నల్లగొండ జిల్లాలో ఘోరం జరిగింది...
బాధ్యత లేని అధికారులు.. వాటర్ ట్యాంకు లో కోతులు చనిపోగా.. ఆ నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారు. ఇది ఎక్కడో కాదు నల్లగొండ జిల్లా, నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో జరిగింది.
నందికొండ మున్సిపాలిటీ ఒకటో వార్డు పరిధిలో విజయ విహార్ ప్రక్కన ఉన్న వాటర్ ట్యాంకులో కోతుల కళేబరాలు కనిపించాయి. అవే నీటిని గత కొన్ని రోజులుగా సరఫరా చేస్తున్న ఎన్ఎస్పి అధికారులు.. అదే నీటిని తాగుతున్న ప్రజలు.
వాటర్ ట్యాంక్ పై రేకులు ఉన్న మూత తెరిచి ఉంచడంతో లోపలికి వెళ్ళిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందాయి. దాదాపు 30 నుండి 40 కోతులు చనిపోయినట్లు సమాచారం.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA

మునుగోడు: జాతీయ మాలమహానాడు అధ్వర్యంలో, తెలంగాణ వ్యాప్తంగా చేపడుతున్న భారత రాజ్యాంగ రక్షణ యాత్ర కరపత్రాలను, మునుగోడు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కరపత్రాలను ఆవిష్కరించారు.
నల్లగొండలో 3 వ తారీకు జరిగే యాత్రకు పెద్ద యెత్తున తరలి రావాలని మండల అధ్యక్షుడు చలిచీమల యాదయ్య పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్చార్జి బెల్లపు బాల శివరాజు, మండల ప్రధాన కార్యదర్శి బేరీ రవీందర్, కార్యదర్శి కూకట్ల మల్లేష్, నాయకులు రెడ్డిమల్ల యాదగిరి,బోల్లు సైదులు, బొల్లు శ్రీశైలం, పురం రామచంద్రం, సంకు లింగస్వామి, గోలి హుస్సేన్, పెరుమాల్ల రాజీవ్, మండల నాయకులు పాల్గొన్నారు.

Apr 04 2024, 08:08
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
23.5k