NLG: ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ 133వ జయంతి
నల్లగొండ జిల్లా: కొండమల్లేపల్లి, దేవరకొండ:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చే స్థాపించబడిన ఆలిండియా సమతా సైనిక్ దళ్ నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో, మహాత్మ జ్యోతిరావు పూలే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహనీయుల జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని.. ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి సందర్భంగా, దేవరకొండ పట్టణంలో దిండి చౌరస్తా నుండి స్థానిక బస్టాండ్ వరకు జై భీమ్ నినాదాలతో, డప్పుల దరువులతో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కొండమల్లేపల్లి పట్టణంలో చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆలిండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బుర్రి వెంకన్న, జిల్లా అధ్యక్షుడు మద్దిమడుగు బిక్షపతి మాట్లాడుతూ.. 14 డిసెంబర్ 1891లో జన్మించిన బాబాసాహెబ్ అంబేద్కర్, పేద వర్గాలకు చెందిన వారైనప్పటికీ ఉన్నత చదువులు చదివి భారత రాజ్యాంగం రచనలో కీలక పాత్ర పోషించారని, బడుగు బలహీనవర్గాలకు ఎంతో మేలు చేశారని, ప్రస్తుతం మనం పొందుతున్న రాజ్యాంగ ఫలాలు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించినవేనని అన్నారు.
మహనీయులు అడుగుజాడల్లో నిలిచి వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఏకుల సురేష్, జిల్లా కార్యదర్శి మానే ప్రవీణ్ కుమార్, నియోజకవర్గం అధ్యక్షుడు చిట్యాల గోపాల్ ఉపాధ్యక్షుడు ఏకుల అంబేద్కర్, నాయకులు ధర్మపురి శీను, సాయి, కూర శ్రీకాంత్, మేడ సైదులు, పేర్ల గిరి తదితరులు పాల్గొన్నారు.
Apr 15 2024, 08:00