రాష్ట్రపతిగా ముర్మును ఎందుకు వ్యతిరేకించారో చెప్పిన మోదీ !
వరంగల్ నగరానికి బీజేపీతో మంచి అనుబంధం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారన్నారు. అందులో ఒక ఎంపీ జంగారెడ్డి.. హన్మకొండ నుంచి గెలుపొందారని మోదీ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అహ్మదాబాద్ తన కర్మభూమి అని.. ఆ నగర దేవత భద్రకాళి అని చెప్పారు. అలాగే వరంగల్‌లో కూడా నగర దేవత భద్రకాళి అని మోదీ గుర్తు చేశారు. ఈ క్షేత్రం కాకతీయ సామ్రాజ్య వైభవానికి ప్రతీక అని ఆయన అభివర్ణించారు. భద్రకాళి చరణాలకు ఈ సందర్బంగా మోదీ నమస్కారాలు తెలిపారు.
బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో ఏర్పాటు చేసి భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ఏ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే.. ఆ రాష్ట్రం.. ఆ పార్టీకి ఏటీఎంగా మారుతుందని పేర్కొన్నారు. అందుకు జార్ఖండ్‌లో దొరికిన నగదే అందుకు ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని విమర్శించారు. ఆ నగదు ఎక్కుడకు వెళ్తుందని ఆయన ప్రశ్నించారు. ఇక తెలంగాణలో ఆర్ ఆర్ ట్యాక్స్ ద్వారా ప్రజలను దోచుకుంటున్నారన్నారు. ఆ డబుల్ ఆర్ ట్యాక్స్‌లో ఒక ఆర్ హైదరాబాద్‌కు వెళ్లితే.. మరో ఆర్ ట్యాక్స్ ఢిల్లీకి వెళ్తుందని ఆరోపించారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో అశాంతి, అస్థిరత్వం ఉందని మోదీ తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం ఇతరుల చేతిలోకి వెళ్ల కూడదని ఆయన స్పష్టం చేశారు. అందుకే దేశం అబ్ కీ బార్ మోదీ సర్కార్ అంటుందన్నారు. గతంలో దేశంలో వరుస బాంబు పేలుళ్ల జరిగేవన్నారు. కానీ ఇప్పటి వరకు మూడు దశల్లో పోలింగ్ జరిగిందని.. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదని తెలిపారు.
May 08 2024, 15:24