నిజంనిప్పులాంటిది

May 04 2024, 18:39

తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉద్యమ బిడ్డా పొన్నం ప్రభాకర్ ?

- ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి

- మరో ఆరుగురికి మంత్రిగా ఛాన్స్

- ప్రజాదారణ పొందిన నేతగా మంత్రి పొన్నం కు మరో బాధ్యత

ఆనాటి జ్ఞాపకాలను మనం గుర్తు చేసుకుంటే మంత్రి పొన్నం ప్రభాకర్ కో ఆపరేటివ్ నుంచి విద్యార్థి నాయకుడుగా ప్రారంభమైన తన ప్రస్థానం.. మంత్రి వరకు కొనసాగింది. మంత్రి అయ్యానని తనను ఒదిలేయొద్దని.. తాను ఎప్పటికీ తమ్ముడినేనంటూ పొన్నం గతంలో చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ అతి చిన్న వయసులోనే మార్కెట్ కమిటీ ఛైర్మన్ అయ్యాననని.. ఐదేళ్లు ఛైర్మన్‌గా చేశానని పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు. ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలన్నారు. పార్టీ అధికారంలోకి రావడంతో తాము సీనియర్లుగా ఉండడం వల్ల తనకు మంత్రిగా అవకాశం వచ్చింది. ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశరు. 7 వ తేదీన ప్రభుత్వం ఏర్పడితే.. 9వ తేదీనే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. ఫ్రీ టికెట్ ద్వారా ఇప్పటి వరకు 7 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని మంత్రి .

మొన్న జరిగిన అసెంబ్లీలో ఉద్యమ బిడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ టిఆర్ఎస్ నేతలకు మాటకు మాట ఇస్తూ గర్జించారు డిప్యూటీ సీఎం గా పొన్నం ప్రభాకర్ కే ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తెలుస్తుంది రాష్ట్రంలోనే ప్రజాదారణ పొందిన ముఖ్య నేతగా పెప్పర్ స్ప్రే తో కూడా ఉద్యమాన్ని ఆపని నేతగా పార్టీలో అన్ని రంగాలలో ఉంటూ ఇన్నేళ్లు కష్టపడ్డా పొన్నం ప్రభాకర్ కే పదవి ఇవ్వాలని కరీంనగర్ జిల్లా నేతలు కోరుకుంటున్నారు .

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ లో పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి మరికొన్ని మంత్రి పదవులను ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ప్రస్తుతం 11 మంది మంత్రులుగా కొనసాగుతున్నారు అయితే మరో ఆరుగురికి మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉంది అయితే దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

నిజంనిప్పులాంటిది

May 04 2024, 12:38

ఆసక్తికరంగా మారిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో

- లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో

- అన్ని స్థానాల్లో గెలుస్తామంటూ పెద్దలకు ముఖ్యమంత్రి రేవంత్ హామీ

- బిజెపి కెసిఆర్ చేసిన తప్పుల పై విజయ డంకా మోగిస్తూ ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణకు స్పెషల్ మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్‌తో పాటు తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలతో రూపొందించిన తెలంగాణ మేనిఫెస్టోని నేడు గాంధీభవన్‌లో విడుదల చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు మేనిఫెస్టోను విడుదల చేశారు. యువత, మహిళలే లక్ష్యంగా చేసుకుని రూపొందించిన జాతీయ మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో పాటు 25 గ్యారంటీలను హస్తం పార్టీ చేర్చింది. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోలో స్థానిక అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు. విభజన హామీలు, రైల్వే ప్రాజెక్టులు, కేంద్ర విశ్వవిద్యాలయాలను ఇందులో చేర్చారు.

తెలంగాణ ప్రజలకు ప్రత్యేక హామీలు ఇవే..

- ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం.. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, హైదరాబాదులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM), హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి పక్కనుంచి రాపిడ్ (వేగవంతమైన) రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు.

- హైదరాబాద్ మహానగరానికి బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ITIR) ప్రాజెక్ట్ పునఃప్రారంభం.

- పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకి జాతీయ హోదా

- నూతన ఎయిర్ పోర్టుల ఏర్పాటు

- నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాదులో ఏర్పాటు

- రామగుండం- మణుగూరు నూతన రైల్వే లైన్ ఏర్పాటు

- కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు

- నవోదయ విద్యాలయాల సంఖ్య రెట్టింపు

- జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు

- నాలుగు నూతన సైనిక పాఠశాలల ఏర్పాటు

- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ఏర్పాటు

- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్‌టీ) ఏర్పాటు

- భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్ఐ) క్యాంపస్ ఏర్పాటు

- నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు

- అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు

- 73 & 74 వ రాజ్యాంగ సవరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ

- ప్రతి ఇంటికి సౌర శక్తితో కూడిన సొంత విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ ఏర్పాటు

- హైదరాబాద్- బెంగళూరు ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ - నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ నుంచి నల్గొండ మీదుగా మిర్యాలగూడ ఇండస్ట్రియల్ కారిడార్, సింగరేణి పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు డ్రై పోర్టు ఏర్పాటు

- హైదరాబాదులో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు

- అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం

- మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ గతానికి భిన్నంగా జాతీయ మేనిఫెస్టో, ప్రాంతీయ మేనిఫెస్టో విడుదల చేసింది. అధికారంలో ఉన్న తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రత్యేకంగా రాష్ట్రానికి మేనిఫెస్టో రూపొందించింది. జాతీయ స్థాయిలో ప్రకటించిన ఐదు న్యాయాలతోపాటు 23 అంశాలతో తెలంగాణకు ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది.

నిజంనిప్పులాంటిది

May 04 2024, 11:30

ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి... రాహుల్ కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం

భారతదేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు దశల్లో జరగనున్న ఎన్నికల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగ్గా, ఇప్పుడు ఐదు దశల్లో ఓటింగ్ జరగనుంది. భారత్‌లో జరుగుతున్న ఎన్నికలపై యావత్ ప్రపంచం దృష్టి సారిస్తోంది. ఇప్పుడు మాజీ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ భారతదేశంలో జరుగుతున్న ఎన్నికలలో ప్రవేశించాడు. గ్యారీ కాస్పరోవ్ తన పోస్ట్‌లలో ఒకదానితో ప్రజలను ఆశ్చర్యపరిచారు. వాస్తవానికి, లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీపై పరోక్షంగా ఆయన విరుచుకుపడ్డారు మరియు మొదట రాయ్‌బరేలీ స్థానాన్ని గెలవాలని కోరారు.

శుక్రవారం మాజీ చెస్ ఛాంపియన్ గ్యారీ కాస్పరోవ్ రాహుల్ గాంధీని సరదాగా ట్రోల్ చేశాడు. "అత్యున్నత స్థాయికి సవాలు చేయాలంటే మీరు రాయ్‌బరేలీలో విజయం సాధించాలని సాంప్రదాయవాదులు అంటున్నారు" అని కాస్పరోవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పై స్థాయి నుంచి కాస్పరోవ్ పరోక్ష ప్రస్తావన ప్రధానమంత్రి నరేంద్ర మోదీపైనే ఉంది.

రాయ్‌బరేలీ స్థానానికి పార్టీ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత రాహుల్ గాంధీని 'రాజకీయాలు మరియు చదరంగంలో అనుభవజ్ఞుడైన ఆటగాడు' అని అభివర్ణించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పదవికి సంబంధించి ఆయన ఈ విధంగా స్పందించారు.

నిజానికి, కాంగ్రెస్ ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ తన మొబైల్ ఫోన్‌లో చెస్ ఆడుతున్న వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో, గాంధీ కాస్పరోవ్‌ను తన అభిమాన చెస్ ప్లేయర్‌గా అభివర్ణించాడు మరియు దీనితో పాటుగా, అతను రాజకీయ నాయకులలో అత్యుత్తమ చెస్ ప్లేయర్‌గా కూడా పేర్కొన్నాడు. అతని ఇదే వీడియోపై, జర్నలిస్ట్-రచయిత సందీప్ ఘోష్ సోషల్ మీడియాలో ఇలా వ్రాశారు, కృతజ్ఞతగా కాస్పరోవ్ మరియు విశ్వనాథన్ ఆనంద్ త్వరగా పదవీ విరమణ చేశారు మరియు వారు మన కాలంలోని గొప్ప చెస్ మేధావిని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఘోష్ ఈ పోస్ట్‌లో కాస్పరోవ్ మరియు ఆనంద్‌లను కూడా ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కాస్పరోవ్ ఈ విధంగా పోస్ట్ చేశారు.

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇటీవల రాజ్యసభకు వెళ్లిన తర్వాత రాయ్‌బరేలీ స్థానం ఖాళీ అయిందని మీకు తెలియజేద్దాం. దీని తర్వాత, శుక్రవారం ఉదయం రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. ఈ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి చివరి తేదీ కూడా అయిన శుక్రవారం నాడు ఆయన మళ్లీ రాయ్ బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానంలో కాంగ్రెస్‌ను వీడిన ఎమ్మెల్సీ దినేష్‌ ప్రతాప్‌సింగ్‌తో రాహుల్‌ పోటీ చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

May 02 2024, 10:36

తెలుగు రాష్ట్రాల్లో 46 డిగ్రీలు దాటిన ఎండలు

తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతోంది. రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణొగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడు తోంది. 

అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధార ణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్ర తలు పెరిగిపోయే అవకా శాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరి స్తోంది. 

ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటుగా ఒడిశా, పశ్చిమబెంగా ల్ ,బీహర్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండి తెలంగాణకు కూడా తీవ్ర మైన హెచ్చరికే జారీ జేసింది.రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులను పరిగణలోకి తీసుకునితెలం గాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. 

రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ తోపా టు దక్షిణ తెలంగాణ లోని పలు జిల్లాలు ఎండల తో మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రతతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 46డిగ్రీలపైగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా గూడాపూర్‌లో 46. 6డిగ్రీలు నమోదయ్యాయి. చందూ రు, మంగపేట, భద్రాచలం ,మునగాల తదితర ప్రాంతాల్లో 46.5 డిగ్రీలు నమోదయ్యాయి. 

తిమ్మాపూర్,వైరా,ఖనా పూర్ ,ముత్తారం ,వెల్గటూర్ ప్రాంతా ల్లో కూడా 46.4 డిగ్రీలు నమోదయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో కూడా 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

మే" నెల ప్రారంభం కావటం తో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయ ని , ఉష్ణోగ్రతలు గరిష్టంగా 50డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణు లు హెచ్చరిస్తున్నారు.

ప్రభుత్వం కూడా ప్రజలను ఎండల తీవ్రత నుంచి కాపా డేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. 

ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవా రం మే "నెలకు సంబంధించి నెల వారి వర్షపాతం, ఉష్ణోగ్ర తల అంచనా నివేదికను విడుదల చేసింది. 

తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధార ణం కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

నిజంనిప్పులాంటిది

May 02 2024, 09:00

ఓఎంఆర్ విధానంతోనే గ్రూప్-1 పరీక్ష: టిఎస్పీఎస్సీ

తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించబోయే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఆఫ్లైన్లో ఓఎంఆర్ విధానం నిర్వహిం చనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

రాష్ట్రంలో కొత్తగా 60 పోస్టు లను కలిపి 563 గ్రూప్-1 పోస్టులకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ 9న జరగనున్న ఈ పరీక్షకు మొత్తం 4.03 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.

అక్టోబర్ 21 మెయిన్స్ పరీక్ష జరగనుందిఈ ఏడాది ఫిబ్ర వరి 19న గ్రూప్-1 నోటిఫి కేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. కాగా…గతంలో లో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్ టీఎస్పీఎస్సీ రద్దు చేసిన విషయం తెలిసిందే.

2022 ఏప్రిల్ లో 503 పోస్టులతో గత ప్రభుత్వం గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయగా,పేపర్ లీకేజీ కారణంగా ఒకసారి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా పడితే.. మరొకసారి నిబంధనలు సరిగ్గా పాటించలేదని రెండోసారి కూడా ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేశారు.

నిజంనిప్పులాంటిది

May 02 2024, 09:01

కేసీఆర్ నేడు జమ్మికుంట బస్సు యాత్ర రద్దు

కేసీఆర్ జమ్మికుంట బస్సు యాత్ర రోడ్డు షో రద్దు చేసారు.. కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ 48 గంటలు నిషేధం విధిం చిన కారణంగా.. షెడ్యూల్ ప్రకారం నిర్వహించాల్సిన ఇవాళ్టి (02.05.24) జమ్మికుంట బస్సు యాత్ర ను రోడ్డు షోను రద్దు చేసు కుని ఎర్రవెల్లి నివాసానికి బయలుదేరారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. 48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే..96 గంటలు కార్య కర్తలు పని చేస్తారన్నారు. మహబూబాబాద్ రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు.

కేసీఆర్ 48 గంటలు ప్రచా రం చేయొద్దని ఎన్నికల కమీషన్ నిషేధం విధించిం ది. కానీ రేవంత్ రెడ్డి నా పేగులు మెడల వేసుకుం టా.. గుడ్లు పీకుతా అన్న కూడా అతన్ని నిషేధించ లేదన్నారు.

48 గంటలు నా ప్రచారాన్ని నిషేదిస్తే.. 96 గంటలు అవిశ్రాంతంగా బీఆర్ఎస్ కార్యకర్తలు పని చేస్తారని కెసిఆర్ వివరించారు.

నిజంనిప్పులాంటిది

May 02 2024, 08:40

ఈ నెల 5న తెలంగాణ లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం

తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రస వత్తరంగా మారింది. అభ్యర్థులతో పాటు కీలక నేతల ప్రచారాలతో రాజకీయ కాక రేగుతోంది.

ప్రధాన పార్టీల నుంచి కీలక నేతలు రంగంలోకి దిగడం తో విమర్శలు, ప్రతివిమ ర్శలతో రాష్ట్రం వేడెక్కింది. ముఖ్యంగా జాతీయ పార్టీల నేతలు రాష్ట్రానికి వస్తుండ టంతో ప్రచారం మరింత ఊపందుకుంది.

ఇప్పటికే మోదీ, అమిత్ షా, నడ్డా బీజేపీ తరఫున ప్రచా రం చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి కూడా జాతీయ నేతలు రంగంలోకి దిగుతున్నారు.

ఇందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల రాష్ట్ర పర్యటన ఖరారైనట్లు పీసీసీ వర్గాలు వెల్లడిం చాయి.

ఈనెల 5వ తేదీన రాహుల్ గాంధీ నిర్మల్, గద్వాల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్ధు లకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తారని తెలిపాయి.

ఈనెల 9వ తేదీన కరీంనగ ర్, సరూర్ నగర్, ప్రచారం చేయనున్నారు. ఈ నెల 6,7వ తేదీల్లో ప్రియాంక గాంధీ రాష్ట్రానికి రానున్నా రు. 6వ తేదీన ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ ఎన్నికల ప్రచార సభలకు, 7వ తేదీన నర్సాపూర్, కూకట్పల్లిలో ప్రియాంక ప్రచారం చేయనున్నారు...

నిజంనిప్పులాంటిది

May 02 2024, 08:02

గ్రామ గ్రామాన రెపరెపలాడిన ఎర్రజెండాలు

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాలు మండలాల్లో లాల్ జెండాలు రెపరెపలాడాయి. దీనిలో భాగంగా...

శంకరపట్నం మండల కేంద్రం లో లాల్ జెండాలను కార్మికు లు కర్షకులు ఎగురవేసి పండగ వాతావరణాన్ని సృష్టించి బుధవారం మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు. 

ఈ సందర్భంగా ఏఐటీయూ సీ జిల్లా కార్యదర్శిపిట్టల సమ్మయ్య.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెలమరెడ్డి రాజిరెడ్డి, సిఐటియు ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు వంగ బిక్షప తి,హమాలి సంఘం నాయకులు బిల్డింగ్ వర్కర్స్ ల ఆధ్వర్యంలో ఎర్రజెండా లను ఎగురవేశారు. 

ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రాజి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య,లు మాట్లాడు తూ..దేశంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థల యజమా నులకు ఊడిగం చేస్తున్నా యని అన్నారు. 

బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించు కొని ఘనంగా మేడే ఉత్స వాలను శంకరపట్నం, కేశవపట్నం, మండల కేంద్రాలలోని కొత్తగట్టు, గద్దపాక, ఎరడపల్లి, మొలంగూర్, కన్నాపూ ర్ ,లింగాపూర్,తాడికల్, గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో కార్మికులు, కర్షకులు ఎర్ర జెండాలు ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను పండగ వాతావరణం జరుపుకు న్నారు.

 జిల్లా,మండల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబి స్తూ,కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని,త్యాగాలు,పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించా లని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయా లని,కార్మిక చట్టాల పునరు ద్ధరణకై దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు,

అమెరికా నగరం హే మార్కె ట్లో 1886 మే 1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్టు మరియు కార్మిక సంఘాల సమ్మె హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన ఎనిమిది గంటల పరిధినంకై కదం తొక్కిన కార్మికులు పెట్టుబడిదా రులు,వారి గుండాలు, పోలీసులు జరిపిన తుపాకుల కాలుపులో చనిపోయిన వారి రక్తం తలసి ఎగిరిసిన ఎర్రజెండే మేడే" అని అన్నారు.

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌర ప్రజా సౌమ్య పాలన అంతమైం దని పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని కార్మిక వర్గం దిశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడుదాలకు అను కూలంగా నాలుగు కోడ్ లను తెచ్చిందని, పెన్షన్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

సివిల్ సప్లై హమాలి కార్మి కులను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలని, ఎగుమతి-దిగుమతి రేట్లు క్వింటాలకు రూ.40/-పెంచా లని,హమాలి,ఆటో,ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షే మ చట్టాన్ని తేవాలని,భవన నిర్మాణ కార్మికుల మరణా నికి 10 లక్షల చెల్లించాలని ఐదు వేల పెన్షన్ ఇవ్వాల ని,సింగరేణి కాంటాక్ట్ కార్మి కులను సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు...

నిజంనిప్పులాంటిది

May 01 2024, 20:27

లోక్ సభ ఎన్నికలు 2024 హైదరాబాద్ లోక్ సభ స్థాన చరిత్ర

ఒవైసీ అలాగే ఉంటాడా లేదా హైదరాబాద్ "నిజాం" మారతాడా, ఈ సీటు రాజకీయ చరిత్ర తెలుసుకోండి

నిజాం నగరం హైదరాబాద్

ముత్యాలకు ప్రసిద్ధి

1984 నుండి AIMIM బలమైన కోట

40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది

మొత్తం 17 ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు గెలిచింది

తండ్రి 6 సార్లు, కొడుకు 4 సార్లు ఎంపీ అయ్యారు

ఈసారి “నిజాముల కోట” బద్దలవుతుందా

దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు హైదరాబాద్‌ సీటు ప్రస్తావనకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. చారిత్రాత్మకంగా ఈ నగరం చాలా ముఖ్యమైనది మరియు రాజకీయంగా కూడా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. హైదరాబాద్‌ను నిజాంలు మరియు ముత్యాల నగరం అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాలలో ఇది ఒకటి. తెలంగాణలోని హైదరాబాద్ లోక్‌సభ స్థానం బీఆర్‌ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్ లేదా బీజేపీ తప్పు చేయని స్థానం. ఇక్కడ మాత్రమే మరియు AIMIM యొక్క నాణెం మాత్రమే అంటే ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ మాత్రమే నడుస్తుంది.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో జరిగిన మొత్తం 17 లోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీ కుటుంబం పదిసార్లు విజయం సాధించింది. ఇతరులకు ఏడుసార్లు మాత్రమే అవకాశం వచ్చింది. కాంగ్రెస్ చివరి విజయం 1980లో. 1984లో అసదుద్దీన్ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ తొలిసారిగా కాంగ్రెస్ విజయ పరంపరకు బ్రేక్ వేశారు. ఆ తర్వాత ఏ పార్టీ కూడా దీనిపై ఆసక్తి చూపలేదు. సలావుద్దీన్ వరుసగా ఆరు ఎన్నికల్లో గెలుపొందగా, అసదుద్దీన్ నాలుగు ఎన్నికల్లో విజయం సాధించారు.

హైదరాబాద్ లోక్ సభ స్థానం చరిత్ర

1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి తొలిసారిగా ఓటింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ మొహియుద్దీన్ విజయం సాధించారు. కానీ 1957 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తన అభ్యర్థిని మార్చింది. వినాయక్‌రావు కోరట్కర్‌ను కాంగ్రెస్‌ రంగంలోకి దించగా ఆయన విజయం సాధించారు.

1962లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మెల్కోటే విజయం సాధించారు. 1971 సాధారణ ఎన్నికల్లో మెల్కోటే ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బదులు తెలంగాణ ప్రజాసమితి టికెట్‌పై మెల్కోటే పోటీ చేశారు.

1977లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు చెందిన కేఎస్‌ నారాయణ్‌ విజయం సాధించారు. 1980 సాధారణ ఎన్నికలలో, కెఎస్ నారాయణ్ మళ్లీ కాంగ్రెస్ (ఐ) టిక్కెట్‌పై ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఒవైసీ కుటుంబం వరుసగా గెలుస్తూ వస్తోంది.

గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం వృత్తి

హైదరాబాద్ లోక్‌సభ స్థానం గత 40 ఏళ్లుగా ఒవైసీ కుటుంబం ఆధీనంలో ఉంది. ఈ కుటుంబానికి చెందిన ఒకరు 1984లో తొలిసారిగా హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. అసదుద్దీన్ ఒవైసీ తండ్రి సలావుద్దీన్ ఒవైసీ ఈ విజయం సాధించారు. అప్పటి నుంచి వరుసగా 6 సార్లు ఈ సీటును గెలుచుకున్నారు. సలావుద్దీన్ ఒవైసీ 1984, 1989, 1991, 1998 మరియు 1999 సంవత్సరాల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. దీని తరువాత, అతని కుమారుడు మరియు ప్రస్తుతం AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఈ స్థానం నుండి వరుసగా 4 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఒవైసీ 2009లో తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2009, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఒవైసీ ఎంపీగా ఎన్నికయ్యారు.

ఒవైసీ ఐదోసారి విజయాన్ని నమోదు చేస్తారా?

2024లో కూడా ఒవైసీ తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈసారి కూడా ఫలితం మారకుంటే అది వారికి వరుసగా ఐదో విజయం అవుతుంది. గత రెండు ఎన్నికల్లో భాజపా గట్టిపోటీనిచ్చినా ఓటమిని తగ్గించుకోలేకపోయింది. ఈసారి మాధవి ఆశతో లాంచ్ అయింది. ముఖం కొత్తదే అయినా గుర్తింపు పాతది. మాధవి ప్రముఖ హిందూ నాయకురాలిగా ఉండడంతో పాటు సామాజిక కార్యకర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆవుల కొట్టం నడుపుతున్నాడు. మురికివాడల్లోని ముస్లిం మహిళల సుఖదుఃఖాలకు ఆమె అండగా నిలుస్తున్నారు. ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఆమె సనాతన్ యొక్క బలమైన వక్త. ఆరోగ్య రంగంలో కూడా చురుకుగా ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:35

తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌.. బాలిక‌ల‌దే పైచేయి…

తెలంగాణలో ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ ఫ‌లితాలు ఈ రోజు విడుద‌ల‌య్యాయి.

రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య‌ కార్య‌ద‌ర్శి 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలను కొద్దిసేప టి క్రితమేవిడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల్లో కూడా బాలిక‌ల‌దే పైచేయిగా ఉంది.

టెన్త్ ఫ‌లితాల్లో 91.31 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. 3927 స్కూళ్ల‌లో వంద‌ శాతం ఫ‌లితాలు సాధిం చారు. 99శాతం ఫ‌లితాల‌ తో నిర్మ‌ల్ జిల్లా టాప్ ప్లేస్ లో ఉంది...