NLG: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి
నల్గొండ: పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవ్వాల ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ల హాజరు పట్టిక,ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషేంట్ల వివరాలను పరిశీలించారు.
హాస్పిటల్ లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా..లిఫ్ట్ రిపేర్ అయ్యిందని..రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని..బాలింతలు,పసిపాపలు ఉండే హాస్పిటల్ లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజుల సమయం పడితే పేషేంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..
అలాగే హాస్పిటల్ ఆవరణంలో పేషేంట్లు,వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికి అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని,వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.భవన నిర్మాణం నెలరోజుల్లోనే పూర్తిచేసేలా యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.తాను రెండు రోజులకు ఒకసారి భవన నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తానని అధికారులకు తెలిపారు.భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను తాను ఇస్తానని చెప్పారు.హాస్పిటల్ మొత్తం కలియతిరిగిన మంత్రి..రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.
పలుచోట్ల పారిశుద్య నిర్వాహణ లోపాలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.
Apr 17 2024, 15:06