నిజంనిప్పులాంటిది

Oct 14 2023, 09:07

తిరుమలలో నేటి నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి.

నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం నాడు తిరుమల తిరుపతి దేవస్థానం అంకురార్పణ చేశారు.నేటి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

ఈనెల 19న సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది. ఇవాళ్టి నుంచి ఈనెల 23 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

శుక్రవారం నుండి శనివారం వరకు సర్వదర్శనాలను రద్దు చేయడం జరిగింది. తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా శ్రీవారి ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు...

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 21:29

మంత్రి శ్రీనివాస్ గౌడ్ భద్రతను 3 అంచెలుగా పెంచాలి : గట్టు నరేష్ గౌడ్

• రాష్ట్ర అధ్యక్షులు & JAC చైర్మన్ తెలంగాణ గౌడ యువజన సంఘం

తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్న భధ్రతపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్న తెలంగాణ గౌడ యువజన సంఘం..

ఎన్నికల సమయంలో పర్యాటనలలో బాగంగా ఎక్కువ సమయం వేల మంది జనాభలో ఉండే ఉధ్యమ కారుడు మంత్రి సీనన్న గౌడ్ పై కేసు ఓడిపోయిన వ్యక్తులు అది జీర్ణించుకోలేక ఎ నిమిషమైన మంత్రి సీనన్న గౌడ్ గారిని హతమార్చాలని కుట్ర పన్నుతున్నారని తెలసింది.

ఇదివరకే ఒకసారి సుపారి గ్యాంగ్ తొ కుట్ర పన్నారు అది బెడసికొట్టడంతొ ఎన్నికల ప్రచార సమయమే హత్య చేసేందుకు అనుకూలంగా బావిస్తున్నట్లు తెలుస్తుంది.

కావున తక్షణమే బి.సి మంత్రి అయిన డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అన్నగారికి రాష్ట్ర ప్రభుత్వం లేద ఎన్నికల కమిషన్ ఉన్న భధ్రతను 3 అంచెలుగా పెంచాలని తెలంగాణ గౌడ యువజన సంఘం డిమ్యాండ్ చేస్తుంది లేని పక్షంలో మంత్రి గారికి ఎలాంటి ప్రమాధం జర్గిన రాష్ట్రం మొత్తం అగ్గిగుండగా మారుతుందని హెచ్చరిస్తున్నాను.

SB NEWS

STREETBUZZ NEWS

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:06

సోషల్ మీడియాలోఎన్నికల ప్రచారం మొదలెట్టిన కేసీఆర్ మనవడు

రాష్ట్రంలో ఎన్నికలకు నెల రోజుల గడువే ఉండటంతో బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం మొదలెట్టారు. అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రభుత్వ సంక్షేమ పథకాల విశిష్టతను వివరిస్తున్నారు.

అంతేకాదు.. సోషల్ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడంతో పాటు కేసీఆర్ వన్స్ ఎగైన్’ అంటూ గత నాలుగైదు రోజులుగా ట్రెండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ మనవడు, కల్వకుంట్ల హిమాన్షు పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా.. సోషల్ మీడియా వేదికగా పార్టీకి తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే గతకొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను, కేసీఆర్ పరిపాలనను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. రెండ్రోజుల క్రితం ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు.

చిన్న సినిమాగా విడుదలై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన కార్తికేయ-2 చిత్రంలోని ఒక డైలాగ్‌ను సీఎం కేసీఆర్‌ను వీడియోలకు లింక్ చేస్తూ ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మళ్లీ కేసీఆరే గెలుస్తారని అంటుండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్ నగరాన్నే అభివృద్ధి చేశారు. గ్రామాలను గాలికొదిలేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఈసారి కేసీఆర్ ఓడిపోవడం ఖాయమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరి హిమాన్షు సోషల్ మీడియా ప్రచారం బీఆర్ఎస్‌కు ఎంతమేర పనిచేస్తుందో చూడాలి..

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:04

తెలంగాణలో ఎన్నికల కమిషన్ ప్రత్యేక నిఘా?

తెలంగాణ ఎన్నికల పై కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇప్పటికే భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు చేపట్టింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన ఇబ్బందులపై అలెర్ట్ అయింది.

ఎన్నికల కోడ్ అమలవుతున్న అక్టోబర్9వ తేదీ నుంచి ఈరోజు ఉదయం వరకు భారీగా నగదు పట్టుకున్నారు. దాదాపు 20,నుండి 25కోట్లకు పైగా సీజ్ చేశారు.

షెడ్యూల్ విడుదల అయిన నాలుగు రోజుల్లోనే కోట్లాది రూపాయలు పట్టుబడటంతో ప్రత్యేక నిఘా పెట్టింది.

ఎన్నికల నాటికీ డబ్బు పంపిణీ భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉండటంతో వంద బలగాలను తెలంగాణ రాష్ట్రానికి సీఈసీ పంపించింది...

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 14:01

బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచార ఇంఛార్జిల నియామకం

బిఆర్‌ఎస్ ఎన్ని కల ప్రచారానికి 54 నియోజకవర్గాలకు ఇంఛార్జీలు నియమించింది. తాజాగా గురువారం సాయంత్రం జాబితాను విడుదల చేసింది.

ఎంపి వెంకటేశ్ నేతా కు (బెల్లంపల్లి (ఎస్‌సి) నియోజకవర్గం),

ఎంఎల్‌సి భానుప్రసాదరావు (మంచిర్యాల),

ఎంఎల్‌సి దండె విఠల్ (ఖానాపూర్ (ఎస్‌సి),

మాజీ ఎంఎల్‌సి పురాణం సతీష్ కుమార్ (ముథోల్),

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత (బోధన్),

మాజీ ఎంఎల్‌సి వి.గంగాధర్ గౌడ్ ఎల్లారెడ్డి

ఎంఎల్‌ఎ గంపా గోవర్ధన్, ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి, ఇంఛార్జి మినిష్టర్ కెటిఆర్ ఇంఛార్జి) (కామారెడ్డి

ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నిజామాబాద్ అర్బన్

ఎంఎల్‌సి ఎల్.రమణ, మాజీ మంత్రి రాజేశంగౌడ్ జగిత్యాల

చైర్మన్ రవీందర్‌సింగ్ పెద్దపల్లి

మంత్రి గంగుల కమలాకర్ చొప్పదండి ఎస్‌సి

మాజీ ఎంపి బి.వినోద్ కుమార్ వేములవాడ

సుడా చైర్మన్ జివి రామకృష్ణ మానకొండూరు ఎస్‌సి

కె.తిరుపతిరెడ్డి:మెదక్

మాజీ ఎంఎల్‌సి ఫరూఖ్ హుస్సేన్ ఆంధోల్ (ఎస్‌సి),

ఎంఎల్‌సి వెంకట్రామిరెడ్డి నర్సాపూర్

మాజీ చైర్మన్ దేవీప్రసాద్ జహీరాబాద్ (ఎస్‌సి),

చైర్మన్‌లు వి.భూపాల్‌రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్ (సంగారెడ్డి),

చైర్మన్ బాలమల్లు దుబ్బాక

మంత్రి హరీశ్‌రావు, ఎంఎల్‌సి డాక్టర్ యాదవ్‌రెడ్డి, చైర్మన్ వి.ప్రతాప్‌రెడ్డి(గజ్వేల్),

ఎంఎల్‌సి శంభీపూర్ రాజు మల్కాజ్‌గిరి

చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి ఉప్పల్

ఎంపి రంజిత్‌రెడ్డి :చేవెళ్ల ఎస్‌సి

వికారాబాద్(ఎస్‌సి), ఎంఎల్‌సి ఎంఎస్ ప్రభాకర్

ముషీరాబాద్ కట్టెల శ్రీనివాస్‌యాదవ్,

అడ్వకేట్ మోహన్‌రావు(అంబర్‌పేట),

మంత్రి శ్రీనివాస్‌యాదవ్ (సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్‌సి),

చైర్మన్ ఆంజనేయగౌడ్ (మక్తల్),

మాజీ చైర్మన్ రాకేశ్ చిరుమళ్ల గద్వాల్

ఎంఎల్‌సి చల్లా వెంకట్రామిరెడ్డి (అలంపూర్ (ఎస్‌సి),

చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ (అచ్చంపేట (ఎస్‌సి),

చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి(కల్వకుర్తి),

ఎంపి పి.రాములు కొల్లాపూర్

ఎంఎల్‌సి కోటిరెడ్డి, రాంచంద్ర నాయక్ నాగార్జునసాగర్

విజయసింహారెడ్డి(నల్గొండ), హూజూర్‌నగర్

ఎంఎల్‌సి టి.రవీందర్‌రావు కోదాడ

జెడ్‌పి చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి నల్గొండ

ఎంపి బడుగుల లింగయ్య యాదవ్ (నకిరేకల్(ఎస్‌సి),

మాజీ ఎంఎల్‌సి బి.వెంకటేశ్వర్లు, చైర్మన్ డాక్టర్ రాజయ్య, మంత్రి హరీష్‌రావు(ఇంఛార్జి), జనగామ

మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ (ఎస్‌టి),

చైర్మన్ వి.ప్రకాష్ (నర్సంపేట),

కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ వరంగల్ (ఈస్ట్)

ఎంఎల్‌సి బసవరాజు సారయ్య భూపాలపల్లి

ఎంఎల్‌సి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ములుగు (ఎస్‌టి),

ఎంపి వడ్డిరాజు రవిచంద్ర (ఇల్లందు (ఎస్‌టి),

మంత్రి పువ్వాడ అజయ్, కొండబాల కోటేశ్వరరావు మధిర (ఎస్‌సి),

ఎంపి నామా నాగేశ్వరరావు (వైరా (ఎస్‌టి),

ఎంపి పార్థసారథి రెడ్డి (సత్తుపల్లి (ఎస్‌సి),

ఖమ్మం డిసిఎంఎస్ శేషగిరిరావు (అశ్వారావుపేట (ఎస్‌టి),

ఎంఎల్‌సి తాత మధు (భద్రాచలం (ఎస్‌టి).లను నియమించినట్టు తెలిసింది...

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 13:58

చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనుభవిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. తీవ్ర ఎండ, ఉక్కపోత కారణంగా అలర్జీతో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని చంద్రబాబు జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన జైలు అధికారులు రాజమండ్రిలోని బోధనాస్పత్రి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మికి గురువారం సమాచారం ఇచ్చారు.

వైద్యులను పంపాలని లేఖలో కోరారు. వెంటనే స్పందించిన జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ ఇద్దరు చర్మ సంబంధిత వ్యాధి నిపుణులను కేటాయించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ జి.సూర్యనారాయణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సీహెచ్‌.సునీతాదేవి సెంట్రల్‌ జైలుకు వెళ్లి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేపట్టారు.

పరీక్షల అనంతరం వైద్యులు ఎలాంటి వివరాలు వెల్లడించకుండా తిరిగి జీజీహెచ్‌కు వెళ్లిపోయారు.వైద్య పరీక్షల్లో వెల్లడైన ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్టు సమాచారం.

సెంట్రల్‌ జైల్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. చంద్రబాబుకు అలర్జీ ఉందని చెప్పడంతో చర్మ వైద్యుల్ని పిలిపించి వైద్య పరీక్షలు నిర్వహించినట్టు చెప్పారు. అవసరమైన మందులు సూచించినట్టు వెల్లడించారు. వైద్యులు చెప్పిన మందులను చంద్రబాబుకు అందజేసినట్టు చెప్పారు.

చంద్రబాబు ఆరోగ్యానికి డోకా లేదు

చంద్రబాబు చర్మ వ్యాధి బారినపడిన నేపథ్యంలో జైలు అధికారులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పేర్కొన్నారు. బీపీ 140/80 ఎంఎంహెచ్‌జీ, టెంపరేచర్‌ నార్మల్‌గా ఉందన్నారు.

పల్స్‌ రేట్‌ 87 నిమిషానికి ఉందని, ఊపిరితిత్తుల్లో ఎలాంటి సమస్య లేదని వెల్లడించారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు..

నిజంనిప్పులాంటిది

Oct 13 2023, 13:56

రేపు పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌

పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ శనివారం కొనసాగుతుందని హైదరాబాద్‌ రీజినల్‌ పాస్‌పోర్ట్‌ అధికారి దాసరి బాలయ్య గురువారంసాయంత్రం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

నగరంలోని బేగంపేట, అమీర్‌పేట, టోలిచౌకీతో పాటు నిజామాబాద్‌, కరీంనగర్‌, భువనగిరి, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మేడ్చల్‌, నల్లగొండ, వరంగల్‌లోని పోస్టాఫీస్‌ పాస్‌పోర్ట్‌ సేవాకేంద్రాలు, పాస్‌పోర్ట్‌ సేవా కేంద్రాల్లో సేవలు పొందొచ్చని చెప్పారు.

www.passport.gov.inలో దరఖాస్తుదారులు అపాయింట్‌మెంట్స్‌ బుక్‌ చేసుకోవాలని చెప్పారు...

నిజంనిప్పులాంటిది

Oct 12 2023, 16:19

వార్డు సమస్యలపై పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
Streetbuzz News Real time News platform