NLG: ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న ఎరెడ్ల రఘుపతి రెడ్డి

నాంపల్లి: మండలంలోని రేవల్లి గ్రామంలో అనారోగ్యంతో నిరుపేద కుటుంబానికి చెందిన కార్యకర్త రేవెల్లి వెంకులు మరణించడంతో, ఆ కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, సాధారణ ఖర్చుల కొరకు పదివేల రూపాయల ఆర్థిక సహాయం చేసి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని జిల్లా నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి తెలిపి వారి ధైర్యం చెప్పారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూల వెంకటయ్య, పెద్దిరెడ్డి సంజీవరెడ్డి, తుమ్మలపల్లి చంద్రారెడ్డి బట్టు శ్రీను, తుమ్మలపల్లి లింగారెడ్డి, కోన్ రెడ్డి యాదయ్య, కోన్ రెడ్డి వెంకటయ్య, బట్టు జగన్, మేకల కొండల్, గ్రామ శాఖ బట్టు శ్రీశైలం, మేకల రాములు, తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.

NLG: కస్తూరిభా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుక

నాంపల్లి: మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల గురుకుల పాఠశాలలో, ఆదివారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్133 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ విజయశ్రీ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ప్రముఖ భారతీయ న్యాయవాది, ఆర్థిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, కుల నిర్మూలన కోసం ఎంత కృషి చేశాడని, అతను స్వాతంత్ర భారతదేశం మొట్టమొదటి కేంద్ర న్యాయ శాఖ మంత్రిని, రాజ్యాంగ శిల్పి అలాంటి గొప్ప మహనీయుల జయంతి వర్ధంతులను చేసుకోవాలని, వారి ఆశయ సాధనకై యువత ఎప్పుడు ముందుండాలని ఆమె అన్నారు.

అదేవిధంగా కేతపల్లి గ్రామంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి గ్రామ మాజీ సర్పంచ్ కోరే యాదయ్య, కాశీమల జంగయ్య, వడ్లకొండ రమేష్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి గ్రామ ప్రజలకు ఆయన సేవలు చేసిన గురించి తెలియజేశారు.

NLG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూల వెంకటయ్య

నాంపల్లి: మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పూల వెంకటయ్య, ఆదివారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన సిఎం రేవంత్ రెడ్డిని శాలువ తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో, రామన్నపేట మండలం బోగారం గ్రామంలో, ఆదివారం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కునూరు సాయి కుమార్ గౌడ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు మేడి కృష్ణ, అంబేద్కర్ యువజన సంఘం కమిటీ అధ్యక్షులు మేడి రవీందర్, విగ్రహం కమిటీ కోశాధికారి మేడి నరసింహ, కమిటీ గౌరవ అధ్యక్షులు మేడి యాదయ్య, మాజీ ఎంపిటిసి మేడి రామలింగం, మాజీ వార్డ్ మెంబర్ మేడి యాదయ్య, మెట్టు అంజయ్య, బొడ్డుపల్లి లింగయ్య, గోగు శ్రీను,చింతల మల్లేష్,మేడి చిరంజీవి,మేడి శివ,మేడి ముఖేష్ ,గుంజా ఆంజనేయులు, గుంజ మహేష్, మేడి మల్లేష్,కునూరు రాజు గౌడ్ ,జల శ్రీనివాస్,బద్దుల మహేష్ ,బద్దుల రాజు ,చిరగోని నవీన్ గౌడ్, గుంజ గణేష్, గుంజ కనకయ్య,గుంజ సత్తయ్య,ఏర్పుల కిరణ్,మేడి స్వామి,మేడి లింగస్వామి, కునూరు వెంకన్న, మోహిన్, మెట్టు తదితరులు పాల్గొన్నారు.

NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి

నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి, దేవరకొండ:

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చే స్థాపించబడిన ఆలిండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని.. ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా, దేవరకొండ పట్టణంలో దిండి చౌరస్తా నుండి స్థానిక బస్టాండ్ వరకు జై భీమ్ నినాదాలతో, డప్పుల దరువులతో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కొండమల్లేపల్లి పట్టణంలో చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆలిండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు బిక్షపతి మాట్లాడుతూ.. 14 డిసెంబర్ 1891లో జన్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్, పేద వర్గాలకు చెందిన వారైనప్పటికీ ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగం రచనలో కీలక పాత్ర పోషించారని, బడుగు బలహీనవర్గాలకు ఎంతో మేలు చేశారని, ప్రస్తుతం మనం పొందుతున్న రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించినవేనని అన్నారు. 

మహనీయులు అడుగుజాడల్లో నిలిచి వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఏకుల సురేష్, జిల్లా కార్యదర్శి మానే ప్రవీణ్ కుమార్, నియోజకవర్గం అధ్యక్షుడు చిట్యాల గోపాల్ ఉపాధ్యక్షుడు ఏకుల అంబేద్కర్, నాయకులు ధర్మపురి శీను, సాయి, కూర శ్రీకాంత్, మేడ సైదులు, పేర్ల గిరి తదితరులు పాల్గొన్నారు.

CSL ఫుట్బాల్ లీగ్స్ పోటీలకు ముఖ్యఅతిథిగా డిఎస్పి శివరాం రెడ్డి

నల్లగొండ టౌన్: CSL ఫుట్బాల్ లీగ్ మ్యాచ్ లో మాన్ ఫోర్ట్ ఫుట్బాల్ క్లబ్, చత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరా హోరి మ్యాచ్ జరగగా 2-2 స్కోర్ నిర్ణీత సమయానికి రెండు జట్లు సమ స్కోర్టు తో నిలిచి మ్యాచ్ డ్రా అయ్యి ముగియడం జరిగింది.

ఈ సందర్భంగా మహమ్మద్ జాన్ స్మారకార్థం వారి కుమారుడు మహమ్మద్ ఫయాజ్ అరటిపండ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను క్రీడాకారులకు పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది.

ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీబొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ.. ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసే విధంగా CSL ఫుట్బాల్ లీగ్ పోటీలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ డిఎస్పి శివరాం రెడ్డి రావడం, క్రీడాకారుల తో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు.

ఈరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నల్గొండ DSP శివరాం రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు, క్రమశిక్షణ అలవాటు అవుతుందని తెలియజేస్తూ, ఫుట్బాల్ క్రీడ ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని తెలిపారు. నల్గొండ జిల్లాలో చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా గొప్పవని వ్యవస్థాపకులు బొమ్మ పాల గిరిబాబు ను ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్ లను ప్రత్యేకంగా అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, కత్తుల హరి, శంకర్, తాజుద్దీన్, వెంకటసాయి, యశ్వంత్, శివదాసు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

చండూరు గురుకుల పాఠశాలలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి

NLG: అంబేద్కర్ 134వ జయంతి ని పురస్కరించుకొని, నల్లగొండలోని చండూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ ఆకుల బిక్షమయ్య అధ్యక్షతన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

అనంతరం వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు గ్యార యాదగిరి, ఉపాధ్యక్షులు అద్దంకి కిరణ్,శీను, సుష్మ, చంద్రయ్య, రాధిక, తదితరులు పాల్గొన్నారు.

NLG: మర్రిగూడ మండలంలో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి

మర్రిగూడ: మండల కేంద్రంలో, నేడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మాల మహానాడు మండల అధ్యక్షులు నాగిళ్ల మారయ్య ఆధ్వర్యంలో, స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షులు పందుల రాములు,బీసీ సంఘ అధ్యక్షులు చెరుకు శ్రీరామ్,మాజీ సర్పంచ్ నల్ల యాదయ్య,ఈద అభి సందేశ్,ఈద కాశి,పగడాల రఘు,గ్యార హరికృష్ణ, ఆవుల ప్రభుదాస్,వడ్డే వెంకటేష్, కొండల్,సిప్పంగి శ్రీను,శంకర్,అజయ్, శివరాజ్, ప్రభుదాస్ పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NALGONDA DIST

నల్లగొండ జిల్లా బిజెపి కార్యాలయంలో గడ్డం వెంకట్ రెడ్డి, దాసోజు యాదగిరి చారి లకు సన్మానం

నల్లగొండ: జిల్లా బిజెపి కిసాన్ మోర్చా అధ్యక్షులుగా నియమితులైన గడ్డం వెంకట్ రెడ్డి మరియు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులైన దాసోజు యాదగిరి చారి లను శనివారం బిజెపి జిల్లా కార్యాలయంలో శాలువ తో సన్మానించిన, బిజెపి పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, జిల్లా అధ్యక్షులు డా. నాగం వర్శిత్ రెడ్డి, పిల్లి రామరాజు యాదవ్, పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంతరెడ్డి శ్రీదేవి రెడ్డి, రాష్ట్ర నాయకులు పోతేపాక సాంబయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు దర్శనం వేణు, గడ్డం మహేష్, తిప్పర్తి మండల అధ్యక్షుడు పల్లె ప్రకాష్, ఆవుల మధు, బాకీ నరసింహ, గుండ్లపల్లి శాంతి స్వరూప్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందించిన వైఆర్పి ఫౌండేషన్

నల్గొండ: పట్టణంలోని JBS ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం YRP ఫౌండేషన్ వారు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల హెడ్మాస్టర్ నిర్మల్ రెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మొత్తం.. YRP ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG