భోజ్ పురి సినీ నటి ఆత్మహత్య?

భోజ్‌పురి నటి అమృత పాండే,ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. బీహార్‌లోని జోగ్‌సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆపార్ట్‌ మెంట్‌లో అమృత పాండే ఉరేసుకుంది.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహా న్ని స్వాధీనం చేసుకున్నా రు. చనిపోయే ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. ఆమె రాసిన వాట్సాప్ స్టేటస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

భోజ్‌పురి సినిమాలు, హిందీ సినిమాలు, వెబ్ సిరీస్, టివి షోలలో ఆమె నటించి మంచి గుర్తింపు తెచ్చుకు న్నారు. సినీ నిర్మాత- దర్శకుడు చింతామనితో విడాకులు తీసుకున్న తరువాత మానసికంగా తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లిపో యింది.

ఈ క్రమంలోనే ఆమె ఆత్మ హత్య చేసుకొని ఉంటుంద ని పోలీసులు భావిస్తున్నా రు. అమృత ఆత్మహత్య కేసులో ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించా మని పోలీస్ ఉన్నతాధి కారులు ఆనంద్ కుమార్, శ్రీరాజ్ తెలిపారు..

రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడు దలకు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటల కు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌ https://results.bsetelangana.org/ చూసుకోవచ్చు.

ఈ ఏడాది మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహిం చిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యా ర్థులు హాజరయ్యారు.

వీరిలో 2,57,952 మంది బాలురు, 2,50,433 మంది బాలికలు ఉన్నారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికి పూర్తిచేశారు.

తెలంగాణ లో బీజేపీ అగ్ర నేతల ఫోకస్

తెలంగాణ సార్వత్రిక ఎన్నికల మహాసంగ్రామాన్ని మరింత రసవత్తరంగా మార్చేందుకు బీజేపీ అగ్రనే తలు తెలంగాణ బాట పడుతున్నారు.

పెద్ద ఎత్తున ప్రచారాలకు సిద్ధమవుతున్నారు. ఓవైపు అభ్యర్థుల కసరత్తు, మరోవై పు తమదైన శైలిలో ప్రచారా నికి రెడీ అయ్యారు. నేడు JP నడ్డా రేపు మోదీ, ఎల్లుండి అమిత్‌ షా ఇలా బీజేపీ అగ్రనేతల అంతా తెలంగాణలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఇవాళ తెలంగాణ కు రాను న్న నడ్డా ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం పన్నెండున్నరకి మహబూబాబాద్‌ బహిరంగ సభలో పాల్గొంటారు

సాయంత్రం 5 గంటలకు నిజాంపేటలో రోడ్‌షో నిర్వహిస్తారు. రేపు ప్రధాని ఎల్లుండి అమిత్‌షా తెలంగాణ రానుండగా.. గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రచారం చేస్తోంది...

నేడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ‌ పిఠాపు రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. పిఠాపురంలో రోడ్ షో నిర్వహిస్తున్నారు.

ఉదయం నుంచి మధ్యా హ్నం వరకూ రోడ్ షో జరగనుంది.అనంత‌రం చెందుర్తిలో రోడ్ షో ప్రారంభమవుతుంది.

తర్వాత రోడ్ షో వన్నెపూ డి, కొడవలి, వెల్దర్తి, దొంత మూరు, బి.కొత్తూరు, పి. తిమ్మాపురం, గోకివాడ, జాములపల్లి, నరసింగా పురం, ఎల్‌.ఎన్.పురం, కొలంక, విరవాడ, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్‌కే పాలెం, కంద్రాడమ,మీదుగా కుమారపురం వరకూ రోడ్ షో జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

పవన్ రోడ్ షోకు జనం భారీగా తరలి వచ్చే అవకాశముంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి...

నేడు క‌ర్ణాట‌క‌కు సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ క‌ర్ణాట‌క‌కు వెళ్ళనున్నారు రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చా రానికి ఇవాళ రేవంత్‌రెడ్డి విరామం ఇచ్చారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌చా రంలో భాగంగా కర్ణాట‌క‌లో ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నా రు.14 లోక్‌సభ స్థానాల్లో ప్రచారం చేసేందుకు తెలం గాణ సీఎం రేవంత్‌రెడ్డి ఇవాళ ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు.

మధ్యాహ్నం గుర్మిట్కల్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కలిసి ఎన్నికల ప్రచార సభలో రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. సాయంత్రం సేడంలో జరగనున్న ఎన్నికల ప్రచార సభకు కాంగ్రెస్‌ అగ్రనేత ప్రియాంక గాంధీతో కలిసి రేవంత్‌రెడ్డి సభలో పాల్గొంటారు..

గుజరాత్ టైటాన్స్ ను చిత్తు చేసిన RCB సేన

గుజ‌రాత్ టైటాన్స్‌ ను వాళ్ల సొంత‌గ‌డ్డ‌పైనే 9 వికెట్ల‌తో చిత్తు చేసింది ఆర్సీబీ.. ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడిన ఆల్‌రౌండ‌ర్ విల్ జాక్స్(100 నాటౌట్) సెంచరీతో బెంగ‌ళూరును గెలిపిం చాడు. 

దాంతో, ఆర్సీబీ ఖాతాలో మూడో విక్ట‌రీ చేరింది. ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీ(70 నాటౌట్) సైతం హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్క‌గా 200 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 15.5 ఓవ‌ర్ల‌కే చేదించింది..

భారీ ఛేద‌న‌లో ఓపెనింగ్ జోడీ మ‌ళ్లీ విఫ‌ల‌మైంది. ప‌వ‌ర్ ప్లేలోనే ఆర్సీబీ తొలి వికెట్ ప‌డింది. ఓపెన‌ర్ ఫాఫ్ డూప్లెసిస్(24) భారీ షాట్ ఆడి ఔట‌య్యాడు. సాయి కిశోర్ ఓవ‌ర్లో బౌండ‌రీ వ‌ద్ద విజ‌య్ శంక‌ర్ చేతికి చిక్కాడు. 

దాంతో, 40 ప‌రుగుల వ‌ద్ద ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న విల్ జాక్స్ క్రీజులోకి వ‌చ్చాడు. కోహ్లీ జ‌త‌గా జాక్స్ ఓ రేంజ్‌లో ఆడాడు. ర‌షీద్ ఖాన్ వేసిన 16వ ఓవ‌ర్లో జాక్స్ మ‌రింత రెచ్చిపోయాడు. 

వ‌రుస‌గా 6, 6, 4, 6, 6 బాదేసి శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఆర్సీబీ 9 వికెట్ల‌తో గెలుపొందింది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టార్గెట్ 200

బెంగళూరుతో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.

సాయి సుదర్శన్ 84 (49 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. షారుక్ ఖాన్ 58 (30 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. గిల్ 16, మిల్లర్ 26, సాహా 5 పరుగులు చేశారు.

బెంగళూరు బౌలర్లలో స్వప్నిల్ సింగ్, మాక్స్‌వెల్, సిరాజ్ తలో వికెట్ తీసుకున్నారు...

సింగరేణిలో ఉద్యోగాల్లో :దరఖాస్తు తేదీల్లో మార్పు

సింగరేణి సంస్థలో 327 పోస్టులకు గత నెలలో నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఏడు కేటగిరీల్లో భర్తీ చేయనున్న ఈ ఉద్యోగాలకు తొలుత ఏప్రిల్‌ 15 నుంచి మే 4 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్న అధికారులు.. ఆ తేదీల్లో మార్పు చేశారు.

వివిధ కారణాల వల్ల ఈ ప్రక్రియను వాయిదా వేసినట్లు వెల్లడించారు. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం.. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు మే 15న మధ్యాహ్నం 12గంట ల నుంచి జూన్‌ 4 సాయం త్రం 5గంటల వరకు ఆన్‌ లైన్‌లో దరఖాస్తు చేసుకోవ చ్చు. మరిన్ని వివరాలకు సింగరేణి వెబ్‌సైట్‌లో తెలుసు కోవచ్చు.

భర్తీ చేయనున్న పోస్టులివే..

ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో.. మేనేజ్‌మెంట్‌ ట్రైనీఈఅండ్‌ ఎం ఈ2 గ్రేడ్‌- 42, మేనేజ్‌ మెంట్‌ ట్రైనీ(సిస్టమ్స్‌) ఈ2 గ్రేడ్‌- 7.నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కేటగిరీలో.. జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీరు టీఅం డ్‌ఎస్‌ గ్రేడ్‌ సీ- 100, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(మెకానికల్‌) టీఅండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ- 9, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రైనీ(ఎలక్ట్రికల్‌) టీ అండ్‌ ఎస్‌ గ్రేడ్‌ సీ- 24, ఫిట్టర్‌ ట్రైనీ కేటగిరీ-1- 47, ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ కేటగి రీ-1- 98 చొప్పున భర్తీ చేయనున్నారు.

అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించరాదు. ఎస్సీ ఎస్టీ,బీసీ,దివ్యాంగులైన అభ్యర్థులకు ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంటుంది...

ఆదివారం రాజన్న ఆలయంలో భక్తుల సందడి

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి సేవలో తరించారు. 

ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకు న్నారు. 

ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి...

కాంగ్రెస్‌ పార్టీకి అర్విందర్‌ సింగ్‌ రాజీనామా?

కాంగ్రెస్‌ ఢిల్లీ శాఖ అధ్యక్షు డు అర్విందర్‌ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని పార్టీ వర్గాలు ఆదివారం ఉదయం వెల్లడిం చాయి.

ఆమ్‌ ఆద్మీ పార్టీతో పొత్తుకు ఢిల్లీ యూనిట్‌ అంగీకరించ లేదని రాజీనామా లేఖలో అర్విందర్‌ పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలు కొనసా గుతున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవ డం పార్టీకి తలనొప్పిగా మారింది. కాంగ్రెస్‌ పార్టీపై నిరాధార అవినీతి, అక్రమా ల ఆరోపణలతోనే ఆప్‌ ఏర్పాటైనట్లు అర్విందర్‌ లేఖలో తెలిపారు.

అలాంటి పార్టీతో పొత్తు వద్దని ఢిల్లీ శాఖ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు చెప్పా రు. అయినప్పటికీ.. అధిష్ఠానం నిర్ణయం మేరకు కూటమిని సమర్థించినట్లు వెల్లడించారు. మరోవైపు డీపీసీసీ అధ్యక్ష హోదాలో పార్టీ పదవుల నియామ కాలను చేపట్టేందుకు ఢిల్లీ ఇన్‌ఛార్జి తనను అనుమ తించడం లేదని ఆరోపిం చారు.

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. పొత్తులో భాగంగా పార్టీకి మూడు సీట్లే కేటాయించడంపైనా అర్విందర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినప్పటికీ.. పార్టీ ప్రయోజనాల కోసం అంగీకరించామని చెప్పారు. అయితే, మూడు సీట్లలో ఒకదానికి తన పేరు బలంగా వినిపించినప్పటికీ.. ఇతర సీనియర్ల కోసం తాను స్వయంగా పోటీ నుంచి వైదొలగానని చెప్పారు.

కానీ, రెండు స్థానాల్లో అసలు ఢిల్లీ కాంగ్రెస్‌తో సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అభ్యర్థులుగా ప్రకటించారని వాపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకుల ప్రయోజనాలను రక్షించలేని తాను పదవిలో కొనసాగడం సమంజసంగా భావించడం లేదని పేర్కొన్నారు.....