ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్..

ఉచిత బస్సు పథకాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్

 

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యక జారీ చేసిన జీవో 47ను సవాలు చేస్తూ ఎ.హరేందర్‌కుమార్‌ అనే ప్రైవేటు ఉద్యోగి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

కేంద్ర చట్టాల ద్వారా ఏర్పాటైన ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేసే అధికారం రాష్ట్ర ప్రభు త్వానికి లేదని, ఇది వివక్షతో కూడిన నిర్ణయమని అన్నారు.

ఉచితంతో బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరగడంతో, అవసరాల కోసం వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవు తున్నాయని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

ప్రతివాదులుగా రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్టీసీ ఛైర్మన్‌తోపాటు కేంద్ర ప్రభుత్వాన్ని చేర్చారు. కాగా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఎన్నికల ప్రచార సమయం లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహి ళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన విషయం తెలిసిందే.

నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు

నేడు నుంచి రైతు ఖాతాల్లో రైతుబంధు 

ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

నిజామాబాద్ జిల్లా, నందిపేట మండలం, ఆంధ్రానగర్‌లో ది వంగత నందమూరి తారక రామారావు విగ్రహా న్ని బుధవారం ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడు తూ…ఎన్ని ఇబ్బందులున్నా రైతు డిక్లరేషన్‌ను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని, రై తాంగ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తా మని అన్నారు. నందమూరి తారకరామారావు ఆశీస్సు లతో రాజకీయా లలోకి వచ్చిన తామంతా, ఆ మహానుభావుని ఆశయా లకు అనుగుణంగా అదే నిబద్దత, నిజాయితీగా ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు.

ఎన్టీఆర్ శ్రీకారం చుట్టిన సంక్షేమ పథకాలు నేడు దేశమంతటా అన్ని పార్టీలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. రైతుల అవస రాలు, కష్టాలు తెలిసిన వ్య క్తిగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం లో రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటికే రెండకరాల లో పు వ్యవసాయ భూమి కలిగిన 29 లక్షల మం ది రైతులకు రైతుబంధు అందించామని, మి గతా రైతులకు కూడా గురువారం నుండే వారి ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

ఈ నెలాఖరులోపు రైతులందరి ఖాతాల్లో రైతుబంధు నిధులు పడతాయని స్పష్టం చేశారు.

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు నిండి ఏటీసీ వరకు క్యూ లైన్‌లో వేచివున్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,964 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 27,657 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు

ఆంధ్ర లో తెలంగాణ పందెం కోడి..

ఆంధ్ర లో తెలంగాణ పందెం కోడి

సంక్రాంతి సందర్భంగా ఏపీలో జరిగే కోడి పందేలకు హైదరాబాద్‌ పాత నగర శివారు ప్రాంతాలకు విడదీయరాని బంధం ఉంది.

జల్‌పల్లి మున్సిపల్‌ పరిధిలో పందెం కోళ్ల కూతలు వినిపిస్తాయి. ఎర్రకుంట, షాహిన్‌నగర్‌, కొత్తపేట, సలాల పరిసరాల్లో కాకి, డేగ, నెమలి, అస్లీ తదితర మేలు జాతి కోడి పుంజులను పెంచుతారు.

ఉభయ గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలకు ఇక్కడి నుంచి కోళ్లను ఎగుమతి చేస్తుంటారు.

కోట్లాది రూపాయలు వెచ్చించి పోటీలకు కొనుగోలు చేస్తుంటారు.

విచారణకు హాజరుకాలేను: కవిత

విచారణకు హాజరుకాలేను: కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరుకాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది.

నేటి మార్నింగ్ ముచ్చట్లు..

మార్నింగ్ ముచ్చట్లు...

సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న మోదీ, జగన్

దావోస్‌లో కొనసాగుతున్న సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన

చంద్రబాబు పిటిషన్‌పై తీర్పుఇవ్వనున్న సుప్రీంకోర్టు

భక్తుల కోసం 'దివ్య్అయోధ్య' యాప్‌ను ప్రారంభించిన UP

రెండు రష్యన్ కమాండ్ విమానాలను కూల్చేసిన ఉక్రెయిన్

అమెరికా షిప్‌పై హౌతీ రెబల్స్ మిస్సైళ్లతో దాడి

గాజా-ఇజ్రాయెల్‌ దాడులతో 24,100కు చేరిన మరణాల సంఖ్య

ఐస్‌ల్యాండ్‌లో బద్దలైన అగ్నిపర్వతం,పలు ఇళ్లు దగ్ధం

సెలక్టర్‌ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానించిన BCCI

ఎంసెట్ పేరులో మార్పు?

ఎంసెట్ పేరులో మార్పు?

 

హైదరాబాద్:జనవరి 15

రాష్ట్రంలో కొత్తగా కొలువు దీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంజినీరింగ్, ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్ ప్రవేశ పరీక్ష పేరును మార్చాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

2017 నుంచి ఎంసెట్‌లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించి, ఎంబీబీఎస్, ఇతర వైద్య కోర్సులను నీట్ ద్వారా భర్తీ చేస్తోంది. అయినా ఎంసెట్ పేరులో ఎం మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతూ వస్తోంది.

ఈ నేపథ్యంలో మెడికల్ పేరు తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గవర్నమెంట్‌కు ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్‌లో ఎం అక్షరాన్ని తీసేసి.. టీఎస్ఈఏ సెట్ లేదా టీఎస్‌ఈఏపీ సెట్‌గా మార్చాలని ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

ఎంసెట్ ద్వారానే బీఫార్మసీ సీట్లను భర్తీ చేస్తున్నందున పీ అక్షరాన్ని తాజాగా పోటీ పరీక్ష పేరుకు చేర్చునున్నట్లు తెలిసింది..

అమరావతి: చంద్రబాబుతో పవన్‌ డిన్నర్‌ మీటింగ్‌...

అమరావతి: చంద్రబాబుతో పవన్‌ డిన్నర్‌ మీటింగ్‌

సంక్రాంతి సందర్భంగా విందుకు ఆహ్వానించిన చంద్రబాబు

ఉమ్మడి మేనిఫెస్టో, సీట్ల సర్దుబాటుపై చర్చ

డిన్నర్‌ మీటింగ్‌లో పాల్గొన్న నాదెండ్ల మనోహర్‌

ఢిల్లీ: ఖర్గే నివాసంలో కీలక సమావేశం పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...

ఢిల్లీ: ఖర్గే నివాసంలో కీలక సమావేశం.. సమావేశంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ, దీపా దాస్‌ మున్షీ, సీఎం రేవంత్‌రెడ్డి.. ఎమ్మెల్సీ ఎన్నికలు, ఖాళీగా ఉన్న మంత్రి పదవుల అంశంపై చర్చ.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్నిప్రమాదం...

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. స్టీల్‌ ప్లాంట్‌లోని బీఎఫ్‌-3లో చెలరేగిన మంటలు.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది.