NLG: ఫుడ్ పాయిజన్ కు బలైన విద్యార్థి మరణాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలి: దళిత రత్న బుర్రి వెంకన్న
భువనగిరి గురుకులాల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఇటీవల హాస్పిటల్ లో మృత్యువుతో పోరాడి ప్రాణాలను కోల్పోయిన ఆరవ తరగతి విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి న్యాయం చేయాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆ సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దళిత రత్న బుర్రి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆయన మాట్లాడుతూ.. పూర్తి స్థాయిలో కూలినాలి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నటువంటి వారి పిల్లలే గురుకులాలలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అటువంటి విద్యార్థులకు ఇలాంటి ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఇంతవరకు విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం, ఏ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయినా కూడా విద్యార్థులు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేకపోవడం చాలా బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అట్టడుగు వర్గాల నుంచి బీద కుటుంబాలైనటువంటి వారి పిల్లలే ఈ హాస్టల్లో అధిక శాతం ఉంటారు. ఇలాంటి ఘటనలు జరుగుతుంటే తమ పిల్లలను హాస్టల్లో ఉంచాలా లేకపోతే ఇంటికి తీసుకెళ్లాలా అని అయోమయ పరిస్థితిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ, పూర్తిస్థాయిలో తెలంగాణ హైకోర్టు సెట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి, చనిపోయిన చిన్న లచ్చి ప్రశాంత్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ప్రశాంత్ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్గ్రేషియా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించాలని, ప్రశాంత్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మరణానికి కారణమైన సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని, ప్రభుత్వం రెసిడెన్షియల్ విద్యాసంస్థలను ప్రక్షాళన చేయాలని ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కమిటీ పక్షాన ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Apr 19 2024, 15:18