NLG: పర్యావరణ క్యాలెండర్ ఆవిష్కరించిన పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు

నల్లగొండ: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ.. ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం (ఐఈఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్ను, తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం పర్యావరణ ఇంజనీర్ పి.సురేష్ బాబు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక, పర్యావరణ అంశాలతో కూడిన ప్రకృతి దినాలను పొందుపరిచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన సంస్థకు అభినందనలు తెలిపారు.  

కార్యక్రమంలో సహాయ పర్యావరణ ఇంజనీర్ ఎండి సజీనా బేగం, సహాయ పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.పురుషోత్తం రెడ్డి, డాక్టర్ యం.రామకృష్ణ, కాలుష్య నియంత్రణ మండలి సిబ్బంది రహిమ, కె.నాగరాజు, విజిత, తదితరులు పాల్గొన్నారు.

NLG: చిరుధాన్యాల ప్రాముఖ్యత గురించి వివరించిన సూపర్వైజర్ పద్మ

నల్లగొండ జిల్లా:

గట్టుప్పల్: మండలం అంతం పేట గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో మంగళవారం పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ పద్మ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. చిరుధాన్యాల ఉపయోగము, ప్రాథమిక విద్య, రెండు సం. లోపు పిల్లలకు అందించాల్సిన పోషకాహారం గురించి వివరించారు. దేవులపల్లి తండాలో చిరుధాన్యాలతో పోషకాహారం తయారు చేయించి బహుమతులు అందజేశారు. అంగన్వాడీ టీచర్లు కలమ్మ, అంబిక, యాదమ్మ, సునీత, శారద, మరియు పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

NLG: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో స్వచ్ఛ గ్రంథాలయ కార్యక్రమం

నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాల జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ మహిళా యూనిట్-4 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మరియు గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో, ఈ రోజు స్వచ్ఛ గ్రంథాలయ కార్యక్రమం నిర్వహించారని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ మునీర్ తెలిపారు .

ఎన్ఎస్ఎస్ మహిళా యూనిట్-4 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ గంజి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. స్వచ్ఛ గ్రంథాలయం కార్యక్రమం లో గ్రంథాలయం ముందు మరియు గ్రంథాలయ పరిసరాలలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలను వాలంటీర్లు తీసివేశారు అని మన కళాశాల మన గ్రంథాలయం పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు.

కళాశాల గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ.. గ్రంథాలయంలో ఉన్నటువంటి పుస్తకాలు, పత్రికల విభాగం ఒక క్రమ పద్ధతిలో ఎన్ఎస్ఎస్ విద్యార్థినిలు అమర్చారు. రీడింగ్ హాల్ ఆవరణలో అనవసరమైనటువంటి చెత్త ను తీసివేశారు. ఆ తరువాత గ్రంథాలయం ముందున్నటువంటి గార్డెన్ లో ఉన్నటువంటి మొక్కలకు నీళ్లు పెట్టారు. మన కళాశాల మన గ్రంథాలయం స్వచ్ఛ గ్రంథాలయంగా ఉండాలని అటువంటి ఉద్దేశంతో ఈరోజు కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థినిలు ఈ యొక్క జాతీయ సేవా పథకం ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని గ్రంథాలయాన్ని మరియు గ్రంధాల ఆవరణంలో ఉన్నటువంటి పరిసరాలను శుభ్రం చేశారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగుల వేణు, మణెమ్మ అసిస్టెంట్ లైబ్రేరియన్, సూదిని వెంకట్ రెడ్డి లైబ్రరీ రికార్డు అసిస్టెంట్, రేణుక మరియు ఎన్ఎస్ఎస్ మహిళా విభాగం యూనిట్-4 విద్యార్థినిలు పాల్గొని ఈ స్వచ్ఛ గ్రంథాలయం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

NLG: మల్లు స్వరాజ్యం కు జోహార్లు అర్పించిన సిపిఎం పార్టీ

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. సిపిఎం మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. కామ్రేడ్ స్వరాజ్యం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో, తుపాకీ పట్టి ముందుండి పేద ప్రజల సమస్యల కోసం పోరాటం చేసిన వీరనారి అని కొనియాడారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో భూస్వామి కుటుంబంలో జన్మించిన ఆమె చిన్ననాటి నుండి ఎర్రజెండా భుజాన వేసుకొని భూస్వాములకు వ్యతిరేకంగా రజాకారులతో పోరాటం చేసిన వీరవనిత జమీందారు రజాకార్లను గడగడలాడించిన వీరవనిత మల్లు స్వరాజ్యం. తుంగతుర్తి నియోజకవర్గ సిపిఎం పార్టీ ఎమ్మెల్యే పనిచేశారు. ఆమె ఆశయ సాధన కోసం యువతరం ఆమె అడుగు జాడల్లో నడవాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎడ్ల నరసింహ రాజు నాయక్, మల్లేష్, రాజు, వెంకటయ్య తదితరులు పాల్గొని జోహార్లు అర్పించారు.

NLG: కొండమల్లేపల్లి నూతన తహశీల్దారు గా అనురాధ

కొండమల్లేపల్లి నూతన తహశీల్దారు గా అనురాధ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు కొండమల్లేపల్లి తహశీల్దారు గా ఉన్న దివ్యారెడ్డి హైదరాబాద్ కు బదిలీ అయ్యారు. హైదరాబాద్ లో విధులు నిర్వహిస్తున్న అనురాధ కొండమల్లేపల్లి కి బదిలీపై వచ్చారు.

కామ్రేడ్ మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి

మిర్యాలగూడ: భవిష్యత్తు ప్రజా ఉద్యమాలకు మల్లు స్వరాజ్యం స్ఫూర్తిగా నిలిచారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్ అన్నారు. మంగళవారం కామ్రేడ్ మల్లు స్వరాజ్యం రెండో వర్ధంతి సందర్భంగా, మిర్యాలగూడ సిపిఎం కార్యాలయంలో, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రవి నాయక్, మంగారెడ్డి, వరలక్ష్మి, రామ్మూర్తి, గౌతమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

NLG: అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం

చౌటుప్పల్: పట్టణ కేంద్రంలోని వలిగొండ రోడ్డులో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో, ఈ రోజు మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు - సంధ్య దంపతులు ఆధ్వర్యంలో, అంగరంగ వైభవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకట్ రాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

NLG: నల్లగొండ రూరల్ పోలిస్ లకు కృతజ్ఞతలు తెలిపిన గుంటూరు జిల్లా వాసి

నల్లగొండ: రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మర్రిగూడ బైపాస్ రోడ్డు వద్ద పెట్రోలింగ్ లో ఉన్న పోలీస్ లకు సూపర్ లగ్జరీ బస్సు నుండి పడిపోయిన సూట్కేస్ ను ఆదివారం  సంబంధిత సూట్కేస్ యజమాని ని గుర్తింపు చేపట్టి వారికి అందజేశారు. వివరాలు ఇలా..గత ఐదు రోజుల క్రితం గుంటూరు జిల్లా నకిరికల్ - హైదరాబాద్ వెళుతున్న సూపర్ లక్సరీ బస్సు ప్రయాణంలో ఓ వ్యక్తికి సంబంధించిన సూట్కేస్ రాత్రి సమయంలో మర్రిగూడ బైపాస్ వద్ద బస్సు నుండి జారీ క్రింద పడిపోయింది. అదే సమయంలో పెట్రోలింగ్ లో ఉన్న పోలీసులకు ఆ సూట్ కేస్ కనపడింది. ఆ సూట్ కేస్ లో లభించిన ఎగ్జామ్ హాల్ టికెట్ ప్రకారం సంబంధిత వ్యక్తి గుంటూరు జిల్లా నకిరికల్ వాసి ఎస్కే బాషా గా గుర్తించి, ఆయనను పిలిపించి సూట్కేస్ మరియు అందులో ఉన్న విలువైన వస్తువులను, బట్టలను ఆయనకు అందజేశారు. అతను ఈ సందర్భంగా రూరల్ పోలిస్ లకు కృతజ్ఞతలు తెలిపారు.

NLG: తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ (TPSF) నల్గొండ జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక

నల్గొండ: జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లా పంచాయతీ కార్యదర్శులు సమావేశమై జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

జిల్లా అధ్యక్షులు గా కత్తుల మధు

గౌరవ సలహాదారు: తంగెళ్ల ఉపేందర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శి :పూసపాటి నరేష్

కోశాధికారి: ఏశబోయిన నరేష్

జాయింట్ సెక్రెటరీ: బక్కతట్ల వెంకన్న

మహిళా అధ్యక్షులు: కోడిరెక్క శైలజ లను ఎన్నుకున్నారు.

ఉపాధ్యక్షులు గా : S.అంజయ్య, G. వెంకటేష్, P. వెంకన్న, CH .అశోక్, K.సుజాత

సహాయ కార్యదర్శులు గా CH. రమేష్,V.నవీన్, M.వెంకటేష్, L.లక్ష్మి, K.వెంకటేశ్వర్లు

డివిజనల్ అధ్యక్షులు గా జైహిందర్ (దేవరకొండ), B.రామకృష్ణ (మిర్యాలగూడ), అశోక్ (నల్గొండ) లను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కత్తుల మధు మాట్లాడుతూ.....

పంచాయతీ కార్యదర్శుల ప్రధాన సమస్యలు

1)ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలి

2)ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే రెగ్యులర్ చేస్తూ ఒపీఎస్ వ్యవస్థని రద్దు చేయాలి

3)పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థని రెండు గ్రేడ్లుగా విభజించాలి

4) ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను అమలు చేయాలి అని అన్నారు. ఈ కార్యవర్గ ఎన్నికలకు సహకరించిన సమస్త జిల్లా కార్యదర్శులకు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.

NLG: తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ (TPSF) నల్గొండ జిల్లా కార్యవర్గ కమిటీ ఎన్నిక

నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆదివారం జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు సమావేశమై, తెలంగాణ పంచాయతీ సెక్రెటరీ ఫెడరేషన్ (TPSF) నల్గొండ జిల్లా కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్షులు గా కత్తుల మధు

గౌరవ సలహాదారు: తంగెళ్ల ఉపేందర్ రెడ్డి

ప్రధాన కార్యదర్శి: పూసపాటి నరేష్

కోశాధికారి: ఏశబోయిన నరేష్

జాయింట్ సెక్రెటరీ: బక్కతట్ల వెంకన్న

మహిళా అధ్యక్షులు: కోడిరెక్క శైలజ

ఉపాధ్యక్షులు:1)S.అంజయ్య

2) G. వెంకటేష్

3) P. వెంకన్న

4) CH .అశోక్

5) K.సుజాత

సహాయ కార్యదర్శులు:

1)CH. రమేష్

2)V.నవీన్

3)M.వెంకటేష్

4)L.లక్ష్మి

5)K.వెంకటేశ్వర్లు

డివిజనల్ అధ్యక్షులు:

1) జైహిందర్ (దేవరకొండ)

2) B.రామకృష్ణ (మిర్యాలగూడ)

3) అశోక్ (నల్గొండ)

లను ఎన్నుకున్నారు

నూతన జిల్లా తెలంగాణ పంచాయతీ సెక్రటరీ ఫెడరేషన్ కమిటీ ఏర్పాటు అయిన సందర్భంగా జిల్లా అధ్యక్షులు కత్తుల మధు మాట్లాడుతూ.....

పంచాయతీ కార్యదర్శుల ప్రధాన సమస్యలు

1)ప్రొబేషనరీ కాలాన్ని సర్వీస్ కాలంగా పరిగణించాలి

2)ఔట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు తక్షణమే రెగ్యులర్ చేస్తూ ఒపీఎస్ వ్యవస్థని రద్దు చేయాలి

3)పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థని రెండు గ్రేడ్లుగా విభజించాలి

4) ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను అమలు చేయాలని అన్నారు. ఈ కార్యవర్గ ఎన్నికలకు సహకరించిన సమస్త జిల్లా కార్యదర్శులకు జిల్లా అధ్యక్ష, ఉపాధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు.