గ్రామ గ్రామాన రెపరెపలాడిన ఎర్రజెండాలు
ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలోని వివిధ గ్రామాలు మండలాల్లో లాల్ జెండాలు రెపరెపలాడాయి. దీనిలో భాగంగా...
శంకరపట్నం మండల కేంద్రం లో లాల్ జెండాలను కార్మికు లు కర్షకులు ఎగురవేసి పండగ వాతావరణాన్ని సృష్టించి బుధవారం మేడేను ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా ఏఐటీయూ సీ జిల్లా కార్యదర్శిపిట్టల సమ్మయ్య.సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు వెలమరెడ్డి రాజిరెడ్డి, సిఐటియు ఆటో యూనియన్ మండల అధ్యక్షుడు వంగ బిక్షప తి,హమాలి సంఘం నాయకులు బిల్డింగ్ వర్కర్స్ ల ఆధ్వర్యంలో ఎర్రజెండా లను ఎగురవేశారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి రాజి రెడ్డి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పిట్టల సమ్మయ్య,లు మాట్లాడు తూ..దేశంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ సంస్థల యజమా నులకు ఊడిగం చేస్తున్నా యని అన్నారు.
బుధవారం ప్రపంచ కార్మిక దినోత్సవం పురస్కరించు కొని ఘనంగా మేడే ఉత్స వాలను శంకరపట్నం, కేశవపట్నం, మండల కేంద్రాలలోని కొత్తగట్టు, గద్దపాక, ఎరడపల్లి, మొలంగూర్, కన్నాపూ ర్ ,లింగాపూర్,తాడికల్, గ్రామాలతో పాటు పలు గ్రామాల్లో కార్మికులు, కర్షకులు ఎర్ర జెండాలు ఎగురవేసి ఘనంగా మేడే ఉత్సవాలను పండగ వాతావరణం జరుపుకు న్నారు.
జిల్లా,మండల కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షక,ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబి స్తూ,కార్పొరేట్లకు ఊడిగం చేస్తుందని,త్యాగాలు,పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించా లని నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయా లని,కార్మిక చట్టాల పునరు ద్ధరణకై దేశంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని దేశాన్ని రాజ్యాంగాన్ని ప్రజలను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు,
అమెరికా నగరం హే మార్కె ట్లో 1886 మే 1న సమ్మె చేయాలని నిర్ణయించిన ప్రపంచ కార్మికుల సమైక్య సోషలిస్టు మరియు కార్మిక సంఘాల సమ్మె హే మార్కెట్లో భారీ నిరసన ప్రదర్శన ఎనిమిది గంటల పరిధినంకై కదం తొక్కిన కార్మికులు పెట్టుబడిదా రులు,వారి గుండాలు, పోలీసులు జరిపిన తుపాకుల కాలుపులో చనిపోయిన వారి రక్తం తలసి ఎగిరిసిన ఎర్రజెండే మేడే" అని అన్నారు.
75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పౌర ప్రజా సౌమ్య పాలన అంతమైం దని పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని కార్మిక వర్గం దిశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలు 29 చట్టాలను సమూలంగా రద్దుచేసి పెట్టుబడుదాలకు అను కూలంగా నాలుగు కోడ్ లను తెచ్చిందని, పెన్షన్ చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సివిల్ సప్లై హమాలి కార్మి కులను ప్రభుత్వ ఉద్యోగు లుగా గుర్తించాలని, ఎగుమతి-దిగుమతి రేట్లు క్వింటాలకు రూ.40/-పెంచా లని,హమాలి,ఆటో,ట్రాన్స్పోర్ట్ కార్మికులకు సమగ్ర సంక్షే మ చట్టాన్ని తేవాలని,భవన నిర్మాణ కార్మికుల మరణా నికి 10 లక్షల చెల్లించాలని ఐదు వేల పెన్షన్ ఇవ్వాల ని,సింగరేణి కాంటాక్ట్ కార్మి కులను సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు...
May 02 2024, 10:36