NHM స్కీం ANM, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

NHM స్కీం ANM, ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి

AITUC ఆధ్వర్యంలో నల్లగొండ DMHO కార్యాలయం ముందు ధర్నా

నల్లగొండ: నేషనల్ హెల్త్ మిషన్ పథకంలో పనిచేస్తున్న2వ ANM మరియు ఇతర ఉద్యోగులందరిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని అలాగే పెండింగులో ఉన్న 3నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి అన్నారు. మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకుంటే ఏ విధంగా బ్రతకాలో ప్రభుత్వ ఆలోచన చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నెట్టుకుంటూ కాలం వెళ్ళబుస్తున్నారు తప్ప ఏఎన్ఎంల గురించి పట్టించుకోవడంలేదని అన్నారు.సుప్రీంకోర్టు కోర్ట్ తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అన్నారు,గురువారం రోజున నల్లగొండ జిల్లా DMHO కార్యాలయం ముందు AITUC ఆధ్వర్యంలో లో నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం )స్కీమ్ ఉద్యోగుల ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.అనంతరం DMHO కొండల్ రావు కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా దేవెందర్ రెడ్డి మాట్లాడుతూ.. గత 20 సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సేవ అందించడంలో NHM స్కీం లో పనిచేస్తున్న ఉద్యోగులు అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నారు,ప్రభుత్వం వీరిని శ్రమదోపిడికి గురిచేస్తుందని అన్నారు,ముఖ్యంగా కరోనా సమయంలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పని చేశారని గుర్తు చేశారు,కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని లేనిపక్షంలో నిరవధిక సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు,అలాగే 7 నెల ఏరియర్స్ బకాయిలు వెంటనే ఇవ్వాలని అన్నారు. ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఒకటవ తేదీన వేతనాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు,ముఖ్యంగా 2వ ANMలు గతంలో సమ్మె చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసి సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చింది. కాని నేటివరకు హామీని అమలు చేయడం లేదని అన్నారు.

ఈ కార్యక్రమంలో రెండవ ANM NHM యూనియన్ నాయకులు కత్తుల రవికుమార్ , గీతా రాణి అన్నపూర్ణ సరిత హైమావతి సుజాత, అండాలు,విజయలక్ష్మి, మల్లేశ్వరి,ఉపేంద్ర,కల్పన,అనిత,తదితరులు పాల్గొన్నారు

TS: తెలంగాణలో తగ్గిన చిరుత పులుల సంఖ్య

తెలంగాణ రాష్ట్రంలో చిరుత పులుల సంఖ్య తగ్గిందని నేషనల్ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. 2018 నాటికి తెలంగాణలో 334 చిరుత పులులు ఉండగా.. 2022లో వాటి సంఖ్య 297కు తగ్గిందని పేర్కొన్నారు.

ఇదే సమయంలో ఏపీలో చిరుతల సంఖ్య 492 నుంచి 569కి పెరిగిందని తెలిపింది.

NLG: శక్తి, ప్రేమ, త్యాగం, ధైర్యానికి.. స్త్రీ నిలువెత్తు నిదర్శనం: ఎంపీపీ

పెడ్డవూర: ప్రస్తుత కాలంలో మహిళలు అన్నీ రంగాలలో రానిస్తున్నారని ఎంపీపి చెన్ను అనురాధ సుందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం లోని గ్రామపంచాయతీ కార్యాలయం లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎంపిపి మాట్లాడుతూ.. మహిళలు తమ పనిలో, గృహ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారని అన్నారు. శక్తి, ప్రేమ, త్యాగం, ధైర్యానికి స్త్రీ నిలువెత్తు నిదర్శనమన్నారు.

క్రీడలు, రాజకీయాలు, ఉద్యోగం,విద్యావేత్తలు, సైన్స్‌ ఇలా ప్రతి రంగంలో, మహిళలు అపారమైన విజయాలు సాధిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మహిళా ఉద్యోగులను ఘన సన్మానం చేశారు.

ఈ కార్యక్రమంలో సీడీపీఓ పద్మావతి, ఏసిడీపీఓ సువర్ణ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం పార్వతి, కస్తూరిభా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
NLG: విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలి

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో, అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని, మహిళా యూత్ కాంగ్రెస్ శక్తి సూపర్ షి కాలేజ్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ తో కలిసి మంగళవారం మెహందీ, రంగోలి పోటీలు నిర్వహించారు.

ఈ పోటీలలో విద్యార్థినీలు చాలా ఉత్సాహంతో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ దేవవాణి, ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కళాశాల ఇంచార్జ్ డాక్టర్ అపర్ణ చతుర్వేది , శక్తి సూపర్ షి జిల్లా కో ఆర్డినేటర్ నాంపల్లి భాగ్యలక్ష్మి, కో కో ఆర్డినేటర్ సంఘం కీర్తి, వడ్డేపల్లి ఎల్లోరా, వడ్డేపల్లి శ్రీ మహాలక్ష్మి పాల్గొన్నారు.

ఈ పోటీలలో గెలుపొందిన విద్యార్థునులకు ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ బహుమతులను బహుకరించారు. ఈ సందర్బంగా విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణించాలని శక్తి సూపర్ షి నాయకురాల్లు అన్నారు.

NLG: లబ్ధిదారుల దరఖాస్తు లలో సవరణలను జాగ్రత్తగా చేయాలి: జిల్లా కలెక్టర్ హరిచందన

       

ప్రజా పాలన సేవా కేంద్రాలలో లబ్ధిదారుల దరఖాస్తులలో సవరణలను జాగ్రత్తగా చేయాలని, జిల్లా కలెక్టర్ హరిచందన అన్నారు. తిప్పర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

గృహజ్యోతి పథకం కింద జీరో విద్యుత్తు బిల్లు, ఎల్పిజి కనెక్షన్ కింద రూ.500/- లకు సిలిండర్ పొందేందుకు సేవా కేంద్రానికి వచ్చిన లబ్ధిదారుల తో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ముందుగా జొన్నగడ్డల గూడెం గ్రామానికి చెందిన ఎం. కోటయ్యతో మాట్లాడుతూ.. దేనికోసం ఎంపీడీవో కార్యాలయం వచ్చారని అడిగారు. 

గృహ జ్యోతి కింద జీరో బిల్లు కోసం, అలాగే 500 రూపాయల ఎల్పీజీ కనెక్షన్ కోసం వచ్చానని కోటయ్య జిల్లా కలెక్టర్ కు తెలుపగా, సేవా కేంద్రంలో ఆ రెండింటికి సంబంధించిన సవరణలను జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించి జీరో విద్యుత్ బిల్లు రసీదు ను కోటయ్య కు అందజేశారు.మరికొందరు లబ్ధిదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. 

500 రూపాయలకే ఎల్ పి జి సిలిండర్ పొందేందుకు ప్రజాపాలన దరఖాస్తులో వినియోగదారు నంబర్ల సవరణ లు పరిశీలించారు. రెవిన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, ఎంపీడీవో వెంకటేశ్వర్ రెడ్డి ,తహసిల్దార్ స్వప్న, తదితరులు ఉన్నారు.

NLG: జాతీయ సేవా పథకం యూనిట్ 3 ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల

నల్లగొండ: ఎన్జీ కళాశాలలో జాతీయ సేవా పథకం యూనిట్ 3 ఆధ్వర్యంలో స్వచ్ఛ కళాశాల కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ కళాశాల కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొని కళాశాల ప్రాంగణంలోని ప్లాస్టిక్ ను ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించారు. అదేవిధంగా పిచ్చి మొక్కలు తొలగించినారు, చెట్లకు పాదులు చేసి నీరు పోయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ సముద్రాల ఉపేందర్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగుల వేణు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి కళాశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయడం జరిగింది .

కళాశాల ప్రధాన ఆచార్యులు మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని, విద్యార్థులు పూర్తిగా ప్లాస్టిక్ వాడడం మానేయాలని. భవిష్యత్తులో ప్లాస్టిక్ వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ మున్నీర్ డాక్టర్ శీలం యాదగిరి, యాదగిరి రెడ్డి, గ్రంథ పాలకులు డాక్టర్ దుర్గాప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ కడారి మల్లేష్, తిరుమలేష్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

NLG: రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీలలో బెస్ట్ డిఫెండర్ గా కుంటిగొర్ల కోటేష్

నిన్నటి వరకు నాగార్జునసాగర్ లో జరిగిన 70వ రాష్ట్రస్థాయి పురుషుల కబడ్డీ పోటీల్లో జిల్లా జట్టు ఛాంపియన్షిప్ సాధించడంలో ప్రధాన పాత్ర పోషించిన నల్గొండ చత్రపతి శివాజీ కబడ్డీ క్లబ్ కు చెందిన కుంటిగొర్ల కోటేష్ రాష్ట్రస్థాయిలో బెస్ట్ డిఫెండర్ గా అవార్డును స్వీకరించాడని క్లబ్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు.  

క్లబ్ కు చెందిన సాయికిరణ్, వేణు, కోటేష్, శ్రీకాంత్, సందీప్ (5 మంది క్రీడాకారులు ) క్లబ్ లో కబడ్డీ క్రీడా ఓనమాలు దిద్దుకొన్నారని తెలియజేస్తూ.. ప్రతినిత్యం సాధన చేస్తూ, కబడ్డీ క్రీడల్లో నైపుణ్యం సాధించి జిల్లా కబడ్డీ జట్టుకు ఎంపికైనారని, వీరందరూ సాయ్ హైదరాబాద్ అకాడమీ నందు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. 

ఈ సందర్భంగా క్రీడాకారులకు అద్భుతమైన శిక్షణ ఇస్తున్న సాయ్ అకాడమీ మరియు క్రీడాకారుల్లో ఉన్న సహజ నైపుణ్యాన్ని వెలికిదీస్తున్న రాష్ట్ర, జిల్లా కబడ్డీ అసోసియేషన్ల కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు.

TS: ఈనెల 7న.. కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన 'మహిళా వృద్ధాప్య ఆశ్రమం' ప్రారంభోత్సవం

కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో

జనగాం లో తొలుత 144 మంది వృద్ధులు నివాసం ఉండేలా రూ. 14 కోట్ల వ్యయంతో ప్రత్యేకంగా నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమంను.. ఈ నెల 7న మంత్రులు సీతక్క, కొండా సురేఖ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు, ఫౌండేషన్ చైర్‌పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజ్ గోపాల్ రెడ్డి తెలిపారు. కోమటిరెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఫౌండేషన్ చైర్ పర్సన్ కోరారు.

NLG: ప్రజా పాలన సేవా కేంద్రాలు ఏర్పాటు

నల్లగొండ: ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తులలో ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ నంబర్, విద్యుత్తు వినియోగదారుల నంబర్ తదితర వివరాలను సరి చేసేందుకు, ప్రజా పాలన సేవా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, రాష్ట్ర ఎనర్జీ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి రిజ్వి, జిల్లా కలెక్టర్ కు తెలిపారు.

హైదరాబాదు నుండి అన్ని జిల్లాల కలెక్టర్లలతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, తదితరులు హాజరయ్యారు.

NLG: పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న నలుగురు నిందితులు అరెస్ట్

నల్లగొండ: పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ పేద ప్రజలకు అందకుండా పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో హెచ్చరించారు.

మంగళవారం జిల్లా టాస్క్ ఫోర్స్ టీం, నాంపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో మెల్లవాయి గ్రామం వద్ద తనిఖీ చేయగా అశోక్ లేలాండ్ ట్రాలీ, ఆటో మహీంద్రా బొలెరో ట్రాలీ లలో 75 కింటాల్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కు సిద్ధంగా ఉంచిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.