నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ గడువు
లోక్‌సభ ఎన్నికలకు మరి కొన్ని గంటల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుంది. రాష్ట్రం లోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
వారిలో 271 మంది అభ్య ర్థుల నామినేషన్లను అధికా రులు తిరస్కరించారు. మిగిలిన 622 మంది అభ్యర్థుల నామినేషన్లను ఆమెదించారు. ఏప్రిల్ 26న నామినేషన్లను పరిశీలిం చారు.
మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణ ముగుస్తుంది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాలను ఎన్నికల సంఘం ప్రకటించనుంది. అత్యధికంగా మల్కాజ్‌గిరి నియోజకవర్గం పరిధిలో 114 నామినేషన్లు దాఖల య్యాయి.
ఆ తర్వాత చేవెళ్లలో 66 మంది, పెద్దపల్లిలో 63 మంది, భువనగిరిలో 61 మంది, సికింద్రాబాద్, హైదరాబాద్‌లలో చెరో 57 మంది, నల్లగొండలో 56, మెదక్ 54, కరీంనగర్ 53, వరంగల్ 58, ఖమ్మం 45, మహబూబ్‌నగర్ 42, నిజామాబాద్ 42, జహీరాబాద్ 40, నాగర్ కర్నూల్ 34, మహబూ బాబాద్ 30, ఆదిలాబాద్‌లో 23 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
ఇక సికింద్రాబాద్ కంటోన్మెం ట్ ఉపఎన్నికకు 24 మంది అభ్యర్థులు 50 సెట్ల నామి నేషన్లు దాఖలు చేశారు. అందులో 21 మంది నామినేషన్లను అధికారులు ఆమోదించారు.
మే 13న పోలింగ్ నిర్వహిం చనున్నారు. జూన్ 4న ఓట్లను లెక్కించి ఫలితా లను ప్రకటిస్తారు..
Apr 29 2024, 18:31