NLG: మర్రిగూడ మండల బిజెపి ప్రధాన కార్యదర్శిగా బోయపల్లి రాజు గౌడ్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం లోని కుదాబక్షుపల్లి గ్రామానికి చెందిన, బోయపల్లి రాజు గౌడ్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా నియామకం అయ్యారు.
బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి మండల నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బిజెపి మండల అధ్యక్షుడు పాత్లవత్ రాజేందర్
నాయక్ వారికి నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి రాజు గౌడ్ మాట్లాడుతూ.. పార్టీ ఎదుగుదలకు క్రమశిక్షణతో కృషి చేస్తానని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసినందుకు గాను తనను గుర్తించి నియమించిన బిజెపి రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, మరియు జిల్లా నాయకులకు, సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG
Apr 04 2024, 10:39