NLG: విద్యార్థులకు పరీక్ష ప్యాడ్ లను అందించిన వైఆర్పి ఫౌండేషన్

నల్గొండ: పట్టణంలోని JBS ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6, 7 తరగతి విద్యార్థిని విద్యార్థులకు వార్షిక పరీక్షల కోసం YRP ఫౌండేషన్ వారు పరీక్ష ప్యాడ్స్ అందజేశారు.

ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు, పాఠశాల హెడ్మాస్టర్ నిర్మల్ రెడ్డి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల బృందం మొత్తం.. YRP ఫౌండేషన్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: డ్రగ్ కేసులలో శిక్షల శాతం పెరిగేలా పని చేయాలి: అడిషనల్ ఎస్పీ

నల్లగొండ: డ్రగ్ కేసులలో శిక్షల శాతం పెరిగేలా పని చేయాలని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఎస్పీ చందనా దీప్తి ఆదేశాల మేరకు ఏఎస్పి రాములు నాయక్ ఆధ్వర్యంలో, కోర్టు డ్యూటీ అధికారులకు ఎన్డీపీయస్/డ్రగ్స్ కేసులలో శిక్షల పురోగతి పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ప్రతి కేసులో తప్పు చేసిన నిందితులకు శిక్ష పడేలా చేయడం ద్వారా నమ్మకం పెరుగుతుందని అన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

NLG: స్నేహితుడి కుటుంబాన్ని ఆదుకున్న తోటి స్నేహితులు

శాలిగౌరారం మండలం, చిత్తలూరు గ్రామానికి చెందిన ఎర్ర సుధాకర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఇవాళ ఆయన దశదిన కర్మ సందర్భంగా టెన్త్ 1999 బ్యాచ్ స్నేహితులు కార్యక్రమంలో పాల్గొని మిత్రుడికి నివాళులు అర్పించారు.

కూరెళ్ల యాదగిరి పూర్వ విద్యార్థులను ఏకం చేసి పేదరికంలో ఉన్న మిత్రుడు ఎర్ర సుధాకర్ కుటుంబానికి రూ. 20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. సుధాకర్ కు భార్య ముగ్గురు, ఆడపిల్లలు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ శౌరిరెడ్డి కి నివాళులు అర్పించిన తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి

NLG: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ ప్రభుత్వ ఫిజికల్ డైరెక్టర్ గాదె శౌరిరెడ్డి దశదిన కర్మ సందర్భంగా ఈరోజు నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కుంభం రామ్ రెడ్డి పాల్గొని..  శౌరిరెడ్డి చిత్రపటానికి పుష్పాలను సమర్పిస్తూ ఘనంగా నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా వ్యాయామ విద్య విభాగానికి, మరియు ఎంతోమంది యువతీ యువకులను గొప్పక్రీడాకారులుగా తీర్చిదిద్దడంలో శౌరిరెడ్డి పాత్ర చాలా గొప్పదని ఆయన సేవలను కొనియాడారు. 

ఈ కార్యక్రమంలో మాజీ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు కుంభం నర్సిరెడ్డి, చత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబు, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్, లింగయ్య, రాములు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Download Streetbuzz news app

ఈనెల 21న ఆలేరు లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక

నల్లగొండ: ఈనెల 27 నుండి 30 తేదీ వరకు కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో 10 వ రాష్ట్రస్థాయి పురుషుల ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను నిర్వహించనున్నారు.

దానికి అనుగుణంగా ఈనెల 21 న ఆదివారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తున్నామని, తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మరియు ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సెలక్షన్ ప్రక్రియలో పాల్గొనదలచిన ఉమ్మడి జిల్లాకు చెందిన ఫుట్బాల్ క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలని, పూర్తి వివరాలకు జాయింట్ సెక్రెటరీ గడసంతుల మధుసూదన్ (సెల్ నెంబర్ 90009-89671) మరియు అసిస్టెంట్ సెక్రటరీ మద్ది కర్ణాకర్ (సెల్ నెంబర్ 94925-72900) లను సంప్రదించాలని సూచించారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Download Streetbuzz news app

నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

నాంపల్లి మండల ప్రెస్ క్లబ్ ఆరవ వార్షికోత్సవ డైరీ ఆవిష్కరణ శనివారం జరిగింది. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో వారి చేతుల మీదుగా డైరీ ఆవిష్కరణ జరిగింది.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్, నాంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, ఆధ్వర్యంలో టి యు డబ్ల్యూ జే -143 నాంపల్లి మండల శాఖ ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, నాంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, ఎరెడ్ల నారాయణరెడ్డి పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

Download Streetbuzz news app

మర్రిగూడెం మండలంలో కురిసిన చిరుజల్లులు...

నల్గొండ జిల్లా:

మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో సాయంత్రం ఐదు గంటల సమయంలో చిరుజల్లులు కురిసాయి. వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిన ప్రకారం ఇవాళ వర్షం కురిసింది. ఉదయం అంతా ఓ మోస్తారు గా ఎండగా ఉన్న వాతావరణం సాయంత్రం సమయానికి ఒక్కసారిగా చల్లబడి, చిరుజల్లులు కురవడం మొదలయ్యింది. దీంతో వేసవి వేడి నుండి కాస్త ఉపశమనం కలిగినట్లు అయ్యింది.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

SB NEWS NLG

కళారంగంలో సేవలందించినందుకు రామ్‌చరణ్‌ కు డాక్టరేట్

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ నెల 13న జరగనున్న చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో రామ్ చరణ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ డాక్టరేట్‌ను అందుకోనున్నారు. 

కళారంగంలో రామ్‌చరణ్ అందించిన సేవలకుగానూ డాక్టరేట్‌ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇక రామ్‌చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంపై మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: డా.బిఆర్ అంబెడ్కర్, కామ్రేడ్ జార్జి రెడ్డి ఆశయాల సాదన కై ఏప్రిల్ 14 న మార్నింగ్ వాక్

నల్లగొండ: భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బిఆర్ అంబెడ్కర్ 143 వ జయంతి మరియు విప్లవ విద్యార్థి నాయకుడు, PDSU వ్యవస్థాపకుడు ఇండియన్ చేగువేరా, ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి 52 వ వర్ధంతి సందర్భంగా వారి ఆశయాల సాధనకై ఏప్రిల్ 14 న ఉదయం 6 గంటలకు ఎన్. జి కాలేజ్ నుండి గడియారం సెంటర్ వరకు మార్నింగ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని.. ఈ కార్యక్రమంలో అంబెడ్కర్, జార్జిరెడ్డి అభిమానులు, PDSU పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల మేధావులు, విద్యావంతులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని PDSU జిల్లా పూర్వ అధ్యక్షుడు పన్నాల గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు.

పన్నాల గోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. సమాజంలో అస్పృశ్యత, అంటరానితనం, దోపిడీ, పీడన, అసమానతలను రూపుమాపేందుకు డా.బిఆర్ అంబెడ్కర్, కా.జార్జిరెడ్డి లు ఎంతో కృషి చేశారని అన్నారు. 

పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, అనేక అవమానాలను, అణిచివేత లను ధిక్కరించి భారత జాతికి గొప్ప రాజ్యాంగాన్ని డా.బిఆర్ అంబెడ్కర్ అందించాడని అన్నారు. 

కా. జార్జిరెడ్డి సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులను చైతన్యం చేసినాడని, యూనివర్సిటీ లో మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డుకట్టవేశాడని పేర్కొన్నారు. ఇద్దరి మేధావుల జయంతి, వర్ధంతిలు ఒకేరోజు రావడం కాకతాలియం అయినప్పటికీ వారి ఇద్దరి లక్ష్యం ఒక్కటేనని దేశంలో కులం, మతం లేని సమ సమాజాన్ని ఆవిష్కరించాలని కలలు కన్నారని వారి ఆశయాల అమలు కై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 

అందులో భాగంగానే ఏప్రిల్ 14న డా,,బి.ఆర్ అంబెడ్కర్, కా,,జార్జిరెడ్డి ల స్పూర్తితో నల్లగొండలోని ఎన్.జి కాలేజ్ నుండి గడియారం సెంటర్ వరకు జరిగే మార్నింగ్ వాక్ లో ప్రగతిశీల మేధావులు, అభిమానులు, PDSU మాజీ,తాజా విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

       

NLG: సిపిఎం అభ్యర్థిని పార్లమెంటుకు పంపించాలి: ఎన్నికల ప్రచారం లో సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య

మర్రిగూడెం మండలం, ఇందుర్తి గ్రామంలో, ప్రజా ఉద్యమ నాయకుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి ఎం.డి జహంగీర్ ను గెలిపించాలని, సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య అన్నారు. ఉపాధి హామీ పని ప్రదేశంలో కూలీలను కలిసి సిపిఎం అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. ప్రజా పోరాటాలలో ముందున్న సిపిఎం అభ్యర్థిని పార్లమెంటుకు పంపించాలని ఓటర్లను కోరారు.

ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా ఏలుతున్న బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందని, ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రవేట్ పరం చేస్తూ నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెంచి పోషించిందని, ప్రజలపై పెనుభారం మోపుతుందని ఆరోపించారు. ఈ బిజెపి ప్రభుత్వాన్ని ఎన్నికల్లో ఓడించాలని, అట్లాగే ప్రతినిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతున్న ప్రజా నాయకుడు ఎర్రజెండా ను భుజాన ఎత్తుకున్న భువనగిరి ఎంపీ అభ్యర్థి జహంగీర్ ను ఢిల్లీ పార్లమెంట్ కు పంపాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పగిళ్ల రామచంద్రం, అయితగోని నరసింహ గౌడ్, అనంతల నరసింహ గౌడ్, శ్రీరామదాసు సుదర్శనమ్మ, చెరుకు గౌరమ్మ, పగిళ్ల కవిత, ఊరి పక్క ఇందిరమ్మ, ఊరి పక్క రాములమ్మ, బోడ సత్తెమ్మ, శ్రీరామదాసు సత్యనారాయణ చారి, అయితగోని సత్తమ్మ, పగిళ్ల మట్టమ్మ, వీరమల్ల నరసమ్మ, తదితరులు పాల్గొన్నారు.