NLG: దామర భీమన పల్లి లో ఘనంగా పూలే 197వ జయంతి
నల్లగొండ జిల్లా, మర్రిగూడెం మండలం:
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక విప్లవానికి పునాదులు వేసినా ఉద్యమకారుడు, మహిళలకు విద్యావకాశం కల్పించిన గొప్ప సంఘసంస్కర్త, మహాత్మ జ్యోతి రావు పూలే 197 వ జయంతి సందర్బంగా, దామెర భీమనపల్లి గ్రామములో మహనీయుడి సేవలను స్మరించుకుంటూ పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు కర్నాటి సత్తయ్య గౌడ్, కొండూరు శేఖర్ గుప్తా, కర్నాటి కృష్ణయ్య గౌడ్, గ్రామ యువకులు అంబళ్ల రవి గౌడ్, మెట్టు శ్రీకాంత్, షేక్ సలీం, బెల్లంకొండ నాగరాజు గ్రామ ప్రజలు కాశిం బి, మోహన్ రెడ్డి, శ్రీను, లక్ష్మమ్మ, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS
SB NEWS NALGONDA DIST
Apr 11 2024, 20:59