భువనగిరి పార్లమెంటు సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీర్ ని గెలిపించండి : సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పిలుపు


నిరంతరం ప్రజల తరఫున, కూలీల, రైతుల తరుపున నిలబడుతూ సమస్యల పరిష్కారానికై , వారి హక్కుల కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ ని గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. మంగళవారం భువనగిరి మండల పరిధిలోని అనాజిపురం గ్రామంలో సిపిఎం అభ్యర్థి గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా గ్రామంలో పనిచెస్తున్న ఉపాధి హామీ పని ప్రదేశాన్ని దగ్గరికి వెల్లి కూలీల దగ్గర ప్రచారం నిర్వహించడం ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ సిపిఎం వ్యవసాయ కార్మిక సంఘం పోరాట ఫలితంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి ఆమె చట్టం వచ్చిందని అన్నారు. నేడు బిజెపి 10 సంవత్సరాల పాలనలో ఉపాధి హామీ పథకంకు ప్రతి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ చట్టాన్ని ఎత్తివేయాలని కుట్రలు బిజెపి ప్రభుత్వం చేస్తున్నది వారు విమర్శించారు. కొన్ని జిల్లాలకి పని చూపాలని, కూలీల సంఖ్యను తగ్గించాలని, పని దినాలు వేతనాలు తగ్గించాలని ప్రయత్నం చేస్తుందని అన్నారు. చట్టంలో ఉన్న మౌలిక సమస్యలు కూడా అమలు చేయడం లేదని ఆవేదన వెలుబుచ్చారు. కొత్త కొత్త జీవోలు తెచ్చి కూలీలను అయోమయంలో నెడుతున్నారని సరిగా బిల్లులు విడుదల చేయకపోవడం, రెండుసార్ల ఫోటో తీసే విధానం, బ్యాంకుకు ఆధార్ లింకు ఇలాంటివి కూలీల పోట్టగొట్టే విధంగా బిజెపి తీసుకొస్తున్న విధానాలు ఉన్నాయని అన్నారు. కూలీలంతా బిజెపిని ఓడించకపోతే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉండదని అందుకే పోరాడే సిపిఎంను గెలిపించాలని నరసింహ కూలీలను కోరినారు. మరో పక్క బీజేపీ అధికారంలో వచ్చినాకనే ధరలు పెరిగి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ శక్తులకు కారు చౌకగా అమ్ముతున్నారని ఇలాంటి బీజేపీని మళ్లీ అధికారంలో రాకుండా ప్రజలందరూ చూడాలని కోరినారు. నిరంతరం కూలీల కోసం రైతుల కోసం పేదల కోసం ఈ ప్రాంతం తాగు తాగునీరు విద్యా వైద్యం అభివృద్ధి కోసం పోరాడుతున్న సిపిఎం అభ్యర్థి ఎండి. జహంగీర్ సుత్తి కొడవల నక్షత్రం గుర్తుపైన అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ ప్రజలను కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు ఎదునూరి మల్లేశం, పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు కొండాపురం యాదగిరి, గ్రామ కమిటీ కార్యదర్శి అబ్దుల్లాపురం వెంకటేష్, శాఖ కార్యదర్శి ఏదునూరి వెంకటేష్, నాయకులు ఎండి. జహంగీర్, బొల్లెపల్లి కిషన్, పాండు, నర్సింహ, బొల్లెపల్లి పరమేష్, కళ్లెం లక్ష్మీ, నరసయ్య, మైలారం శివ, తోటకూరి మల్లేష్ ,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి హామీ చట్ట రక్షణకై పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓటేయండి: నారీ ఐలయ్య వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి


మోడీ అధికారంలోకొస్తే ఉపాధి హామీ చట్టం రద్దు చేపడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య తెలిపారు ఈరోజు మండలంలోని గోకారం గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించి ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్మికులను ఉద్దేశించే మాట్లాడుతూ అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం నిధులు కుదిస్తూ చట్టాన్ని నీరుగారిచే పద్ధతుల్లో వ్య వరిస్తూ ఉపాధి హామీ చట్టం లేకుండా చేయడం కోసం అనేక మార్పులు చేర్పులు ఉపాధి హామీలో తీసుకురావడం జరిగిందజరిగిందని కేంద్ర బడ్జెట్లో నిధులు తగ్గించడం మూలంగా ఉపాధి కార్మికులు పనిచేసిన వాటికి పెద్ద ఎత్తున బకాయిలు పేరుకు పోయాయని గత సంవత్సరం తో పాటు ఈ సంవత్సరం పనిచేసిన కార్మికులకు ఆరేడు వారాల బిల్లులు రాకపోవడం మూలంగా కూలీలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని తెలియజేశారు. ఈ చట్టం నిలబడాలంటే తిరిగి పార్లమెంట్లో వామపక్ష ఎంపీల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని అందుకోసమే వ్యవసాయ కార్మికులంతా భువనగిరి పార్లమెంట్ సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు పనిచేసే చోట నీడ నీరు ప్రైమరీ చికిత్స కోసం మెడికల్ కిట్టు ఏర్పాటు చేయాలని గ్రామ పంచాయతీలకు అనుమతిస్తూ 18 94 జీవోను తీసుకురావడం అని జరిగింది కానీ పని చేసే చోట ఎక్కడ కూడా కనీస సౌకర్యాలు కల్పించడం లేదు కాబట్టి పంచాయతీ కార్యదర్శుల మీద చర్య తీసుకోవలసిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రభుత్వం ఏప్రిల్ ఒకటి నుండి 300 రూపాయలు కూలీనిచ్చే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కానీ ఎర్రటెండాలో పనిచేస్తున్న కూలీలకు 100,150 కి మించి రావటం లేదని కరువును తీవ్రమైన ఎండలను దృష్టిలో పెట్టుకొని చట్టం వచ్చినటువంటి నేటి వరకు రెగ్యులర్ గా పని చేస్తున్న కార్మికులకు కొలతలు లేకుండా 300 రూపాయల కూలీని అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్ సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్,నాయకులు నారి రామస్వామి, నారి జంగయ్య,కొమ్ము ముత్తయ్య,శనిగారపు నరిసింహ, తదితరులు పాల్గొన్నారు.
క్షత గాత్రుని తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

భువనగిరిఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రచారం మధ్యలోనే ఆపి క్షత గాత్రుడిని తన సొంత వాహనంలో ఆసుపత్రి కి చేర్చి మానవత్వం చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం  చొక్లా తండా గుర్రాల దండి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ భువనగిరి పట్టణంలోని ఆర్బి నగర్ చౌరస్తాలో మూర్చ వ్యాధితో ద్విచక్ర వాహనం నుండి పడిపోవడంతో ప్రచారంలో భాగంగా అక్కడికి విచ్చేసిన స్థానిక ఎమ్మెల్యే శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాధితున్ని వెంటనే తన సొంత వాహనంలో భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా ఏరియా ఆసుపత్రి పర్యవేక్షణ అధికారి చిన్న నాయక్ ను పిలిపించి బాధితుని ఆరోగ్య పరిస్థితి పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు.
వెలువర్తి గ్రామం లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వెలువర్తి లో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వలిగొండ పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు .మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, భద్రతపై ప్రజలకు భరోస కల్పించారు.

వలిగొండ మండల టాపర్స్ కి సన్మానం, పురస్కారాలను అందజేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని గాయత్రి హై స్కూల్ లో గాంధీ గ్లోబల్ జ్ఞాన ప్రతిష్ట వారి సౌజన్యంతో మండల కన్వీనర్ పాలకూర వెంకటేశం సమక్షంలో మండలంలోని అన్ని పాఠశాల టాపర్ లకు ఘన సన్మానం చేశారు .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గాంధీ గ్లోబల్ చైర్మన్ గున్న రాజేందర్ రెడ్డి ,కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, స్కూల్ చైర్మన్ నరహరి , వాకిటి రామిరెడ్డి ,కాసుల వెంకటేశం, వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



మహిళల T20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల

మహిళల టి20 వరల్డ్ కప్- 2024 షెడ్యూల్‌ను విడు దల చేసింది ఐసిసి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభంకానున్న ఈ మెగాటోర్నీకి బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. మొత్తం 10 జట్లు పోటీపడ నుండగా వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో అయిదు జట్లు ఉన్నాయి. గ్రూప్-ఏలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, న్యూజిలాండ్, క్వా లిఫయిర్-1 జట్లు ఉన్నాయి. గ్రూప్-బిలో ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, క్వాలిఫయర్ 2 జట్లు ఉన్నాయి. గ్రూప్ దశలో ప్రతి జట్టు మిగిలిన జట్లతో ఒక్కో మ్యాచ్‌లో తలపడతాయి. గ్రూప్ ద శలో టాప్‌లో తొలి రెండు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సిల్హె ట్ వేదికగా అక్టోబర్ 17న తొలి సెమీఫైనల్ జరుగనుండగా ఢాకా వే దికగా అక్టోబర్ 18న రెండో సెమీస్ జరగనుంది. ఇక ఢాకా వేదికగా అక్టోబర్ 20న ఫైనల్ మ్యాచ్ నిర్వ హించనున్నారు. ప్రారంభ మ్యాచ్ లో ఇంగ్లండ్ -సౌతా ఫ్రికా జట్లు తలపడతాయి. ఇక భారత్ అన్ని గ్రూప్ మ్యాచ్‌లు సిల్హెట్‌లోనే ఆడనుంది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌ తో తొలి మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 6న పాకిస్థాన్‌తో, 9న క్వాలిఫయిర్-1 టీమ్‌తో, 13వ తేదీన ఆస్ట్రేలియాతో భారత్ తలపనుంది.

ఎన్నికల నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలి: జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ హనుమంతు కే జండగె


ఎన్నికల  నిర్వహణలో భాగంగా రాజకీయ ప్రకటనలు, (పెయిడ్ న్యూస్) చెల్లింపు వార్తల పట్ల నిశితంగా పరిశీలించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కే. జండగే మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు సూచించారు. సోమవారం నాడు కాన్ఫరెన్స్ హలులో ఆయన సభ్యులతో సమావేశమైనారు. ఎన్నికల ప్రవర్తనా నియావళిని పకడ్బందీగా అమలు చేయడంలో భాగంగా వివిధ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే ప్రకటనలను పరిశీలించాలని, ఓటరుపై ప్రభావితం చేసే వార్తల పట్ల అప్రమతంగా ఉండాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్, లోకల్ కేబుల్ ఛానల్స్, సోషల్ మీడియా, వాట్సప్, ఈ పేపర్లలో రాజకీయ ప్రకటనలు మానిటరింగ్ చేయాలని, అనుమతి లేకుండా ప్రకటనలు ప్రసారం చేస్తే రిటర్నింగ్ అధికారికి తెలిపి నోటీస్ జారీ చేయాలని అన్నారు. ప్రచారం కొరకు అవసరమయ్యే అనుమతులను పరిశీలించి జారీ చేయాలని, వివిధ వార్తాపత్రికలు, టెలివిజన్, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే చెల్లింపు వార్తలు, రాజకీయ ప్రకటనలను తనిఖీ చేయడంతో పాటు ప్రసారాలు, ప్రకటనలు వచ్చినట్లయితే వాటికి అయ్యే ఖర్చులు ఎక్స్పెండీచర్ అబ్జర్వర్ కు పంపాలని, సంబంధిత నివేదికలను ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. సమావేశంలో మెంబర్ సెక్రెటరీ, జిల్లా సంబంధాల అధికారి పి. వెంకటేశ్వర రావు, సోషల్ మీడియా నోడల్ అధికారి, జిల్లా ఉపాధి కల్పన అధికారి సాహితి, కమిటీ సభ్యులు జి.దయాకర్, కె.శ్రీనివాస్, ఎ.శ్రవణ్, పాల్గొన్నారు.

గోకారంలో బిఆర్ఎస్ విస్తృత ప్రచారం
వలిగొండ మండలం గోకారం గ్రామంలో బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్ అన్న గెలుపు కోసం ఉపాధి హామీ కూలీలను కలవడం జరిగింది కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి మొగుళ్ళ శ్రీనివాస్ , గ్రామ శాఖ అధ్యక్షులు కనికరపు రాము, పాల్గొన్నారు.

చౌటుప్పల్ లో బిజెపి భారీ బహిరంగ సభలో పాల్గొన్న బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా



యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ జనసభ కు ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి జాతీయ అద్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికిన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బిజెపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు* భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ పట్టణ పరిధిలోని ముసుగు మధుసూదన్ రెడ్డి కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ముఖ్య అతిథిగా బిజెపి జాతీయ అధ్యక్షులు *శ్రీ జేపీ నడ్డా గారతో* కలిసి హాజరైన భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత బీజేపీ ఎంపీ అభ్యర్థి *డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు* ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలుకానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కోడి గుడ్డుకు గాడిద గుడ్డుకు తేడా తెలియని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను రైతు రుణమాఫీ, రైతుబంధు, ఆసరా పింఛన్లు, మహిళలకు 2500 రూపాయలు, కళ్యాణ లక్మి లక్ష రూపాయల తులం బంగారం, ఇందిరమ్మ ఇండ్లు,విద్యార్దులకు స్కూటీలు, ఇవ్వకుండా ప్రజలను మోసగిస్తున్న మీకు ప్రజలను ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. ఈ సందర్భంగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మాట్లాడుతూ ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి చెందాలంటే 3వ సారి మోడీ గారిని ప్రధాని గారు చూడాలని అన్నారు. మోడీ గారి నాయకత్వంలో మన భువనగిరి బీజేపి ఎంపీ అభ్యర్థి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ గారు ఎయిమ్స్ తీసుకొచ్చి, మాతా శిశు హాస్పిటల్, జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్ రైళ్ళు, ప్రతిపక్షంలో బిఆర్ఎస్ లో ఉన్నా సరే భువనగిరి పార్లమెంటుకు ఎన్నో నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారని అన్నారు. మంచి సౌమ్యుడు ఒక డాక్టర్ మీ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి బూర నర్సయ్య గౌడ్ గారి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు రాష్ట్ర నాయకులు మండలం మరియు జిల్లా, మండల గ్రామ బూత్ నాయకులు పాల్గొన్నారు.


పేదల కోసం పోరాడే జహంగీర్ ను ఎంపీగా గెలిపించండి: నారీ ఐలయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు


నిరంతరం పేదలు,వ్యవసాయ కార్మికులు,రైతుల సమస్యలపై పోరాడే సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు సోమవారం రోజున మండల పరిధిలోని వర్కట్ పల్లి గ్రామంలో సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ గెలుపును కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం రైతులు,వ్యవసాయ కూలీలు, కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిపిఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో జహంగీర్ గెలిస్తే ఈ ప్రాంతంలో ఉన్న త్రిబుల్ ఆర్ బాధితుల సమస్యను పరిష్కారం చేయడానికి కృషి చేస్తారని పార్లమెంట్ వేదికగా అలైన్మెంట్ మార్పు కోసం పోరాడుతారని తెలిపారు ఇప్పటిదాకా జరిగిన అనేక ఆందోళనలో సిపిఎం పార్టీ అగ్ర భాగాన నిలిచిందని భవిష్యత్తులో జహంగీర్ గెలిస్తే ప్రజలకు భువనగిరి కేంద్రంగా అందుబాటులో ఉంటారని తెలిపారు డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ అధిపతులు గెలవడం ద్వారా ప్రజలకు మరిన్ని కష్టాలు తప్ప ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం జరగదన్నారు ధరల పెరుగుదలను నియంత్రించాలంటే పార్లమెంట్ వేదికగా పోరాడే వారు కావాలని,ఉపాది హామీ పథకం చట్ట రక్షణ కోసం పోరాడే సిపిఎం అభ్యర్థి జహంగీర్ కు అవకాశం ఇచ్చి ఎన్నికల్లో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజు మండల కార్యదర్శి సిర్పంగి స్వామి శాఖ కార్యదర్శి మెట్టు రవీందర్ రెడ్డి నాయకులు గూడూరు బుచ్చిరెడ్డి చేగూరి రాములు ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వేముల జ్యోతిబసు తదితరులు పాల్గొన్నారు.