లగ్గాలకు ఇక మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే
మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు
పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని వెల్లడి
చిరువ్యాపారుల ఉపాధికి గండి, తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్ సేల్స్
సాధారణంగా ఎండా కాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుం టాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది.
వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు.ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూ ర్తాలు ఉండవని వివరిస్తు న్నారు.
దీనివల్ల వివాహాలతోపాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాప నలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యంకాదని తెలియజే స్తున్నారు.
సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని పేర్కొంటున్నారు.
వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది.
అలాగే గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగ నుంది.గురు, శుక్ర మూఢా ల్లో నూతన శుభకార్యక్ర మాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తు న్నారు.
ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.
మూఢాలు, ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరువ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూప నుంది. వారి వ్యాపారం మందగించ నుంది.
అలాగే బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజే లు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభ రణాల కొనుగోళ్లు మందగిం చనున్నాయి.
Apr 30 2024, 11:32