నిజంనిప్పులాంటిది

Apr 30 2024, 11:31

నేడు సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్‌, వరంగల్, చేవెళ్లలలో ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల ప్రచారం లో భాగంగా ఇవాళ కరీంనగర్‌, వరంగల్, చేవెళ్ల లోకసభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. 

మధ్యాహ్నం హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు.అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. 

అలాగే రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్‌సభ నియోజ కవర్గం పరిధిలోని మహేశ్వ రం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్ పేట్ కార్నర్ సమావేశాలల్లో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. 

రాత్రి 9 గంటలకు ఆర్కేపు రం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాలల్లో హాజరవు తారని వివరించారు...

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 19:21

లగ్గాలకు ఇక మూడు నెలలు ముహూర్తాలు లేనట్లే

మూఢాలు, ఆషాఢం కారణంగా వచ్చే మూడు మాసాలు ముహూర్తాలు లేవంటున్న వేద పండితులు

పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం కుదరదని వెల్లడి

చిరువ్యాపారుల ఉపాధికి గండి, తగ్గనున్న పెళ్లిళ్ల షాపింగ్స్ సేల్స్

సాధారణంగా ఎండా కాలంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుం టాయి. కానీ ఈసారి మాత్రం పెళ్లిళ్లు సహా ఇతర శుభ కార్యక్రమాలకు అనూహ్యంగా బ్రేక్ పడనుంది.

వచ్చే మూడు నెలలపాటు శుభ ముహూర్తాలు ఏమీ లేకపోవడమే అందుకు కారణమని వేద పండితులు అంటున్నారు.ఈ నెల 29 నుంచి మూడు నెలలపాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల సుముహూ ర్తాలు ఉండవని వివరిస్తు న్నారు.

దీనివల్ల వివాహాలతోపాటు నూతన గృహ ప్రవేశాలు, దేవతా విగ్రహ ప్రతిష్టాప నలు, శంకుస్థాపనల లాంటి శుభకార్యాలను జరపడం సాధ్యంకాదని తెలియజే స్తున్నారు.

సూర్య కాంతి గురు గ్రహంపై పడినప్పుడు గురు మౌఢ్యమి, శుక్ర గ్రహంపై పడితే శుక్ర మౌఢ్యమి సంక్రమిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఫలితంగా ఆయా గ్రహాల గమనం తెలియక శుభ ముహూర్తాలు పెట్టడం కుదరదని పేర్కొంటున్నారు.

వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 28 చైత్ర బహుళ చవితి ఆదివారం నుంచి జులై 8 ఆషాఢ శుద్ధ తదియ సోమవారం వరకు శుక్ర పౌఢ్యమి ఉంది.

అలాగే గురు పౌఢ్యమి మే 7 చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం నుంచి జూన్‌ 7 జ్యేష్ఠ శుక్ల పాడ్యమి గురువారం వరకు కొనసాగ నుంది.గురు, శుక్ర మూఢా ల్లో నూతన శుభకార్యక్ర మాలు చేయడం మంచిది కాదని పండితులు సూచిస్తు న్నారు.

ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో ఎలాగూ పెళ్లిళ్లు సహా ఇతర శుభకార్యాలు నిర్వహించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు.

మూఢాలు, ఆషాడ మాసం వల్ల శుభకార్యాలకు బ్రేక్ పడటం పూలు, పండ్లు లాంటివి అమ్ముతూ జీవనం సాగించే చిరువ్యాపారుల ఉపాధిపై ప్రభావం చూప నుంది. వారి వ్యాపారం మందగించ నుంది.

అలాగే బాజాభజంత్రీలు, డప్పు వాయిద్యాలు, డీజే లు, బారాత్ లు నిర్వహించే కళాకారుల ఉపాధికి మూడు నెలలపాటు గండిపడనుంది. నూతన వస్త్రాలు, బంగారు ఆభ రణాల కొనుగోళ్లు మందగిం చనున్నాయి.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:32

మూడు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు..

దేశంలో బాంబు బెదిరిం పులు కలకలం సృష్టిస్తున్నా యి. ఇవాళ దేశంలోని పలు ప్రధాన ఎయిర్‌పోర్ట్స్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఆయా విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

సోమవారం ఉదయం రాజ స్థాన్‌లోని జైపూర్, మహారా ష్ట్రలోని నాగ్‌పూర్‌ ‌, గోవా విమానాశ్రయాలకు ఈమె యిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

దీంతో వెంటనే ఆయా విమా నాశ్రయాల అధికారులు స్థానిక పోలీసులకు సమా చారం అందించారు. రంగం లోకి దిగిన అధికారులు బాంబ్‌ స్క్వాడ్‌, జాగిలాలతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు.

అయితే, ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు కనిపిం చలేదని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు బెదిరింపు మెయిల్స్‌ నేప థ్యంలో ఆయా విమానాశ్ర యాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈమె యిల్‌ పంపిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆయా విమానాశ్రయాల్లో విమాన సర్వీసులకు ఎలాంటి అంతరాయం కలగలేదని అధికారులు తెలిపారు.

కాగా, దేశంలో ఇటీవలే వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా చెన్నై, ముంబైలోని పలు పాఠశాలలకు వరుస బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాదు, పలు విమానా శ్రయాలకు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.

ఇలా దేశంలోని పలు పాఠశాలలు, ప్రముఖ సంస్థలకు ఒకదాని తర్వాత ఒకటి వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:31

సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసు లు నోటీసులు జారీ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

మే 1వ తేదీకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. రిజర్వేషన్ల అంశం మీద అమిత్ షాపై కాంగ్రెస్ నేతలే ఫేక్ వీడియోను క్రియేట్ చేశారని బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు.

దీంతో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నా రని అమిత్ షా చెప్పినట్లు గా ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేస్తోం దని ఢిల్లీ, హైదరాబాద్‌తో పాటు పలురాష్ట్రాల్లో బీజేపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 18:29

నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు

లోక్‌సభ ఎన్నికలకు మరి కొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రం లోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

వారిలో 271 మంది అభ్య ర్థుల నామినేషన్లను అధికా రులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలిం చారు.

మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖల య్యాయి.

ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్‌ 54, కరీంనగర్‌ 53, వరంగల్‌ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్‌ 42, నిజామాబాద్‌ 42, జహీరాబాద్‌ 40, నాగర్‌ కర్నూల్‌ 34, మహబూ బాబాద్‌ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

ఇక సికింద్రాబాద్‌ కంటోన్మెం ట్‌ ఉపఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామి నేషన్లు దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు.

మే 13న పోలింగ్‌ నిర్వహిం చనున్నారు. జూన్‌ 4న ఓట్లను లెక్కించి ఫలితా లను ప్రకటిస్తారు..

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:21

శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో ఆపరేషన్ చిరుత

శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఎయిర్‌పోర్టు పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించారు.

చిరుతను బంధించేందుకు మొత్తం 9 ట్రాప్ కెమెరాలతో పాటుగా ఒక బోన్‌ను సైతం ఏర్పాటు చేశారు. అయితే ఆ ట్రాప్ కెమెరాల్లో సైతం చిరుత కదలికలు స్పష్టంగా రికార్ట్ అయ్యాయి.

అదే చిరుత రన్‌వే పైకి వచ్చిందని జిల్లా అటవీ శాఖ అధికారి విజయానంద్ తెలిపారు. కొన్ని నెలల క్రితం షాద్‌నగర్ ప్రాంతంలోనూ చిరుత కనిపించింది.

ఇప్పుడే అదే చిరుత ఎయిర్‌పోర్టు పరిసరాలకు వచ్చి ఉంటుందని ఎయిర్‌ పోర్టు అధికారులు భావిస్తు న్నారు. చిరుతను బంధిం చేందుకు అందులో ఓ మేకను సైతం ఎరగా ఉంచినట్లుగా డీఎఫ్‌వో విజయానంద్ వెల్లడిం చారు...

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:20

పులివెందులలో వైయస్ భారతి ప్రచారం

పులివెందుల నియోజక వర్గంలో సీఎం జగన్ సతీమణి భారతి రెండో రోజు వేంపల్లిలో ప్రచారం చేస్తున్నారు.

మొదటిరోజు తొండూరు మండలం ఇడమడక గ్రామంలో వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమతతో కలిసి ప్రచారం చేశారు. రెండవ రోజు వేంపల్లి పట్టణంలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు.

వైఎస్ భారతికి శాసన మండలి మాజీ డిప్యూటీ ఛైర్మన్ సతీష్ రెడ్డి సతీమణి సుమతీరెడ్డి ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లను తప్పనిసరిగా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

వేంపల్లి పట్టణంలో అడుగ డుగునా భారతిరెడ్డికి స్వాగతం పలికారు. జగన్ అభిమానులు, వైసీపీ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రచారంలో పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:17

ఏపీ, తెలంగాణలో నామినేషన్ల ఉప సంహరణకు నేడు చివరి రోజు..

175 అసెంబ్లీ సెగ్మెంట్లకు 6001 నామినేషన్ల దాఖలు.

4189 నామినేషన్ల ఆమోదం. 1637 నామినేషన్ల తిరస్కరణ‍..

తొమ్మిది నామినేషన్ల ఉప సంహరణ.

25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 1103 నామినేషన్ల దాఖలు.

771 నామినేషన్ల ఆమోదం. 291 నామినేషన్ల తిరస్కరణ‍..

తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు 625 నామినేషన్లు దాఖలు..

268 నామినేషన్ల తిరస్కరణ..

ఎంత మంది పోటీ చేస్తారనే అంశంపై ఇవాళ రాత్రికి క్లారిటీ వచ్చే అవకాశం.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 15:15

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు తెలుసు నాకు : కంచర్ల కృష్ణారెడ్డి

ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తా

మౌత్ ప్రచారంలో అడ్వకేట్ల చాలా కీలకమైన పాత్ర

నల్లకోటు వెనక ఉన్న కష్టాలు నాకు తెలుసని నల్లగొండ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారు అన్నారు

ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారితో కలిసి ఆయన పాల్గొన్నారు

ఈ సందర్భంగా కంచర్ల కృష్ణారెడ్డి గారు మాట్లాడుతూ... ఎంపీగా గెలిస్తే నా తొలి ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు న్యాయవాదుల అభివృద్ధికే కేటాయిస్తానని అన్నారు

ప్రజలను చైతన్యవంతం చేయడంలో అడ్వకేట్ల పాత్ర చాలా కీలకమైనదనీ, అటువంటివారు నాకు మద్దతుగా నిలవడం చాలా సంతోషదాయకమని అన్నారు

ఈ కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సిరిగిరి వెంకటరెడ్డి, జనరల్ సెక్రెటరీ గిరి లింగయ్య గౌడ్, సీనియర్ న్యాయవాదులు మునగాల నారాయణ, నేతి రఘుపతి, లొడంగి గోవర్ధన్, కె.జవహర్ లాల్, జి.జవహర్ లాల్, జి.వెంకటేశ్వర్లు, మామిడి బాలయ్య, మామిడి ప్రమీల, తిమ్మ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 29 2024, 13:00

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డి

పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

భారత్ రాష్ట్ర సమితి పార్టీకి ఇప్పటికే పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఈరోజు మరో యువనేత పార్టీని వీడారు.

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రేవంత్ రెడ్డి ఆయన మెడ లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నిక ల్లో అమిత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు.

టికెట్ కోసం గట్టిగా ప్రయ త్నాలు చేసినా.. ఫలించ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

తన తాత గుత్తా వెంట్ రెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించిన అమిత్.. గత కొంత కాలంగా నియోజ కవర్గంలో సేవా కార్యక్ర మాలు నిర్వహించి పట్టు సాధించారు.

ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ అడుగుపె ట్టాలని భావించారు.