NLG: చండూర్ లో ఘనంగా జ్యోతిబాపూలే జయంతి

చండూరు: బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం కార్యాలయం చండూరు నందు, మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మునుగోడు నియోజకవర్గ బీఎస్పీ ఇన్చార్జి నేరెళ్ల ప్రభుదాస్, బహుజన్ సమాజ్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి నరసింహ మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు, మనుషుల్ని మహాత్ముని గా తీర్చిదిద్దేది విద్య ఒక్కటేనని, మనిషిని మహోన్నతమైన ఉన్నత స్థాయికి విద్యనే తీసుకొని వెళుతుందని భావించి, మహిళలకు సైతం విద్యను నేర్పించి తన భార్యను ఉపాధ్యాయురాలుగా చేసి మొట్టమొదటి పంతులమ్మ గా తీర్చిదిద్దిన వ్యక్తి మహాత్మ జ్యోతిబా పూలే అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అసెంబ్లీ అధ్యక్షుడు పల్లేటి వినోద్ కుమార్, అసెంబ్లీ కార్యదర్శి అన్నిపాక శంకర్, చండూర్ మున్సిపల్ అధ్యక్షులు కడారి సైదులు యాదవ్, చండూర్ బహుజన్ సమాజ్ పార్టీ ఉపాధ్యక్షులు చాపల నాగరాజ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

NLG: వివక్ష లేని సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతి బా పూలే

నకిరేకల్: మహాత్మా జ్యోతి రావ్ పూలే జయంతి సందర్భంగా, శాసనసభ్యులు వేముల వీరేశం, పట్టణంలోని పన్నాల గూడెం క్యాంపు కార్యాలయం నందు పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...

సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్షకు వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన క్రాంతి కారుడు పూలే అని మహాత్మ పూలే సేవలను స్మరించుకున్నారు.

వివక్ష లేని సమానత్వ సమాజం కోసం జీవితాంతం శ్రమించిన గొప్ప సామాజిక తత్వవేత్త జ్యోతి బా పూలే అని కొనియాడారు.

సామాజిక కార్యకర్తగా, సంఘ సంస్కర్తగా, వర్ణ వివక్ష వ్యతిరేక పోరాటానికి బాటలు వేసిన దార్శనికుడు మహాత్మా జ్యోతి రావ్ గోవింద్ రావ్ పూలే.. దళిత, బహుజన జనోద్ధరణ కోసం జీవితకాలం పూలే చేసిన కృషి భారత సమాజంలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేసిందన్నారు.

తన భార్య సావిత్రి బాయి పూలే కు విద్యాబుద్దులు నేర్పి, దేశంలో ప్రథమ ఉపాధ్యాయురాలిని చేసి స్త్రీ విద్యకు బాటలు వేసిన ఘనత పూలేకు దక్కుతుందన్నారు. పూలే ఆశయ సాధన దిశగా నిరంతరం కృషి చేయాలని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండల PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, స్థానిక కౌన్సిలర్లు, మండల నాయకులు, తదితరులు పాల్గొన్నారు..

ఇఫ్తార్ విందులో పాల్గొన్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్

నాంపల్లి: మండల కేంద్రంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కర్నాటి విద్యాసాగర్, బుధవారం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. 


ఈ కార్యక్రమంలో కోట రఘునందన్, తిప్పని వెంకట్ రెడ్డి, అలంపల్లి ఆనంద్ కుమార్, పోలోజు వెంకటాచారి, శర్ఫోద్దీన్, కైరత్ జాను, దస్తగిరి, ముస్లిం పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS

SB NEWS NLG

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి

నల్లగొండ: ఆర్ అండ్ బి మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. బుధవారం జిల్లా మరియు నియోజకవర్గ ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అకుంఠిత దీక్ష ధార్మికచింతనలతో ముస్లింలంతా నెల రోజులపాటు దీక్షలు చేపట్టారని అన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తిని అల్లా మీకు ప్రసాదించాలని కోరారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన ల కలయిక పవిత్ర రంజాన్ మాసం అని అన్నారు.

SB NEWS

SB NEWS NLG

రంజాన్ శుభాకాంక్షలు: ఎస్పి రాహుల్ హెగ్డే

సూర్యాపేట: రంజాన్ పండుగ సందర్బంగా ముస్లిం సోదరులకు, జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే రంజాన్ శుభాకాంక్షలు తెలిపినారు. రంజాన్ త్యాగాలకు, మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. ప్రజలు అందరు కలిసి మెలిసి ఉత్సవాలు జరుపుకోవాలని కోరినారు.

TG: భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరబాద్ లో ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటుచేసిన, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మరియు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు.

SB NEWS

SB NEWS TELANGANA

NLG: పకడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

మిర్యాలగూడ: లోక్ సభ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని, జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. 

మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రం, ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ లను బుధవారం పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం, రిసెప్షన్ కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

TG: బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరిన పిల్లి రామరాజు యాదవ్

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ ఎమ్మెల్యేగా పోటీ చేసిన పిల్లి రామరాజు యాదవ్, ఇవాళ హైదరాబాద్లోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరారు. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని మోడీ 10 సం.లుగా అందించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పిల్లి రామరాజు బిజెపి పార్టీలో జాయిన్ అయ్యారని తెలిపారు. 

కార్యక్రమంలో బిజెపి నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, పలువురు బిజెపి నాయకులు, తదితరులు ఉన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం

కేతేపల్లి మండలం, గుడివాడ గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పండుగకు మంగళవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS NATIONAL MEDIA

SB NEWS TELANGANA

NLG: మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. నియోజకవర్గ ప్రజలకు మరియు జిల్లా, రాష్ట్ర ప్రజలకు క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట పండగ ఆనందం వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, సిరిసంపదలతో తులతూగాలని, జీవితంలో ప్రతి ఒక్కరు దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.