీఈఎస్ ఈ తనిఖీలు చేపడుతుంది. మరోవైపు, ప్రయాణికుల అంచనాలను అందుకునేలా రైల్వే శాఖ (Indian Railways) వందే భారత్ స్లీపర్‌ను అత్యాధునిక వసతులతో తీర్చిదిద్దుతోంది. రాజధాని, తేజస్ ఎక్స్‌ప్రెస్‌లను తలదన్నేలా వీటి ఫీచర్లు ఉండనున్నాయి.
వందే భారత్‌లో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయట. వీటిలో 11 ఏసీ 3 టైర్, నాలుగు ఏసీ 2 టైర్, రెండు ఏసీ ఫస్ట్ కోచ్ ఉంటుంది. ఒకేసారి 823 మంది ప్రయాణికులు తరలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏసీ 3 టైర్‌లో 611, ఏసీ 2 టైర్‌లో 188 మంది, ఏసీ ఫస్ట్ క్లాస్‌లో 24 మంది ఉంటారు.
అత్యధికులు ప్రయాణించే ఏసీ 3 టైర్‌లో అత్యాధునిక సౌకర్యాలను సిద్ధం చేస్తున్నారు. వీటిల్లోని బెర్తుల్లో ఎక్స్ట్రా కుషన్ ఏర్పాటు చేస్తు్నారు. రాజధాని కంటే మెరుగ్గా బెర్తులను సిద్ధం చేస్తున్నారు.
కోచ్‌లో వాతావరణం కంటికి ఇంపుగా ఉండేలా క్రీమ్, పసుపు రంగులకు చెందిన వివిధ షేడ్స్‌ను వినియోగిస్తారు. అప్పర్, మిడిల్ బెర్తులను ఎక్కేందుకు మరింత అనువైన నిచ్చెనను డిజైన్ చేశారు.
కోచ్‌లో వాతావరణం కంటికి ఇంపుగా ఉండేలా క్రీమ్, పసుపు రంగులకు చెందిన వివిధ షేడ్స్‌ను వినియోగిస్తారు. అప్పర్, మిడిల్ బెర్తులను ఎక్కేందుకు మరింత అనువైన నిచ్చెనను డిజైన్ చేశారు.
రైల్లో అంతటా సెన్సార్ ఆధారిత లైట్లను ఏర్పాటు చేస్తారు. విద్యుత్ తక్కువగా వినియోగిస్తూ రాత్రుళ్లు కావాల్సినంత వెలుతురును అందించేలా లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. సులువుగా నడిచేందుకు వీలుగా రైలు ఫ్లొర్‌లపై స్ట్రిప్స్‌ను కూడా వినియోగిస్తున్నారు.
సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు, శబ్ద కాలుష్యం తగ్గించేందుకు నాయిస్ ఇన్సులేషన్, సెలూన్ స్పేస్, దివ్యాంగులకు కూడా అనువుగా ఉంటే టాయిలెట్లను రైల్లో ఏర్పాటు చేస్తారు.
రైలు టాయిలెట్లలో దుర్వాసన రాకుండా ఉండే వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. మాడ్యులార్ ఫిట్టింగ్స్‌తో కూడిన బయో వ్యాక్యూమ్ టాయిలెట్స్ ఉంటాయి. నీరు చిందకుండా ఉండేందుకు వాష్ బెసిన్స్‌లో కూడా యాంటీ స్పిల్లేజ్ ఫీచర్లు ఉంటాయి.
ప్రయాణ అనుభవం మెరుగ్గా ఉండేలా ఇంటీరియర్స్‌ను అత్యాధునికంగా డిజైన్ చేస్తున్నారు. జీఎఫ్‌ఆర్‌పీ పానల్స్, పబ్లిక్ అనౌన్స్‌మెంట్ వ్యవస్థ, విసువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ వంటి అత్యాధునిక ఫీచర్లు జోడిస్తున్నారు.
ప్రయాణాల్లో కుదుపులు తక్కువగా ఉండేందుకు రైల్లో సెమీ పర్మెనెంట్ కప్లర్స్ వాడుతారు. దీంతో, ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారుతుంది.
కోచ్‌ల మధ్య ప్రయాణానికి వీలుగా పూర్తిగా మూసి ఉంచిన గ్యాంగ్‌వేస్‌ను డిజైన్ చేశారు. ఇది వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లోని వ్యవస్థ మాదిరిగానే ఉంటుంది.
ఇవి సెమీ హైస్పీడ్ రైళ్లు కావడంతో గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని రైల్వే శాఖ చెబుతోంది. అయితే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న నమూనా రైలును గరిష్ఠంగా 180 కిలోమీటర్ల వేగం వద్ద పరక్షిస్తారు. ఈ స్లీపర్ రైలు అందుబాటులోకి వచ్చాక రాత్రి ప్రయాణాల సమయం చాలా వరకూ తగ్గుతుందని రైల్వే శాఖ చెబుతోంది.
నల్లగొండ పార్లమెంట్‌లో వారి ఓట్లే అధికం.. ఆదరణ చూపితే గెలుపు ఈజీయేనా..?
నల్లగొండ పార్లమెంటు పరిధిలో రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు తమదంటే తమదని, లక్షల్లో మెజార్టీ సాధించడం ఖాయమని ఎవరికి వాళ్లు ధీమాతో చెబుతున్నాను. కానీ ఇక్కడ పురుషుల ఓట్ల కంటే మహిళా సంఖ్య అధికంగా ఉంది. మహిళల ఆదరణను బట్టి విజయం వరించే అవకాశం ఉంది.
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ. ఈ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓట్లు 1718954 ఉన్నాయి. అందులో పురుషులు 842247, మహిళలు 876538, ఇతరుల ఓట్లు 169 ఉన్నాయి.
దేవరకొండ నియోజకవర్గం లో 328 పోలీస్ స్టేషన్లు, పురుషులు ఓట్లు 131599, మహిళ ఓట్లు 130241, ఇతరులు 18ఓట్లు కాగా మొత్తంగా 261858 ఓట్లు ఉన్నాయి.
నాగార్జున సాగర్ అసెంబ్లీలో పోలింగ్ స్టేషన్‌లు 306, పురుషులు ఓట్లు 115545, మహిళా ఓటర్లు 120229, ఇతర ఓట్లు 21 ఉన్నాయి. మొత్తం ఓట్లు 235795 ఉన్నాయి.
మిర్యాలగూడలో పోలింగ్ స్టేషన్ లు 264, పురుషులు ఓట్లు 115352, మహిళా ఒట్లు 119956, ఇతరుల ఓట్లు 26 ఉండగా మొత్తంగా 235334 ఓట్లు ఉన్నాయి.
హుజుర్ నగర్ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్ లు ఉన్నాయి. పురుషులు ఓట్లు 120556, మహిళా ఓటర్లు 127109, ఇతరుల ఓట్లు 57 ఉండగా మొత్తం 247722 ఓట్లున్నాయి.
కోదాడ నియోజకవర్గంలో 296 పోలింగ్ స్టేషన్ లు ఉండగా, పురుషులు ఓట్లు 121390, మహిళా ఓట్లు128692, ఇతరుల ఓట్లు 17 కాగా మొత్తం 250099 ఓట్లున్నాయి..
సూర్యా పేట నియోజకవర్గంలో 271 పోలింగ్ స్టేషన్‌లు, పురుషులు ఓట్లు 119295, మహిళా ఓట్లు 125889, ఇతరుల ఓట్లు 17ఉన్నా యి. మొత్తం ఓట్లు 245201 ఉన్నాయి.
నల్లగొండ నియోజకవర్గంలో పోలింగ్ స్టేషన్లు 288 ఉన్నాయి. పురుషులు ఓట్లు 118510, మహిళా ఓట్లు 124422, ఇతరుల ఓట్లు 13ఉన్నాయి. మొత్తం 242945 ఓట్లున్నాయి.
అధికంగా మహిళా ఓటర్లు..
నల్గొండ పార్లమెంట్ పరిధిలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.. నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 1718954 ఓట్లు ఉండగా అందులో పురుషులు 842247 ఓట్లు కాగా మహిళా ఓట్లు 876538 ఓట్లు ఉన్నాయి. అయితే మొత్తంగా మహిళా ఓట్లు 34291 అధికంగా ఉన్నాయి. మొత్తం ఏడు నియోజకవర్గాలలో దేవరకొండ నియోజకవర్గం తప్ప మిగతా ఆరింటిలోనూ మహిళా ఓట్లే అధికం. ఇది ఇలా ఉంటే 2019 ఎన్నికలలో నల్గొండ పార్లమెంట్ పరిధిలో 15,85,980 లక్షల ఓట్లు ఉండేవి.. అయితే ప్రస్తుత ఎన్నికలకు అదనంగా 1,32,974 ఓట్లు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పెరిగిన ఓట్లలో కూడా దాదాపు 50%శాతం మహిళల ఓట్లే ఉన్నట్లు తెలుస్తోంది.
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లోనే
నేడు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. ఈ జిల్లాల్లోనే
తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, భువనగిరి, కామారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది.
అలాగే ఏపీలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, ప్రకాశం జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు..?
- త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ
- కాంగ్రెస్‌లో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- మంత్రి కోమటిరెడ్డి కీలక కామెంట్స్
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది. ఆ తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. 20 మందికి పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ నేతలు పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు.
తాజాగా.. రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు చెప్పారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ అయిందిన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందన్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానుండగా.. జూన్ 5న 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరనున్నట్లు కోమటిరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ఆరుగురు నామినేషన్ కంటే ముందు తనను సంప్రదించారని మరో బాంబ్ పేల్చారు.
కాంగ్రెస్‌లో ఏక్‌నాథ్ షిందేలు ఎవరూ లేరని.. మరో పదేళ్ల పాటు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని చెప్పారు. త్వరలో నియోజకవర్గాల డీలిమిటేషన్ ఉంటుందని.. తెలంగాణ అసెంబ్లీ సీట్ల సంఖ్య 154కు పెరుగుతుందని చెప్పారు. డీలిమిటేషన్ తర్వాత 154 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు గెలుచుకుంటుందని జోష్యం చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావటంపైనా కోమటిరెడ్డి స్పందించారు. ఆమె తెలంగాణ పరువు తీస్తున్నారని ఫైరయ్యారు.
త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారని.. జూన్ 5న వారు హస్తం గూటికి చేరనున్నట్లు వెల్లడించారు. డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్య 154కు చేరుకుంటుందని... ఇందులో 125 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
అమ్మ ఆశీర్వాదం లేకుండా మొదటిసారి ఎన్నికల్లో మోడీ !
- మోదీ ఆరడుగుల బుల్లెట్.. : బండి సంజయ్
- మోదీ తల్లి మరణాన్ని గుర్తుచేసిన బండి
- మనమందరం మోడీ కుటుంబీకులమే - బండి సంజయ్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కు మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) వేములవాడకు చేరుకున్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కు (BJP MP Candidate Bandi Sanjay) మద్దతుగా వేములవాడలో నిర్వహించిన బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేదికపై బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ మాట్లాడుతూ... కాశీ నుంచి మోదీ దక్షిణ కాశీకి వచ్చారన్నారు. వేములవాడకు ఇంత వరకు ఏ ప్రధానీ రాలేదని తెలిపారు.
కాంగ్రెస్ చవటల్లారా మోదీని విమర్శిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకే దేశం.. ఒకే విధానం ఉండాలన్నదే మోదీ లక్ష్యమని స్పష్టం చేశారు. రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించామన్నారు. నరేంద్ర మోదీ మేడ్ ఇన్ ఇండియా అని.. సోనియా, రాహుల్ ఏ దేశం వారో చెప్పాలని వ్యాఖ్యలు చేశారు.
మోదీ పక్కా లోకల్ అని అన్నారు. కాంగ్రెస్ అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి గాడిద గుడ్డు బాస్మాసుర అస్త్రమన్నారు. కాంగ్రెస్ పార్టీ హామీలు ఒక గాడిద గుడ్డు అంటూ సెటైర్ విసిరారు. ‘‘మీరు ఆరు గ్యారంటీల దొంగల బ్యాచ్’’ అని మోదీ ఆరడుగుల బుల్లెట్ అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు.
రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో చెప్పిన మోదీ !
వరంగల్ నగరానికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారన్నారు. అందులో ఒక ఎంపీ జంగారెడ్డి.. హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అహ్మదాబాద్ తన కర్మభూమి అని.. ఆ నగర దేవత భద్రకాళి అని చెప్పారు. అలాగే వరంగల్‌లో కూడా నగర దేవత భద్రకాళి అని మోదీ గుర్తు చేశారు. ఈ క్షేత్రం కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భద్రకాళి చరణాలకు ఈ సందర్బంగా మోదీ నమస్కారాలు తెలిపారు.
బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రం.. ఆ పార్టీకి ఏటీఎంగా మారుతుందని పేర్కొన్నారు. అందుకు జార్ఖండ్‌లో దొరికిన నగదే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని విమర్శించారు. ఆ నగదు ఎక్కుడకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఆ డబుల్ ఆర్ ట్యాక్స్‌లో ఒక ఆర్ హైదరాబాద్‌కు వెళ్లితే.. మరో ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని ఆరోపించారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి, అస్థిరత్వం ఉందని మోదీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇతరుల చేతిలోకి వెళ్ల కూడదని ఆయన స్పష్టం చేశారు. అందుకే దేశం అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటుందన్నారు. గతంలో దేశంలో వరుస బాంబు పేలుళ్ల జరిగేవన్నారు. కానీ ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్ జరిగిందని.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు.
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !
కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !
- కవితకు మళ్లీ చుక్కెదురు...
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ప్రస్తుతం జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న కవితకు.. కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. పైగా.. కవిత జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్న కోర్టు.. ఇప్పుడు మే 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని కూడా రౌజ్ ఎవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.
అయితే.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. జ్యుడీషల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహార్ జైల్‌లో ఉంచారు. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే.. ఏప్రిల్ 11వ తేదీన సీబీఐ అరెస్ట్ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు 2 కేసుల్లో కవిత బెయిల్ కేసం పిటిషన్లు వేస్తూ ఉంటే.. ఈడీ, సీబీఐ మాత్రం కస్టడీని పొడిగించాలని, బెయిల్ ఇవొద్దంటూ పిటిషన్లు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. న్యాయస్థానం కూడా ఈడీ, సీబీఐ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ నిరాకరించటమే కాకుండా కస్టడీని కూడా పొడిగిస్తూ వస్తోంది.
ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై ఈడీ, సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నాయి. ఇందుకు గానూ.. ఆప్‌కు కవిత రూ. 100 కోట్ల లంచం ఇచ్చారని అభియోగం మోపగా.. ఆ రూ.100 కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారంటూ వాధిస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్‌లో 33 శాతం వాటా దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. కాగా.. బెయిల్ ఇవ్వటం వల్ల.. సాక్ష్యాధారాలను కవిత తారుమారు చేసే అవకాశాలున్నాయంటూ న్యాయస్థానం ముందు అధికారులు వాధిస్తున్నారు.
ఈ వ్యవహారంలో ఇప్పటికే తాము పలు ఆధారాలు సేకరించామని.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని.. కవితను విచారిస్తే తమకు కావాల్సిన వివరాలు దొరుకుతాయంటూ అధికారులు చెప్తూ వస్తున్నారు. దీంతో.. అటు బెయిల్ దొరకట్లేదు.. ఇటు కస్టడీ కూడా పొడిగిస్తూ వస్తున్నారు.
అయితే.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కావాలనే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని.. ఇప్పుడు కూడా విచారణ పేరుతో కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు.. ఎన్నికలయ్యే వరకు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బెయిల్ రాకుండా.. కస్టడీని పొడిగిస్తూ.. కవితను జైలులోనే ఉండేలా చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.
తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ రిలీఫ్ !
- తగ్గనున్న భానుడి భగభగ
- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ ఐఎండి వెల్లడి
తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...
వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains) పడే అవకాశముందని హైదరాబాద్ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది.
నేడు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే.. ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి .
ఏపీలో ఇలా..!
విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది.
మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
వడగళ్ల వానలతో రైతులకు పంట నష్టమే !
అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో గాడ్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.
May 10 2024, 15:01