madagoni surendar

Mar 02 2024, 17:44

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 నుంచి పోలియో చుక్కలు*
*తెలంగాణ వ్యాప్తంగా మార్చి 3 నుంచి పోలియో చుక్కలు*
*రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 3 నుంచి ఫల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభం కానున్నది. వరుసగా మూడు రోజుల పాటు మార్చి 5 వరకు స్పెషల్ డ్రైవ్‌లు కొనసాగనున్నాయి*
*ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అంగన్ వాడీ సెంటర్లు, గ్రామ పంచాయితీ కార్యాలయాలు, సర్కారీ స్కూళ్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 5 ఏళ్ల లోపు పిల్లలందరికీ డ్రాప్స్ వేయనున్నారు* *రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మందికి పైగా పోలియో డ్రాప్స్ వేయనున్నట్లు అంచనా. అయితే వైద్యారోగ్యశాఖ పల్స్ పోలియో ప్రిపరేషన్‌పై ఇప్పటి వరకు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కనీసం టీమ్ లకు సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేదని తెలుస్తోన్నది. ఇక ఫిబ్రవరి 29న 1532 మంది జన్మించినట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. లీప్ ఇయర్ డే న పుట్టినందున ఆయా పిల్లలకు నాలుగేళ్లకోసారి బర్త్ డే రానున్నది*

madagoni surendar

Mar 02 2024, 17:34

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం*
*అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం* అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు

రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.

madagoni surendar

Mar 02 2024, 16:56

దుద్దిల్ల శ్రీపాదరావు  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కట్టంగూర్ ఎంపీపీ
దుద్దిల్ల శ్రీపాదరావు  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన కట్టంగూర్ ఎంపీపీ నల్గొండ జిల్లా:-
కట్టంగూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఉదయం శ్రీ దుద్దిల్ల శ్రీపాదరావు మాజీ స్పీకర్  జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు  జల్లా ముత్తిలింగయ్య ఎంపీపీ  మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మందని నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది  ప్రజలకు అనేక సేవలు అందించారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి శ్రీపాద రావు  స్పీకర్ గా తన బాధితులు సక్రమంగా నిర్వహించి శాసనసభ వన్నెతెచ్చినటువంటి మహానుభావుడు శ్రీపాద రావు  వారి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్ణయించడానికి ప్రభుత్వం స్వీకారం చుటడం సంతోషకరమని వారి వేడుకల్ని చేయడం చాలా సంతోషమని అని అన్నారు. దుద్దిల్ల శ్రీధర్ బాబు  రాష్ట్ర ఐటీ మంత్రి కొనసాగుతూ మందని నియోజకవర్గం నాటి నుండి నేటి వరకు నిరంతరం నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తూ రాష్ట్ర దేశ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సాధించుకున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సూపర్డెంట్ చలపతి, ఏపీఓ రామ్మోహన్,కార్యాలయ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

madagoni surendar

Feb 24 2024, 16:56

రేపే నకిరేకల్ లో మెగా జాబ్ మేళా

రేపే నకిరేకల్ లో మెగా జాబ్ మేళా

నియెజకవర్గ యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలి

నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

.

నల్గొండ జిల్లా :-

నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సహయ సహకారంతో రేపు అనగా 25 /02/2024 (ఆదివారం) రోజున మెగా జాబ్ మేళా ను నకిరేకల్ పట్టణంలోని హైస్కూల్ నందు నిర్వహిస్తుండగా శనివారం నాడు ఎమ్మెల్యే వేముల వీరేశం ఏర్పాటు పరిశిలించి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని సుమారుగా యువతి, యువకులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు .. కావున రేపు అభ్యర్థులు వచ్చేటప్పుడు తమ ద్రువప్రతాలు తామ వెంట తెచ్చుకోగలరు. ఉదయం 9.00 గంటలకు ప్రారంభం కావడం జరుగుతుంది. సుమారుగా 60 పైచిలుకు కంపెనీలు ఇందులో పాల్గొంటాయి..కావున నియోజకవర్గ నిరుద్యోగ, యువతి, యువకులు సద్వినియోగం చేసుకోవాలని మనవి..

.

madagoni surendar

Feb 24 2024, 13:33

ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర
ముగింపు దశకు చేరుకున్న మేడారం జాతర

ములుగు జిల్లా:-

వనదేవతలు ఈరోజు రాత్రి వనప్రవేశం చేయనున్నారు.

ఈ వనప్రవేశంతో జాతర ముగియనున్నది.

సాయంత్రం గద్దెల దగ్గర సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు.

పూజల తర్వాత వనదేవతల వనప్రవేశ ఘట్టం ప్రారంభం కానుంది.

అనంతరం సమ్మక్క తల్లి చిలకలగుట్టకు, సారలమ్మ తల్లి కన్నెపల్లికి తరలివెళ్లనున్నారు.

చివరి రోజు కూడా భక్తుల రద్దీ భారీగా ఉంది.
. . . .

madagoni surendar

Feb 23 2024, 11:47

తెలంగాణకు భారీ వర్షాలు

తెలంగాణకు భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇంకా చలికాలం పూర్తి కాకముందే.. ఎండాకాలం వచ్చినట్లు కనిపిస్తోంది.

రాత్రిపూట చలిగా ఉంటుంది... మధ్యాహ్నం అయితే ఎండ విపరీతంగా కొడుతోంది.

ఇలాంటి నేపథ్యంలో... తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు అందింది. తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ స్పష్టంగా చేసింది. తెలంగాణలో... వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు తూర్పు తెలంగాణ జిల్లాలో... మోస్తారు వర్షం పేర్కొన్నారు అధికారులు. ఇక హైదరాబాద్లో ఫిబ్రవరి 25వ తేదీ నుంచి 26వ తేదీ మధ్య... భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది.

madagoni surendar

Feb 23 2024, 11:42

రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే మృతి. వరుస ప్రమాదాల నుండి తప్పించుకోలేకపోయిన వైనం

రోడ్డు ప్రమాదంలో యువ ఎమ్మెల్యే మృతి... వరుస ప్రమాదాల నుండి తప్పించుకోలేకపోయిన వైనం

  

ఆ డ్రైవరే మళ్లీ ఇక్కడ కూడా.. వరుస ప్రమాదాల నుంచి గట్టెక్కలేకపోయిన యువ ఎమ్మెల్యే..

బీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే లాస్య నందిత చనిపోయింది. 

మొన్నటికి మొన్న నల్గొండ సభను ముగించుకుని వస్తున్న సమయంలోనే పెను ప్రమాదం తప్పింది. 

ఎమ్మెల్యే కారు డీకొని హోంగార్డ్ మృతి చెందాడు. 

అయినా కానీ ఎమ్మెల్యే అతన్నే డ్రైవర్ గా కొనసాగించింది.          

ఈ రోజు మాత్రం ఆమె ఎస్కేప్ కాలేకపోయింది.. 

ఎమ్మెల్యే గా లాస్యకు కలిసి‌రాని‌ కాలం.. ఎన్నికైనప్పటి నుంచి ప్రమాదాలే.. 

1) లిప్ట్ లో ఇరుక్కుని తొలి ప్రమాదం 

2) నల్గొండ బహిరంగ సభకు వెళ్లొస్తూ ఫిబ్రవరి 13 న రెండవసారి‌ ప్రమాదం 

3) ఓఆర్ఆర్ వద్ద రోడ్డు ప్రమాదంలో మూడో సారి గండాన్ని గట్టెక్కలేకపోయిన యువ‌ఎమ్మెల్యే 

ఆమె మృతదేహం పటాన్ చెరులోని ఆమోదా ఆసుపత్రిలో ఉంది.. 

కాసేపట్లో పటాన్ చెరు ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం.

madagoni surendar

Feb 21 2024, 14:03

మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:-మేడారం వెళ్తున్న బస్సుకు ప్రమాదం.. పలువురికి గాయాలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా:-

మంచిర్యాల డిపో నుంచి మేడారం జాతరకు 50 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి ఆటవీ ప్రాంతంలో ఈ ఘటన ఉదయం జరిగింది... ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు... ఆర్టీసీ డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి... క్షతగాత్రులను భూపాలపల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు...

మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

.

..

.

madagoni surendar

Feb 21 2024, 13:32

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

నల్గొండ జిల్లా :-

ఈ నెల 25వ తేదిన ఉదయం 10గంటలకు.. నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం a నకిరేకల్ యువతకు పిలుపునిచ్చారు. మెగా జాబ్ మేళా పోస్టర్ ను నేడు నకిరేకల్ పట్టణంలోని వారి నివాస సముదాయంలో ఆయన విడుదల చేశారు.

.

.

.

.

madagoni surendar

Feb 20 2024, 19:48

సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో జర్నలిస్టు భవన్ ఏర్పాటు చేయాలి

సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో జర్నలిస్టు భవన్ ఏర్పాటు చేయాలి

అన్ని సౌకర్యాలతో కూడిన పక్క భవనాన్ని 500 గజాల స్థలంలో నిర్మించాలి

వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇంటి స్థలాలు,హెల్త్ కార్డులు,పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి

రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

సూర్యాపేట జిల్లా:-

సూర్యాపేట పాత వ్యవసాయ మార్కెట్లో 500 గజాల స్థలాన్ని కేటాయించి అన్ని సౌకర్యాలతో కూడిన పక్క జర్నలిస్టు భవన్ ను విలేకరుల కోసం ఏర్పాటు చేయాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడెక్కడ ప్రెస్ క్లబ్ భవనాలు లేక జర్నలిస్టులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆ ప్రాంతాలలో విలేకరుల ఆత్మగౌరవ భవనాలుగా గుర్తించి జర్నలిస్టు భవనాలు నిర్మించాలన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రెస్ క్లబ్బులు లేక జర్నలిస్టులు హోటల్లో ప్రైవేటు భవనాల మెట్ల కింద చెట్లనీడకు సేద దీరుతున్నారని తమ దయనీయమైన పరిస్థితి చూసి ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.అదేవిధంగా వర్కింగ్ జర్నలిస్టు అందరికీ ఇంటి స్థలాలు ఇవ్వడం లేదా ప్రత్యేక ఇండ్లు కట్టి ఇవ్వడం చేయాలని కోరారు.ఎటువంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచిత సేవ చేస్తూ ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టు వృత్తిలోనే కొనసాగుతూ ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులను గుర్తించి కుటుంబ సభ్యులందరికీ ఎలాంటి ఆర్థిక భారం లేకుండా హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.వృత్తిపరంగా పోలీసు వారి నుండి ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా జర్నలిస్టులకు పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలన్నారు.ఇంతే కాకుండా తాము గత రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న సమస్యలు ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఏడాదికి నాలుగు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతిరోజు లీటర్ పెట్రోల్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలన్నారు.తమ సమస్యలన్నీ ప్రభుత్వం వెనువెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఎల్ నాగబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దుర్గం బాలు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రఘువరన్ ఆచార్యులు,రాష్ట్ర గౌరవ సలహాదారులు మానుకొండ రాము,రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్,ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు చిలకల చిరంజీవి, ఉమ్మడి నల్లగొండ జిల్లా సలహాదారులు అనంతుల శ్రీనివాస్ గౌడ్,సూర్యాపేట పట్టణ కార్యదర్శి తప్సి అనిల్ తదితరులు పాల్గొన్నారు.

.

.

.