Vijayawada: ఇంద్రకీలాద్రిలో బాలత్రిపురసుందరీ దేవిగా దుర్గమ్మ దర్శనం..

విజయవాడ:దుర్గగుడిలో అంబరాన్నంటే దసరా సంబరాలు (Dussehra celebrations) ఆరంభమయ్యాయి. బెజవాడ దుర్గమ్మ ఈ రోజు బాలత్రిపురసుందరీదేవి (Balatripurasundari Devi) అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు..

ఇంద్రకీలాద్రిపై (Indrakiladri) ఈ నెల 23 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి..

దుర్గమ్మ ఈ ఏడాది తొమ్మిది రోజుల్లోనే పది అవతారాల్లో దర్శనమివ్వనుంది.

మొదటి రోజు ఆదివారం శ్రీబాలాత్రిపుర సుందరీదేవిగా,

రెండో రోజు సోమవారం గాయత్రీదేవి,

మూడో రోజు అన్నపూర్ణాదేవి,

నాలుగో రోజు మహాలక్ష్మీదేవి,

ఐదో రోజు శ్రీమహాచండీదేవి,

ఆరో రోజు అమ్మవారి జన్మనక్షత్రమైన మూలానక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి రూపంలో దర్శనమివ్వనున్నారు.

ఏడో రోజు లలితా త్రిపుర సుందరీదేవి,

ఎనిమిదో రోజు దుర్గాదేవి,

తొమ్మిదో రోజు ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మహిషాసుర మర్దినిదేవి,

మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 11 వరకు రాజరాజేశ్వరీదేవి రూపంలో

దుర్గమ్మ భక్తులకు అభయం ఇవ్వనున్నారు..

తెలంగాణ కాంగ్రెస్ తొలి గెలుపు గుర్రాల జాబితా

చర్చోపచర్చలు, కులసంఘాలతో భేటీలు. ఆశావహులతో సమావేశాల అనంతరం ఎట్టకేలకు కాంగ్రెస్‌ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 55 మంది పేర్లతో జాబితాను విడుదల చేసింది.

కులసమీకరణాలు, గెలుపు అవకాశాలు, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన కాంగ్రెస్‌ తొలిజాబితాలో చోటు దక్కిన అభ్యర్థులు హర్షం ప్రకటిస్తున్నారు. తొలిజాబితాలో చోటు దక్కని వారు రెండో జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మరోవైపు సీపీఐతో పొత్తులపై క్లారిటీ ఇచ్చింది. చెన్నూరు, కొత్తగూడెం అసెంబ్లీ సీట్లు కేటాయిస్తూ ఇప్పటికే సమాచారం ఇచ్చింది.

ప్రకటించిన కాంగ్రెస్ అభ్యర్థులు వీరే..

బెల్లంపల్లి – గడ్డం వినోద్

మంచిర్యాల – ప్రేమ్ సాగర్

నిర్మల్ – శ్రీహరి రావు

ఆర్మూర్ – వినయ్ కుమార్ రెడ్డి

బోధన్ – సుదర్శన్ రెడ్డి

బాల్కొండ – సునీల్ కుమార్ ముత్యాల

జగిత్యాల – జీవన్‌రెడ్డి

ధర్మపురి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

రామగుండం – రాజ్ ఠాకూర్

మంథని – శ్రీధర్ బాబు

పెద్దపల్లి – విజయ రమణారావు

వేములవాడ – ఆది శ్రీనివాస్

మానకొండూరు – కవ్వంపల్లి సత్యనారాయణ

మెదక్ – మైనంపల్లి రోహిత్

ఆందోల్ – దామోదర రాజనర్సింహ్మ

జహీరాబాద్ – ఏ చంద్రశేఖర్

సంగారెడ్డి – జగ్గారెడ్డి

మేడ్చల్ – తోటకూర వజ్రీస్ యాదవ్

మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు

గజ్వేల్ – నర్సారెడ్డి

కుత్బుల్లాపూర్ – హన్మంత్ రెడ్డి

ఉప్పల్ – పరమేశ్వర్ రెడ్డి

చేవేళ్ల – భీమ్ భరత్

పరిగి – రాంమోహన్ రెడ్డి

వికారాబాద్ – గడ్డప్రసాద్

ముషీరాబాద్ – అంజన్ కుమార్ యాదవ్

మలక్ పేట – షేక్ అక్బర్

సనత్ నగర్ – నీలిమా

నాంపల్లి – ఫిరోజ్ ఖాన్

కార్వాన్ – మహ్మమద్ అల్ హజ్రీ

గోషామహల్ – మోగిలి సునీత

చంద్రాయణగుట్ట – బోయ నగేశ్

యాకత్ పుర – రవి రాజు

బహదూర్ పూర్ – రాజేశ్ కుమార్

సికింద్రాబాద్ – సంతోష్ కుమార్

కొడంగల్ – రేవంత్ రెడ్డి

గద్వాల్ – సురితా తిరుపతయ్య

అలంపూర్ – సంపత్ కుమార్

నాగర్ కర్నూల్ – కూచుకుళ్ల రాజేశ్ రెడ్డి

అచ్చంపేట – వంశీకృష్ణ

కల్వకుర్తి – కసిరెడ్డి నారాయణరెడ్డి

షాద్ నగర్ – శంకరయ్య

కొల్లాపూర్ – జూపల్లి కృష్ణారావు

నాగార్జున సాగర్ – జయవీర్ రెడ్డి

హుజుర్ నగర్ – ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ – ఉత్తమ్ పద్మావతి రెడ్డి

నల్గొండ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

నకిరేకల్ – వేముల వీరేశం

ఆలేరు – బీర్ల ఐలయ్య

ఘన్ పూర్ – సింగాపురం ఇందిరా

నర్సంపేట – దొంతి మాధవరెడ్డి

భూపాలపల్లి – గండ్ర సత్యనారాయణ

ములుగు – సీతక్క

మధిర – భట్టి విక్రమార్క

భద్రాచలం – పొదెం వీరయ్య

చెన్నూరు(సీపీఐ)

కెసిఆర్ సభకు ముస్తాబైన హుస్నాబాద్

ఎన్నికల శంఖారావం పూరించేందుకు బీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. తనకు అచ్చొచ్చిన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ నుంచే సీఎం కేసీఆర్‌ వచ్చే శాసనసభ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు.

హుస్నాబాద్‌ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉన్నది. ఇది రాష్ట్రంలో ఈశాన్య ప్రాం తంలో ఉంటుంది. ఇది కలిసి వచ్చే అంశం కావడంతో బీఆర్‌ఎస్‌ తొలి బహిరంగ సభ ఇక్కడే నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్‌ నిర్ణయించారు.

2014, 2018 శాసనసభ ఎన్నికలకు సైతం ఇక్కడి నుంచే ‘ప్రజా ఆశీర్వాద సభల’తో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టా రు. ప్రతి ఎన్నికల ముందు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీగా వస్తున్నది.

వీటన్నింటి కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు హుస్నాబాద్‌తో విడదీయరాని అనుబం ధం ఉన్నది. ఈ నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాలు ఉద్యమంలో కలిసి వచ్చాయి.

ఉద్యమ స్ఫూర్తిని నింపుకొని గత ఎన్నికల్లో భారీ మెజా ర్టీ ఇచ్చాయి. అందుకే ఎన్నికల శంఖారావాన్ని మళ్లీ ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించబోతున్నారు...

నేడు కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల

తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో నేడు ఆదివారం మొదటి విడత అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.

అభ్యర్థుల ఎంపిక కోసం ఇప్పటికే స్క్రీనింగ్ మూడు సార్లు భేటీ అయ్యి అభ్యర్థుల పేర్లను ఓ కొలిక్కి తీసుకురాగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఏఐసిసి ఆమోదం తర్వాత నేడు అభ్యర్థులకు సంబంధించి ప్రకటన చేయనుంది.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదలపై స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ సైతం శనివారం కీలక ప్రకటన చేశారు.

ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.58 మంది పేర్లతో మొదటి జాబితాను విడుదల చేస్తామని ఆయన ప్రకటించారు.

మిగిలిన స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామన్నారు. వామపక్షాలతో పొత్తులు చివరి దశకు చేరుకున్నాయని పొత్తులపై నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ రోజు అభ్యర్థుల జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి, అధిష్టానం ఎవరికి షాక్ ఇవ్వనుందన్న దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జాబితా విడుదల కానుండటంతో కాంగ్రెస్ టికెట్ ఆశావహుల్లో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది.

అయితే ఈ మొదటి విడత జాబితాలో గతంలో పోటీ చేసిన వారి పేర్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలకు సంబంధించి రెండో జాబితాలో ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి..

తెలంగాణ లో ఎన్నికల సమరానికి సన్నద్ధమైన బిఆర్ఎస్

ఎన్నికల సమరానికి పూర్తిగా సన్నద్ధమైన బీఆర్‌ఎస్‌ విశ్వరూప ప్రదర్శనకు సిద్ధమైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్‌.. ఆదివారం ఉదయం తెలంగాణ భవన్‌లో మ్యానిఫెస్టోను విడుదల చేయనున్నారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే వచ్చే ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి బీఆర్‌ఎస్‌ ఏం చేయబోతున్నదన్న పూర్తి ప్రణాళికను వివరించనున్నారు. హామీలను చెప్పడమే కాకుండా, వాటి అమలుకు తమ వద్ద ఉన్న వనరులు, అమలు విధానాలను కూడా కేసీఆర్‌ ప్రజలకు వెల్లడించనున్నారు.

ప్రజల అవసరాలు తీర్చేలా, రాష్ట్ర ప్రగతికి ఉపయోగపడేలా మ్యానిఫెస్టో తీర్చిదిద్దిన్నట్టు బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి. మ్యానిఫెస్టో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సృష్టిస్తుందని, సకల జన సంక్షేమంగా ఉంటుందని అంటున్నాయి.

ఎన్నికల సందర్భంగా నేతలంతా మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇందులోని అంశాలపై విస్తృతంగా చర్చ పెట్టనున్నారు.

అభ్యర్థులకు బీ-ఫారాలు

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులందరికీ సీఎం కేసీఆర్‌ ఆదివారమే బీ-ఫారాలు అందజేయనున్నారు. ఇప్పటికే అభ్యర్థులను తెలంగాణ భవన్‌కు రావాలని పిలిచారు. మొత్తం 119 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫారాలు ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా వారికి ఎన్నికల వ్యూహాన్ని వివరిస్తారు.

ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య మ్యానిఫెస్టో విడుదల, బీ-ఫారాల అందజేత కార్యక్రమం ఉండనున్నది. అనంతరం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబు అధ్యక్షతన జరిగే పార్టీ ఎన్నికల సభకు సీఎం కేసీఆర్‌ బయల్దేరి వెళ్తారు.

ఈ సభతో మొదలయ్యే కేసీఆర్‌ ఎన్నికల ప్రచార సభలు ప్రతి రోజు 2-3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగనున్నాయి.

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి దసరా మహోత్సవాలు

ఇంద్రకీలాద్రిపై ఆదివారం తెల్లవారుజాము నుంచి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి.

ఈ నెల 23వ తేదీ వరకు దసరా‌ మహోత్సవాలు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో కనకదుర్గమ్మ దర్శనమివ్వనున్నారు.

తొలిరోజు ఆదివారం శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ

ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు.

అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవి

అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి

అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి

అక్టోబర్ 19న శ్రీ మహాచండీ దేవి

అక్టోబరు 20న మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవి

అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి

అక్టోబరు 22న శ్రీ దుర్గాదేవి

అక్టోబరు 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా, మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరగనుంది.

దసరా ఉత్సవాలకు 8 లక్షల మందికిపైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. దీంతో వినాయకుని గుడి నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూం ద్వారా క్యూలైన్లను మానిటరింగ్ చేస్తారు.

వృద్ధులకు, వికలాంగుల కోసం బ్యాటరీ కార్లు అందుబాటులో ఉంచారు. అలాగే ఘాట్లలో పుణ్య స్నానాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

బీసీలను రాజకీయంగా అనగా తొక్కుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ

•బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్

బీసీ విద్యార్థి సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు అయితదోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే అగ్రవర్ణాల పార్టీగా వ్యవహరిస్తుంది.

దీనికి నిదర్శనమే బీసీలకు సీట్లు కేటాయించకపోవడం దాంట్లో భాగమే కాంగ్రెస్ పార్టీ బీసీలను రాజకీయంగా అనగా తొక్కుతున్నది అనడానికి నిదర్శనం కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని తీర్మానం చేసిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ నిబంధనని వర్తించమని చెప్పి వ్యవహారం కనబడుతుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అగ్రవర్ణ నాయకులు

కేవలం డబ్బు సంచులతో వచ్చిన అగ్రవర్ణ నాయకులకే టికెట్లు కేటాయించడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పటికైనా చెరువు తీసుకొని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న అవకతవకల పైన విచారణ జరిపించి బీసీలకు జనాభా తమాషా ప్రకారం ప్రతి పార్లమెంట్లో పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం.

ఎన్నో సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం అనేక విధాలుగా ఇబ్బందులు పడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటే ఈరోజు కేవలం ఓకే సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు కేటాయించడం దేనికి నిదర్శనం అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షున్ని అడుగుతున్నాం ఇప్పటికైనా మీ ప్రవర్తనని మార్చుకోకపోతే రేపు జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.

బీసీలకు ఏ రాజకీయ పార్టీ ఎక్కువ సీట్లు కేటాయిస్తే ఆ పార్టీకే మేము ఓట్లు వేసి గెలిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి పార్లమెంట్లో రెండు అసెంబ్లీ స్థానాలు బీసీలకు కేటాయించకపోతే తీవ్రమైన పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీ మీద ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.

ఈ కార్యక్రమంలో బిసి యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కారింగు నరేష్ గౌడ్ బీసీ విద్యార్థి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కన్నుబోయిన రాజు యాదవ్ విద్యార్థి సంఘం జిల్లా నాయకుడు కొంపల్లి రామన్న గౌడ్ స్వామి యాదగిరి నాగరాజు మహేందర్ శివ హరికృష్ణ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

పొన్నాలను బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించిన: మంత్రి కేటీఆర్

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. నేతలు.. ఆ గట్టు నుంచి ఈ గట్టుకు దాటి పోతున్నారు. తాజాగా కాంగ్రెస్‌లో సుదీర్ఘ అనుభవం కలిగిన సీనియర్ నేత, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య హస్తానికి గుడ్‌బై చెప్పారు.

రాజీనామా చేసి కొన్ని గంటలైనా గడవక ముందే బీఆర్ఎస్ పెద్దలు సంప్రదింపులు జరిపి.. కారెక్కించడానికి ప్రయత్నాలు షురూ చేసింది. మంత్రి కేటీఆర్ స్వయంగా పొన్నాల ఇంటికి వెళ్లి బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించారు. మంత్రి ఆహ్వానాన్ని పొన్నాల కూడా స్వాగతించారు. 

పొన్నాలతో భేటీ తర్వాత కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘బలహీన వర్గాల బలమైన గొంతుక పొన్నాలను బీఆర్ఎస్‌లోకి రావాలని ఆహ్వానించాను. సానుకూలంగా స్పందించారు.

సీఎం కేసీఆర్ సూచన మేరకే వచ్చాను. రేపు సీఎం కేసీఆర్‌ను పొన్నాల కలుస్తారు. ఈనెల 16న జనగామలో జరిగే బహిరంగ సభలో పార్టీలో చేరాలని కోరాను. సీఎంను కలిశాక ఆయనే పూర్తి వివరాలు చెబుతారు. బీఆర్ఎస్‌లో పొన్నాలకు సముచిత గౌరవం ఇస్తాం. పొన్నాలపై పీసీసీ చీఫ్ చేసిన కామెంట్స్ బాధాకరం.

బలహీన వర్గాల నేత వయసులో పెద్ద అలాంటి నేతపై రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌ను ఛీదరించుకుంటున్నారు. పార్టీలు మారిన నేతనే నీతులు చెబుతున్నారు. 40 ఏళ్లు పని చేసిన నేతకు ఇలాంటి అవమానాలు జరిగితే ఆ పార్టీలో ఎలా కొనసాగుతారు.

పొన్నాలను పట్టుకుని సచ్చేముందు అని చిల్లర మాటలు ఎలా మాట్లాడుతారు’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్‌తో భేటీ తర్వాత పొన్నాల మీడియాతో మాట్లాడుతూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఫైరయ్యారు. రాజకీయాల్లో పదవులు కో-ఆర్డినేషన్ కోసం మాత్రమే. రేవంత్ లాంటి దౌర్భాగుడి గురించి నేను మాట్లాడాను. కాంగ్రెస్ పార్టీని రేవంత్ లాంటి వాళ్లు భ్రష్టు పట్టిస్తున్నారు.

రేవంత్ కాంగ్రెస్‌లోకి వచ్చాక అయన ఎమ్మెల్యే గా ఎందుకు గెలవలేదు?, పార్టీలో నేనొక్కడ్నే ఓటమి పాలయ్యానా?, జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ భార్య ఓడిపోలేదా?, అవమానాన్ని భరించలేకే పార్టీని వీడా. బీఆర్ఎస్‌లో చేరాలని కేటీఆర్ నన్ను కోరారు. రేపు సీఎం కేసీఆర్‌ను కలిసిన తర్వాత అన్ని వివరాలు చెప్తా.అని పొన్నాల పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే.. జనగామ బీఆర్ఎస్ టికెట్ పొన్నాలకు ఇవ్వొచ్చని ప్రచారం సాగుతోంది. ఇందులో భాగంగానే బీసీ నాయుకుడ్ని కలిసినట్లు పొలిటికల్‌గా చర్చ నడుస్తోంది. పొన్నాల బీసీ నాయకుడు కావడం.. పైగా రాజకీయ అనుభవం కలిగిన నేత అయి ఉండడం బీఆర్ఎస్‌కు కలిసొచ్చే అవకాశంగా భావిస్తోంది...

CBN Health Condition: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన..

రాజమండ్రి:తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu) ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు..

శనివారం నాడు చంద్రబాబుతో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, నారా భువనేశ్వరి, తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖత్ అయ్యారు. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే నారా లోకేష్ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈసందర్భంలో చంద్రబాబును చూసి నారా భువనేశ్వరి, లోకేష్ భావోద్వేగానికి గురయ్యారు. మానసికంగా చంద్రబాబు స్ట్రాంగ్‌గా ఉన్నా....ఆరోగ్య సమస్యలపై కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. అక్టోబర్ 6 తేదీ నుంచి ములాఖత్‌లో ఆరోగ్యంగా కనిపించిన చంద్రబాబు.. నేడు వీక్‌గా కనిపించడంపై కుటుంబ సభ్యులు బాధ పడుతున్నారు. గత ములాఖత్ నాటికి, నేటికి చంద్రబాబులో చాలా మార్పు వచ్చినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు..

చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉంది: కాసాని జ్ఞానేశ్వర్

చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని కాసాని జ్ఞానేశ్వర్( Kasani Gnaneswer) తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై మాజీ మంత్రులు జవహర్, పీతల సుజాత మీడియాతో మాట్లాడారు. జైలులో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం క్షీణించందన్న ఆవేదనతోనే లోకేష్, భువనేశ్వరిలు మీడియాతో మాట్లాడలేదు. చంద్రబాబుకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు..

జైలులో చంద్రబాబుకు వైద్య పరీక్షలు..

చంద్రబాబు కు వైద్య పరీక్షల కోసం రాజమండ్రి సెంట్రల్ జైలుకి ప్రభుత్వ ఆస్పత్రి చర్మ వ్యాధుల నిపుణులు డాక్టర్లు సూర్యనారాయణ, సునీతాదేవి చేరుకున్నారు. చంద్రబాబుకు జైలులో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు..

తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ శుభాకాంక్షలు: సీఎం కేసీఆర్

పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మగౌరవానికి, ప్రత్యేక సాంసృతిక అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు.

శనివారం బతుకమ్మ పండుగ ప్రారంభం ఎంగిలిపూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలందరికీ సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా జరుపుకొంటూ, తెలంగాణ సంసృతీ సంప్రదాయాలను రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా గౌరవిస్తున్నదని చెప్పారు.

ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై, ఉత్సవాల ముగింపు రోజైన సద్దుల బతుకమ్మ దాకా తొమ్మిది రోజులపాటు ఆడబిడ్డలంతా ఆటా పాటలతో కోలాటాలతో కలిసికట్టుగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ప్రకృతితో మమేకమైన తెలంగాణ సంసృతి, సంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వ వ్యాప్తంగా చాటుతుందని తెలిపారు.

మహిళా సంక్షేమం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు మహిళా సాధికారతను పెంపొందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచాయని స్పష్టంచేశారు.

తెలంగాణ ప్రజలందరి బతుకుల్లో వెలుగులు నింపుతూ, మరింతగా సుఖ సంతోషాలతో జీవించేలా దీవించాలని ప్రకృతి మాతను సీఎం కేసీఆర్‌ ప్రార్థించారు...