సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గుత్తా అమిత్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
భారత్ రాష్ట్ర సమితి పార్టీకి ఇప్పటికే పలువురు ఎంపీ లు, ఎమ్మెల్యేలు, కీలక నేతలు గుడ్‌బై చెప్పగా.. తాజాగా ఈరోజు మరో యువనేత పార్టీని వీడారు.
శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
రేవంత్ రెడ్డి ఆయన మెడ లో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నిక ల్లో అమిత్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డారు.
టికెట్ కోసం గట్టిగా ప్రయ త్నాలు చేసినా.. ఫలించ లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే కూసుకుంట్లకే టికెట్ కేటాయించారు. అప్పటి నుంచి ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తన తాత గుత్తా వెంట్ రెడ్డి పేరుతో మెమోరియల్ ట్రస్ట్ ప్రారంభించిన అమిత్.. గత కొంత కాలంగా నియోజ కవర్గంలో సేవా కార్యక్ర మాలు నిర్వహించి పట్టు సాధించారు.
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ అడుగుపె ట్టాలని భావించారు.
Apr 29 2024, 15:15