కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !

కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ !

- కవితకు మళ్లీ చుక్కెదురు...

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత‌కు కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. ప్రస్తుతం జ్యుడీషియల్ ఖైదీగా తీహార్ జైలులో ఉన్న కవితకు.. కోర్టు బెయిల్ నిరాకరించిన విషయం తెలిసిందే. పైగా.. కవిత జ్యుడీషియల్‌ కస్టడీని కూడా రౌజ్‌ ఎవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇప్పటికే పలుమార్లు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ వస్తున్న కోర్టు.. ఇప్పుడు మే 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని కూడా రౌజ్‌ ఎవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది.

అయితే.. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేయగా.. జ్యుడీషల్ కస్టడీలో భాగంగా ఆమెను తీహార్ జైల్‌లో ఉంచారు. జ్యుడీషియల్ ఖైదీగా ఉన్న సమయంలోనే.. ఏప్రిల్‌ 11వ తేదీన సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత ప్రస్తుతం రిమాండ్‌లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు 2 కేసుల్లో కవిత బెయిల్ కేసం పిటిషన్లు వేస్తూ ఉంటే.. ఈడీ, సీబీఐ మాత్రం కస్టడీని పొడిగించాలని, బెయిల్ ఇవొద్దంటూ పిటిషన్లు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. న్యాయస్థానం కూడా ఈడీ, సీబీఐ అధికారుల వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ నిరాకరించటమే కాకుండా కస్టడీని కూడా పొడిగిస్తూ వస్తోంది.

ఢిల్లీ మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా తయారుచేయించి అక్రమార్జన చేశారని కవితపై ఈడీ, సీబీఐ అధికారులు ఆరోపిస్తున్నాయి. ఇందుకు గానూ.. ఆప్‌కు కవిత రూ. 100 కోట్ల లంచం ఇచ్చారని అభియోగం మోపగా.. ఆ రూ.100 కోట్ల లంచం సొమ్మును సౌత్ గ్రూప్ సిండికేట్ నుంచి కవిత వసూలు చేశారంటూ వాధిస్తున్నారు. పైసా పెట్టుబడి లేకుండానే కవిత ఇండోస్పిరిట్‌లో 33 శాతం వాటా దక్కించుకున్నారని ఆరోపిస్తున్నారు. కాగా.. బెయిల్ ఇవ్వటం వల్ల.. సాక్ష్యాధారాలను కవిత తారుమారు చేసే అవకాశాలున్నాయంటూ న్యాయస్థానం ముందు అధికారులు వాధిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఇప్పటికే తాము పలు ఆధారాలు సేకరించామని.. మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని.. కవితను విచారిస్తే తమకు కావాల్సిన వివరాలు దొరుకుతాయంటూ అధికారులు చెప్తూ వస్తున్నారు. దీంతో.. అటు బెయిల్ దొరకట్లేదు.. ఇటు కస్టడీ కూడా పొడిగిస్తూ వస్తున్నారు.

అయితే.. ఈ వ్యవహారంపై బీఆర్ఎస్ శ్రేణుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. కావాలనే.. ఎలాంటి ఆధారాలు లేకుండా కవితను రాజకీయ కక్షతోనే అరెస్టు చేశారని.. ఇప్పుడు కూడా విచారణ పేరుతో కస్టడీని పొడిగిస్తూ వస్తున్నారంటూ మండిపడుతున్నారు. మరోవైపు.. ఎన్నికలయ్యే వరకు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బెయిల్ రాకుండా.. కస్టడీని పొడిగిస్తూ.. కవితను జైలులోనే ఉండేలా చేస్తారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు.

తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ రిలీఫ్ !

- తగ్గనున్న భానుడి భగభగ

- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడతాయంటూ ఐఎండి వెల్లడి

తెలుగు రాష్ట్రాల ప్రజలకు భానుడి భగభగల నుంచి కాస్త ఉపశమనం లభించనుంది. వారం రోజులుగా ఎండ వేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనాలకు ఊరట దొరకనుంది...

వచ్చే మూడ్రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు (Rains) పడే అవకాశముందని హైదరాబాద్‌ (Hyderabad) వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో అన్ని జిల్లాల్లో సగటున 3 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు తగ్గుతాయని.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు మించకపోవచ్చని వివరించింది. 

నేడు నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనుమకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అలాగే.. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి . 

ఏపీలో ఇలా..!

విదర్భ నుంచి తమిళనాడు వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు ఏపీలో అనేక చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. అక్కడక్కడా భారీ వర్షాలు, అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు జల్లులు పడతాయని తెలిపింది. 

మన్యం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్‌, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొంది. ఇంకా గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.

వడగళ్ల వానలతో రైతులకు పంట నష్టమే !

అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. రాష్ట్రంలోని ఎండ తీవ్రత, వడగాడ్పుల ప్రభావం కొనసాగింది. ప్రధానంగా రాయలసీమలో ఎక్కువ ప్రాంతాల్లో గాడ్పులు వీచాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే నాలుగు నుంచి ఏడు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. 

కాగా, విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకూ కొనసాగుతున్న ఉపరితల ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో విస్తరించింది. ఇదే సమయంలో రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగడంతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. ఈ ప్రభావంతో సోమవారం ఉత్తరాంధ్రలో పలుచోట్ల ఈదురుగాలులు వీచాయి. అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.

అన్నా, చెల్లెళ్ళ సెంటిమెంట్ రిపీటవుతుందా ?

పార్లమెంటు ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధి, ప్రియాంకగాధీల సెంటిమెంటు కాంగ్రెస్ కు వర్కవుటవుతుందా ? ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాహుల్, ప్రియాంక విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఇద్దరు కూడా విడివిడిగా చెరో 15 సార్లు పర్యటించారు. పర్యటించిన ప్రతిసారి పార్టీ వీళ్ళతో తక్కువలో తక్కువ రెండ రెండు మూడు నియోజకవర్గాల్లో ప్రచారం చేయించింది. అనేక అంశాలకు తోడు వీళ్ళ ఆకర్షణ, ప్రచారం కూడా కలిసొచ్చే అవకాశం .

అందుకనే పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్, ప్రియాంకలతో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయిస్తోంది. ఇప్పటికే ఒక విడత అన్నా, చెల్లెళ్ళు ప్రచారం చేశారు.తుక్కుగూడలో జరిగిన భారీ బహిరంగసభలో రాహుల్ కాంగ్రెస్ జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేసి ఎన్నికల ప్రచారానికి శంఖారావం పూరించారు . ఈమధ్యనే నిర్మల్, గద్వాలలో జరిగిన బహిరంగసభల్లో పాల్గొన్నారు. 9వ తేదీన కరీంనగర్, కూకట్ పల్లి, సరూర్ నగర్ బహిరంగసభల్లో రాహుల్ పాల్గొంటున్నారు. అలాగే 10వ తేదీన కామారెడ్డి, షాద్ నగర్, తాండూరు బహిరంగసభల్లో పాల్గొననున్నారు . 11వ తేదీ సాయంత్రంతో ప్రచారం పూర్తయిపోతుంది కాబట్టి అవకాశం ఉంటే ఇద్దరితోను హైదరాబాద్ నగరంలో భారీ రోడ్ షోతో ఎన్నికల ప్రచారం ముగియనుంది . 

పార్టీ ఎన్నికల ప్రచారంలో గ్యారెంటీగా పార్టీ గెలుస్తుందని అనుకున్న నియోజకవర్గాల్లో అన్నా, చెల్లెళ్ళతో ప్రచారంచేయించలేదు. ప్రత్యర్ధుల నుండి టఫ్ ఫైట్ ఉండి, గెలుపు విషయంలో వెనకబడ్డామని అనుకున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఎక్కువ ప్రచారం చేయించింది

మొత్తంమీద రాహుల్, ప్రియాంక ప్రచారం వల్ల కాంగ్రెస్ అభ్యర్ధులు లబ్దిపొందుతారని, గెలుపు అవకాశాలు ఎడ్జిల ఉన్న చోట్ల గెలుపు గ్యారెంటీ అని పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

రేవంత్ రెడ్డి సర్కార్ కు ఎదురుదెబ్బ !

- బ్యాంక్ ఖాతాల్లో పడతాయనుకుంటే ట్విస్టు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రేవంత్ రెడ్డి (Anumula Revanth Reddy) ప్రభుత్వానికి ఈసీ షాక్ ఇచ్చింది. నిన్ననే ఐదెకరాల పైబడి వ్యవసాయ భూమి ఉన్న రైతులందరికీ పెట్టుబడి సాయం అందించేందుకు నిదులు విడుదల చేసినట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది. ఇంతలోనే.. రైతుభరోసా ప్రక్రియను ఆపేయాలంటూ ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారంటూ పేర్కొంది. పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఆదేశించింది.

రైతు భరోసా నిధుల (Rythu Bharosa Funds) విడుదలపై ఈసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. మే 13న లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ (Polling Day) ముగిసిన తర్వాతే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని.. అప్పటివరకు రైతు భరోసాను ఆపేయాలని రేవంత్ రెడ్డి సర్కారును ఆదేశించింది. రైతు భరోసా విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఎన్‌ వేణుకుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. రైతు భరోసా చెల్లింపులతో పాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల కమిషన్‌ సీఎం రేవంత్‌ రెడ్డి.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంది.

మరోవైపు.. ఐదు ఎకరాలు పైబడి వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులు విడుదల చేసినట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఈ మేరకు రైతుల ఖాతాల్లో నగదును జమ చేసే ప్రక్రియ కూడా చేపట్టింది. ఇందుకోసం.. 2 వేల కోట్లకు పైగా నిధులు సమీకరించి.. విడుదల చేసినట్టు పేర్కొంది. అంతేకాదు.. ఈ ప్రక్రియ 3 రోజుల్లోనే పూర్తవుతుందని కూడా అధికారులు భావించారు. కాగా.. ప్రస్తుతం ఈసీ ఇచ్చిన ఆదేశాలతో రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియకు బ్రేక్‌ పడింది.

అయితే.. రైతులకు పెట్టుబడి సాయం విషయంలో ప్రభుత్వంపై మాజీ సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. మే 9వ తేదీలోగా రైతులందరికీ రైతు భరోసా నిధువు విడుదల చేస్తామంటూ పలు ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఎన్నికల సభల్లో రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయటాన్ని కోడ్ ఉల్లంఘనగా భావించిన ఈసీ.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో రసవత్తరంగా లోక్ సభ ఎన్నికల ప్రచారం !*

- నేడు కరీంనగర్‌కు రాహుల్ గాంధీ, రేపు ప్రధాని మోదీ రాక, 9,10 తేదీల్లో కేసీఆర్ పర్యటనలు

పార్లమెంట్ ఎన్నికల వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అగ్రనేతలు క్యూ కట్టారు. వరుసగా కాంగ్రెస్, బిజేపి, బిఆర్ఎస్ నేతలు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలతో ప్రచారం చేస్తున్న అభ్యర్థులతోపాటు నాయకులు, ఆఖరి మోఖ అన్నట్లు అగ్రనేతల పర్యటనలు ఖరారయ్యారు.

మే 7న మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కరీంనగర్ లో జరిగే కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొంటారు. 8వ తేదీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొంటారు.

మే 9, 10 తేదీల్లో రెండురోజుల పాటు బస్సుయాత్రతో బిఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ రోడ్ తో కరీంనగర్, సిరిసిల్లలో ప్రచారం నిర్వహించనున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లలో ఆయా పార్టీల నాయకులు నిమగ్నమయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి ఐదు జన జాతర సభలు

ఎన్నికల ప్రచారంలో బాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని మూడు పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో నాలుగు జనజాతర సభలు నిర్వహించారు. మరోసభకు సిద్దమయ్యారు.

ఏప్రిల్ 30న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని జమ్మికుంటలో జనజాతర నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి మే 1న నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో జన జాతరతో ప్రచారం నిర్వహించారు.

3న పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలోని జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో, అదే రోజు రాత్రి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సిరిసిల్ల లో జన జాతర సభతో కేంద్రంలోని బిజేపి ప్రభుత్వతీరు, పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించిన కేసిఆర్ వైఖరి బిఆర్ఎస్ తీరును విమర్శించారు. మళ్ళీ రాహుల్ గాంధీతో కలిసి ఏడున మంగళవారం సాయంత్రం కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే జనజాతర సభలో పాల్గొంటున్నారు.

జగిత్యాల నుంచి జైత్రయాత్ర కు మోదీ శ్రీకారం

ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రచార శంఖారావం పూరించారు. మార్చి 18న జగిత్యాల లో కరీంనగర్ నిజామాబాద్, పెద్దపల్లి మూడు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన భారీ బహిరంగ సభతో సమరశంఖం పూరించారు.

ముగ్గురు అభ్యర్థులు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, గోమాసె శ్రీనివాస్ లను ప్రజలకు పరిచయం చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో కమలనాధులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్ సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడంతోపాటు అదనంగా పెద్దపల్లిలో సైతం కాషాయజెండా ఎగుర వేయాలని కసరత్తు చేస్తున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపి నడ్డా సోమవారం పెద్దపల్లిలో బహిరంగ సభ నిర్వహించారు. 8న మోదీ మరోసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని దక్షిణకాశీగా పేరొందిన వేములవాడకు చేరుకుని శ్రీరాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడ జరిగే ఎన్నికల ప్రచార సభలో పాలొంటారు.

...మరో రెండు రోజులు కేసిఆర్ పర్యటన …!

గులాబీ దళపతి కేసీఆర్ కు అచ్చోచ్చిన కలిసొచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే పార్లమెంట్ ఎన్నికల కదనభేరీ మ్రోగించారు. బస్సు యాత్రతో రోడ్ షోలు చేపట్టిన కేసిఆర్, నామినేషన్ ల ప్రక్రియ ముగియగానే ఇప్పటికే రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్రతో ప్రచారం నిర్వహించారు.

మే 2న జమ్మికుంటలో రోడ్ షో ఉండగా ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు నిషేధం విధించడంతో మే 3న రాత్రి 8 గంటల తర్వాత పెద్దపల్లి నియోజకవర్గంలోని గోదావరిఖనిలో రోడ్ షో తో ప్రచారం నిర్వహించారు. మరుసటి రోజు 4న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వీణవంకకు చేరుకుని రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు 5న హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలతో ఆత్మీయ సమ్మేళనంతో ప్రచారం సాగించారు.

చివరగా బస్సు యాత్రతో ఈనెల9న మళ్ళీ కరీంనగర్ కు చేరుకుని కరీంనగర్ లో రోడ్ షో తో ప్రచారం నిర్వహించి ఆ రోజు ఉత్తర తెలంగాణ భవన్ లో బస చేసి మరుసటి రోజు 10న సిరిసిల్లలో బస్సు యాత్రతో రోడ్ షో ద్వారా ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే రెండు రోజులు ప్రచారం చేసిన కేసిఆర్ మరో రెండు రోజులు ఆఖరి మోఖ గా ఉమ్మడి జిల్లాలో ప్రచారం సాగిస్తుండడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది.

పార్టీల అగ్రనేతలు వరుస కట్టి ఉమ్మడి జిల్లాలో పర్యటిస్తు ఎన్నికల ప్రచారం సాగిస్తుండడంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కీ రోల్ పోషిస్తుందనే ప్రచారం సాగుతుంది.

ఫోన్ ట్యాపింగ్ పై స్పందించిన మాజీ సీఎం కేసిఆర్

- ఫోన్ ట్యాపింగ్ ఆరోపణే కాదు

- ఆ వ్యవహారంతో మాకు సంబంధం లేదు

- మాజి సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ ప్రభుత్వం ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తుందని అనుకోలేదని మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామమన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అసలు ఆరోపణే కాదని ఆయన కొట్టి పడేశారు.

పార్లమెంట్ ఎన్నికల వేళ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా.. పలు పార్టీల నేతలు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాపింగ్ అయినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారానే ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాలు సాధించిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు (KCR) నిబంధనలకు విరుద్ధంగా ఫోన్లు ట్యాపింగ్ చేయించారని మండిపడుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులు అరెస్టు కాగా.. విచారణ కొనసాగుతోంది. ఇదే క్రమంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కీలక ప్రచార అస్త్రాలుగా మలుచుకున్నారు.

ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ సీఎం కేసీఆర్ స్పందించారు. ఓ ప్రముఖ మీడియా దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక కామెంట్స్ చేశారు. ప్రభుత్వానికి గూఢచారులుండడం, వారు నివేదికలివ్వడం అత్యంత సహజ పరిణామమని అన్నారు. సీఎం, ఇతర మంత్రుల చేతికి ఆ రిపోర్ట్‌లు వస్తాయని.. కానీ, వాళ్లు ట్యాపింగ్‌ చేశారా? లేదా? అనేది మాకేలా తెలుస్తుందని అన్నారు. అది తమ పరిధిలోకే రాదని.. ఫోన్‌ ట్యాపింగ్‌తో మాకేం సంబంధం? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత తెలివితక్కువగా ఆలోచిస్తుందని తాను అనుకోలేదని చెప్పారు.

తమ పదేళ్ల మా పాలనలో అద్భుతాలు సృష్టించామని.. ఐదు నెలల పాలనలోనే ప్రజల్ని కాంగ్రెస్‌ రాచిరంపాన పెట్టిందని మండిపడ్డారు. ఆ ప్రభావం పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా కనిపిస్తుందన్నారు. పార్లమెంట్ ఎన్నికలను రెఫరెండమన్న సీఎం రేవంత్ తోక ముడిచారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆ రెండు పార్టీలు ఒకటేనని చెప్పారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత తెలంగాణలో అనిశ్చితి వస్తుందని.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే కొలువుదీరనుందని అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని.. సంకీర్ణ ప్రభుత్వంలో తాము కీ రోల్ పోషిస్తామన్నారు.

ప్రధాని మోదీ వికృతరూపానికి ఢిల్లీ మద్యం కేసు నిదర్శనమని కేసీఆర్ ఫైరయ్యారు. ఆడబిడ్డ అని చూడకుండా అప్రజాస్వామికంగా, అరాచకంగా, క్రూరంగా తన కుమార్తె కవితను జైళ్లో పెట్టించారనన్నారు. మోదీ వికృత పాలనకు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు చరమగీతం పాడతారని జోష్యం చెప్పారు.

తెలుగు రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్.. భానుడి భగభగలు నుంచి ఉపశనం..

_ మరో రెండు రోజులు వర్షాలు..

భానుడు భగభగలు, ఎండ వేడి, వడగాల్పులు తో తెలుగు రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అత్యవసర పరిస్థితి అయితే తప్ప బయటకు వెళ్లవద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. మరో రెండు రోజుల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది.

ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది.

మరో వైపు తెలంగాణకు కూడా వర్ష సూచన ఉంది. తెలంగాణలో ఇవాళ్టి నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉద్యమ బిడ్డా పొన్నం ప్రభాకర్ ?

- ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

- మరో ఆరుగురికి మంత్రిగా ఛాన్స్

- ప్రజాదారణ పొందిన నేతగా మంత్రి పొన్నం కు మరో బాధ్యత

ఆనాటి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది. మంత్రి అయ్యానని తనను ఒదిలేయొద్దని.. తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం గతంలో చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాననని.. ఐదేళ్లు ఛైర్మన్‌గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశరు. 7 వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి .

మొన్న జరిగిన అసెంబ్లీలో ఉద్యమ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ నేతలకు మాటకు మాట ఇస్తూ గర్జించారు డిప్యూటీ సీఎం గా పొన్నం ప్రభాకర్ కే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది రాష్ట్రంలోనే ప్రజాదారణ పొందిన ముఖ్య నేతగా పెప్పర్ స్ప్రే తో కూడా ఉద్యమాన్ని ఆపని నేతగా పార్టీలో అన్ని రంగాలలో ఉంటూ ఇన్నేళ్లు కష్టపడ్డా పొన్నం ప్రభాకర్ కే పదవి ఇవ్వాలని కరీంనగర్ జిల్లా నేతలు కోరుకుంటున్నారు .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మరికొన్ని మంత్రి పదవులను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు అయితే మరో ఆరుగురికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది అయితే దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో

- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో

- అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ

- బిజెపి కెసిఆర్ చేసిన తప్పుల పై విజయ డంకా మోగిస్తూ ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో రూపొందించిన తెలంగాణ మేనిఫెస్టోని నేడు గాంధీభవన్‌లో విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన జాతీయ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలో స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విభజన హామీలు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర విశ్వవిద్యాలయాలను ఇందులో చేర్చారు.

తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు ఇవే..

- ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పక్కనుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు.

- హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్ పునఃప్రారంభం.

- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా

- నూతన ఎయిర్ పోర్టుల ఏర్పాటు

- నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు

- రామగుండం- మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు

- కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు

- నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు

- జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు

- నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు

- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటు

- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటు

- భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు

- నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు

- అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు

- 73 & 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ

- ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు

- హైదరాబాద్- బెంగళూరు ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ - నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు డ్రై పోర్టు ఏర్పాటు

- హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు

- అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం

- మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గతానికి భిన్నంగా జాతీయ మేనిఫెస్టో, ప్రాంతీయ మేనిఫెస్టో విడుదల చేసింది. అధికారంలో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా రాష్ట్రానికి మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది.

ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి... రాహుల్ కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం

భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగ్గా, ఇప్పుడు ఐదు దశల్లో ఓటింగ్ జరగనుంది. భారత్‌లో జరుగుతున్న ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇప్పుడు మాజీ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలలో ప్రవేశించాడు. గ్యారీ కాస్పరోవ్ తన పోస్ట్‌లలో ఒకదానితో ప్రజలను ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి, లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పరోక్షంగా ఆయన విరుచుకుపడ్డారు మరియు మొదట రాయ్‌బరేలీ స్థానాన్ని గెలవాలని కోరారు.

శుక్రవారం మాజీ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీని సరదాగా ట్రోల్ చేశాడు. "అత్యున్నత స్థాయికి సవాలు చేయాలంటే మీరు రాయ్‌బరేలీలో విజయం సాధించాలని సాంప్రదాయవాదులు అంటున్నారు" అని కాస్పరోవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పై స్థాయి నుంచి కాస్పరోవ్ పరోక్ష ప్రస్తావన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఉంది.

రాయ్‌బరేలీ స్థానానికి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీని 'రాజకీయాలు మరియు చదరంగంలో అనుభవజ్ఞుడైన ఆటగాడు' అని అభివర్ణించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పదవికి సంబంధించి ఆయన ఈ విధంగా స్పందించారు.

నిజానికి, కాంగ్రెస్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్‌లో చెస్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, గాంధీ కాస్పరోవ్‌ను తన అభిమాన చెస్ ప్లేయర్‌గా అభివర్ణించాడు మరియు దీనితో పాటుగా, అతను రాజకీయ నాయకులలో అత్యుత్తమ చెస్ ప్లేయర్‌గా కూడా పేర్కొన్నాడు. అతని ఇదే వీడియోపై, జర్నలిస్ట్-రచయిత సందీప్ ఘోష్ సోషల్ మీడియాలో ఇలా వ్రాశారు, కృతజ్ఞతగా కాస్పరోవ్ మరియు విశ్వనాథన్ ఆనంద్ త్వరగా పదవీ విరమణ చేశారు మరియు వారు మన కాలంలోని గొప్ప చెస్ మేధావిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఘోష్ ఈ పోస్ట్‌లో కాస్పరోవ్ మరియు ఆనంద్‌లను కూడా ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కాస్పరోవ్ ఈ విధంగా పోస్ట్ చేశారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు వెళ్లిన తర్వాత రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయిందని మీకు తెలియజేద్దాం. దీని తర్వాత, శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ కూడా అయిన శుక్రవారం నాడు ఆయన మళ్లీ రాయ్ బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్సీ దినేష్‌ ప్రతాప్‌సింగ్‌తో రాహుల్‌ పోటీ చేస్తున్నారు.