డ్రగ్స్ ని అరికట్టడానికి కఠినమైన చట్టాలను ఉపయోగిస్తున్నాం: SP
నల్లగొండ జిల్లా :
నల్లగొండ జిల్లాలో నల్గొండ సబ్ డివిజన్ పరిధిలో 26 కేసులలో పట్టుబడిన, ఒక కోటి 93 లక్షల విలువ గల 1379 కేజీల గంజాయి, నార్కట్ పల్లి మండలం గుమ్మల్లబావి గ్రామంలోని 12 వ బెటాలియన్ గన్ ఫైరింగ్ రేంజ్ ప్రదేశంలో డ్రగ్స్ డిస్ట్రక్షన్ కమిటీ ఆధ్వర్యంలో తగలబెట్టినట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి శనివారం తెలిపారు.
-గంజాయి అక్రమ రవాణాపై జిల్లా పోలీసులు గట్టి నిఘా పెట్టారు.
-డ్రగ్స్ ని అరికట్టడానికి కఠినమైన చట్టాలను ఉపయోగిస్తున్నాం.
-డ్రగ్స్ కట్టడి కోసం తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ టీం ని ఏర్పాటు చేసి ట్రైనింగ్ కూడా ఇస్తుంది అని SP తెలిపారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG
Apr 07 2024, 10:07