Andrapradesh

Nov 09 2023, 11:17

ఆర్మీ జవానుకు పోలీసుల క్షమాపణలు

AP Police Apologies: పరవాడ సంతబయలులో ఆర్మీ ఉద్యోగి అలీముల్లాపై మంగళవారం కానిస్టేబుళ్ల దాడి చేసిన ఘటనపై అనకాలపల్లి ఎస్సీ విచారం వ్యక్తం చేశారు.

ఈ తరహా ఘటనల్ని ఉపేక్షించమని ప్రకటించారు.

అనకాపల్లి జిల్లాలోని పరవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంతమంది పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నామని చెప్పారు. బాధ్యులైన నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు.

అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలు వద్ద ఆర్మీజవాన్ సయ్యద్ అలీమ్ ముల్లాపై దాడి చేసిన నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. మంగళవారం సంతబయలులో జవాను అలీముల్లాతో దిశ యాప్ డౌన్లోడ్ చేయించిన తర్వాత ఓటీపీని పోలీసులు నమోదు చేసుకోవడంపై తలెత్తిన వాగ్వాదంలో అతనిపై దాడి చేసి పోలీస్ స్టేషన్కు బలవంతంగా తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు.

నలుగురు కానిస్టేబుళ్లు ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్న జవాను కేకలు వేయడాన్ని స్థానికులు వీడియోలో చిత్రీకరించారు. ఇదిసోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసుల దాడిని స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో అతడిని వదిలేశారు. ఈ ఘటనపై బాధితుడు మంగళవారం సాయంత్రం ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మంగళవారం రాత్రి బాధ్యుల్ని విఆర్కు పంపి విచారణ జరిపారు. జవానుపై దాడి చేసిన కానిస్టేబుళ్లను విధుల నుంచి తప్పిస్తూ జిల్లా ఎస్పీ కేవీ.మురళీకృష్ణ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ యాప్ డౌన్లోడ్ చేయించే క్రమంలో ఓటీపీ నమోదు చేసుకోవడంపై అభ్యంతరం చెప్పినందుకు జవానుపై పోలీసులు దాడి చేశారు. దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లను స్థానికులు నిలదీయడంతో ఆ వీడియో వైరల్గా మారింది.

పరవాడ పిఎస్ కానిస్టేబుళ్లు ముత్యాలనాయుడు, శోభ మొదట జవానుపై దాడి చేశారు. ఆ తర్వాత హెడ్ కానిస్టేబుల్ దేవల్లు, రమేష్లు బలవంతంగా ఆటోలో ఎక్కించే ప్రయత్నం చేశారు. దీనిపై అలీముల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలను విచారించిన తర్వాత నలుగురు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.

Andrapradesh

Nov 08 2023, 10:19

విజయవాడ బస్సు ప్రమాదంలో డ్రైవర్‌ సహా ఇద్దరు అధికారులపై చర్యలు

విజయవాడ బస్టాండ్‌లోకి బస్సు దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందిన ఘటనలో బాధ్యులపై ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఘటనకు బాధ్యులైన బస్సు డ్రైవర్‌ ప్రకాశం సహా మరో ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ప్రమాదానికి గల కారణాలను వెల్లడిస్తూ ఆర్టీసీ అధికారుల కమిటీ నివేదిక సమర్పించింది. బస్సు డ్రైవర్‌ ప్రకాశం తప్పుగా గేర్‌ ఎంచుకోవడం వల్లే బస్సు బస్టాండ్‌లోకి దూసుకెళ్లిందని నివేదికలో పేర్కొన్నారు. దీంతో డ్రైవర్‌ ప్రకాశంపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

విధుల పర్యవేక్షణలో ఆటోనగర్‌ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ వి.వి.లక్ష్మి విఫలమయ్యారని నిర్ధారించారు. నిబంధనల ప్రకారం ఆటో మేటిక్‌ గేర్‌ సిస్టం ఉన్న బస్సుకు పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను పంపాల్సి ఉంది. కానీ, అలా చేయకుండా సూపర్‌ లగ్జరీ బస్సులను నడిపిన డ్రైవర్‌ ప్రకాశాన్ని పంపారని కమిటీ తేల్చింది. దీనికోసం డ్రైవర్‌కు ముందస్తుగా.. సమగ్ర శిక్షణ ఇవ్వలేదని నిర్ధరించారు. దీనికి ఆటోనగర్ అసిస్టెంట్ డిపో మేనేజర్ వి.వి లక్ష్మి బాధ్యతారాహిత్యమే కారణమని తెలుపుతూ ఆమెపై సస్పెన్షన్ వేటు వేసి, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాలను సమగ్రంగా పర్యవేక్షించాల్సిన ఆటోనగర్ డిపో మేనేజర్ ప్రవీణ్ కుమార్ విఫలమయ్యారని కమిటీ తేల్చింది. ఆయనపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

Andrapradesh

Nov 03 2023, 13:17

పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం:నాదెండ్ల మనోహర్

చేయూత స్కీమ్ పేరుతో వైసీపీ స్కామ్

బీహార్ దాణా స్కామ్ కంటే పెద్ద కుంభకోణం

3.94 లక్షల పాడి పశువులు కొనుగోలు చేశామని అసెంబ్లీలో చెప్పారు

అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేల పాడి పశువులు మాత్రమే

పాడి పశువుల కొనుగోలు పేరుతో కొల్లగొట్టిన సొమ్ములు ఎటు పోయాయి?

అక్కచెల్లెమ్మలను నిండా మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం

లక్షల పాడి పశువులు కొని ఉంటే పాల వ్యాపారంలో రూ.14 వేల కోట్లకుపైగా ఆర్థిక లావాదేవీలు జరిగేవి

పాల వెల్లువ కాదు... వైసీపీ పాపాల వెల్లువ నడుస్తోంది

పాడి పశువుల కొనుగోలుపై సమగ్ర విచారణ చేపట్టాలి... ప్రజా ధనాన్ని వెనక్కి తీసుకురావాలి

తెనాలి మీడియా సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు

పాడి పశువుల కొనుగోలు, పంపిణీ మాటున వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణం చేశారు... ఈ కుంభకోణం విలువ రూ.2,887 కోట్లు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు వెల్లడించారు. లక్షల కొద్దీ పాడి పశువులు కొనుగోలు చేశామని శాసన సభలో ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలకు, క్షేత్ర స్థాయిలో అధికారులు చేసిన పరిశీలనలో తేలిన లెక్కలకు అసలు పొంతనే లేదని అన్నారు. అధికారుల పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేలు మాత్రమే అని తెలిపారు. వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద పశువుల కొనుగోలులోనే దాదాపు రూ. 2,887 కోట్ల అవినీతికి ఆస్కారం ఇచ్చిన ఈ స్కామ్ బీహార్ దాణా కుంభకోణం కంటే పెద్దది అని స్పష్టం చేశారు. మినీ డెయిరీల పేరుతో అక్కచెల్లెమ్మలను వైసీపీ ప్రభుత్వం నిండా మోసం చేసిందని చెప్పారు. పశువుల కొనుగోలు స్కామ్ మీద ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ... “మహిళల ఆర్థిక అభివృద్ధి, సాధికారితకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రతీ సమావేశంలో ఊదరగొడుతున్న వైసీపీ ప్రభుత్వం... క్షేత్ర స్థాయిలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళల ద్వారా మినీ డెయిరీలు ఏర్పాటు చేయించి పాల ఉత్పత్తి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగానూ 5.65 లక్షల మంది స్వయం సహాయక సంఘాల్లో మహిళలను అధికారులు గుర్తించారు. 4,90,374 పాడి పశువులను చేయూత స్కీంలో కొనుగోలు చేసేందుకు అనుమతిస్తూ నవంబర్ 25, 2020లో క్యాబినెట్ తీర్మానం చేసింది. తద్వారా 20 లక్షల లీటర్ల పాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  

• ఒక్క రోజులో 1.85 లక్షల పాడి పశువులు పెరిగాయి  

మహిళా సాధికారితపై శాసనసభలో సెప్టెంబర్ 25, 2023లో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా మహిళ సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం 2,08,790 పాడి పశువులను కొనుగోలు చేశామని చెప్పారు. విచిత్రంగా ఆ మరుసటి రోజే వ్యవసాయ శాఖపై జరుగుతున్న చర్చలో సంబంధిత మంత్రి గారు పాల వెల్లువ పథకం కింద 3.94 లక్షల పాడి పశువులను కొనుగోలు చేశామని చెప్పారు.

ఒక్క రోజులోనే 1,85,210 పాడి పశువులు ఎలా పెరిగాయో ముఖ్యమంత్రిగానీ, సంబంధిత మంత్రులుగానీ సమాధానం చెప్పాలి. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసిన పశు సంవర్థక శాఖ, డెయిరీ విభాగాల అధికారులకు వాస్తవంలో కనిపించినవి 8 వేల పశువులు మాత్రమే. ఒక గేదెను కొనుగోలు చేసి ఆ గేదెనే అనేకమంది కోసం కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించారు. 

అసలు లక్షల్లో పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయడం కష్ట సాధ్యమైన ప్రక్రియ. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశుక్రాంతి పథకం ద్వారా 50 వేల పాడి పశువులను కొనుగోలు చేయడానికి బీహార్, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలు తిరిగినా సాధ్యపడలేదు. ఇప్పుడు 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. వాస్తవంలో ఉన్నవి 8 వేల పాడి పశువులు మాత్రమే. లక్షల కొద్దీ కొన్నామని చెప్పి కోట్ల ప్రజాధనం దోచేశారు. ప్రభుత్వం తీసుకొచ్చింది పాలవెల్లువ పథకం కాదు పాపాల వెల్లువ పథకం. 

Andrapradesh

Nov 03 2023, 12:39

చిత్తూరులో మీడియా తో మాట్లాడిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి

మద్యంపై సమాధానం చెప్పకుండా కేసులా? : పురందేశ్వరి

ఇసుక తవ్వకాల్లో ప్రభుత్వ విధానాలతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని BJP రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి ఆరోపించారు.

 చిత్తూరు (D) కాణిపాకంలో ఆమె మాట్లాడుతూ.. 

మద్యం కుంభకోణంపై తమ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరులపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. 

చంద్రబాబు అరెస్టు అక్రమమని మొదట గళం విప్పింది BJPనే అని చెప్పారు. 

కేంద్ర నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు.

Andrapradesh

Oct 29 2023, 15:06

మరో బీహార్ లాగా రాజధాని లేని రాష్ట్రము
మరో బీహార్ లాగా రాజధాని లేని రాష్ట్రము లో అధికారులు పరిస్థితి ఆఫీస్ లోనే ఆటాక్ ... అధికారి పై అధికార పార్టీ నేత దాడి ▪️పీలేరు MRO ఆఫీస్ లో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడికి యత్నం. ▪️కోర్టు వివాదం లో ఉండే భూమికి తాను ఎంజాయ్ మెంట్ సర్టిఫిక

Andrapradesh

Oct 28 2023, 14:13

ప్రొద్దుటూరు పట్టణం గాంధీ రోడ్డు లోని మెడినోవా ఆసుపత్రి సర్కిల్ ప్రధాన రోడ్డు పై కత్తులతో దాడి...
కడప జిల్లా : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుచరుడు బెనర్జీ కి తీవ్ర గాయాలు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఎస్ఐ నరసయ్య... తీవ్ర గాయాలైన బెనర్జీని

Andrapradesh

Oct 28 2023, 13:58

వచ్చే ఎన్నికల్లో మా వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో తెనాలి సాధికార సభ నిరూపించింది: రఘురామకృష్ణరాజు

సామాజిక సాధికార యాత్ర పేరుతో వైసీపీ నేతలు చేస్తున్న యాత్రలపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శలు గుప్పించారు. తిరుపతిలో ఏ ముఖం పెట్టుకుని సామాజిక యాత్ర చేస్తారని మండిపడ్డారు.

తిరుపతిలో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట రమణారెడ్డి, తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ నియమించారని... మొత్తం పదవులను ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారని... ఇంత చేసి ఏ ముఖం పెట్టుకుని సామాజిక సాధికార సభలు నిర్వహిస్తారని దుయ్యబట్టారు.

త్వరలోనే స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా అజయ్ రెడ్డిని, మరో కార్పొరేషన్ కు రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని నియమించబోతున్నట్టు సమాచారం ఉందని అన్నారు. 

జగన్ తన సొంత సామాజికవర్గానికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు. సామాజిక సాధికార యాత్రలకు ప్రజల మద్దతు లేదని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెనాలిలో జరిగిన సామాజిక సాధికార సభ నిరూపించిందని తెలిపారు.

అక్కడి సభలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని రఘురాజు అన్నారు. ఈ కూటమిలో బీజేపీ కూడా చేరితే వైసీపీ అరాచకాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని చెప్పారు.

Andrapradesh

Oct 28 2023, 13:56

భార్యతో కలిసి ఇటలీకి పయనమైన పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ, సినిమా బిజీ లైఫ్ కు చిన్న బ్రేక్ ఇచ్చి ఇటలీకి బయల్దేరారు. తన భార్యతో కలిసి పయనమయ్యారు. తన అన్నయ్య నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీల పెళ్లి ఇటలీలో జరుగుతున్న సంగతి తెలిసిందే.

నవంబర్ 1న మెగా కుటుంబ సభ్యులు, కొద్ది మంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. వీరి వివాహానికి హాజరవడానికి పవన్ ఇటలీకి బయల్దేరారు. వాస్తవానికి ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న పవన్... ఇటలీకి వెళ్తారా? లేదా? అనే విషయంలో కొంత సందేహం ఉండేది.

అయితే ఈ సందేహాలకు ముగింపు పలుకుతూ పవన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్టులో ప్రత్యక్షమయ్యారు. మరోవైపు ఇప్పటికే కొందరు మెగా కుటుంబ సభ్యులు ఇటలీకి చేరుకున్నారు. ఈరోజు, రేపటి లోగా మిగిలిన వారందరూ చేరుకోబోతున్నారు.

Andrapradesh

Oct 28 2023, 13:54

హోంగార్డుపై కానిస్టేబుల్ దాడి విఆర్ కు పంపిన ఎస్పీ

ప్రకాశం జిల్లా దర్శి డిఎస్పీ కార్యాలయంలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న అశోక్ 2023 అక్టోబర్ 21 న మార్కాపురం పి.ఎస్ లో హోంగార్డుగా పనిచేస్తున్న వెంకటరమణ పై దాడి చేయగా బాధితుడు మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్లో అదేరోజు ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా ఎస్పీ కానిస్టేబుల్ అశోక్ ను విఆర్ కు పంపినట్లు సమాచారం

Andrapradesh

Oct 28 2023, 13:53

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు షెల్టర్ లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

జంగారెడ్డిగూడెం నుండి దొరమామిడి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అప్రమత్తమైన ఆర్టీసీ డ్రైవర్..

బస్సును ప్రమాదం జరగకుండా మరోవైపుకు మళ్ళించడంతో బస్సు షెల్టర్ తగలడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు..

అదే బస్సు వేరే వైపుకి వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని డ్రైవర్ అప్రమత్తమయ్యి బస్సును ఇటు పైపుకు మళ్లించడంతో ప్రమాదం తప్పిందని తెలిపిన స్థానికులు..

ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా ప్రయాణికులు..

అయితే జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుండి వెళ్లే ప్రతి బస్సు ఫిట్నెస్ లేకపోవడమే ప్రమాదాలు, జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు..