తెలంగాణ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
హైదరాబాద్: రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ప్రభుత్వం సమకూరుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.![]()
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్టుల(జేఎన్‌జే) హౌసింగ్ సొసైటీకి సంబంధించి ఇళ్ల స్థలాల అప్పగింతపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డితో జేఎన్‌జే ప్రతినిధులు చర్చించి ఒక రోడ్‌మ్యాప్‌తో తన దగ్గరకు వస్తే ఒక్క నిమిషంలో సంబంధిత ఫైలుపై సంతకం చేస్తానని ముఖ్యమంత్రి చెప్పారు. రాష్ట్రంలో ఏ సంస్థకు నామినేటెడ్ ఛైర్మన్ నియమించకుండా కేవలం మీడియా అకాడమీకే శ్రీనివాస్‌రెడ్డిని ఛైర్మన్‌గా నియమించామంటే తమ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో స్పష్టమవుతోందని అన్నారు. శుక్రవారం సాయంత్రం జేఎన్‌జేలో సభ్యులైన అన్ని పత్రికల, టీవీ మీడియాకు చెందిన ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.
జేఎన్‌జేకు కేటాయించిన ఇళ్ల స్థలాల అప్పగింత ప్రక్రియ వంద రోజుల్లోగా మొదలుపెడతానన్న హామీని అమలు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సొసైటీకి 16 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వమే నిజాంపేట, పేట్‌బషీరాబాద్‌లో 70 ఎకరాల స్థలాన్ని జేఎన్‌జేకు కేటాయించిందని ప్రతినిధులు సీఎంకు తెలిపారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో సొసైటీకి స్థలాన్ని అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా గత ప్రభుత్వంలో ఈ తీర్పు అమలుకాలేదన్నారు. ఇప్పటి వరకు ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వచ్చామని వారు వివరించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ. రాష్ట్రంలో అర్హులైన మిగిలిన జర్నలిస్టులకు కూడా స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలను ఇస్తామని పేర్కొన్నారు. జర్నలిస్టుల ఆరోగ్యభద్రతా కార్డులతోపాటు ఇతర సమస్యలపైనా దృష్టిసారించామని తెలిపారు. సమావేశంలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఆదేశాలకు అనుగుణంగా స్థలాల విషయంలో వెంటనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.![]()
![]()


తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు దాదాపు 4 డిగ్రీల మేర పెరిగినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
వేసవి ప్రారంభానికి ముందు రాష్ట్రంలో 32 నుంచి 37 డిగ్రీల మధ్య పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ తరుణంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పగటిపూట ఎండలు తీవ్రంగా ఉండడంతో తెలంగాణలో హాఫ్ డే స్కూళ్లను నడపాలని రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. మార్చి 15 నుంచి రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒక్క పూట తరగతులు నిర్వహించాలని చెప్పారు.
నల్గొండ జిల్లా :-
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ :- విధ్యార్ధిని, విద్యార్థులు ఇష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు 30 సంవత్సరాలుగా విద్యారంగంలో సేవలు అందిస్తున్న యశ్వంత్, నర్సిరెడ్డి కి హృదయ పూర్వక ధన్యవాదములు.మా ప్రాంతంలో ఈ పాఠశాల పెట్టి తల్లిదండ్రులు చనిపోయిన విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్న వారికి అభినందనలు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు..
*రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి పైగా పోలియో డ్రాప్స్ వేయనున్నట్లు అంచనా. అయితే వైద్యారోగ్యశాఖ పల్స్ పోలియో ప్రిపరేషన్‌పై ఇప్పటి వరకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం టీమ్ లకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదని తెలుస్తోన్నది. ఇక ఫిబ్రవరి 29న 1532 మంది జన్మించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. లీప్ ఇయర్ డే న పుట్టినందున ఆయా పిల్లలకు నాలుగేళ్లకోసారి బర్త్ డే రానున్నది*
అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు
రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
నల్గొండ జిల్లా:-
.
.

ములుగు జిల్లా:-
.
.
.
Mar 07 2024, 10:06
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
16.2k