NLG: ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించిన తుమ్మలపల్లి వాసి

నల్లగొండ జిల్లా:

చండూరు: మండలంలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన బత్తుల వినోద్ కుమార్, ఒకేసారి రెండు ఉద్యోగాలు సాధించాడు. ఇటీవల వెలువడిన గురుకుల ఫలితాలలో గురుకులం జూనియర్ లెక్చరర్, గురుకులం పి జి టి ఉద్యోగాలకు ఎంపిక అయ్యాడు. కష్టపడి చదివి ఉద్యోగం సాధించడం పట్ల, మండలంలో ఆయనను పలువురు గ్రామస్తులు అభినందిస్తున్నారు.

.

TS: నేటి నుంచే ‘ధరణి’ స్పెషల్‌ డ్రైవ్‌

‘ధరణి’ పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న లక్షలాది దరఖాస్తుల పరిష్కార ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

ఈరోజు నుంచి ఈనెల 9వ తేదీ వరకు ఈ దరఖాస్తుల పరిష్కారం కోసం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

పెండింగ్‌లో ఉన్న సుమారు 2.45 లక్షల దరఖాస్తులను పరిష్కరించాలని నిర్ణయించింది.

NLG: ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులై కళాశాలకు మంచి పేరు తేవాలి: ఎస్సై నాగరాజు

నల్లగొండ: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం, బీకాం ప్రథమ సంవత్సర విద్యార్థులకు స్వాగతం మరియు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు ఫేర్వెల్ పార్టీ నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న టూ టౌన్ ఎస్ఐ నాగరాజు మాట్లాడుతూ.. విద్యార్థినిలు, కళాశాలలో అన్ని వసతులు వినియోగించుకొని ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులై, కళాశాలకు మంచి పేరు తేవాలని, అలాగే బీకాం ప్రథమ సంవత్సర విద్యార్థినులు.. రెండవ, మూడవ సంవత్సర విద్యార్థుల నుంచి అన్ని విషయాలపై అవగాహన చేసుకుని మంచి మార్కులతో పాస్ కావాలని సూచించారు.

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ గన్ శ్యామ్ మాట్లాడుతూ.. విద్యార్థులందరికీ కళాశాలలో అన్ని రకాలైన సౌకర్యాలు ఉన్నాయని, ఉత్తమ విద్యను బోధించేందుకు మంచి నిపుణులైన అధ్యాపకులు ఉన్నారని, కళాశాలలో మంచి ఆటస్థలం, గ్రంథాలయం మరియు ఇతరత్రా అనేక రకాల సౌకర్యాలు ఉన్నాయని, విద్యార్థులు వాటిని వినియోగించుకొని కళాశాలకు, తద్వారా తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తేవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీకాం డిపార్ట్మెంట్ హెడ్ జబీన్, అధ్యాపకులు ఎస్. రాజు, శైలజ, సుధాకర్, రేణుక, రమేష్, మరియు కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవవాని, భాస్కర్ రెడ్డి, అపర్ణ, చతుర్వేది, రాజశేఖర్, మల్లికార్జున్, శంకర్, హసేన, గ్రంథాల శాఖ అధ్యాపకులు డాక్టర్ సుంకర రాజారామ్, విద్యార్థినులు, తదితరులు పాల్గొన్నారు.

NLG: ట్రాఫిక్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్

నల్లగొండ: ట్రాఫిక్ సిఐ డానియల్ కుమార్ ఆధ్వర్యంలో అడ్డదిడ్డంగా రోడ్డుపై నిలిపిన ఇసుక ట్రాక్టర్ల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై అడ్డదిడ్డంగా పెట్టిన ఇసుక ట్రాక్టర్లు మొత్తం 16 వెహికల్ లకు గాను 15 వెహికల్ లకు రాంగ్ పార్కింగ్ మరియు డాక్యుమెంట్స్ లేని కారణంగా ఒక్కొక్క బండికి రూ.1100/- చొప్పున 15 బండ్లకు రూ.16,500/- ఫైన్ వేయడం జరిగిందని ట్రాఫిక్ సీఐ డానియల్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని హెచ్చరించారు.

NLG: జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ -1861 అమలు: ఎస్పీ చందనా దీప్తి

నల్లగొండ: జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మార్చి 1 నుండి 30వ తేదీ వరకు నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీసు యాక్ట్-1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేనిది ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకో, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు.

NLG: స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బదిలీ

నల్లగొండ: స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బదిలీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న హేమంత్ కేశవ్ పాటిల్ ను హైదరాబాద్ కు అదనపు కలెక్టర్ (రెవెన్యూ ) గా బదిలీ చేసింది. అయితే ఇంకా వారి స్థానంలో ఎవరిని నియమించలేదు.

NLG: సంత్ సేవాలాల్ 285 జయంతి ఉత్సవాలలో పాల్గొన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

గిరిజన అభివృద్ధి శాఖ మరియు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మునుగోడు నియోజకవర్గం, నారాయణ పూర్ మండల కేంద్రంలో, శ్రీ సంత్ సేవలాల్ మహారాజ్ 285 జయంతి ఉత్సవాలలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజన సాంప్రదాయంలో గిరిజనులు, గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం సాంప్రదాయ గిరిజన తలపాగా ను ఆయనకు చుట్టి సన్మానించారు.

NLG: రాహుల్ గాంధీకి, సిఎం రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ చిత్రపటాలకు పాలాభిషేకం

నల్లగొండ జిల్లా:

కాంగ్రెస్ మరో రెండు గ్యారెంటీ లు అమలులోకి వచ్చిన సందర్భంగా, ఈ రోజు మర్రిగూడ మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో.. కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీకి, సిఎం రేవంత్ రెడ్డి, కోమిటిరెడ్డి బ్రదర్స్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతర్ యాదయ్య, బుచ్చి నాయక్, మారగోని వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ యువనేత అల్వాల్ రెడ్డి , కొండల్, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

NLG: మార్చి 1 ,2 ,3 తేదీలలో ఆర్య సమాజం మహాసభలు

నల్లగొండ: ఆర్య సమాజం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆర్య ప్రతినిధి సభ సౌజన్యంతో మహర్షి దయానంద సరస్వతి ద్విషత జయంతి మహాసభలు ఈనెల 1, 2, 3 ,తేదీలలో పట్టణంలో ఆర్యసమాజ మహాసభలు నిర్వహిస్తున్నట్లు మహాసభ నిర్వాహకులు కృష్ణారెడ్డి తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఈ మహాసభలలో స్వామి రాందేవ్ హాజరవుతున్నట్లు తెలిపారు. 

NLG: ఉమెన్స్ కాలేజీలో' 'జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు"

నల్లగొండ: ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో లైఫ్ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో 'జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు" నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు జాతీయ సైన్స్ దినోత్సవ ప్రాముఖ్యత ను గూర్చి విద్యార్థినిలకు వివరించారు. పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. 

ప్రిన్సిపల్ డా.ఘన్ శ్యామ్, సూక్ష్మజీవ విభాగాధిపతి దేవవాణి, జంతుశాస్త్ర విభాగాధిపతి రావిరాల నరేష్, అధ్యాపకులు స్వామి, సంధ్య, సమత, మిస్కిన్, సరిత, సునిత, అతూఫా మరియు విద్యార్థినిలు పాల్గొని విజయవంతం చేశారు.